Friday 4 January 2019

బావా బావా పన్నీరు

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు

పట్టెడ మంచం వేసేరు
పది గుద్దులు గుద్దేరు

పందిరి గుంజకి కట్టేరు

పాతిక గుద్దులు గుద్దేరు


నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు

చావిడి చూరుకి కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు.

వీశెడు గంధం పూసేరు
వీశె గుద్దులు గుద్దేరు.

వీశెడు గంధం పూసేరు
వీధి వీధి తిప్పేరు,

బావా బావా పన్నీరు 
బావను పట్టుకు తన్నేరు.


తంతే బావా ఊర్కోడు

తాళి కట్టి లాక్కెళ్తాడు.

2 comments:

  1. ఇది మేనరికాలు సంబంధాలుగా చేసుకొనే రోజుల్లో వీలయ్యిందేమోనండి. ఇప్పటి పెళ్ళిళ్ళల్లో ఇటువంటి పాటకాదు, మాట కూడా వినపడడానికి లేదు.

    ReplyDelete
  2. అన్యగామిగారు,

    మేనరికాలు సామాన్యులు మానేశారుగానండి మాన్యులు చేస్తూనే ఉన్నారు.

    ఈపాట నా చిన్నప్పటిది. పెళ్ళిలో కాదండి, మామూలుగా సరదాకి పిల్లలు పాడుకునేది. ఈ పాట పల్లవి గుర్తొచ్చిందిగాని పూర్తి పాట గుర్తు రాలా! నెట్ లో వెదికితే దొరకలేదు. పూర్తిగా గుర్తు చేసుకునేందుకు వారం పట్టిందండి. గుర్తుకోసం రాసుకున్నదే! మొన్నను మరోపాటా ఇలాగే గుర్తు చేసుకున్నా! మంచి బిజీగా పని చేసుకుంటూ....
    ధన్యవాదాలు.

    ReplyDelete