కాళ్ళగజ్జి కంకాళమ్మ
కాళ్ళగజ్జి కంకాళమ్మ
వేగు చుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీరు
నీరుకాదు నిమ్మలవాయ
వాయకాదు వావింటి కూర
కూరకాదు కుంకుమ బొట్టు
కాలుతీసి కడగ బెట్టు.
ఇది చిన్న పిల్లల పాటగా ప్రసిద్ధిలో ఉంది, కాని దీనిలో ఒక వ్యాధికి నివారణోపాయాలున్నాయని అంటారు. నిజమెంతో తెలియదు. తెలిస్తే చెప్పండి. ఈ పాట చాలా రూపాల్లో కనపడుతోంది.
నాకు తెలిసి మొండి గజ్జి అనగా మాదకి ఒక మందు అని అనుకుంటున్నా! ఇందులో కంకాళం అనేది మానవ పుఱ్ఱె. శ్మశానంనుంచి మానవ పుఱ్ఱెను తెచ్చి మరల కాల్చితే తెల్లని భస్మం తయారవుతుంది. ఇది మందు,మొండి గజ్జిలాటి చప్పి,మాదలకి మందు. ఈ భస్మాన్ని ఆముదంలో కలిపి రాయాలంటారు. ఒకప్పుడు ఇది వాడుకలో ఉండేదని చెప్పగా విన్న గుర్తు.
ఇక ఇందులో చెప్పిన కూరలపేర్లు వెలగమొగ్గ తెల్లగా ఉంటుంది. వేగు చుక్కంటే మార్నింగ్ స్టార్ గా చెప్పబడే శుక్రుడు.మోదుగ చెట్టు తెలిసినదే! నిమ్మలవాయ అన్నది ఒక ఆకు కావచ్చా అని అనుమానం లేదా నిమ్మకాయకావచ్చా? వావింటి కూర అనేది ఆవాలజాతిలో వామింటి అనే కూర ఉన్నది. కుంకుమ పసుపుతో తయారైనది కూడా మందే. ఈ పాట చెప్పినవారేం చెప్పదలుచుకున్నారు. కాలంలో ప్రజలనోట మాటల్లో మార్పులేమైనా వచ్చి ఉండచ్చు కూడా!!!
కాళ్ళ గజ్జా కంకాళమ్మ
ReplyDeleteవేగు చుక్కా వెలగామొగ్గా
మొగ్గా కాదు మోట నీరు
నీరు కాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూర కాదు గుమ్మడి పండు
పండు కాదు పాప కాలు
కాలు తీసి కడిగా పెట్టు
bonagiri19 February 2024 at 10:44
Deleteమనం చెప్పినవేకాక చాలా ఇతరరకాలుగా కూడా ఈ పాట ఉన్నదండి. ఐతే మొదటి రెండు పంక్తులు ఎందులోనూ మార్పులేదు.
నాకో సందేహం ఉండిపోయింది. మొదటి పంక్తిలోనిది కంకాళం కాదేమోనని, కాకోలమేమోనని. కాకోలమనేది ఒక మొక్క. ఇవన్నీ వివిధరకాల ఆకులు వాటి పసర్లు గజ్జికి వాడేవారేమో! ఇదంతా ఎందుకూ అన్న మేధావులనీ చూశానండి. మన పూర్వీకులు ఎలా జీవించారో తెలుసుకోడం తప్పులేదనుకున్నానండి.
ధన్యవాదాలు.