కనబడకపోవడమేం, వీడియో ఇటుపక్క నుండి తీశారు కాబట్టి మనకి బాగానే కనిపిస్తోంది. బండికి అవతలి పక్కన నిలబడే కొనుగోలుదారుడుకి కనబడదు. అమ్మేవాడి ధైర్యం అదే కదా. లాభాల వేటలో సిగ్గూ లజ్జా వదిలేసిన నీతి, నిజాయితీ లేని వ్యాపారాలు 😡. మేరా భారత్ మహాన్ 🙏.
అయితే హస్తలాఘవం అనే ఈ మోసం మీవైపులకు కూడా ప్రాకిందా? హైదరాబాద్ లో చాలా కామన్. రెండు మూడు సార్లు ఇలా దెబ్బ తిన్నట్లు గ్రహించిన తరువాత తెలియని బండి మీద కొనడం బాగా తగ్గించేశాను.
సిగ్గుపడడం అంటే - లాభాల కోసమే వ్యాపారం చేస్తారు శర్మ గారూ, కాదనడం లేదు. కానీ అడ్డమైన దారులూ తొక్కి లాభాలు సంపాదించడానికీ, నమ్మకంతో వచ్చిన కొనుగోలుదారుడిని అలా నీతి లేని మార్గంలో మోసం చేసి మరీ లాభాలు దండుకోవడానికీ ..... లేశమైనా సిగ్గుండాలి ... బండివాడైనా సరే, కార్పొ’రెట్ట’యినా సరే ..... అదీ నా భావం.
మొన్నీ మధ్య మాల్స్ లో కార్పొరేట్లలో జరుగుతున్న మోసాలగురించి చర్చించినట్టుంది. తక్కెడ కింద చింతపండు అంటించడం ,మేగ్నెట్ పెట్టడం పాత కాలపు వి. మరి నేడు జరుగుతున్నది? ఎలక్ట్రానిక్ కాటాలతో కూడా మాయ చేస్తున్నారు. వాటిని కేలిబరేట్ చేసి సీల్ వెయ్యాలి, ఎక్కడో?
ఒకప్పుడు సున్నితపు త్రాసు బంగారపు మధ్యస్థ తూకం ఏదో ఇలా జరిగిపోయేది. మరి నేటి మాట? మధ్యస్థ తూకం లేనట్టే ఉంది.ఎలక్ట్రానిక్ బేలన్స్ ల సంగతి చెప్పేదే లేదు.
తనిఖీలలో దొరికినా కేస్ లూ పెట్టినా వీరికి సిగ్గా?
సిగ్గు పడవలసినవారెవరు? వినియోగదారుడు కదా! మోసపోతున్నామని తెలిసీ మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి మోసపోతున్నాడు. మోసపోతున్నందుకు సిగ్గు పడటం లేదు కదా! అదండి సంగతి. ఎక్కువ చెప్పేనా?
ఈ పోస్ట్ కు సంబంధం లేని వ్యాఖ్యలెండి. అయినప్పటికీ, వినదగిన విషయాలున్నాయి కదాని ఈ విడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
జీవితంలో కొన్ని రకాల వ్యక్తులతో గొడవ పెట్టుకోకూడదు అని గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మంచి మాటల యూట్యూబ్ విడియో. పాఠకులందరూ కూడా విని ఆనందిస్తారని ఆశిస్తాను.
కనబడకపోవడమేం, వీడియో ఇటుపక్క నుండి తీశారు కాబట్టి మనకి బాగానే కనిపిస్తోంది. బండికి అవతలి పక్కన నిలబడే కొనుగోలుదారుడుకి కనబడదు. అమ్మేవాడి ధైర్యం అదే కదా. లాభాల వేటలో సిగ్గూ లజ్జా వదిలేసిన నీతి, నిజాయితీ లేని వ్యాపారాలు 😡. మేరా భారత్ మహాన్ 🙏.
ReplyDeleteఅయితే హస్తలాఘవం అనే ఈ మోసం మీవైపులకు కూడా ప్రాకిందా? హైదరాబాద్ లో చాలా కామన్. రెండు మూడు సార్లు ఇలా దెబ్బ తిన్నట్లు గ్రహించిన తరువాత తెలియని బండి మీద కొనడం బాగా తగ్గించేశాను.
విన్నకోటవారు,
Deleteఅమ్మకందారుడిది లాభాపేక్ష కదా! సిగ్గుపడితే లాభం లేదుకదా!
బజారుకి నడిచెళ్ళేవారెందరు? బండి, కారే కదా!! ఒక సంచి అందులో పడేసి ఉంచుకోవచ్చుగా! మరేం? అదొగో అదే నామోషీ!!! మనమే సంచి పట్టుకెళితే ఇది జరగదుగా!!!!!
సంచి పట్టుకెళితే రెండు లాభాలు, ఇలా మోసపోనక్కర లేదు, కేరీ బాగ్ లు మోసుకు తెచ్చుకోనక్కర లేదు. నేను బాజారు కెళ్ళినంత కాలం కేరీ బేగ్ ఇంటికి తేలేదు.
ఇది వాట్సాప్ నుంచి దిగుమతీ! సార్వజనీనమే కదండీ!!!!!!
సిగ్గుపడడం అంటే -
Deleteలాభాల కోసమే వ్యాపారం చేస్తారు శర్మ గారూ, కాదనడం లేదు. కానీ అడ్డమైన దారులూ తొక్కి లాభాలు సంపాదించడానికీ, నమ్మకంతో వచ్చిన కొనుగోలుదారుడిని అలా నీతి లేని మార్గంలో మోసం చేసి మరీ లాభాలు దండుకోవడానికీ ..... లేశమైనా సిగ్గుండాలి ... బండివాడైనా సరే, కార్పొ’రెట్ట’యినా సరే ..... అదీ నా భావం.
విన్నకోటవారు,
Deleteమొన్నీ మధ్య మాల్స్ లో కార్పొరేట్లలో జరుగుతున్న మోసాలగురించి చర్చించినట్టుంది. తక్కెడ కింద చింతపండు అంటించడం ,మేగ్నెట్ పెట్టడం పాత కాలపు వి. మరి నేడు జరుగుతున్నది? ఎలక్ట్రానిక్ కాటాలతో కూడా మాయ చేస్తున్నారు. వాటిని కేలిబరేట్ చేసి సీల్ వెయ్యాలి, ఎక్కడో?
ఒకప్పుడు సున్నితపు త్రాసు బంగారపు మధ్యస్థ తూకం ఏదో ఇలా జరిగిపోయేది. మరి నేటి మాట? మధ్యస్థ తూకం లేనట్టే ఉంది.ఎలక్ట్రానిక్ బేలన్స్ ల సంగతి చెప్పేదే లేదు.
తనిఖీలలో దొరికినా కేస్ లూ పెట్టినా వీరికి సిగ్గా?
సిగ్గు పడవలసినవారెవరు? వినియోగదారుడు కదా! మోసపోతున్నామని తెలిసీ మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి మోసపోతున్నాడు. మోసపోతున్నందుకు సిగ్గు పడటం లేదు కదా! అదండి సంగతి. ఎక్కువ చెప్పేనా?
ఈ పోస్ట్ కు సంబంధం లేని వ్యాఖ్యలెండి. అయినప్పటికీ, వినదగిన విషయాలున్నాయి కదాని ఈ విడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
ReplyDeleteజీవితంలో కొన్ని రకాల వ్యక్తులతో గొడవ పెట్టుకోకూడదు అని గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మంచి మాటల యూట్యూబ్ విడియో. పాఠకులందరూ కూడా విని ఆనందిస్తారని ఆశిస్తాను.
జీవితంలో ఎవరితో గొడవ పెట్టుకోకూడదు (గరికపాటి)
https://youtu.be/_i02spJypIU
ReplyDeleteజీవితములో నెవరెవరి
తో వనితా పోరు కూడదో నరసింహా
రావవధానులె తెలిపిరి
భావము తెలుసు కొనవే స్వభావంబవగాన్ !
జిలేబి
ఇది యెదియేని చిత్తమున నించుక నెవ్వరి వల్లొ బోధయై
ReplyDeleteయొదవిన దేమి కాదుగద ! , ఓ నరసింహ మహాత్మ ! ఇందులో
పదపడి యెవ్వరెవ్వ రెటువంటి మహాత్ముల కోవ కొత్తు , రే
విధము మదీయ , మన్నిటి వివేచన చేసి పసందు గూర్చరా !