25, జులై 2019, గురువారం
24, జులై 2019, బుధవారం
21, జులై 2019, ఆదివారం
ఇళాపంచమి
Courtesy:Whats app
ఇళాపంచమి
ఇద్దరు భార్యలని పెళ్ళి చేసుకోవచ్చా? ఒకసారి ఇద్దరిని కట్టుకుంటే తప్పు లేదా? ఏమో లా తెలిసినవారు చెప్పాలి. కాని శ్రీనాథుడు మాత్రం ఇలా అనేశారు.
సిరిగలవానికి జెల్లును
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
డబ్బున్నవాడు పదహారు వేలమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుని పై ఎత్తిపొడుపు, ఆయన పదారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడు, వారు కోరితేనే. ఎవరిదగ్గర వారికే స్వంతమైనట్లూ ఉన్నాడన్నారు. ఎందుకు చేసుకోగలిగాడు ఆయనకేం సొమ్ముందిగనక పదారు వేలమందిని చేసుకున్నాడు. పరమేశ్వరా! నీవేమో బిచ్చగాడివా!! నీకు ఇద్దరు పెళ్ళాలా? చాలు చాలు ఒకతినే పోషించలేనివాడికి ఇద్దరు పెళ్ళలెందుకయ్యా! ఒకదాన్ని వదిలెయ్యమన్నాడు. సరే అది కూడా నిర్దిష్టం చేసి చెప్పేసేడు, ఆవిడే తనకు కావాలట, అదే గంగ అని తేల్చి చెప్పేడు. కవయః నిరంకుశః అన్నారు గాని మరీ ఇంత నిరంకుశత్వమా? అనిపించింది. కొంచం నీళ్ళివ్వయ్యా అని అడగచ్చుగా!
ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో జేరేం కదూ. ఇళా పంచమి అన్నది ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజు వివాహం చేసుకోవచ్చంటారు. ఆషాఢ మాసంలో పెళ్ళి నిషిద్ధం,కాని ఈ ఒక్కరోజు వివాహం చేసుకోవచ్చట. అది కూడా ఎప్పుడంటే మిడసరలగ్గం అంటారు చూడంది అదే ఇది. అనగా సూర్యుడు నడినెత్తికి వచ్చేవేళ అనగా అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం అనగా సూర్యోదయానికి ఉండే లగ్నం నుంచి 4వ లగ్నం అనగా, ఆషాఢంలో సింహలగ్నం తో తూరుపు తెల్లవారుతుంది, దాని నుంచి 4వలగ్నం మిట్టమధ్యాహ్నానికి వృశ్చికలగ్నం వస్తుంది. (Roughly 11.30to 12.20) అప్పుడు వివాహం చేసుకోడానికి మరేం చూడక్కర లేదంటారు. ఈ లగ్నం లో ఆషాఢ శుద్ధ పంచమి రోజున ఇళా దేవిని శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అదండి ఇళాపంచమి మాట. ఇక అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టిన ఏపని ఐనా నిర్విఘ్నంగా జరుగుతుందంటారు, దీనికి తిథి,వార,నక్షత్రాలతో, వర్జ్యం,దుర్ముహూర్తం లతో నిమ్మిత్తం లేదని ఉవాచ.
వీడియోలో పెళ్ళి కొడుకు అదృష్టవంతుడు. ఒకదాన్ని పెళ్ళి చేసుకుందామన్నా ఆడ పిల్లలు దొరకని కాలం, బ్రహ్మచారులు ముదురు బెండకాయల్లా ఐపోతున్న కాలంలో ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. డబల్ ధమాకా!
నేడు ఆషాఢ బహుళ పంచమి.
నేడు ఆషాఢ బహుళ పంచమి.
19, జులై 2019, శుక్రవారం
ఏం పని కావాలి?
ఇల్లు మారాలా?
సామాను పేక్ చేయడం దగ్గరనుంచి ఇల్లు చూసి పెట్టడం దగ్గరనుంచి, సామాను కొత్తింటికి చేర్చి సద్ది పెట్టడం దాకా అన్ని పనులు చేసి పెడతాం.
పండగలకి ఫంక్షన్ లకి ఇల్లు దులపాలా? రంగులేయాలా? కడగాలా? తుడవాలా? మాకు చెప్పండి, చేసి పెడతాం.
ఇంటిలో కరంటు పనులు చిన్నచిన్నవైనా చేయాలా? నీళ్ళ కుళాయిలు బాగు చెయ్యాలా? అలంకరణ చేయాలా? మొక్కలు అలంకరించాలా? మాకు చెప్పండి.
పెళ్ళి చేయించాలా? భోజనాలు పెట్టాలా? ఇంటి దగ్గరే వంట చేయించాలా? ఏ ఆచారంలో పెళ్ళి, భోజనాలు కావాలో చెప్పండి, ఒక గంటలో పెళ్ళి నుంచి ఐదురోజుల పెళ్ళి దాకా అన్ని ఏర్పాట్లూ చేస్తాం. కావాలంటే ఫంక్షన్ హాల్ తో సహా బుక్ చేసి పెడతాం.
అంతెందుకు మీ ఇంట్లో పని ఏదైనా సరే మీకు నచ్చినట్లు చేసి పెడతాం. మిమ్మల్ని చీపురు కావాలి,బ్రష్ కావాలి, ఎత్తు పీట కావాలి అని దేని గురించి అడగం. మాకు ఫోన్ చేయండి. మా సూపర్వైసర్ వచ్చి చూసి పని చూసి సొమ్ము ఎంతవుతుందో చెబుతారు. ఎప్పటిలోగా పని పూర్తి చేయగలమో చెబుతాం. మీ ఇంటిలో సామానుకు మాది పూచీ! ముందుగా వీడియో తీసి మీకిచ్చి దులిపి, కడిగిన తరవాత ఎప్పటిలా సద్ది మళ్ళీ వీడియో మీకిస్తాం. ఏ వస్తువూ బీరు పోదు. మరో ముఖ్యమైన సంగతి, మీ కిచ్చిన తరవాత వీడియో మాదగ్గరుండదు, మళ్ళీ మీరు కావాలన్నా దొరకదు, అంత ప్రైవసీ మెయెంటైన్ చేస్తాం. మీ ఇంటి గురించి మరొక చోట మాట్లాడం.
ఇదివరకు పట్టణాలలో ఈ రకం సర్వీసులున్నట్టు విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లెలలో కూడా ఇవి మొలుచుకొచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే సందడి.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, శుభ్రంగా చేసిపెడుతున్నారు.
9, జులై 2019, మంగళవారం
అల్పజీవి-అర్ధనారి....2
అల్పజీవి-అర్ధనారి.
అంచిత కావ్య కంఠ బిరుదాంకు, అమోఘ వచస్కు,అంబికా
చంచల కింకిణీ నినద సౌమ్య సుసంస్కృత వాగ్విలాసు,ని
శ్చంచల యోగి పుంగవుని, జ్ఞాన విశోధిత లబ్ధ తత్త్వ భా
సాంచిత రాజహంసు,రమణాశ్రమ వాసు నుతింతు "నాయనన్".....6
తెప్పున గారె ముక్కలను తేనెల ముంచుక తిన్న రీతిగా
గొప్పలు కాదుగాని కవికోటి శిరంబుల నూచి మెచ్చగా,
చప్పున నాదు పల్కులకు శంకరుడే విని నవ్వునట్లు; నే
చెప్పెద పద్దెముల్ రసిక శేఖరు లెల్లరు బాగు బాగనన్.....7
చొక్కపు పిల్ల తెమ్మెరల సోకుకు కోయిల కూసినట్లుగన్
చక్కని నాదు భావముల సౌరభమెంచి ప్రశంస చేయగా
నొక్కడు చాలు; లోతెఱుగ కూరక త్రిప్పగ నేల శీర్షముల్
రక్కెస తుప్పలున్ మరియు రావులు తా తలలూపవా! శివా!....8
తూరుపు దిగ్గజంబైన ధూర్జటి తోటి సాటి యౌదనన్
కోరిక నాకు లేదు, మరి కోరెద నాతని చెంత నిల్వగా;
దూరపు చుట్టమై ప్రజకు తోచిన చాలును సంతసించెదన్
సారమ సారమున్ తెలియ సర్వగతుండవు నీవెగా! శివా!........9
సరగున పూర్ణిమా విమల చారుతరోజ్వల చంద్రకాంతికిన్
కరగును చంద్రకాంతములు, కాక ద్రవించున గండ శైలముల్
వరకవి మాధురీగుణ విభాసిత కోమల వాక్యరీతులన్
సరసుడు సంతసించి నటు ఛాందసు డాదర మొందునా! శివా!....10
నింగిని తోచినట్టి నెల నిండిన జాబిలిజూచి సంద్రము
ప్పొంగును, బావి నీళ్ళకును పొంగులు కల్గునె? బిడ్డ ముద్దుమో
ముంగని పాలచే పాదువ మోదము బిడ్డల తల్లి చెందెడిన్
తొంగుడు నాకు చాలనెడి తొత్తుకు పాపడు తీపియా! శివా!.......11
బంగరు సుద్దు లయ్యమరవాణిని గైకొని చెప్పినాడ నే
పొంగుచు కొన్ని పద్దెముల,పూర్వులొసంగిన యాస్తిగాన నీ
వెంగిలి ముక్కలంచు మది నెంచకు, కీరము ముట్టినట్టి యా
రంగగు దోరకాయ ధర రాలిన రుచ్యము గాదటో! శివా....12
అప్పయ శంకరాది ఘనులాత్మ విచారణ దక్షు లందముల్
కుప్పలు గాగ పోసి నిను గొల్చిరి కైతల, వారి ముందు నే
చప్పన యౌదుగాక,విను చక్కెర మెక్కియు పండు చీకుచో
చప్పన గాక ఎప్పుడు రసాలము మెప్పును పొందునా! శివా!....13
లలిత కవిత్వ సంపద ధరాస్థలి నెంతటి భూరి పుణ్యమూ
ర్తులకు లభించు? దాన సరితూగునె రాజ్యము గీజ్య మీ క్షితిన్!
నిలుచును నిత్యుడై కవి మనీషను,తక్కిన వారు మట్టిలో
కలిసెడు వారె, నిల్చు నొక కావ్యము నందిన భర్తయున్ శివా....14
ఒకపద్యము చెప్పువాడె కవియౌ యూరేగు ఈ రోజులం
దొక కావ్యంబు గూర్ప,వాడికను నర్హుండే గదా కాళిదా
సుకు తా పెద్దకుమారుడంచు సకల సర్వజ్ఞుండంచు విద్వాంసులం
దొక లెక్కుంచక నిందసేయ, కలిలో నూహింప వింతల్ శివా!...15
*”నాయన”..కావ్యకంఠ గణపతి ముని.
5, జులై 2019, శుక్రవారం
అల్పజీవి-అర్ధనారి-1
అల్పజీవి-అర్ధనారి
(శివ శతకం)
ఒకవైపు అంచల నూరించు మంజీర - మహిరాజ ఫూత్కర మవలివైపు
స్కందాదిరోహణోత్సంగంబు నొకవైపు - అవ్వల గణపతి నవ్వుమోము
పద్మకాండము మించు బాహువు నొకవైపు - కరితుండమును మించు కరము నవల
ఒకవైపు కుముదాళి గికురించు నయనంబు - నీరజ శ్రీజూపు నేత్రమవల
పారిజాతకలతా పల్లవంబొకవైపు - ఉల్లోల మాలిక లొక్కవైపు
లాస్యమొకవైపు తాండవార్భటియు మెరయ
అమృతకిరణుండు - ఉమ్మడి ఆస్తి కాగ
వెలుగుచీకట్లు కలిసిన విధము తోప
కలిసి కాపుర మొనరించు కలిమిలేము
లనగ రూపించు జంటకు అంజలింతు......1
తేలుచున్నవి నింగి నీలాభ్రములు రెండు - ఒండొంటి నొరయంగ ఉత్సహించి
వ్రాలుచున్నవి లీల బాల మృణాలముల్ - మలయానిలాహతి మలగి మలగి
క్రాలుచున్నవి హేల నీలకంఠంబులు - పురివిప్పి నాట్య వైఖరుల కలిమి
సోలుచున్నవి క్రీడ లీలాకపోతముల్ - కువకువ ధ్వనులతో కవసికవసి
వెలుగు చీకట్లు, కలిమి లేములును, అస్తి
నాస్తులును... ఏవో! ఏవో! అణగి పెనగి
జంట జంటలై.. ఒకటియై సర్వసృష్టి
అర్ధనారీశ్వర విలాసమగుచు తోచు.....2
"హత్తిన ప్రేమ జూచుటకు అమ్మయు నాన్నయు నాకు కల్గగా
నెత్తఱి నెంచి చూచినను ఎక్కువ నేనని గౌరి పల్క,"నా
కత్తయు మామగారు కల"రంచు నవ్విన శూలి నేర్పుకున్
బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్.....4
రాజిత సుందరానన,పరాజిత రాజమరాళ యాన,వి
భ్రాజిత సుందరాలక,విరాజిత రాజ మనోజ్ఞరూప,ఉ
త్తేజిత సింహవాహన, జితేంద్రియ మానస రాజహంస, సం
పూజిత రాజమౌళి, వర భూషణి, గౌరి శుభంబు లీవుతన్.....5
తేలుచున్నవి నింగి నీలాభ్రములు రెండు - ఒండొంటి నొరయంగ ఉత్సహించి
వ్రాలుచున్నవి లీల బాల మృణాలముల్ - మలయానిలాహతి మలగి మలగి
క్రాలుచున్నవి హేల నీలకంఠంబులు - పురివిప్పి నాట్య వైఖరుల కలిమి
సోలుచున్నవి క్రీడ లీలాకపోతముల్ - కువకువ ధ్వనులతో కవసికవసి
వెలుగు చీకట్లు, కలిమి లేములును, అస్తి
నాస్తులును... ఏవో! ఏవో! అణగి పెనగి
జంట జంటలై.. ఒకటియై సర్వసృష్టి
అర్ధనారీశ్వర విలాసమగుచు తోచు.....2
శంకరు జేరి గౌరి సరసమ్ముగ హాసము లాడు వేళ "ని
శ్శంకను సామి! నేగనుక సైచితి నివ్విధి లేమి కాపురం
బింకొక లేమ యెవ్వతెయు నిట్టుల సైచునె" యంచు బల్క, యా
వంకను జూచి నవ్వు భగవంతుడు శంకరుడిచ్చు కోరికల్....3
నెత్తఱి నెంచి చూచినను ఎక్కువ నేనని గౌరి పల్క,"నా
కత్తయు మామగారు కల"రంచు నవ్విన శూలి నేర్పుకున్
బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్.....4
రాజిత సుందరానన,పరాజిత రాజమరాళ యాన,వి
భ్రాజిత సుందరాలక,విరాజిత రాజ మనోజ్ఞరూప,ఉ
త్తేజిత సింహవాహన, జితేంద్రియ మానస రాజహంస, సం
పూజిత రాజమౌళి, వర భూషణి, గౌరి శుభంబు లీవుతన్.....5
1, జులై 2019, సోమవారం
27, జూన్ 2019, గురువారం
24, జూన్ 2019, సోమవారం
దాహం తో అల్లాడుతున్న ప్రాణికోటి
10, జూన్ 2019, సోమవారం
విదేశాలకు ముంజలు ఎగుమతి
Courtesy: Whats app
ఇక విదేశాలలో కూడా తాటి ముంజలు ఆరునెలలు దొరుకుతాయి. ఐదేళ్ళకితం సరదాగా అనుకున్నమాటిది. ఇక ముందు తేగలు,బుర్రగుంజు, కొబ్బరి పువ్వు
కూడా ఎగుమతి కావచ్చు.
కూడా ఎగుమతి కావచ్చు.
కాదేదీ వ్యాపారానికనర్హం?
అడివిలో ఉప్పమ్ము, సముద్రపొడ్డున మామిడికాయ అమ్ము. ఈ రేండిటినీ కలిపి ఊరగాయ పెట్టి ఊళ్ళో అమ్ము. అదీ వ్యాపార రహస్యం.
7, జూన్ 2019, శుక్రవారం
5, జూన్ 2019, బుధవారం
3, జూన్ 2019, సోమవారం
2, జూన్ 2019, ఆదివారం
1, జూన్ 2019, శనివారం
అద్భుత భారతీయ నృత్యం
CourtesyWhats app
ఈ అద్భుత భారతీయ నృత్యం కేరళ లోని పదహారేళ్ళ అమ్మాయి చేసింది. ఇటువంటి నృత్యం అరవై సంవత్సరాల కితం చూసిన గుర్తు. ఆ తరవాత చూడలేదు. ఈ నృత్యానికో పేరు కూడా ఉన్నది.
కళాకారిణి సోదరులు పక్క వాద్యాలతో సహకరించారు. ఇంతకుమించి వివరాలు తెలియవు.
30, మే 2019, గురువారం
గోదారోళ్ళ కితకితలు
Courtesy Stinu sri Facebook
28, మే 2019, మంగళవారం
26, మే 2019, ఆదివారం
24, మే 2019, శుక్రవారం
చలో! హమారా దేశ్ బచ్ గయా!!
చలో! హమారా దేశ్ బచ్ గయా!!
సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవీ
నారాయణి నమోస్తుతే
మేరా భారత్ మహాన్!!!
21, మే 2019, మంగళవారం
How a human heart is prepared for transportation and transplantation
Courtesy:Whats app. Dr.T.RamaguruReddy
19, మే 2019, ఆదివారం
ప్రపంచం మారిపోతోంది-నీటితో నడిచే హైడ్రోజన్ ఇంజన్.
అరవై ఏళ్ళ కితం మాట, ఉద్యోగంలో చేరిన కొత్త. కారు కొనుక్కోవాలనిపించింది. ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ ఖరీదు పదివేలు! నా జీతం వంద రూపాయలు!!
జీతం పట్టుకెళ్ళి అమ్మకిస్తూ అడిగాను
”ఎప్పటికైనా కారు కొనుక్కోగలనంటావా అమ్మా!” అని.
విన్న అమ్మ ''నీటితో నడిచే కార్లొచ్చే రోజులొస్తాయి అప్పుడు కొనుక్కుందువు” అన్నది.
నిజమే డిస్టిలెడ్ వాటర్ పోస్తే దానిని హైడ్రోజన్ ఆక్సిజన్ లుగా విడదీసి, హైడ్రోజన్ తో ఇంజను నడిపి ఆక్సిజన్ విడుదల చేసే ఇంజను కనుక్కోబడింది. జపాన్ లో విడుదల జేయబడుతోంది, తొందరలో. ఇంతకి కనుక్కునదెవరో తెలుసా? ఒక భారతీయుడు.
మరి జపాన్ లో ఎందుకు విడుదలజేయబడుతోంది. ఇటువంటి ఇంజన్ తయారు చేస్తున్నాను, సాయం చేయమని మన దేశ ప్రభుత్వాలని పదేళ్ళు అడిగి అడిగి నోరు నొప్పి పుట్టి జపాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. తొందరలోనే భారత దేశంలో కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు చెప్పేడు. అనుమానమా! ఈ కింద లింక్ లో చూసెయ్యండి.
https://www.ndtv.com/tamil-nadu-news/tamil-nadu-engineer-invents-engine-that-uses-hydrogen-releases-oxygen-2036119?pfrom=home-topstories
ప్రపంచ ముఖచిత్రం మారిపోతోంది. oil రాజకీయాలకి చెల్లు చీటీ రాసినట్టే.ప్రపంచ రాజకీయమే మారిపోతోంది. బహుపరాక్. ఆయిల్ కంపెనీల షేర్లు ఢమాల్, బహుపరాక్
మరో మాట.
ఈ కుర్రాణ్ణి చూశారా?
Harshwardhan Zala
ఏం? ఏఅమ్మాయికైనా లైనేసేడా? కాదు కాదు.ఇంకా మీసం కూడా మొలవని మొనగాడు.ప్రపంచాన్ని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న మైన్ (మందు పాతర)ల మూలంగా ఎంతో మంది చనిపోతున్నారు, police and military personnel. ఈ కుర్రాడో డ్రోన్ కనిపెట్టేడు. అది ఎక్కడ ఏమూల మందుపాతరున్నా కనిపెట్టేసి పనికి రాకుండా చేసేస్తుంది. ఎన్నో దేశాలు ఈ డ్రోన్ కోసం పోటీ పడ్డాయి. ఇవ్వనుగాక ఇవ్వనని దేశం లో వినియోస్తున్నాడు. Now Indian forces are free from the death of personnel due to land mine explosion.
ఇటువంటి వారిని మనం పట్టించుకుంటామా? ఉహు!
మేరా భారత్ మహాన్
16, మే 2019, గురువారం
హస్త లాఘవం
Courtesy: Whats app
వీడియోలు చూసారా? హస్త లాఘవం కనపడలేదు కదూ! మరో సారి నిదానంగా చూడండి!! ఆశ్చర్యపొండి!!!
ఇది మీకూ జరుగుతుంది!!!!!
15, మే 2019, బుధవారం
తల్లి
ప్రకృతిలో ఏతల్లి ఐనా ఇంతే! తల్లికి తండ్రికి తేడా అంతే!!
11, మే 2019, శనివారం
4, మే 2019, శనివారం
29, ఏప్రిల్ 2019, సోమవారం
అత్యద్భుత ధ్వన్యనుకరణ ( Excellent ventriloquism )
Courtey:Whats app
Excellent ventriloquism
23, ఏప్రిల్ 2019, మంగళవారం
19, ఏప్రిల్ 2019, శుక్రవారం
27, ఫిబ్రవరి 2019, బుధవారం
ధర్మవరం పట్టు చీర
పెళ్ళి చీర అంతా ప్రత్యేకతే. చేనేత చీర. పమిటంచులో వధూవరుల చిత్రాలు, అదీ నేతలో. ఎంత అందంగా ఉందో! కలిగినవారి సంపదకి మంచి వినియోగం. ఎంతోనా ఐదు లక్షలే. కోట్లు ఖర్చుపెట్టేవారికి ఐదు లక్షలో లెక్కా!
26, ఫిబ్రవరి 2019, మంగళవారం
కుంభ మేళా
Courtesy:Whats app
Courtesy:Whats app
Courtesy:Whats app
15, ఫిబ్రవరి 2019, శుక్రవారం
విలువైన వస్తువులు స్కూటర్ వెనక డిక్కీలో పెడితే కొంప కొల్లేరే!
Courtesy:Whats app
11, ఫిబ్రవరి 2019, సోమవారం
28, జనవరి 2019, సోమవారం
చిన్న చిటకా-ప్రయత్నించి చూడండిలా
4, జనవరి 2019, శుక్రవారం
బావా బావా పన్నీరు
బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
పట్టెడ మంచం వేసేరు
పది గుద్దులు గుద్దేరు
పందిరి గుంజకి కట్టేరు
పాతిక గుద్దులు గుద్దేరు
పందిరి గుంజకి కట్టేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
చావిడి చూరుకి కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు.
వీశెడు గంధం పూసేరు
వీశె గుద్దులు గుద్దేరు.
వీశెడు గంధం పూసేరు
వీధి వీధి తిప్పేరు,
బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు.
తంతే బావా ఊర్కోడు
తాళి కట్టి లాక్కెళ్తాడు.
తంతే బావా ఊర్కోడు
తాళి కట్టి లాక్కెళ్తాడు.
11, డిసెంబర్ 2018, మంగళవారం
5, డిసెంబర్ 2018, బుధవారం
27, నవంబర్ 2018, మంగళవారం
పొడుపు కథ విప్పడం.
పొడుపు కథ విప్పడం.
ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే.
కొడుకుని చూస్తే తండ్రికి భయం.
ఎవరీకుటుంబం.
ఏ పొడుపు కథనైనా విప్పాలంటే కొన్ని విషయాలు తెలిసుండాలి. అప్పుడు గాని అది సాధ్యపడదు. పై పొడుపు కథలో ఒక కుటుంబం ముత్తాత కనపడతాడుగాని,దొరకట్ట,తాతకి రూపే లేదు, ఇదో విరుద్ధం. తండ్రిని చూస్తే అందరీ భయం, ఇది మరో చిత్రం. ఇక చివరగా కొడుకుని చూస్తే తండ్రికి భయం, ఇది మరో విరుద్ధం. సమన్వయమెలా?
కనపడుతూ ఉంటుంది ఎంత దూరం పోయినా కాని చేతికందనిది ఆకాశం. ఇదే ముత్తాత, చివరి వాడైన వానికి ముత్తాత. ఇక తాతకి రూపులేదు అది వాయువు. వాయువుకి రూపు లేదుగదా! తరవాత తండ్రిని చూస్తే అందరికి భయం అది అగ్ని. కొడుకును చూస్తే తండ్రికి భయం. అదే నీరు,నీటితో నిప్పు ఆరిపోతుందిగా! బాగానే ఉందిగాని బంధుత్వమెలా? పంచభూతాలు పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్, అంటే భూమి,నీరు,నిప్పు,వాయువు,ఆకాశం కదా! ఇక్కడో అనుమానం రావాలి, అదే ముందు భూమి కదా, ఆకాశం ఎలా ముత్తాతవుతుందీ అని. మొట్టమొదటిది ఆకాశమే, దాని నుంచి పుట్టినది,గాలి, గాలినుంచి పుట్టినది,నిప్పు, నిప్పు నుంచి పుట్టినదే నీరు,నీటినుంచి పుట్టినది భూమి. ఈ మాటని మన పూర్వీకులూ చెప్పేరు, నేటి శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు.ఆ కుటుంబం పంచ భూతాలలో నాలుగూ, ఆకాశం,వాయువు,నిప్పు,నీరు. అదండి సంగతి.
ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే.
కొడుకుని చూస్తే తండ్రికి భయం.
ఎవరీకుటుంబం.
ఏ పొడుపు కథనైనా విప్పాలంటే కొన్ని విషయాలు తెలిసుండాలి. అప్పుడు గాని అది సాధ్యపడదు. పై పొడుపు కథలో ఒక కుటుంబం ముత్తాత కనపడతాడుగాని,దొరకట్ట,తాతకి రూపే లేదు, ఇదో విరుద్ధం. తండ్రిని చూస్తే అందరీ భయం, ఇది మరో చిత్రం. ఇక చివరగా కొడుకుని చూస్తే తండ్రికి భయం, ఇది మరో విరుద్ధం. సమన్వయమెలా?
కనపడుతూ ఉంటుంది ఎంత దూరం పోయినా కాని చేతికందనిది ఆకాశం. ఇదే ముత్తాత, చివరి వాడైన వానికి ముత్తాత. ఇక తాతకి రూపులేదు అది వాయువు. వాయువుకి రూపు లేదుగదా! తరవాత తండ్రిని చూస్తే అందరికి భయం అది అగ్ని. కొడుకును చూస్తే తండ్రికి భయం. అదే నీరు,నీటితో నిప్పు ఆరిపోతుందిగా! బాగానే ఉందిగాని బంధుత్వమెలా? పంచభూతాలు పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్, అంటే భూమి,నీరు,నిప్పు,వాయువు,ఆకాశం కదా! ఇక్కడో అనుమానం రావాలి, అదే ముందు భూమి కదా, ఆకాశం ఎలా ముత్తాతవుతుందీ అని. మొట్టమొదటిది ఆకాశమే, దాని నుంచి పుట్టినది,గాలి, గాలినుంచి పుట్టినది,నిప్పు, నిప్పు నుంచి పుట్టినదే నీరు,నీటినుంచి పుట్టినది భూమి. ఈ మాటని మన పూర్వీకులూ చెప్పేరు, నేటి శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు.ఆ కుటుంబం పంచ భూతాలలో నాలుగూ, ఆకాశం,వాయువు,నిప్పు,నీరు. అదండి సంగతి.
25, నవంబర్ 2018, ఆదివారం
పొడుపు కథ విప్పండి
ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే
కాని కొడుకును చూస్తే తండ్రికి భయం.
ఎవరీ కుటుంబం?
23, నవంబర్ 2018, శుక్రవారం
కుక్కకు మాంసం దొరికినది
కుక్కకు మాంసం దొరికినది
అది వంతెన మీదకుపోయినది
నీటిలో నీడను చూచినది
వేరొక కుక్కని తలచినది
భౌ! భౌ!! భౌ!!! యని అరచినది
మాసం ముక్క పోయినది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

















































