Sunday 28 July 2019

తెలివి తక్కువ వాళ్ళు

తెలివి తక్కువ వాళ్ళు ఇళ్ళు కడతారు, తెలివైనవాళ్ళు కాపరం ఉంటారు. 


6 comments:

  1. ఇటువంటిదే ఆ మధ్య ఒక సినిమాలో ..... చదువురాని వాళ్ళంతా స్కూళ్ళు పెట్టారు, చదువుకున్న వాళ్ళు ఆ స్కూళ్ళల్లో పని చేస్తున్నారు ... అని అంటాడు.

    ఇల్లు (నా భావం ఇండిపెండెంట్ ఇల్లు అని) కట్టడం తెలివైన పనే శర్మ గారు, దాని మెయింటెనెన్స్ గురించి అప్పుడప్పుడు అటూ ఇటూ పరుగులు పెట్టాల్సొచ్చినప్పటికీ కూడా. ఈ మెయింటెనెన్స్. ఆపై సెక్యూరిటీ .... వీటిని భూతద్దంలో చూపించి ఇంటి యజమానిని భయపెట్టి, వారసులందరికీ తలొక ఇల్లు ఏర్పడుతుందని temptation కలిగించి, డెవలప్మెంట్ పేరిట వారి స్ధలం తీసుకుని దాంట్లో అపార్ట్మెంట్లు కట్టి, అంతవరకు ఒక కుటుంబం నివసిస్తున్న భవనంలో పదో ఇరవై కుటుంబాలకు అమ్మి, చిన్న చిన్న ఊళ్ళను కూడా వదలకుండా ఊళ్ళకు ఊళ్ళను భ్రష్టు పట్టించి, quality of life దిగజారడానికి ప్రధాన కారకులుగా తయారయ్యారు బిల్డర్లు. వీరు అసలైన తెలివైనవారు. ఏతావాతా పరిణామం ఏమిటంటేఇప్పుడు కొత్తగా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడానికి స్ధలం దొరకడం దాదాపు మృగ్యం అయిపోయింది. అధిక శాతం ఇళ్ళ వారు తమ ఇంటిని బిల్డర్లకు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు. Progress పురోగతి 😥.

    ReplyDelete
    Replies
    1. ఆ డైలాగ్ అతడు సినిమాలో సునీల్ చెప్పాడనుకుంటాను.
      ఇండిపెండెంట్ ఇంటిని row House అంటారండీ.
      అయినా భారతదేశ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. సౌకర్యాలు అంతంతమాత్రం. అందరికీ row house లు కట్టుకునే స్థలం దొరుకుతుందా చెప్పండి.
      జనాభా తక్కువ ఉండే దేశాల్లో కూడా పట్నాలలో పని చేసుకునేవారికి పని ప్రదేశానికి దగ్గరలో ఉండాలంటే అపార్ట్మెంట్ తప్ప గత్యంతరం లేదు(మీలో అతను కోటీశ్వరుడైతే తప్ప!).

      Delete
    2. విన్నకోటవారు,
      ఇల్లు కట్టుకోవాలన్నది మానవులకున్న కోరిక. అలాగే ముఫై ఏళ్ళకితం మమతలు,కష్టాలు కలగలిపి సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టేం. ఇక మెయింటెనెన్స్ అన్నది భారమే ఐ కూచుందండి. డబ్బులుంటే పని చేసేవారికి లోటు లేదు, కాలు కదపక్కరలేదుగాని, ఒకటికి రెండవడమే....జరుగుతున్నది. ఇదే ఇబ్బంది బాధ...

      ఇక బిల్డర్లదే పూర్తి పాపం అనడానికీ లేదండి. నాలుగువందల గజాల్లో ప్రత్యేక ఇల్లు కట్టేను. దాని పక్కనే స్థలం అమ్మకానికొస్తే కొన్నాను. ఆశ, అవసరం, పెద్ద ఇల్లు కట్టించేసేయి. కాలం గడచింది. పదేనేళ్ళకితమే ఒక బిల్డర్ నన్ను కోటీశ్వరుణ్ణి చేస్తానన్నాడు, మొత్తం స్థలమిచ్చేస్తే. ఇల్లాలితో ఆలోచించి ఆ పని విరమించేసేను. ఆశ, అవసరం, అవకాశం మనిషిని నడిపిస్తున్నాయి. ఇప్పుడు స్థలం ధరలు వింటేనే గుండె దడ వస్తోందండి.

      నేటి పరిస్థితికి అందరూ కారకులేనండి.

      Delete
  2. సూర్యగారు,

    నేను ఇల్లు కట్టినపుడు ఇది ఊరికి దూరంగా ఉండేది, ఇప్పుడు ఊరిలో ఒక భాగం మధ్య కొచ్చేసింది. పని చోట్లకి దగ్గరగా నివసించాలంటే, స్కూళ్ళు,కాలేజిలకు దగ్గర కావాలంటే, మల్టీ లు తప్పవండి. కాని వీటిని కట్టేస్తే పల్లెలలో నివసించేవారు, ఒక అపార్ట్మెంట్ కొని పడేస్తే ఉంటుంది లెద్దూ అని కొనేసి ఉంచేస్తున్నారు, వీలుంటే అద్దెకిస్తున్నారు. అలా మల్టీ లు పెరిగాయి. మేమూ నగరపంచాయతీ ఐపోతున్నాం, సౌకర్యాలు పెరక్కపోయినా.

    ReplyDelete
  3. ముప్ఫై కోట్ల జనాభాకు సరిపడే వనరులున్న భారతదేశంలో నూట ముప్పై కోట్లు దాటిపోయాము. India's population has reached unsustainable levels. No amount of resources will be enough. Sooner than later we have to take sponge bath only as there isn't enough water.

    ReplyDelete
    Replies
    1. బుచికిగారు,

      నిజమే! ఉన్నవనరుల్ని సద్వినియోగం చేసుకోలేని దురవస్థ,అన్నిటా రాజకీయమే!

      నీటి వనరులున్నాయి! మన్ది కానిదాన్ని వాడుకోవాలనే కోరికపెరిగిపోయింది,అందరిలోనూ!
      ఆహా! మీరన్నట్లు స్పాంజి బాత్ రోజులు దూరంగాలేనట్టే

      Delete