Length Measurement
12 inches= 1 Foot
3 Feet= 1 Yard
22 yards= 1 Chain
220 Yards or 10 chains = 1 Furlong.
8 Furlongs= 1 Mile.
Length Measurement in Links.
7.92 inches= 1 Link
100 Links= 1 Chain=100 X 7.92 inches=792 inches=66 Feet=22 Yards.
Area Measurement in Sq.Links and Acres.
1,000 Sq. links= 1 Cent
10,000 Sq. links = 10 Cents
1,00,000 Sq. links = one Acre.
10 Cents= ఒక కుంచం.
1 Sq. chain= 484 Sq. Yards.=10 Cents.
10 Sq. chains= 4840 Sq. yards= 1 Acre.
100 Sq. Chains= 10 Acres.
80 X 80 Chains =6400 Sq. Chains = 640 Acres=one square mile.
********
ఇప్పుడెందుకివన్నీ? కొచ్చను. సంవత్సరం కితం పంచాయతీవారు ఇళ్ళకొలతలేసుకెళ్ళేరు, భవనం ధర మదింపు, పన్ను విధింపు కోసం. ''వారం కితం మీ భవనం మరియు అది ఉన్న స్థలం కొలతలు కింద ఇస్తున్నాం, మా సర్వేయర్ సమర్పించిన కొలతల ప్రకారం. వీటిలో తేడాపాడాలుంటే రికార్డుతో వచ్చి కలవండి'' అని ఇచ్చారో నోటీసు. ఇంటికొలతలు మీటర్లలో తీసుకున్నారు, సరిగానే ఉన్నాయికాని. స్థలం మాత్రం ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువకనపడింది, అడుగుల్లో కొలతలు తీసుకుని మీటర్లలో నమోదు చేసుకుని ఉండచ్చనుకున్నా. అలాగా సరిపోలేదు ఏమై ఉండచ్చు,పాలుపోలేదు. . ఆహా! ముఫై ఏళ్ళ పైబడి నేను కొనలేకపోయిన స్థలం పంచాయితీవారు నాపరం చేసినట్టున్నారే అని క్షణం సంతోషించి, వెంటనే ఉలికిపడ్డాను. మూడు రెట్లు స్థలముందని రికార్డయితే నా బతుకు బస్టాండే, ఆ తరవాత, పన్నేసేటప్పుడని భయపడి, కాగితాలు బయటకి తీసి చూస్తే, అందులో కొలతలు లింకుల్లో కనపడ్డాయి.వాటిని చదరపుగజాలు,చదరపు మీటర్లలోకి మార్చడానికి పడ్డ తిప్పలు. చిన్నప్పుడు లెక్కల మాస్టారు మానం రాకపోతే అవమానంరా అనేవారు. అందుకీ మానాలన్నీ ఒక సారి గుర్తుచేసుకుని, లింకుల్ని చదరపు గజాల్లోకి మార్చి,చదరపుమీటర్లుగా మార్చి, ఎక్కడో అడుగుల్ని చదరపు మీటర్లలోకి మారడం లో పొరపాటు జరిగుంటుందని చెప్పి,ఒప్పించి, లెక్కలేసి చూపి,కాగితాలు చూపి, సరిజేయించుకొచ్చాను. అప్పుడు గుర్తు చేసుకున్న సంబరం.
🙂🙂
ReplyDeleteచాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
ఈ లింకులు కరణాల దగ్గర వుండేవని గుర్తు.
విన్నకోట నరసింహా రావు25 February 2024 at 21:40
Deleteఅవునండి.లైసెన్సుడు సర్వేయర్లు ఉండేవారు,వారి దగ్గరా ఉండేవండి. వందలింకుల ఇనపచైన్,మడతపెట్టడానికి వీలుగా,దానికి కొన్నిచోట్ల వేలాడుతూ అంకెలతో ఇత్తడిబిళ్ళలు, మరొకటి ఆరడుగులపొడుగు ఇనప ఊచ, దానికి చివర ఒక చెక్కదిమ్మ,దానిలో క్రాసుగా రెండు గాడులు,దీన్ని క్రాస్టాప్ అనేవారు. జండాలకి ఆరడుగులపొడుగు, వెదురుపుల్లలు. ఇవీ సర్వేసరంజామా. ఇవి మోసుకొచ్చేందుకో మనిషి. సర్వే చేసేటపుడు సర్వేయరు మొదటగా ఆ స్థలంచుట్టూ తిరిగి కొన్ని చోట్లు గుర్తించుకుని అక్కడ జండాలుపాతి, ఆ తరవాత తక్కువ త్రిభుజాల్లో మొత్తం కొలత పూర్తయేలా చూసుకుని,కర్ణం కొలిచేందుకు మధ్యలో మనుషుల్ని నిలబెట్టిజండాలతో,అన్నీ ఒక వరసలో వచ్చేటట్టు చూచుకుని క్రాస్టాప్ తో, ఇలా చాలా పని ఉండేదండి. ఆతరవాత కొలతలు తీసుకుని కాగితం మీద వేసుకున్న స్కెచ్ పై కొలతలేసుకుని లింకుల్లో, ఆ తరవాత తీరుబడిగా లెక్కలు కట్టి మొత్తం విస్తీర్ణం తేల్చడం ఒక పెద్ద పనిగా ఉండేది.
కొంతమందైతే ముఖదృష్టినే విస్తీర్ణం చెప్పగలిగి ఉండేవారు. ఇలాగేకాక కొలవడానికి ఒక ఆరడుగుల పొడుగు చేపాటికర్రనూ ఉపయోగించేవారు, దానితో కూడా కొలత సరిగానే వచ్చేది.
లింకులు అనేవి ఉన్నవని తెలుసుకొని మీరు చెప్పినవాటితో ఏకీభవించిన ఆ ఉన్నతాధికారికి నిజంగా ధన్యవాదములు చెప్పాలి.
ReplyDeleteRao S Lakkaraju25 February 2024 at 22:25
Deleteఅధికారి కంప్యూటర్ లో చూస్తూ, పక్కన సర్వేయర్ ఉండగా, ఆయనకూడా ఆ బ్లాకు మొత్తం ప్లాను కొలతలతో చూస్తుండగా, ప్రశ్నోత్తరాలు జరిగాయి. నేను కాగితాలతో సాక్షాలతో,మాటాడేను. మానాలు చెప్పేను, మానాలు నిజమని అనిపించాను. ఏరకంగానూ అక్కడ చ.మీటర్ లలో నమోదైన సంఖ్య సరికాదని,జరిగి ఉన్నది ఇదీ అని వారికి చెప్పేను,ఒప్పించేను. జరిగి ఉన్నది, కొలతలు అడుగులలో తీసుకోడం జరిగింది అవే నమోదయ్యయి ప్లాన్ లో కూడా. ఆ తరవాతవి చ.గ మార్చబడ్డాయి. అంతవరకు సరిగానే జరిగింది. ఆతరవాతే చ్.మీ లుగా మార్చడంలో పొరబాటు జరిగి చ.గ లు రెట్టింపు చేసి చ.మీ లుగా నమోదయిందని అంకెలతో రుజువు చేసాను. అధికారి ఒప్పుకున్నారు. మార్పుచేసిన కాగితమొకటి సతకంతో నాకిచ్చేరు. అంతతో పని పూర్తయిందండి. అప్పుడు నేను కూడా మీరన్నట్టుగానే అధికారికి ధన్యవాదాలు తెలిపాను. ఇది ఏదీ పని చెయ్యకపోతే నాకు ఆఖరిస్త్రం ఉంది, మళ్ళీ కొలవమనేది. సమాధానం పెద్దదయిపోయిందేమో సుమా!