Wednesday 27 February 2019

ధర్మవరం పట్టు చీర


పెళ్ళి చీర అంతా ప్రత్యేకతే. చేనేత చీర. పమిటంచులో వధూవరుల చిత్రాలు, అదీ నేతలో. ఎంత అందంగా ఉందో! కలిగినవారి సంపదకి మంచి వినియోగం. ఎంతోనా ఐదు లక్షలే. కోట్లు ఖర్చుపెట్టేవారికి ఐదు లక్షలో లెక్కా!

3 comments:

  1. రెండునెలల క్రితం జరిగిన అంబానీ గారి కూతురి పెళ్ళి డ్రస్ ఖరీదు ఎనభయ్యో తొంభయ్యో కోట్లట. మీరన్నట్లు కోట్లు ఖర్చుపెట్టేవారికి ఐదు లక్షలొక లెక్క కాదు. కానీ నాకెప్పుడూ అనిపిస్తుంటుంది - పెళ్ళిచీర కాస్తంత ప్రత్యేకంగా ఉండాలనుకోవడం సహజమే కానీ పెళ్ళయిపోయిన తరువాత బహుశః జీవితంలో మరెన్నడూ తిరిగి కట్టని (చాలా మంది విషయంలో) ఆ పెళ్ళిచీర కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా ? సమాజంలో ఆడంబరాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయనిపిస్తోంది. కలిగిన వారిని చూసి మధ్య తరగతి వారు కూడా వాతలు పెట్టుకుంటున్నారేమో కదా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      ఖర్చుపెట్టగలవారు ఖర్చు పెట్టకపోవడం తప్పు. ఖర్చు పెట్టలేనివారు ఖర్చు పెట్టడమూ తప్పే! పులిని చూసినక్కవాత పెట్టుకోకూడదు!
      ఇక పెళ్ళి చీరను మళ్ళీ కట్టకపోవడం అన్నది వారివారి ఇష్టాలమీద ఆధారపడ్డదే! ఆ చీరను మళ్ళీ ఎప్పుడెపుడు కట్టుకుంటే మళ్ళీ ఆ నాటి ఆనందాన్ని పొందవచ్చో ఎవరి స్థాయినిబట్టి వారు నిర్ణయించుకునేదే!
      మధ్య తరగతివారు ఖర్చు పెట్టగలవారే ఎగురుతారండీ!
      ధన్యవాదాలు.

      Delete


  2. ఈ ధర్మావరపు చమకు
    లీ ధరలన్గనుడయా జిలేబీ సేలల్
    రాధనము జేర్చు రమణుల్
    క్రోధమును విడిచి కుఱగలి కోకనదమవన్ :)



    జలేబి

    ReplyDelete