Monday 29 April 2019

అత్యద్భుత ధ్వన్యనుకరణ ( Excellent ventriloquism )



Courtey:Whats app

Excellent ventriloquism

12 comments:

  1. నిజంగా అద్భుతం. టాలెంట్ పలు రకాలు 👏.

    ReplyDelete
    Replies
    1. బాగుందనిపించిందండి

      Delete


  2. టాలెంటు పలురకమ్ములు
    మేలగు రీతిని ప్రతిభను మేధస్సును పూ
    మాలగ నిడి చూపుదురే
    లాలిత్యంబొప్పగా కళాత్మక విలువల్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తమరి టేలెంట్ తమది :)

      Delete




    2. తమరి టేలెంటు తమదాయె తరుణి వారి
      దయ్యె టాలెంటు వారిది ! ధర్మ మిద్ది
      యే పరస్పర మైత్రిని నెంచి మెచ్చు
      కొనుట తరముగ మీకున్ను కొంగుపసిడి

      Delete
  3. ధ్వన్యనుకరణ అంటే ఇంగ్లీష్ లో mimicry అనుకుంటాను?

    ReplyDelete
    Replies
    1. ఆ వీడియో వాట్సాప్ లో పెట్టినాయన ventriloquism అన్నారు, మీరేమో మిమిక్రీ అన్నారు. నాకు తోచిన మాట ధ్వన్యనుకరణ అనుకున్నానండి.

      Delete
  4. పై విడియోలో చేసినది ventriloquism అయితే కాదు. mimicry అన్నదే సరిపోతుంది. తెలుగులో అయితే మీరన్నట్లు అనుకరణ సరైన పేరే.

    ventriloquism అంటే “పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య“ (బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852); “నోరు మెదపకుండా మాట్లాడే నైపుణ్యం“ (ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008).

    ReplyDelete
    Replies
    1. సాధారణంగా చేత్తో ఒక పెద్ద బొమ్మ పట్టుకుని ఆ బొమ్మ మాట్లాడుతున్నట్లుగా భ్రమ కలిగిస్తుంటారు ventriloquism చేసే . అప్పుడప్పుడు టీవీ మీద, సినిమాల్లోనూ అటువంటి ప్రదర్శన చూపిస్తుంటారు (ఉదా: ఒక సినిమాలో కమల్ హసన్ చేసిన సీన్)

      Delete
    2. ఇటు అటు కాని..హృదయం తోటి.. ఎందుకురా..ఈ..తొందర నీకు..అంటాడు కమల్ హాసన్.

      Delete
    3. విన్నకోటవారు,

      ఆ రెండు మాటలకి అర్ధం తెలియదండి. కార్యక్రమం చూసి నా కనైపించినది తలకట్టు పెట్టేనండి, సరైనదే అన్నారు, సంతోషం. ఆ మాటలకి మీ వల్ల అర్ధాలూ తెలిసాయి.

      Delete
    4. సూర్యగారు,

      ''తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల'' మంచి పాట గుర్తు చేసారు. తెనుగులో ఇటువంటి పాట మరొహటి రాలేదేమో!

      Delete