Monday 1 July 2019

ఆలచిప్ప




16 comments:

  1. శర్మ గారు,
    ఆల్చిప్ప నాకైతే మూడో ఫొటోలో మాత్రమే (అన్నిటికన్నా కింద ఫొటోలో) కనిపిస్తోందేమిటి? మరి తతిమ్మా రెండు ఫొటోల సంగతి?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      రెండు ఫోటో ల గురించి చెప్పలేదన్నారుగా! అది మామిడి కాయలు కోసుకునేందుకు వాడే చిక్కం కర్ర. చెట్టెక్కినా కాయలు చేతికందవు, చుట్టూ ఉన్న కాయలు కింద పడిపోకుండా అందుకోవాలంటే ఇదే సాధనం. కాయను దూరం నుంచే చిక్కంలో ఉండేలా కిందనుంచి చిక్కంలోకి దూర్చి లాగితే కాయ సులువుగా చిక్కంలో పడుతుంది.

      Delete
    2. శర్మ గారు,
      చిక్కం, దాని వాడకం గురించి తెలుసు. అయితే మీ టపాకు "ఆలచిప్ప" అని హెడ్డింగు పెట్టారు కదా, దానికి ఆ రెండు చిక్కం ఫొటోలకు సంబంధం ఏమిటో తెలియక పోవడంతో మిమ్మల్ని నా మొదటి కామెంట్ లో అడిగానన్నమాట.

      Delete
    3. విన్నకోట నరసింహా రావుగారు,

      అలా అంటారా! వేసవికాలం-మామిడికాయ-చిక్కం కర్ర-ఆల్చిప్ప- మాగాయ అన్నిటికి అవినాభావ సబంధం కదండీ. అలా జరిగిపోయిందంటేనండీ!

      Delete
    4. అలా అంటారా? అయితే ఓకే 🙂.

      Delete
  2. విన్నకోటవారు,
    ఆల్చిప్ప ఒకప్పటి పీలర్. మామిడికాయలు చెక్కు గీయడానికి వాడేవారు. మొదటి రెండు పోటోలలోది అందరికి తెలుసనుకుని చెప్పలేదు.

    ReplyDelete
    Replies
    1. కాయలు గీయడానికి అంత ఖరీదైన పీలర్ వాడేవారా! అయినా మామిడికాయలు తొక్కతీయడం దేనికి టైం దండగ! తొక్కతోనే తింటే ఆరోగ్యానికి మంచిదని ఆమధ్య తొక్క శాస్త్రవేత్తలు కూడా సెలవిచ్చారాయె!

      Delete
    2. సూర్యగారు,

      ఈ ఆల్చిప్పలు గోదావరి ఇసుక తిప్పల్లో దొరికేవి. ఏరుకు తెచ్చేవాళ్ళం. నాలుగు ఐదు వందల కాయ మాగాయికి గీసేవారు, నలుగురైదుగురు కూచుని. మరి ఇవే పీలర్లు.

      ఆవకాయకి తొక్క తీయరు కదండీ! మాగాయి మిగిలినవాటికి తొక్క తీస్తారు, ఇది అలవాటు, లేకపోతే రుచిగా ఉండదష! పాతాకాలంవాళ్ళకి తొక్క శాస్త్రజ్ఞుల సంగతి తెలియదనుకుంటా. :)

      Delete
  3. అవి అప్పట్లో చెరువుల, వాగుల ఒడ్డున లెక్కలేనన్ని కనిపించేవి. వాతావరణ మార్పులవల్లో ఏమో ఇప్పుడు అవి పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఆ పీలర్ ను 'కష్కె' అని పిలిచేవారు.

    ReplyDelete
    Replies

    1. రాజేష్ గారు
      పర్యావరణ సమతుల్యం చెడి నేడు చాలా జీవులు కనపడటం లేదు. కొత్తమాట తెలుసుకున్నా. ధన్యవాదాలు.

      Delete
    2. గోరేటి వెంకన్న సంధించిన ప్రశ్న:

      "తొలకరి జల్లుకు తడిసిన నేల
      మట్టి పరిమళాలేమైపాయెర
      వానపాములు నత్తగుల్లలు
      భూమిల ఎందుకు బతుకత లేవు?"

      దీనికి తానే సమాధానం ఇస్తూ ఆయన రాసిన వాక్యాలు:

      "ఈ పత్తి మందుల కత్తర వాసనరా నా పంటపొలాలల
      ఆ మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయె నా రైతు కుతికెపై"

      Delete
    3. జై గారు,

      గోరేటి వెంకన్న మాట ప్రతి అక్షరం నిజం కదా!
      పల్లెలలో పురుగు మందుల వాడకం మూలంగా రైతు కుటుంబాలలో మగవారిలో పునరుత్పత్తి శక్తి తగ్గిపోతున్నమాట నిజం.

      Delete


    4. ఏ విషయమైనా చెప్పండీ మా గోరేటాయన యెప్పుడో వ్రాసేసేడాటి పయిన :)


      మా గోరేటాయన సా
      మీ! గీ విషయము పయి వినుమీ చెప్పిండూ
      పాగలు మడుసులు సేసిం
      డ్రీ గోలల! మతలబు గనుడీ శర్మాజీ :)



      జిలేబి

      Delete

    5. జిలేబి గారు,
      జిలేబి దేశం లోనే ఉండిపోయినట్టుందే!

      Delete


  4. సమతుల్యత చెడి నేడా
    యె మన పుడమి కలుషితమ్ము ! యెన్నో‌ జీవుల్
    తమ యుసురుల బాసెనిచట
    తమకపడు మనుజుల మూర్ఖతయె కారణమై


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. Zilebi గారు,
      పర్యావరణ సమతుల్యత ఎప్పుడో చెడింది, నత్తలని కోళ్ళకి,చేపలకి ఆహారంగా వేసేశారు, వెతికి,వెతికి. ఇప్పుడు చెరువుల దగ్గర నత్త కనపడటం లేదు.
      పిచుక కనపడటం లేదు. కారణం టెలికం సిగ్నల్స్ అన్నారు, కాదు పురుగు మందులు వాడిన పైరుపైని చిన్న కీట్కాలను తిని పిచుకలు మరణించాయి. ఇలా జీవజాతి చక్రమే విరిగింది, స్థభించింది.మానవుని ఆశ కారణం.

      Delete