ఎలక్ట్రల్ బాండ్లు -- కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినట్టు...
కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినంతలో కొబ్బరికాయల దొంగతనం ఆగుతుందా? అంటుంటారు మా జిల్లాలలో.
అనగనగా ఒక పేద బ్రాహ్మడికి పెరట్లో నాలుగు కొబ్బరిచెట్లున్నాయి. చెట్టు గెలవేసి కాయ దింపుకొచ్చే సమయానికి ఎవరో దొంగ, కాయలు చడీ,చప్పుడూ కాకుండా దింపుకుపోతున్నాడు. దొంగని పట్టుకోడానికి,కాయలు దొంగతనం జరగకుండా ఉండడానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూవచ్చాడు, కాని దొంగతనం ఆగటం లేదు. ఈ సంగతివిని మరొకరు, కొబ్బరి చెట్లకి మడిబట్ట కట్టు, ఎలా కాయలెత్తుకెళతాడో చూద్దామని, పేదవాడిని ఎగసనతోసాడు. నిజమేననుకుని పేదవాడు మడిబట్టలు కట్టేడు, నాలుగు చెట్లకీ. దొంగ మామూలుగానే చెట్లకాయలూ, చెట్లకి కట్టిన మడిబట్టలూ కూడా ఎత్తుకుపోయాడు. మర్నాడు ఉదయం కాయలు,బట్టలూ కూడా పోవడం చూసి పేదవాడు గొల్లుమన్నాడు. అన్నవస్త్రాలకోసం పోతే ఉన్నవస్త్రాలు పోయినట్టు బట్టలుకూడా పోయినందుకు ఏడ్చేడు.
మన సుప్రీం కోర్ట్ వారు ఎలక్ట్రల్ బాండ్లు చెల్లవని తీర్పిచ్చారు. భేష్! మన దేశంలో ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టడం కొత్తకాదు. స్వతంత్రం వచ్చింది మొదలు అన్ని పార్టీలు డబ్బు కర్చుపెడుతూనే ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఎలక్షన్లకి సొమ్ములు కర్చుచేయడం కొత్తకాదు. ఈ చట్టం చెల్లకపోతే, మరో చట్టం రావచ్చు. లేదా మరో పద్ధతిలో రాజకీయపార్టీలు సొమ్ములు వసూలు చేసుకుంటాయిగాని మానవు. చిత్రమేమంటే ఎలక్టరల్ బాండ్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన పార్టీ కనపడ్డ దాఖలాలు ఉన్నట్టు లేదు. చాలా తేలిక విధానం, క్రౌడ్ ఫండింగ్, చాలా తేలిక. ఎంతమందిచ్చారు? తెలీదు. ఎవరిచ్చారు? తెలీదు. ఎంతిచ్చారు? తెలీదు.ఎక్కడిచ్చారు? తెలీదు. ఎవరు చెప్పలేరు. ఏ బహిరంగ సభలో ఎంతిచ్చారు? చెప్పలేరు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు.
విరాళాల విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వనుకోవు,అదీ చిత్రం. అన్నీ ఆ తానులో ముక్కలే! ప్రపంచంలో రాజకీయపార్టీలకి, ప్రజలు,కార్పొరేట్లు సొమ్ములెందుకిస్తాయి? వాళ్ళు అధికారంలో కొస్తే తమకి లాభం చేకూరుస్తారనేగా!డబ్బుతో సంబంధంలేని ఎన్నికలొస్తాయా? సాధ్యమా? డబ్బున్నవాళ్ళు గాని, డబ్బున్నవాళ్ళు వెనకున్నవాళ్ళుగాని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, నెగ్గుతున్నారు. డబ్బులేనివాళ్ళంతా డబ్బున్నవాళ్ళని పాలకులుగా ఎన్నుకుంటున్నారు, అదికదా చిత్రం. ఇదింతే
వెల్క్ం బేక్, శర్మ గారు. “మీ రాక మాకెంతో సంతోషం సుమండీ”
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు17 February 2024 at 13:30
Deleteతొందరపాటు నిర్ణయమని తొందరలోనే తెలుసుకున్నానండి.
ధన్యవాదాలు.
🙏
Deleteమీరాక హర్షించే వాళ్ళల్లో నేనొకడ్ని.
ReplyDeleteraamudu20 February 2024 at 01:29
Delete''వినదగు నెవ్వరు చెప్పిన'' అన్నదాన్ని పట్టుకుని విన్నానండి కాని ఆ అతరవాత చెప్పిన ''వినినంతనె వేగపడక'' అన్నది మరచాను. విన్నాను వేగపడ్డాను. పడ్డానని సిగ్గుపడలేదు. పడ్డానని తొందరలోనే గుర్తించానండి. పడి లేవడం తప్పుకదు కదండీ. మళ్ళీ లేచాను.పడి లేవలేకపోతే సిగ్గుపడాలి. పడిలేస్తే సిగ్గుపడ్డమెందుకు?ఇలా పడటం లేవడం జీవితంలో భాగాలే కదండీ. మీలాటి అభిమానులు పడి లేచినందుకు సంతోషించి తెలిపారు. నాకు అభిమానులున్నారని, విదేశాల్లో కూడా ఉన్నారని కుళ్ళు కుంటున్నవాళ్ళునారు చూసారా! పాపం అలాగే కుళ్ళు కుంటూనే ఉన్నారుగా! వాళ్ళు పదికాలాలకి అలాగే ఉండాలండి.
మీ అభిమానం నా పట్ల ఉన్నందుకు
ధన్యవాదాలు.