వినతి
అభిమాన మిత్రులకు సవినయ వినతి
కొంతమంది నాతో ఫోన్లో మాటాడటానికి ప్రయత్నిస్తున్న కాల్ రికార్డ్ నాదగ్గర ఉన్నది. అందులో ముఖ్యంగా ఒకరు అమెరికా,మరొకరు ఆస్ట్రేలియా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ మధ్య బహరైన్ దేశం నుంచి ఒకరు నాతో మాటాడటానికి ప్రయత్నిస్తున్నది కాల్ రికార్డ్ చూశాను. నేను ఎవరితోనూ ఫోన్ లోకాని వీడియో కాల్ లోగాని మాటాడలేను, వినపడకపోవడమే కారణం. నేను అత్యవసరంగా మాటాడాలంటే నాకు మరొకరు తోడు ఉండాలి,తప్పదు. అందుచేత దయచేసి నన్ను మన్నించ ప్రార్ధన. నా పరిస్థితి ఈ మధ్య నన్ను దయతో చూడటానికి వచ్చిన మిత్రులు ప్రత్యక్షంగా చూడటం వలన వారికి తెలుసు. మీరు మెయిలివ్వండి జవాబిస్తాను,లేదా బ్లాగులోకి రండి, జవాబిస్తాను.
నమస్కారం.
మీ బ్యాంకు అకౌంట్లను హ్యాకు చేసే వాళ్లయ్యుంటారు :)
ReplyDelete
DeleteZilebi5 February 2024 at 11:09
Zilebi5 February 2024 at 13:24
జన్మకో శివరాత్రి అంటారు.నీ బ్లాగు జీవితంలో ఎవరికైనా ఒక మంచిమాట చెప్పేవంటే ఇదేనేమో!
నాకు బహరైన్ లో కూడా అభిమానులున్నారు,వారవునాకాదా అనే అనుమానంతోనే ఈ టపా. నేనెవరి అడియో కాల్ గాని వీడియోకాల్ గాని ఆన్సర చెయ్యనని చాలామందికి తెలుసు. తెలియనివారికోసమే ఈటపా! ఇప్పుడు నాకు గల్ఫ్ లోకూడా అభిమానులున్నందుకు కుళ్ళుకో!
-
Deleteనారదా!
సోకు మాడ కుళ్ళకే :)
కుళ్లొద్దె జిలేబీ నా
వాళ్లెంతోమంది గలరె బహరెయినున! నా
కాళ్ళకు మొక్కేందుకనుచు
వాళ్లెల్లరువచ్చెదమని కాల్జేస్తారే!
ఫోన్ లో శర్మ గారి స్పందన లేకపోయేసరికి హ్యాకోత్సాహికులకు ఆటకట్టు అయినట్లుంటుంది 😁😁.
ReplyDeleteహ్యాకోత్సాహము గలదని
Deleteసైకోవలె కాలు సేసి సైసై యనకోయ్
నీ కా తెలివే వుంటే
రా ! కష్టేఫలి విదురుల రఫ్ఫాడింపన్ !
Zilebi5 February 2024 at 13:24
Deleteచిమడవే చిమడవే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీ పులుపుపోదు
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ
నువ్వెంత ఉడికినా నీ కంపుపోదు.
కుళ్ళవే కుళ్ళవే ఓ జిలేబి
నువ్వెంత కుళ్ళినా నీ బతుకు మారదు
పాపం జిలేబి.
Delete-
Deleteపాపం జిలేబి! అయ్యో
పాపమ్ము జిలేబులమ్మి! బతుకేమో పా
డై పోయేనే కుళ్లుచు
పాపమ్మిక మారటమ్ము భగిని కుదరదే!
Zilebi7 February 2024 at 17:15
Deleteపాపం జిలేబి! అయ్యో
పాపమ్ము జిలేబులమ్మి! బతుకేమో పా
డై పోయేనే కుళ్లుచు
//పాపమ్మిక మారటమ్ము భగిని కుదరదే!//
నువ్వు చేస్తున్నది తప్పని గుర్తించి ఒప్పుకున్నావు,చివరికి. పులి స్వారీ చేస్తున్నావని తెలుసునీకు,స్వారీ విరమించి కిందకి దిగితే బొమికలు కూడా మిగలవనీ తెలుసు,నీకు,అది గుర్తించావు,చాలా ఆలస్యంగా. ఇది తెలిసొచ్చినరోజున నేను బ్లాగులనుంచి విరమించడం........విధి.
అసలు సమాధానం ఇవ్వకూడదనుకున్నా,బ్లాగులనుంచి విరమిస్తూ,తప్పుకుంటూ,కాని కొద్దిగా సడలించుకున్నా!
ఇలా చెప్పాల్సివస్తుందనుకోలేదు. విధి అంతే!
టాటా వీడుకోలూ గుడ్ బై
ఇంక
శలవు,
ఎల్లరకు నమస్కారం
ఆహా! నే రాయక పోడానికి కారణం నువ్వేనోయ్
Deleteఅంటూ గడుసుగా తప్పించుకోవడం గోజీలకే చెల్లు :)
విరమిస్తున్నా ! నాదిక
కరకర లాడెడు టపాలు కనబడవోయ్ తిం
గరి బుచ్చి ఒప్పు కున్నావ్
మరి తెలుసుకొనేవు తప్పు ; మన్నించేసా!
నేనూ వి రమించే స్తున్నా
శర్మ గారు,
ReplyDeleteఅమెరికా, ఆస్ట్రేలియాల నుంచి వచ్చిన ఫోన్లు మీ అభిమానులేమో (అదీ ఘంటాపథంగా చెప్పలేం లెండి)? బహ్రెయిన్ మాత్రం సందేహాస్పదమే. తెలియని నెంబర్ల ఫోన్లు తియ్యకపోవడమే క్షేమకరం ఈ డిజిటల్ మాయా జగత్తులో. (నా పోలసీ).
విన్నకోట నరసింహా రావు5 February 2024 at 13:14
Deleteనేనెవరి ఆడియో వీడియో కాల్స్ ఆన్సర్ చెయ్యనని మీకూ తెలుసు. నేను ఫోన్ లో మాటాడాలంటే ఎలా ఉంటుందో మీకూ అనుభవమే కదా! :) నాకు గల్ఫ్ లో ఉన్న అన్ని దేశాలలోనూ అభిమానులున్నారండి.