Tuesday 23 April 2019

వడగళ్ళ వాన

 పండిన చేనులో వడగళ్ళు

ఉండ్రాళ్ళు కాదు వడగళ్ళు 





 వడగళ్ళు దెబ్బకి నాలుగు పెచ్చులుగా మారిన బూడిద గుమ్మడి

ఆకాశం నుంచి జారిపడ్డ మంచు రాయి ( ఖండం )
కోడిగుడ్లు కాదు వడగళ్ళే 


రాళ్ళలాటి వడగళ్ళు











 వడగళ్ళ వాన

ఈనెల 21వ తారీకు సాయంత్రం తూగోజి కోరుకొండలో కురిసిన వడగళ్ళవాన 

11 comments:

  1. గురువుగారు🙏లు. వడగళ్ళు చూస్తుంటే గుండె గుభిళ్ళు.
    ఇలా సడెన్గా వడగళ్ళు పడితే పొలాల్లో వున్నవాళ్ళు ఎలా తప్పించుకుంటారో !!

    ReplyDelete
  2. అయ్యబాబోయ్ వడగళ్ళ వానే. ఇప్పటి దాకా ఇంత పెద్ద వడగళ్ళు చూడలేదండి........ మహా

    ReplyDelete


  3. నిజమే ?



    జిలేబి

    ReplyDelete


  4. వడగళ్ళవాన చిత్రము!
    గడగడలాడించె జనుల కలికాలమిదే!
    పడగొట్టగ ప్రకృతిని మను
    జుడు తన వంతుగ విభుడు రుజువయె జిలేబీ


    జిలేబి

    ReplyDelete
  5. YVR's అం'తరంగం',బులుసు సుబ్రహ్మణ్యం,Zilebi

    ౧.సాధారణంగా పొలాల్లో బోరుబావి షెడ్లు, పశువుల పాకలు ఉంటాయి. వాటిలో తలదాచుకోవచ్చు.
    ౨.ట్రాక్టర్ ట్రైలర్ ఉంటే దానికింద దూరచ్చు.
    ౩.గడ్డి వామిలో ఖాళీ చేసుకుని దూరిపోయి తలదాచుకోవచ్చు.
    ౪.ఏవీ దొరక్కపోతే నాలుగు తాటాకులు అడ్డంగా పెట్టుకుని శరీరం కుదించుకుని భూమికి దగ్గరగా కూచోవచ్చు.
    ౫.తలకు రక్షణ చూసుకుని నీటిలో దగి నిలబడచ్చు. పెద్ద తలపాగా చుట్టుకునేవారిదివరలో, దాన్నే కుళాయి అని వర్ణించారు శ్రీనాథుడు.
    ౬.చెట్టు కిందకి చేరడం అతి ప్రమాదకరం. చెట్టుకొమ్మ విరిగిపడచ్చు,చెట్టు పై పిడుగు పడచ్చు.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది,సెల్ ఫోన్లలో, నలభై నిమిషాల ముందు, రక్షణ చర్యలు తీసుకోమని, ఇటువంటి సమయాల్లో. ఆరోజు సాయంత్రం వాకింగ్ ట్రాక్ మీదున్నాను,నాలా మరో పదిహేనుమందీ నడుస్తున్నారు.మెసేజ్ వచ్చింది,వాకింగ్ ఆపేసి కాలేజి బిల్డింగ్లో చేరాను.అందరికి మెసేజ్ వచ్చింది, అందరూ మెసేజ్ లు చూసుకుని నడక ఆపేసి కాలేజిలోకి చేరిపోయారు. నాలాగే మిగిలినవారూ వచ్చేసేరు. మాకు ఏభై కిలో మీటర్ల దూరంలో జరిగిందిది. ఎవరూ చనిపోయిన వార్త లేదు.

    బులుసువారు,

    మిన్ను విరిగి మీద పడుతుందా అని ఆశ్చర్యం వెలిబుచ్చుతారు. నిజమే ఎప్పుడూ పడదు కాని, ఇలా అనుకోకుండా అంత పెద్ద వడగళ్ళు రాళ్ళలా రాలుతోంటే, నిజం, ఇంత పెద్ద వడగళ్ళతో వాన ఎరగను. మిన్ను విరిగి మీద పడటం అంటే ఇదే!

    జిలేబి

    మీ పద్యాల దెబ్బ వడగళ్ళ దెబ్బకంటే ఎక్కువదిలా ఉంది. :)


    ReplyDelete
  6. ఇన్ని వడగళ్లు పడ్డాయా? సమ్మర్ వస్తోంది కదా అని దేవుడు తన డీప్ ఫ్రీజర్ శుభ్రం చేసినట్లున్నాడు!
    వర్షాలకోసం ఆమధ్య మేఘమధనం అని ఏదో చేసేవారట. ఇప్పుడు మేఘ మెల్టింగ్ అనో ఇంకోటో మన సర్కారువారు మొదలు పెట్టాలి!

    ReplyDelete
  7. సూర్య గారు,

    వడగళ్ళ వాన ఎరుగుదుముగాని, ఇలాటిది జీవితంలో చూడటం, గోజిలలో మొదటిసారి.

    దేవుడు డీప్ ని శుభ్రం చేసుకున్నాడు :) అసలు చిత్రం స్వయంకృతాపరాధం. పర్యావరణాన్ని పాడు చేసుకున్నకారణం. ఉష్ణోగ్రతలలో అధిక తేడాలు దీనికి కారణం.

    మేఘ మెల్టింగ్ మంచి ఐడియా!

    ReplyDelete
  8. మీ ఊరు ... అనపర్తి ... వార్తల్లోకి ఎక్కిందే శర్మ గారు (ఆంగ్లంలో చెప్పినట్లు for the wrong reasons). ప్రియుడితో కలిసి పారిపోతున్న కూతుర్ని అడ్డుకున్న తండ్రిపై దాడి చేసిందట ఆ పుత్రికారత్నం. తండ్రి ఆస్పత్రిపాలట. TV9 లో స్క్రోలింగు పరిగెడుతోంది.

    పాతతరం వారి పరిభాషలో చెప్పాలంటే ... పిదపకాలం, పిదపబుద్ధులున్నూ.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ''మా సీమ చిగురు మొక్కైన చేవ''. మేమెప్పుడూ వార్తలలో వ్యక్తులమేనండి

      Delete


    2. ఓ యబ్బో యేమి టెక్కో :)

      మా సీమచిగురు నరస
      న్నా సిత్రము చేవ గల్గి నాణ్యత తోడై
      వాసిని గాంచెను మొక్కై
      రోసములకు పేరుగాంచె రోడ్డున పడెనే :)


      జిలేబి

      Delete
    3. మాది టెక్కు తమరిది నిక్కు వెరసి టెక్కునిక్కు.

      Delete