Monday 28 January 2019

చిన్న చిటకా-ప్రయత్నించి చూడండిలా

Courtesy:whats app

15 comments:

  1. అంతే సర్, కొన్ని పనులు డబ్బులిస్తే జరుగుతాయి, కొన్ని పనులు బెదిరిస్తే జరుగుతాయి 😀.

    (చిట్కాలు ఆసక్తికరంగానే ఉన్నాయి)

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావువెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి :)

      డబ్బులేసి గిలకరిస్తే వెల్లుల్లిపాయలదెంత లెండి :)
      ధన్యవాదాలు.

      Delete


    2. వెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి

      ** ఈ వెంకన్న ఎవరండీ ?


      జిలేబి

      Delete
    3. పెద్దలు మన్నించాలి ,
      ' వెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి '
      ?????

      Delete
    4. వెంకట రాజారావు . లక్కాకుల గారు
      డబ్బుతో ఏపనైనా అవుతుందనడానికీ మాట చెబుతారండి
      ధన్యవాదాలు.

      Delete

    5. వెండి చెప్పు తో కొట్టడమంటే మొక్కు బడేమో!
      వెంకన్నా !వెండి చెప్పు కానుక గా వేస్తా నని‌ మొక్కుకోవడమేమో ఏడుకొండల సదా మి ని

      ( పాదకానుకలు చిన్ని చిన్నివి‌ చేసి మొక్కుబడి గా వేయడం)


      జిలేబి

      Delete
    6. చేతు లెత్తి తనువు చిత్తంబు పులకించ
      కనుల భాష్పజలము క్రమ్ముకొనగ
      క్షణము మాత్రమైన చాలు వీక్షింపంగ
      వెంకటేశు నట్టి విభుని గూర్చి

      నానుడిగా నైన నిటుల
      హీనముగా నుడువ తగదు , హృది కలచు గదా !
      నే ననుటయె గాదు , తమరు
      ఙ్ఞానులు , పెద్దలు , విబుధులు , మన్నించండీ !

      Delete
    7. ఘనమైన సమర్దింపిది
      ఘనులు గదా ! పండితులుగ ఘనత వహించే
      జన సమ్మాన్యులు గద ! తమ
      కనయము ప్రణతులు , జిలేబి యార్యా ! విబుధా !

      Delete


    8. :)


      మీ విదురుని నానుళ్ళవి !
      నే విన్నది కాదు దారిని చదివి పోదా
      రీ విదురుల పల్కుల కిది
      యే వివరణయో యనుకొని యెర తెలుపంతే :)


      జిలేబి

      Delete
    9. లక్కాకుల వారు
      తమరు విజ్ఞులు మన్నించాలి.
      ధన్యవాదాలు

      Delete
    10. జిలేబి
      కొత్త కొత్త మొక్కులు కనిపెడుతున్నారా
      ధన్యవాదాలు

      Delete


    11. కొత్త కొత్త మొక్కుల సరి కొత్త గా జి
      లే‌బి కనిబెడు తున్నారు లెస్సగాను
      వెండి చెప్పుల కతకిక వేతు తాళ
      మును జనుల కుతిలంబిక ముదురు గాక :)


      జిలేబి

      Delete

  2. సూపర్ చిట్కాస్

    మా అయ్యరు గారికి చూపించి వార్ని‌ వాడమన్నా :)


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. Zilebi

      అదే మంచిపని. పొరబాటుగా మీరు పని చెయ్యబోయారనుకోండి అయ్యరుగారు హాస్పిటల్ చుట్టూ తిరగలేకబాధపడాలి :) మీకు పని గండం ఉందిగదా!

      ధన్యవాదాలు.

      Delete
  3. పెరుమాళ్ళు

    అజ్ఞానినా మయా దోషా నశేషాన్ విహితాన్ హరే
    క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే

    ReplyDelete