Wednesday 21 February 2024

అనానిమస్సు

 అనానిమస్సు



అనానిమస్సులు ఒక్క సోషల్ మీడియానే కాదు,రాజకీయరంగాన్ని కూడా పట్టికుదుపుతున్నారు. ఎలక్టరల్ బాండ్లు కొని, అనానిమస్సుగా రాజకీయపక్షాలకి డొనేషన్ ఇవ్వచ్చని, ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్ల పథకం తెచ్చింది. 2017-22 దాకా మొత్తం పదహారు వేలకోట్లు రూపాయల  

బాండ్లు అమ్మితే అందులో పదివేల కోట్లు బి.జె.పి కి పదహారు వందలకోట్లు కాంగ్రెస్ కి, మిగిలినది మిగిలిన పార్టీలకి చేరిందిట. ఈ బాండ్లు కేష్ చేసుకోలేదు, వాటిని కోర్ట్ ఆపింది.    రాకీయపక్షాలకిచ్చే డొనేషన్లన్నీ ఆనానిమస్సులనుంచే అందుతున్నాయి,ఏ కొద్ది మొత్తమో ఇతరులనుంచొస్తున్నాయేమో! ఈ డొనేషన్లిచ్చేవారెవరో తెలియాల్సిన అవసరముందని ఒక పి.ఐ.ఎల్ వేస్తే, సుప్రీం కోర్టు  అనానిమస్సుల ముసుగు తొలగించి వారెవరో చెప్పాల్సిందే, అని రూలింగ్ ఇచ్చింది, ఎలక్టరల్ బాండ్లు చెల్లవంది. బాండ్ల సొమ్ము కొన్నవారికి తిరిగిచ్చేయాలంది.  ఏది అమలు జరుగుతుందో చూడాలి,  రాజకీయ పక్షాలకి అనానిమస్సుగా సొమ్మిద్దామనుకునేవాడు తన స్వంతపేరున బాండ్లు కొంటాడా? అనుమానమే!  ఎంతమంది అనానిమస్సులు సొమ్ము వెనక్కి తీసుకుంటారో చూడాలి.  

సోషల్ మీడియాలో  అనానిమస్సులు కామెంట్లు వెనక్కి తీసుకోలేనట్టు, వీళ్ళూ సొమ్ము వెనక్కి తీసుకోలేకపోవచ్చు.  

ప్రతిపక్ష రాజకీయులు సుప్రీం కోర్ట్ అలా అన్నతరవాత అవును వారెవరో తెలియాల్సిందే అంటున్నాయి. బి.జె.పి కి సొమ్ము రాకుండా పోయిందని చంకలు గుద్దుకుంటే   ప్రతిపక్ష రాజకీయులవారికొచ్చే సొమ్ము కూడా పోయింది.


 అనానిమస్సూ ఏమైనా నువ్వు గొప్పవాడివోయ్! నీతో ఏదైనా సాధ్యమే సుమా!!   అన్నాడు మా గిరీశం.


కొసమెరుపు:- శ్రీ కపిల్ సిబాల్ గారు చేపట్టిన ప్రతి కేసు ఓడిపోవడమే జరుగుతోంది, ఈ కేసు నెగ్గేరు,  జన్మకో శివరాత్రన్నట్టు.

 

అప్పుడే రెండు రోజులనుంచి సూరీడు చురుక్కుమంటున్నాడు, రాత్రి చలి పగలు 37/38 c degrees వేడి. సూరీడు అనానిమస్సు కాదే!!!

2 comments:

  1. రాజకీయ పార్టీలకు గుప్త దానాలు స్వీకరించడం సౌకర్యంగా ఉంటుంది. మధురమైన పేరు గలవారిలో కూడా అనానిమస్సులు ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. బుచికి22 February 2024 at 00:30

      మూట పట్టుకెళ్ళి బాండ్లిచ్చెయ్యండంటే కుదరదుటండీ! బాండ్లు కొనేవారికి బేంక్ అక్కౌంట్ కావాలి, దానినుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఆన్ లైన్ అప్లై చెయ్యాలి,పాన్ నంబరు,ఆధార నంబర్లివ్వాలి.ఇంత చేస్తే బేంక్ బాండిస్తుంది. అన్ని బ్రాంచీలు ఇవ్వవండి, కొన్ని మాత్రమే! ఆ తరవాత బాండు కొన్నవారు ఇవ్వాలనుకున్న రాజకీయపార్టీకి ఇవ్వచ్చు. నాకు ఆలస్యంగా తెలిసింది.ఇప్పుడు కొన్నవారందరి అక్కౌంట్లకి డబ్బులు తిరిగి చేరతాయండి, అనుమానం లేదు.

      పాన్ నెంబరు ఆధార్ ఇస్తే ఇక అనానిమస్సేంటండి? ప్రభుత్వానికి తెలిస్నట్టే! ఇన్కం టాక్స్ కట్టక తప్పదు, ఇచ్చిన సొమ్ముమీద! బ్లాక్ మనీ కానే కాదు. పార్టీకి ఎవరిచ్చేరు? తెలీదు. ప్రభుత్వానికి తెలుస్తుంది. గుప్తదానం కాదేమో!అనిపిస్తుందండి.

      మీరు మరీ మొహమాటస్థుల్లా ఉన్నారే! అనానిమస్సుగా తిరిగే జిలేబి తెలియనిదేంగాదు. తనగురించి తను చెప్పుకోవాలి.ఇతరులు చెబితే బాగోదు. ఇప్పుడు తనూ తన గురించి చెప్పుకోలేదు. చెబితే పిచ్చకొట్టుడు కొడతారు. కుళ్ళు జిలేబీ అని చెప్పచ్చునండి.

      Delete