అభిమానులు
చాలాకాలంగా నన్ను చూడడానికొచ్చిన అభిమానులగురించి చెప్పలేదు.నా బ్లాగు పుస్తకంలో అభిమానులది పెద్ద ప్రకరణమే! నిజం చెప్పాలంటే, అభిమానులే నన్ను బ్లాగులో ఇంతకాలం నిలబెట్టేరన్నది కాదనలేని సత్యం.ఐదేళ్ళకితం మాట. ఓ రోజో మెయిలొచ్చిందిలా!''నాపేరు చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ దగ్గర, ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా! మీ బ్లాగు చూస్తాను. అభిమానిని,విశాఖ పెళ్ళికెళుతున్నా!వచ్చేటపుడు వస్తా!'' అంతకుముందు పరిచయమే లేదు. రమ్మని ఆహ్వానించా!ఎలా వస్తారు? ఎప్పుడొస్తారు. అడిగా! ''నాది గాంధీగారి టిక్కట్టు, ఎప్పుడొస్తానో చెప్పలేను, వచ్చి మిమ్మల్ని చూసి వెళతా!'' అన్నారు. మర్నాడు ఉదయం, ''ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను,బండి ఏది దొరికితే అది ఎక్కేసివస్తా''ననంటే బండెక్కేకా చెప్పండి స్టేషన్ కొస్తా అంటే,''రావద్దు నేనే వస్తా! ఎలా రావాలో చెప్పండంటే'' చెప్పక తప్పలేదు. ఎదురుచూస్తూ కూచున్నా! మధ్యాహ్నం పన్నెండున్నర దాటింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చారు.వయసు ఎనభై అన్నారు. భోజనాలు చేసేం,చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు కూచోండన్నా! ''కూచోను, ఏ బండి దొరికితే అదెక్కేస్తాను. ఏరాత్రి కైనా హైదరాబాదు చేరతానని'' వచ్చినంత వేగంగానూ వెళ్ళేరు. వారిని కలిశాను,అదో ఆనందం! అంతే!!ఆ తరవాత కాలంలో శ్యామలీయం,శ్రీమతి శారద,తమ్ముడు రామంతో "వస్తున్నా "అన్నారు, కాకినాడనుంచి. రమ్మని ఆహ్వానించా!అప్పటికే ఇల్లాలు లేవటం లేదు,మంచాన ఉంది. ఎలా వస్తున్నారు? అడిగా! కార్ ఉంది చేతిలో ఏలారావాలో చెప్పండంటే, చెప్పేను. దురదృష్టం ఆ రోజు ఫ్లై ఓవర్ కట్టేసేరు, అక్కడికొచ్చి ఫోన్ చేసేరు, ఇలా జరిగిందని. అక్కడికెళ్ళి సందుగొందులగుండా ట్రేక్ దాటించి,ఇంటికి చేరేం! ఆ తరవాత అంతంత మాత్రమే అతిథి సత్కారం చేయగలిగేం. దానికేవారు చాలా ఆనందపడ్డారు. నిజానికి ఏమీ చేయలేకపోయేం అన్నది, నిజం.ఆ తర్వాత ఇల్లాలు కాలం చేయడంతో అన్నీ వెనకబట్టేయి. ఎవరిని రమ్మనటమూ లేదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లలితమ్మాయి ''దేశంలో కొచ్చా! వస్తున్నా'' అంది! రమ్మని ఆహ్వానించా! గౌరవం చేయలేనేమోనని భయం, అనుమానం. వచ్చింది,ఇంటి ఆడపడుచుకంటే ఎక్కువగా కలసిపోయిందంటే! అభిమానం ఇలా అని చెప్పలేను. ఇంతకు మించి చెప్పను. బంగారు తల్లికి దిష్టి తగులుతుంది. తను మాకోసం ఎవో ఏవో బహుమతులు తెచ్చింది. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంది,పాపం. మా చిన్న సత్కారం పుచ్చుకుంది. వీటన్నిటికంటే నాకు మీ ఆశీర్వచనం కావాలనిపాదాభివందనం చేసి, కూచుంది. చిన్న ఆశీర్వచనం పనస చెప్పి ఆశీర్వదించా! కడుపు నిండింది, మీరు పిలవకపోయినా వచ్చానంది.అవునమ్మా! నిజమే నేనే ఎవరిని పిలవలేకపోతున్నా! ఇల్లాలు కాలం చేయడంతో అన్నా! అభిమానం ఉన్నపుడు పిలుపులు పట్టింపులు ఉండవు, అందుకే పిలవకపోయినా వచ్చాను, ఆశీర్వచనానికే వచ్చానని, సరిపెట్టుకుంది.. మీ అభిమానానికి కడుపు నిండిందని సంబరపడి వెళ్ళింది. నిజానికి తను నన్ను చూడ్డానికి వచ్చి నన్ను సంబరపెట్టింది. నన్ను మళ్ళీ లోకంలో పడేయడానికి తనరాక దోహదం చేసింది.
ఆ తరవాత మొన్న విన్నకోటవారు, నేనూ బండివారూ వస్తున్నాం మిమ్మల్ని చూడ్డానికీ అన్నారు. రండి! రండి!! రండి!!! దయచేయండని ఆహ్వానించా! ఎలా వస్తున్నారంటే ట్రైన్ అన్నారు. స్టేషన్ కొస్తా అంటే వద్దన్నారు. చెబుతా వినండి! మీరొచ్చేబండి మూడో నంబర్ ప్లాట్ఫాం మీదకొస్తుంది. అక్కడినుంచి నడిచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి దిగి మళ్ళీ ఒకటో నంబర్ ఫ్లాట్ఫాం నడిచి బయటికొచ్చి కొంత దూరం నడిస్తేగాని ఆటో దొరకదు. ఈ నడిచే దూరం అరకిలో మీటరుంటుంది. ఆటోమూడున్నర కిలోమీటర్లు చుట్టు తిరిగి తీసుకొస్తుంది. నేనొస్తే మూడోనంబర్ ప్లాట్ఫాం నుంచి పట్టాలు దాటుకుని అరకిలో మీటర్ నడిపించి ఇంటికి చేర్చేస్తా! అన్నా. మీ ఇష్టం ఏం చేయమంటే అదే చేస్తా అన్నా! ఐతే స్టేషన్ కి రమ్మన్నారు.
బండి పదింపావుకొస్తుందంటే పదికి ఇంటి దగ్గర బయలుదేరా! ప్లాట్ఫాం మీదకి చేరి దిక్కులు చూస్తూ కూచున్నా! చాలా కాలమయింది రైల్ స్టేషను చూసి, అందుకు. అదుగో ఇదుగో అంటూ గంట పైన ఆలస్యంగా చేరింది,బండి. కబుర్లు చెబుతూ నడిపించి ఇంటికి చేర్చేను, ఇటుపక్క ఆటోలు దొరకవు మరి. కబుర్లు చెబుతూనే ఉన్నా!
కొంచం సేపు తర్వాత భోజనాలు చేసేం. నేను కబుర్లు చెబుతూనే ఉన్నా! కబుర్లతోనే వారి కడుపులు నింపేశాను. లెక్కకి రెండేసి మెతుకులు కతికేరంతే! నాతో ఏమైనా చెప్పాలంటే అదో పెద్ద ప్రయత్నం, అప్పుడప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేసి, కొన్ని సార్లు సఫలమై,కొన్ని సార్లు విఫలమై,సంజ్ఞలతో,అమ్మాయి చెప్పడంతో, ఇలా కాలం నడచింది.
భోజనాల తరవాత మీకు సన్మానమని మిత్రులిద్దరూ వేరు వేరుగా, నూతన వస్త్రాలతో సత్కరించి, ఆశీర్వచనం కావాలని అక్షతలు తెప్పించారమ్మాయి చేత. ఆశీర్వచనం చేసి, ఇలా కాదు కూచోండని, ఇద్దరిని కుర్చీల్లో కూచోబెట్టి ఒక ఆశీర్వచనప్పనస చెప్పి ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. ఆ తరవాత మిత్రులకి బహుచిన్న సత్కారం చేసేను.
ఆ తరవాత విన్నకోటవారు ప్రత్యేక బహుమతిగా ఎన్.టి.ఆర్ నూరవజయంతికి (NTR birth centenary coin) వచ్చిన వెండి డాలర్ బహూమానంగా ఇచ్చారు. ఇది అభిమానానికి పరాకాష్ట.నేనా చదువు లేనివాణ్ణి, ఒక గొప్పవ్యక్తినీ కాదు, ఆటగాణ్ణీ,పాటగాణ్ణీ కాదు, పెద్ద ఉద్యోగమూ చేయ్యలేదు. తెనుగు బ్లాగర్లలో ఒకడిని, అంతకు మించి ప్రత్యేకతేం లేదు. నన్ను చూడ్డానికి చలిలోపడి వందలకిలో మీటర్లు, శ్రమపడి ప్రయాణం చేసి రాకపోతే వీరి పెద్దలు చెఱబోయారా! ఇదేకదా అభిమానమంటే!!
మిత్రులిద్దరు బహు ఆనందపడి నన్ను ఆనందపెట్టేరు. విషయం మరింత వివరించడానికి మాటలు సరిపోవు.
నన్ను ఇంతమంది అభిమానించడమన్నది వారి గొప్పతనమేకాని నా గొప్ప ఇందులో లేశమాత్రమున్నూ లేదు..ఇంతమంది చేత అభిమానింపబడటం, వారు పెద్దమనసుతో నాన్ను చూడ రావడం, నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం.
మిమ్మల్ని మీరు మరీ తక్కువ చేసుకుంటున్నారు.
ReplyDeleteమిమ్మల్ని చూడడం, మీ ఆతిధ్యం ఆశీర్వచనం అందుకోవడం మా అదృష్టం 🙏. ఎంతో కాలం నుంచీ అనుకుంటున్న పని ఇప్పటికి చెయ్యగలిగినందుకు సంతోషంగా ఉంది.
రుచికరమైన వంట చేసి వడ్డించిన మీ కోడలు గారికి కృతజ్ఞతలు. మీ మనవరాలు అభివృద్ధి లోకి రావాలని ఆశీస్సులు ✋. అనుకూలవతయిన ఇల్లాలిని పొందిన మీ అబ్బాయికి అభినందనలు.
మాకు ప్రాప్తం ఉంటే మరోసారి కలుద్దాం 🙏.
విన్నకోట వారూ... అదృష్టవంతులు .. నేను 'వారంలో వచ్చి కలుస్తా' అని శర్మ గారికి చెప్పి ఎన్ని నెలలు దాటిందో లెక్కే లేదు.... పాతిక కిలోమీటర్లు దూరం అంతే..
Deleteనాకు ప్రాప్తం లేనట్లుంది..
శ్రీనివాస్, శోధిని
🙏
Deleteగట్టిగా అనుకోండి, అవుతుంది 👍.
విన్నకోట నరసింహా రావు29 January 2024 at 10:13
Deleteప్రతి నిమిషం నన్ను నేను గుర్తుచేసుకుంటూ ఉంటానండి, మరేంకాదు.
మిత్రుల ఔన్నత్య హృదయానికి నమస్కారాలు.
చిరంజీవులంతా మీ ఆశీస్సులకి అభినందనకు ఆనందించారు, మీకు నమస్కారాలు తెలియజేయమన్నారు.
సాధారణంగా గుడికెడితే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించేవారు, పాదుకలిస్తూ. మొన్న గుడికెడితే అక్కడ పాదుకలిచ్చి ఊరుకుంటే అయ్యా! పునర్దర్శనప్రాప్తిరస్తు అని ఆశీర్వదించండీ అని అడిగా! అమ్మ దయ ఉంటే మళ్ళీ కలుద్దాం. సందర్భంకాని ఉదాహరణ చెప్పి ఉంటే మన్నించండి.
ధన్యవాదాలు.
srinivasrjy29 January 2024 at 17:21
Deleteఅనుకుంటే ఎంత సార్! గంట. నేను కదల్లేకగాని, లేకపోతే వారానికోసారి మిమ్మల్ని కలిసేవాడినే! కాలవగట్టు రోడ్డు కంటే రాజానగరం మీంచి దగ్గరనేనండి :)
దొందూ దొందే :)
Deleteఅదృష్టవంతులు 🙏
ReplyDelete🙏
Deletebonagiri29 January 2024 at 10:15
Deleteవిన్నకోట నరసింహా రావు29 January 2024 at 21:39
ఈ విషయంలో నిజంగానే అదృష్టవంతుడినేనండి.
మీరు మాను,
Deleteమేము అభిమానులం.
ఇంతకీ ఫొటోలో విన్నకోట వారు ఎవరు, బండి వారెవరు?
దాడీవాలా బండీజీ
Deleteగం భీరము గా వున్నవారు .....సింహము గారు
ఇదే కొంటెతనం అంటే. “గం” తరువాత స్పేస్ ఎందుకు 😑?
Deleteఎవరు ఎవరో చెప్పారు fluke గినానా?
అయినా మీరు రిటైర్డ్ ప్రొఫెసర్ గారని శర్మ గారు అంటుంటారు. మరి సరళంగా చెప్పడం అలవాటు లేదా? ప్లాట్ ఫాం ఫొటోలో మెళ్ళో మాస్క్ వేళ్ళాడుతున్న వాడే కంఠీరవ అనో లేదా కుర్తా వేసుకున్న వాడే కేసరి అనో చెబితే సింపుల్ గా సరిపోతుందిగా? అబ్జర్వేషన్ ఉండాలండీ అబ్జర్వేషన్ ☝️.
bonagiri31 January 2024 at 14:21
Deleteకొద్ది సేపు అర్ధం చేసుకోలేకపోయాను సుమా! :)
బలే అన్నారుగా!
యువకుల్ని యువకులు గుర్తించాలి కదండీ :)
విన్నకోట నరసింహా రావు31 January 2024 at 20:24
Deleteగం బీజాక్షరం. గం గణాధిపతయేనమః
ఫ్లూక్ కాదు లెండి. ఒకప్పుడు మీరు బండివారు రాజారావు మాస్టార్ని కలిసారు,గుర్తొచ్చిందా? అప్పుడు వారు బ్లాగులో ఫోటోలు పెట్టేరు. అది చూసి చెబుతున్నది జిలేబిముసలి శాల్తీ, తప్పించి మరేమంత సీను లేదండి.
ఆయ్ మేమూ వచ్చినాము
ReplyDeleteసతీసమేతముగా మిమ్ముల కలిసినాము
వారిలో “సతి” గారి పేరేమిటి, “సమేతం” గారి పేరేమిటి?
Delete?
Delete"కష్టేఫలి వార్ని వారి సతీసమేతముగా.
ఈ తెలుగు వాళ్లకబ్బబ్బా తెలుగు నేర్పించాలిసి వొస్తోంది కర్మ కర్మ
Zilebi29 January 2024 at 14:03
Deleteరావణుడు గొప్ప శివభక్తుడు, గొప్ప పరిపాలకుడు, వేద పండితుడు,గొప్ప ఇంజనీర్ కాని పరస్త్రీ వ్యామోహం అనే ఒక్క దుర్గుణం అధోగతిపాలు చేసింది. నీవు గొప్పవాడివి, విషయం మీద గుణదోషం గుణదోషాలని చెప్పగలవాడివి, కాని ఈ వెకిలితనం,ఇతరులను హేళన చేయడం అనే దోషాలు నిన్ను అధోగతికి చేరుస్తున్నాయని గుర్తించలేకపోతున్నవు సుమా! చెప్పాలనిపించిది చెప్పేసేను.
మొత్తానికి జిలేబిని రావణకాష్టానికి కట్టేసారన్నమాట :(
Deleteరైల్వే స్టేషన్ ఫోటోకి
ReplyDelete"ముగ్గురు బ్లాగ్మరాఠీలు" సబ్ టైటిల్ పెట్టొచ్చు :)
మూడు జిలేబీల బంధం.☺️
DeleteZilebi29 January 2024 at 17:10
Deleteచిన్నప్పుడు మా స్వంత సినిమాహల్లో ముగ్గురు మరాఠీలు అనే సినిమా చూసాను. నిన్నూ తీసుకెళుదుననుకో కాని నువ్వింకా అమ్మని వదిలిపెట్టే వయసుకాదనుకుంటా. నాకంటే మూడు,నాలుగేళ్ళు ఆలస్యంగా పుట్టేవుగా మరి. :) గొప్పసినిమాలే, అందుకే ఎక్కువకాలం ఆడలేదు. :)
bonagiri29 January 2024 at 22:08
ReplyDelete:)
గురువు గారికి నమస్కారం. మిమ్మల్ని కలుసుకున్న ఆనందం నాక్కూడా మాటల్లో వ్యక్తీకరించ లేనిదే. ఓ చిరకాల ఆకాంక్ష తీరింది ఆ దేవుని సంకల్పంతో. మనఃపూర్వక ధన్యవాదాలు, మీ యొక్క, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరణకు, ప్రేమాభిమానాలకు. దేవుడు కనికరిస్తే మరొక్కసారి కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఈ విషయంలో ఒక చిన్న నిరాశ : శ్రీ రాజారావు గారూ కూడా మాతో రావలసి ఉంది, కానీ వారి ఆరోగ్య రీత్యా మా కూడా రాలేకపోయారు. I sincerely wish that happens some other time. Thanks once again to all of you 🙏🙏 🙏
ReplyDeletenmrao bandi30 January 2024 at 15:48
Deleteమూడు గంటలు కూడా లేని మనకలయిక ఒక మథురస్మృతి.నన్ను రసడోలలో ఓలలాడించిందన్నది నిజం.
మీ మాట కుటుంబసభ్యులకు వినిపించాను. ఆనందించారు. మీకు నమస్కారం తెలియజేయమన్నారు.
రాజారావు మాస్టారి ఆరోగ్యం కుదుటపడాలని అమ్మని వేడుకుంటా.
అమ్మదయుంటే మరోసారి కలుద్దాం.
**********************************************
మీ బ్లాగు చిత్రంగా ప్రవర్తిస్తోంది. :)
కామెంటు చేయబోతే బ్లాగులో ప్రచురించలేదు. మోడరేషన్ పెట్టేరేమో అనుకుని మళ్ళీ నొక్కేను. అదీ ప్రచురించలేదు. ఇప్పటికీ అవి బ్లాగులో కనపట్టంలేదు కాని ఆగ్రిగేటర్ లో కనపడుతున్నాయి...చిత్రంగా :)
చూడండి ఏమయిందో!
బండి వారి బ్లాగు టెంప్లేటంత చెత్త టెంప్లేటు వేరే ఎక్కడా కనరాదు :)
Deleteమీ బ్లాగు చిత్రంగా ప్రవర్తిస్తోంది. :)
ReplyDeleteఅవును సార్, నేను కూడా ట్రై చేశాను, రాలేదు. (ఆ ఒక్క పోస్ట్ లో మాత్రమే అలా జారిగింది, ఇతర పోస్ట్ ల దగ్గర ఓకే). మీ కామెంట్ చూశాక సెట్టింగ్స్ లోకెళ్ళి అటూ ఇటూ కెలికిన తరువాత ప్రస్తుతం సర్దుకున్నట్లుగానే అనిపిస్తోంది.
మూడు గంటలు కూడా లేని ... ... ...
i thank god for giving such happy moments of life, wherein we feel very joyous, forgetting time and ourselves. moments like these, meeting and spending time with learned friends like you, is like finding a hidden treasure. i thank you and your family members once again for being so very kind, cordial and treating us like family. i pray god to be kind to your family in all things and circumstances. i am ever indebted to you for your affection and goodwill. please convey my regards to your family members sir 🤝😊🙏
బండి వారి బ్లాగు టెంప్లేటంత చెత్త టెంప్లేటు ... ... ...
Deleteబామ్మాశ్రీ, గతంలో ఈ విషయంలో మీరిచ్చిన సలహా తరువాత కూడా నేను ప్రస్తుతం వాడుతున్న టెంప్లేట్ నే కంటిన్యూ చెయ్యడానికి ప్రధాన కారణం, ఆ టెంప్లేట్ లో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక సౌలభ్యం : బ్లాగులో గల పోస్ట్ లన్నింటినీ స్క్రీన్ ని పైకి క్రిందికి జరుపుతూ చాలా ఈజీగా ఏక కాలంలో 55 పోస్ట్ లను ఒకేసారి చూడగలగడం. ఏ ఇతర టెంప్లేట్ లోనూ ఈ సౌలభ్యం లేదు. నా పోస్ట్ లకు average గా నెలకు 2500 వ్యూస్ వస్తున్నాయంటే ఈ టెంప్లేట్ మాత్రమే కారణం అని నా నమ్మకం. (last month views score 5389, this month it is 2561) అందుకే కామెంట్స్ పోస్టింగ్ లో అప్పుడప్ప్పుడు ఇబ్బందులు తలెత్తినా దాన్నే పట్టుకు వెళ్ళాడుతున్నాను.
anyway, thanks for your concern.
గురువు గారు శర్మ గారిలా మీరు కూడా కూసింత పెద్ద మనసు చేసుకుంటే మీ దర్శన భాగ్యానికి అనుమతిస్తే, మిమ్మల్ని కూడా సందర్శించగలవాడను (అది కూడా మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటేనే సుమా) (మీ ఉత్తారాం కోసం పత్తికాయ కళ్ళతో ఎదురుచూపు చూసే ... ఇట్లు, మీ మనవడు 🤝😊🙏
నేను కూడా 👍.
Deleteరేపు వినరా వారిని కలుస్తాను.
Deleteఅలాగలాగలాగలాగే. ఉత్సుకతతో నాకు నిద్ర పట్టేటట్లు లేదు.
Deletenmrao bandi31 January 2024 at 18:45
Deletenmrao bandi31 January 2024 at 19:26
మీకు తెలీదనికాదుగాని ఓ చిన్న సలహా!
మీరు వేసే టపా పబ్లిష నొక్కే బటన్ కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ పోస్ట్ కి కామెంట్లు అలో చెయ్యాలా? వద్దా? అన్నది కూడా నిర్ణ్యించచ్చు. ఒక సారి అది చూడండి. :)
*************************************
మధురక్షణాలెప్పుడు తక్కువే ఉంటాయనుకుంటా! అవి మధురక్షణాలని గుర్తించేలోగా కరిగిపోతాయి. ఇదీని తెలియంది కాదు. చాదస్తం,టెన్షన్ పెరిగిపోతోందిగా :)
************************
ఈ ముసలి శాల్తీ సింగపూర్లో ఉంది, దేశం లోకి రాలేదు. వచ్చినా తోడు లేనిది కదలలేదు, నాలా. పడక కుర్చీ, లేప్టాప్ కబుర్లే. కాలు కదపలేదు.
విన్నకోట నరసింహా రావు31 January 2024 at 20:34
Deleteహాయిగా నిద్దరోండి. ఈ శాల్తీ సింగపూర్ లో ఉంది. దేశంలోకి రాలేదు. తోడుంటేకాని కదల్లేదు. నాలాకూడా నడవలేదు. పాపం! ఇప్చ్. కీ బోర్డ్ వారియరే :)
Zilebi31 January 2024 at 20:15
Deleteసుత్తి కబుర్లు చెప్పకు :)
// “ సుత్తి కబుర్లు చెప్పకు :)” //
Delete😁😁😁😁👌👌
sarma1 February 2024 at 09:07
Delete🙏🙏🙏
నిన్న బిజీ బిజీ కలవలే
Deleteఇవ్వాళ కలుస్తాము.
అలాగలాగే.
Deleteమిమ్మలి ఇవ్వాళ
Deleteకలిసి నందులకు మహాదానందము గా
వున్నది.
మరే, అదే చెప్పుకుంటున్నారు.
Deleteరేపటి పత్రికలో వార్తగా వస్తుందని కూడా అంటున్నారు.
“జిలేబి” గారు,
ReplyDelete// “ రేపు వినరా వారిని కలుస్తాను.” //
అని మీరు మొన్న అన్నారు. మొన్నటికి రేపు అంటే నిన్న ….. వచ్చింది వెళ్ళింది. మీరు అన్న రేపు బహుశః గోడ మీద వ్రాసుకోవలసిన రేపు ఏమో కదా?