లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 2
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభవిశేషకా
వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా
నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా
తారాకాంతి తిరస్కారి నాసాభరణభూసురా
కదంబమంజరీక్లప్త కర్ణపూర మనోహరా
తాటంకయుగళీభూత తపనోడుపమణ్డలా
పద్మరాగశిలాదర్శి పరిభావి కపోలభూః
నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి దశనఛ్ఛదా
శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా
కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కఛ్ఛపీ
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజితా
కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభితకంధరా
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలన్వితా
కామేశ ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ
నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ
లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా
స్తనభారదళన్మధ్య పట్టబంధవళి త్రయీ
అరుణారుణకౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ
రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి