దుర్వినియోగం
దుర్వినియోగం మన జీవితంలో భాగమైపోయిందా అంటే నిజమే అనిపిస్తూ ఉంది.
ఉదయం లేచినది మొదలు పళ్ళు తోమినంతసేపూ కుళాయి నీళ్ళు తిప్పి వదిలెయ్యడం అలవాటు దుర్వినియోగం. అలాగే మనుషులు లేకపోయినా పట్టపగలే లైట్లు ఫేన్లు పనిచేస్తూ ఉండడం. ఆపై ఆహార దుర్వినియోగం, తిన్నంత తిని, తిన్నదానికంటే ఎక్కువ పారెయ్యడం అలవాటైపోయింది. ఇక పెళ్ళిళ్ళు పేరంటాలలోనైతే చెప్పేదేలేదు. మందుల దుర్వినియోగం,అదో పెద్దకత. మూడు మాత్రలేసుకోండి, మూడు పూటలా, తగ్గితుంది చాలు, ఇది డాక్టర్ గారి మాట, చీటి పట్టుకెళితే షాపువాడు మూడు అమ్మడం కుదరదండి, స్ట్రిప్ కి పదుంటాయి, మీరువాడుకున్నా మరేం చేసుకున్నా పదీ కొనాల్సిందే. అవసరం! కొనక తప్పదు, మూడు వాడిన తరవాత మిగిలినవి దుర్వినియోగం, పారెయ్యాలి లేదా రోగాన్ని మళ్ళీ ఆహ్వానించాలి. వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సమాజపరంగా దుర్వినియోగానికి లెక్కే లేదు. ఆపై చట్ట దుర్వినియోగానికొస్తే సెక్షన్ 498 A మరియుSC/ST Atrocities act దుర్వినియోగమైనంతగా మరేదీ దుర్వినియోగం కాలేదనే అనిపిస్తుంది. వాక్స్వాతంత్ర్యం పేరిట జరిగే దుర్వినియోగానికి లెక్కలేదు. మన దేశంలో అనధికారుల అధికార దుర్వినియోగం ఓ పెద్ద కత.
“పుణ్యభూమి నాదేశం నమోనమామి”
ReplyDeleteఅధికార దర్పం ఉండేదేమో గానీ బ్రిటిష్ పాలనా కాలంలో అధికార దుర్వినియోగం ఇంత దారుణంగా లేదేమో? ఇప్పుడు రెండూ కూడా (దర్పం, దుర్వినియోగం) పెచ్చు మీరి పోతున్నాయి.
విన్నకోట నరసింహా రావు4 February 2024 at 09:55
Deleteఇదెప్పుడూ ఉన్నదేనండి. అప్పుడు ఎక్కువమందికి తెలిసేదికాదు. ఇప్పుడు అంతా అందరికి తెలుస్తోంది. అంతే తేడా! :)
Supreme court had proposed changes to some stringent provisions of the SC ST ACT. In 2018 BJP government Cabinet brought an amendment bill to restore the original law that had provisions for an FIR without any preliminary enquiry and immediate arrest of a person.
ReplyDelete------
The 2018 Supreme Court verdict had made a provision for anticipatory bail to offenders under the law. However, after strong protests against the dilution across the country, the Modi government removed this provision to bring the law back to its original form with stringent provisions.
https://theprint.in/judiciary/supreme-court-upholds-modi-govts-sc-st-amendment-act-says-approval-not-needed-for-firs/362395/
బుచికి4 February 2024 at 15:03
Deleteవివరించినందుకు ధన్యవాదాలు. చెప్పాలంటే చాలా ఉంది.