Friday 2 February 2024

మధ్యాహ్న సూర్యుని మీద ఉమ్మేస్తే మన మొహానే పడుతుంది.

 


మధ్యాహ్న సూర్యుని మీద ఉమ్మేస్తే మన మొహానే పడుతుంది.


ఇదొకనానుడి.

సూర్యుని మీద ఉమ్మెస్తే ఏం జరుగుతుంది?ఎక్కడ సూర్యుడు ఎక్కడ మనం. సూర్యుడు మనకి 8 నిమిషాల ఇరవై సెకండ్ లు కాంతి దూరంలో ఉన్నాడు. మా పాశర్లపూడంత దూరముండదూ! అదేంటి? దూరం చెప్పాలంటే మైళ్ళో,కిలో మీటర్లో అనాలిగాని, ఈ కాంతి దూరమేంటీ? కాంతి సెకనుకి మూడులక్షల  కిలో మీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. 8నిమిషాల్లో ఎంత దూరం చేస్తుంది?  ఒక సెకనులో మూడులక్షల  కిలోమీటర్లయితే నిమిషానికెంత దూరం? 60 X 8= 480sec. 500 X 3=1500 లక్షలకిలో మీటర్లు. అమ్మబాబోయ్! అంత దూరమా? అంతదూరాన ఉన్న సూర్యుడు వేసవిలో మనభూమి కొంచం ఆయనవైపు తిరిగితేనే భరించలేం,వేడికి. అంతదూరం ఉమ్మి వేయగలమా? దగ్గరకెళ్ళగలమా? ఆవేడికి బతికుంటామా? ఏదీ మనవల్లకాని పని అని అర్ధం. మామూలు రోజుల్లోనే మధ్యాహ్నం సూర్యునికేసి తిరిగి ఉమ్మితే అది మన ముఖానే పడుతుంది. ఇది లోకరీతికి తర్జుమా చేసుకుంటే!!!


మనకంటే గొప్పవాడైన వ్యక్తిని కించపరచడానికో,ఎగతాళీ చేయడానికో మనం పిచ్చి పిచ్చిగా వాగితే అది తిరిగి మనకే అంటుకుంటుంది. అందుచేత ఎప్పుడూ అర్హులైనవారి జోలికి పోవద్దు. వారిని తూలనాడటం, కించపరచడానికి ప్రయత్నించడం,ఎగతాళీ చేయడానికి ప్రయత్నం చేస్తే మనమే వాటికి గురవుతాము తప్పించి ఆ గొప్పవ్యక్తికి ఏం జరగదు. ఇది చెప్పడానికే ఈ నానుడి వాడుతుంటారు.

2 comments:

  1. చాలా బాగా చెప్పారండీ
    ఇలాంటివన్ని మీ లాంటి పెద్దల ద్వారా వివరంగా తెలుసుకోవ టం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.

    ReplyDelete
    Replies
    1. మీరు కూడా కొంచెం పెద్దలే కదా, కందాలు మానేసి అందంగా ఏమైనా చెప్పండి.

      Delete