15, అక్టోబర్ 2026, గురువారం

పంచమీ....

 పంచమీ....


పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపపచారిణీ. ఇవి లలితాసహస్రనామాలులో 948,949,950 నామాలు.  ఈరోజు దేవీనవరాత్రులలో 5వరోజు తిథి పంచమి. ఈనామాలగురించి ఊసు.


పంచమి అంటే ఐదని తెలిసినదే.పంచభూతేశి ఐదు శక్తులు అవే పంచభూతాలు. వాటినే పృధివి,ఆపస్సు,తేజ,వాయువు,ఆకాశము అని చెపుతారు. ఎన్ని కోట్లకోట్ల సంవత్సరాలుగానో ఈ ఐదు శక్తులే ఉన్నాయి,ఆరో శక్తి పుట్టలేదు,వీటిలో ఒకటీ నశించలేదు. ఈ పంచభూత శక్తులే అమ్మ. ఈ పంచభూతాలే సర్వానికీ కారణం. పంచభూతాలూ సంఘటితమైతే జననం,విఘటితమైతే మరణం. తల్లి కడుపున పడినప్పుడూ ఒక క్రమంలో (పంచభూతాల క్రంలో) పెరుగుతాం. ఒక భూతశక్తి లోపిస్తే ఒక అవకరం ఏడ్పడుతుంది. ఇక మరణం లో కూదా ఈ ఐదు శక్తులూ విఘటితం కావడనికీ ఒక క్రమం ఉంది. ముదుంగా పుట్టుకా చావూ కూడా చెవులతో ప్రారంభవుతాయి. బయట కనపడే ఈ ఐదు శక్తులే మనలోనూ ఉన్నాయి.    


ఐదు శక్తి. పంచాయతి మొదలు ఐదు సంఘటతమే విజయం,విఘటితమే నాశనం. ఐదు విజయానికి మార్గం. విజయదశమికి మధ్యరోజు..... ఆలోచించుకోండి...  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి