అడిగిన ప్రశ్న "అబద్ధం చెప్పనిదేది?" అని. అద్దం అసలు ఏమీ మాట్లాడదు/చెప్పదు, చూపిస్తుంది అంతే (అంటే మూకీ సినిమా లాంటిది). ఆ చూపించేది కూడా నిజం కాదు. ఎందుకంటే అన్నింటికీ కుడి-యెడమలు మార్చి రివర్స్‌లో చూపిస్తుంది. ఒకవేళ శర్మగారు అద్దం కరెక్ట్ అనినా, అది సరైన సమాధానం కాదు అని నా ఉద్దేశ్యం.
కాంత్10 January 2024 at 22:25 మీరలా అంటే కాదనగలనా? నీటి నిశ్చలత ఏక్షణం లోనైనా చెదిరిపోవచ్చు, నిశ్చలత చెదరని ప్రతిబింబాలు చూపగల రాతి స్థంభాలున్నాయి మన కొన్ని దేవాలయాలలో. కాని అవి ప్రతిబింబం చూపడానికి ఉద్దేసింపబడలేదు. అద్దం మాత్రం సర్వకాల సర్వాస్థలలోనూ ప్రతిబింబం చూపడానికే ఉద్దేసింపబడిందనుకుంటానండి.
Zilebi8 January 2024 at 11:57 వెంకట రాజారావు . లక్కాకుల8 January 2024 at 14:26 ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగ తుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి! వింటే? దానవులలో ముఖ్యుడా! ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం ఎందుకు? అక్కరలేదు. చక్రి సర్వోపగతుడు,అన్ని చోట్లా ఉన్నాడు. వెదికి చూస్తే, ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు.
వెతికితే కనపడతాడా? నిస్సందేహంగా! చూడగల కన్ను,వెతకాలనే మనసూ ఉండాలి. అంతే.
"చుక్క కడుపులో పడితే నిజం తన్నుకొస్తుందన్నమాట. :) ఎప్పుడూ నిజమే చెబుతున్నామన్నవారి కడుపులో చుక్క ఎప్పుడూ ఉంటుందనమాట. :) ... ... ... sarma10 January 2024 at 16:49
అక్కరలోని మక్కువ లెక్క చెయ్యక తొక్కలో చుక్క అని టెక్కుగా, నిక్కుగా ఎకసెక్కమాడే వారికి డొక్కలో చుక్క పడితే గానీ ఆ తైతక్కల తొక్కులాట చక్కంగా, నిక్కంగా లెక్కకెక్కి రాదన్న భల్ చక్కటి నిజం ఎంచక్కగా, ధిక్కరించ లేనంత మా చక్కగా, మనసుకెక్కేట్లుగా, నొక్కి వక్కాణించారు సారూ ! మీకో నూటొక్క చక్కిలాలు 🙏🙏🙏 jf/jk :)
nmrao bandi12 January 2024 at 00:11 అనుప్రాస పదాలతో ఆటాడుకునే విద్య అందరికీరాదు సుమా! నాకు పొగడడానికి మాటలు రావటం లేదు, చెప్పలేకపోతున్నా!. అద్భుతం ఆవిష్కరించారుగా!!! వందనాలు.
hari.S.babu11 January 2024 at 16:44 పరబ్రహ్మ స్వరూపమెప్పుడూ సత్యమైనది, నిత్యమైనది. మరి బుద్ధియే పరబరహ్మ స్వరూపమైతే ఇన్ని అబద్ధాలు ఎందుకు కనపడుతున్నాయి?
హరి.S.బాబు వేదం చెప్పిందని భాగవతంలో పోతన చెప్పాడు!అన్నీ చూసే నమ్ముతున్నావా - జిలేబీని డిప్ప మీద ఒకటిస్తే బతుకు జాంగ్రీ అవ్వుద్ది,ఖబడ్దార్.
@sarma బుద్ధియే పరబరహ్మ స్వరూపమైతే ఇన్ని అబద్ధాలు ఎందుకు కనపడుతున్నాయి?
హరి.S.బాబు కనబ్డుతున్నవి అబధ్ధాలు అని మికు తెలిసేది కూడా మీలో బుధ్ధి జాగృతం కావడం వల్లనే కదా!
బుధ్ధి జాగృతం కాని సమయంలో కూడా తెలివి అనేది పని చేస్తుంది.అందువల్ల తాత్కాలికం నడిచిపోతుంది గాబట్టి దాన్నే బుధ్ధి అని పొరపడుతున్నారు.అసలు సిసలైన దేవరహస్యం - "బుధ్ధి" అనేది స్వయం జాగృతం కాదు.మనం కష్టపడి నిద్ర లేపాలి.అది నిదర్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న తెలివి అన్నిసార్లూ నిజానిజాలు నిర్ధారించి చెప్పలేదు.
@zilebi ఇగ్గో హరి బాబు.....కమ్ టు ది పాయింట్ అండ్ ఏంసర్
హరి.S.బాబు వేదం చెప్పిందని భాగవతంలో పోతన చెప్పాడు!అవును,నేనే చూశాను.ఎక్కడో చూసి ఇక్కడికి రావటం కాదు,నాలోని బుధ్ధిని జాగృతం చేశాను,సత్యాన్ని నాలోనే చూశాను..తెలిసింది.నీకసలు బుధ్ధి ఉందో లేదో కూడా తెలియదు నాకు. ==== డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్సులో ఒకతనికి స్టైలుగా ఉండటం ఇష్టం.రోజుకో గెటప్ వెయ్యాలని సరదా - కమలాగాసన్ ఫ్యాన్!ఒకసారి మీసం తీసేసి వచ్చాడు,చూట్టానికి బాగానే ఉన్నాడు గానీ వెంకటేష్ అనే ఫ్రెండు దానికీ మగతనానికీ లింకు పెట్టి జోకులేస్తున్నాడు అతనిమీద. నేనేదో పుస్తకం చదువుకుంటూ వీళ్ళ గోలకి డిస్టర్బ్ అయ్యి కల్పించుకుని "అది లేకపోతే తప్ప మీసం లేనంతమాత్రాన మగవాడు కాకుండా పోతాడా?" అని రిటార్ట్ ఇచ్చాను.దానికి మీసం తీసేసిన ఫ్రెండు ఖుషీ అయ్యాడు గానీ వీడు మాత్రం "అది అంటే ఏమిటి?చెప్పు!" అని జిడ్డులా తగులుకున్నాడు. ఆ చెప్పగూడని మాట నాతో చెప్పించాలని వాడి ప్లాను,నేను దొరుకుతానా!"అది నీకు ఉండి ఉంటే నువ్వు నన్ను అడిగేవాడివి కాదు - ఇప్పటికే తెలిసిపోయేది.అది నీకు లేనప్పుడు నేను ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా నీకు అర్ధం కాదు - కాబట్టి పదే పదే అడిగి ఉపయోగం లేదు!" అనేశాను. ==== మళ్ళీ ఇన్నేళ్ళకి నీకూ అదే రిప్లై ఇస్తున్నాను.
hari.S.babu14 January 2024 at 21:35 sarma11 January 2024 at 17:54 చిన్న అనుమానం, ************** శంకరులు ఆత్మయే పరమాత్మ స్వరూపం అన్నారు. పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ అన్నారు. ఎక్కడో చిన్న లింకు మిసాయిపోతున్నా! దయచేసి మరికొంచం వివరించవూ!
@sarma చిన్న అనుమానం, ************** శంకరులు ఆత్మయే పరమాత్మ స్వరూపం అన్నారు. పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ అన్నారు. ఎక్కడో చిన్న లింకు మిసాయిపోతున్నా! దయచేసి మరికొంచం వివరించవూ!
హరి.S.బాబు వేదంలో ఉన్న అద్వైతం అనేది ఒక సత్యంలా చెప్పి వదిలేసిన దాన్ని శంకరులు కొంచెం సాగదీసి సిధ్ధాంత రూపం ఇచ్చారు.అయితే, శిష్యులు గానీ భాష్యకారులు గానీ వ్యాఖ్యానుంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొంత గందరగోళం వచ్చింది.లలితా సాహస్రం "పంచ కోశాంతర స్థితా" అని బల్లగుద్ది చెప్తున్నప్పుడు శంకరులు చెప్పినా సరే "పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ" అనేది అబధ్దం అయిపోతుంది,అయిపోవాలి.ఎందుకంటే,వైరుధ్యం లేకపోవటమే సతం యొక్క ప్రధాన లక్షణం.
ఆననదవల్లి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించి చెప్తూ అన్నమయ కోశం గురించి చెప్తున్న అనువాకంలో "తస్యేద మేవ శిరః, అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అందువల్ల పురుషతత్వం గల జీవులు అన్నరసమయమై ఉంటాయి.బ్రహ్మమునైన నేను పురుషతత్వం గల జీవులకు శిరస్సునై ఉన్నాను.ఆ పక్షికి నేను కుడి రెక్కను,ఆ పక్షికి నేను ఎడమ రెక్కను.ఆ పక్షికి నేను ఆత్మను.ఇదియే ఆ పక్షికి తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది" అని అన్నమయ కోశంలో పరమాత్మ పక్షిలా విహరిస్తాడని చెప్తుంది.ఇది అన్నమయ కోశపు వర్ణన అయితే, మిగిలిన నాలుగు కోశాలలోనూ పరమాత్మ యొక్క బింబ రూపమైన ఆత్మ పక్షి రూపంలోనే విహరిస్తుంది.
బుధ్ధి నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా తెలివిలానే ఆత్మకూ అస్తిత్వం ఉంటుంది.బుధ్ధిని చైతన్యవంతం చేసినప్పుడు జరిగేది ఆత్మకు స్వస్వరూపజ్ఞానం కలగడమే.బుధ్ధిని చైతన్యం చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క దారి ప్రార్ధన - జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే బుధ్ధిని నిద్ర లేపుతుంది.
బుధ్ధి జాగృతం కాని సమయంలో కూడా తెలివి అనేది పని చేస్తుంది.అందువల్ల తాత్కాలికం నడిచిపోతుంది గాబట్టి దాన్నే బుధ్ధి అని పొరపడుతున్నారు.అసలు సిసలైన దేవరహస్యం - "బుధ్ధి" అనేది స్వయం జాగృతం కాదు.మనం కష్టపడి నిద్ర లేపాలి.అది నిదర్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న తెలివి అన్నిసార్లూ నిజానిజాలు నిర్ధారించి చెప్పలేదు. - 👌👌బాగా చెప్పారు హరి బాబు గారు.
Jilebi wants only time pass and sees even serious topics as entertainment.
అద్దం.
ReplyDeleteఅడిగిన ప్రశ్న "అబద్ధం చెప్పనిదేది?" అని. అద్దం అసలు ఏమీ మాట్లాడదు/చెప్పదు, చూపిస్తుంది అంతే (అంటే మూకీ సినిమా లాంటిది). ఆ చూపించేది కూడా నిజం కాదు. ఎందుకంటే అన్నింటికీ కుడి-యెడమలు మార్చి రివర్స్‌లో చూపిస్తుంది. ఒకవేళ శర్మగారు అద్దం కరెక్ట్ అనినా, అది సరైన సమాధానం కాదు అని నా ఉద్దేశ్యం.
Deleteకుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
Deleteదేవదాసులాగా ఒక్క తాగడానికైతే పొరపాటుండదు కాని మిగతా అన్ని విషయాల్లోనూ, కుడి ఎడమైతే చాలా పెద్ద పొరపాటేనండోయ్
Deletebonagiri8 January 2024 at 09:39
Deleteఅద్దం నిజమని నమ్ముతున్నానండి, మీలాగా. పేరుకూడా నిజం చెప్పుకోలేని జనాలున్న కాలంలో అద్దం చెప్పేది నిజమండి.
కాంత్8 January 2024 at 22:11
Deleteఅద్దం మాట్లాడటం మొదలెడితే భరించగలమంటారా? పీకపిసికి చంపెయ్యమూ? మన చూపు తేడా ఇక్కడే మొదలయిందనుకుంటానండీ!. :)
కాంత్8 January 2024 at 23:48
Deleteకుడి ఎడమల తేడాలు లేనిచోట్లలోనే జనాలెక్కువండి. కుడి ఎడమల తేడా ఉండకూడదని కదా ఉవాచ మరి :)
Rao S Lakkaraju8 January 2024 at 23:29
Deleteఅంతేకదండీ! మరోమాటకూడా చెప్పేసేడు కదా! ’ఓడిపోలేదోయ్’ అని :)
నిశ్చలమైన నీరు కూడా నిజం చెపుతుంది(చూపిస్తుంది) కదా మరి. అది సరి అయిన సమాధానం ఎందుకు కాకూడదు?
Delete-
Deleteనీరు నిశ్చల మైనచో నిజము చెప్పు
గాదె? మరదేలనొ జవాబు కాదు సూవె ?
కాంతునికి సమాధానపు దాహమెపుడు
తీరునొ? తెలిపెదరొ తాత తీయగంటి :)
:)
కాంత్10 January 2024 at 22:25
Deleteమీరలా అంటే కాదనగలనా?
నీటి నిశ్చలత ఏక్షణం లోనైనా చెదిరిపోవచ్చు, నిశ్చలత చెదరని ప్రతిబింబాలు చూపగల రాతి స్థంభాలున్నాయి మన కొన్ని దేవాలయాలలో. కాని అవి ప్రతిబింబం చూపడానికి ఉద్దేసింపబడలేదు. అద్దం మాత్రం సర్వకాల సర్వాస్థలలోనూ ప్రతిబింబం చూపడానికే ఉద్దేసింపబడిందనుకుంటానండి.
-
Deleteమీరనిన నేను కాదని మీర గలన ?
నీరు నిశ్చలముగనెప్డు నిలచునక్కొ?
అద్దమెల్లపుడు ప్రతిబింబమునె చూపు
గాదె తరచితరచిచూడ కాంతు డౌర!
జిలేబి
ReplyDeleteమట్టి ప్రమిద లోన , మరి కాను పించడు
ReplyDeleteనూనె లోన గనగ , నోప మతని
ప్రత్తి లోను , దాని వత్తిలో గనరాని
శివుడు , దివ్వె లోన చేరి వెలుగు .
మట్టిలోను గలడు మరికని పించునూ
Deleteనియని ప్రత్తిలోను నీవు గాంచ
గలవు వత్తిలోను గాన ప్రమిదలోను
గాంచ గలవు హృదిని గాన మొదట
కౌంటర్ అటాకు :)
లక్కాకుల వారూ పద్యం బాగుంది. జిలేబీ గారూ అర్ధం బాగుంది.
DeleteZilebi8 January 2024 at 11:57
Deleteవెంకట రాజారావు . లక్కాకుల8 January 2024 at 14:26
ఇందుగలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగ
తుండెందెందు వెదకి చూచిన
అందందేగలడు దానవాగ్రణి! వింటే?
దానవులలో ముఖ్యుడా! ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం ఎందుకు? అక్కరలేదు. చక్రి సర్వోపగతుడు,అన్ని చోట్లా ఉన్నాడు. వెదికి చూస్తే, ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు.
వెతికితే కనపడతాడా? నిస్సందేహంగా!
చూడగల కన్ను,వెతకాలనే మనసూ ఉండాలి. అంతే.
ఉన్నడున్నాడున్నాడు,
చూడగలకన్నుంటే
వెతకగల మనసుంటే
ఎక్కడబడితే అక్కడున్నాడు.
ఉన్నాడోయ్! ఉన్నాడు!!
వింటే మనసు ఉంటే
చూసే కన్నుంటే
తెలిసేను మనకతా!
ఉన్నాడోయ్! ఉన్నాడు
Deleteఅబ్బో చూసి నట్టే ఘంటాపథము గా చెప్పెస్తున్నారు ? గన్నారా ?
కన్నారా యని , దుడుకుగ
Deleteఅన్నా రేమండి , బుధుల నట్లడుగంగా ,
విన్న జనాలకు , హవ్వా !
మన్నన వద్దాండి ? మీరు మారరు సుమ్మీ !
-
Deleteకన్నా ! రా యని దుడుకుగ
అన్నానా ! వెన్నుడు మన వాడండోయ్ రా
జన్నా! అభ్యంతరమా
చిన్నా ! రారా యటంచు సేవింప హరిన్ ?
కౌంటరు :(
హరి యైరి శర్మవారలు ,
Deleteసరి సరి ! ఈ యమ్మ మీకు , సరి వెన్నలు , వే
సరి , కొసరుచు తినిపించును ,
సరిగా తినుడయ్య ! మూతి సరిగా నిడుచున్ .
రెండు పద్యాలు అర్థవంతంగా ఉన్నాయి.👌
ReplyDeleteబుచికి8 January 2024 at 19:39
Deleteఅర్ధమే ఆనందం :)
ఏకాలంలోనూ,ఏదేశంలోనూ,అబద్ధం చెప్పనిదేది?
ReplyDeleteజిలేబి, గుండుసున్న
శీధు వబధ్ధము చెప్పదు ,
Deleteశోధించగ నెన్నడైన , చుక్క పడిన వా
డేదేశమందు గానీ ,
తాదాత్మ్యము పొందు , నిజము తన్నుక వచ్చున్ .
వెంకట రాజారావు . లక్కాకుల10 January 2024 at 10:34
Delete"Zilebi8 January 2024 at 11:57
జిలేబి
&
Zilebi10 January 2024 at 04:21
ఏకాలంలోనూ,ఏదేశంలోనూ,అబద్ధం చెప్పనిదేది?
జిలేబి, గుండుసున్న"
చుక్క కడుపులో పడితే నిజం తన్నుకొస్తుందన్నమాట. :)
ఎప్పుడూ నిజమే చెబుతున్నామన్నవారి కడుపులో చుక్క ఎప్పుడూ ఉంటుందనమాట. :)
అస్తు! అస్తు! అస్తు!!!
ఉల్టా చేస్తే యెట్లా !
Deleteఫల్టీ కొట్టింది నిజము , భావఙ్ఞులలో
గిల్టీగా ఫీలయి , ఫే
కల్టీ బ్లాగుల జిలేబిగార్ ఫీలవరో !
ఉల్టా చేస్తే భళా !
Deleteఫల్టీ కొట్టించి నిజం, దానర్ధం నా
వెల్టీగా ఫీలవ, ఫే
కల్టీ బ్లాగుల జిలేబి ఫ్లావర్ మిస్సవరో !
(నా karaoke వెర్షన్ సారూ :)
ఆహా ! బ ' కరావోకే ' ,
Deleteబాహాటముగా జనాల్ని బకరా ల్జేసెన్ ,
దాహము వేస్తే , సారూ !
సోహం బ్రహ్మోస్మి , శీధు శోధన యేనా ?
-
Deleteనారదా
బండెనక బండి కట్టీ
ఖండన మండనల జేసి కందంబొకటిన్
నిండుగ గంధోత్తమ తో
డెందంబారగ పదముల రివ్వున వేయన్
"చుక్క కడుపులో పడితే నిజం తన్నుకొస్తుందన్నమాట. :)
Deleteఎప్పుడూ నిజమే చెబుతున్నామన్నవారి కడుపులో చుక్క ఎప్పుడూ ఉంటుందనమాట. :) ... ... ... sarma10 January 2024 at 16:49
అక్కరలోని మక్కువ లెక్క చెయ్యక తొక్కలో చుక్క అని టెక్కుగా, నిక్కుగా ఎకసెక్కమాడే వారికి డొక్కలో చుక్క పడితే గానీ ఆ తైతక్కల తొక్కులాట చక్కంగా, నిక్కంగా లెక్కకెక్కి రాదన్న భల్ చక్కటి నిజం ఎంచక్కగా, ధిక్కరించ లేనంత మా చక్కగా, మనసుకెక్కేట్లుగా, నొక్కి వక్కాణించారు సారూ ! మీకో నూటొక్క చక్కిలాలు 🙏🙏🙏
jf/jk :)
శీధు శోధన యేనా ? ... వెంకట రాజారావు . లక్కాకుల11 January 2024 at ౦౭:౪౨
Deleteమధు శోధనాయ నమః 🙏🙏🙏
:)
nmrao bandi12 January 2024 at 00:11
Deleteఅనుప్రాస పదాలతో ఆటాడుకునే విద్య అందరికీరాదు సుమా! నాకు పొగడడానికి మాటలు రావటం లేదు, చెప్పలేకపోతున్నా!. అద్భుతం ఆవిష్కరించారుగా!!!
వందనాలు.
డెభ్భై దాటెను , వైద్యులు
Deleteనిబ్బరముగ (1 ) పెగ్గు వైను , నింపాదిగ మీ
ఇబ్బందులు తొలగించును ,
సుబ్బరముగ తీసుకొనుడు సూ ! యనిరి సఖా !
మరి , వెదుకులాట మొదలయె
సరి సరి యే వైను మంచి సరుకని , బుధు లీ
సరికిందున ఘనులని , గడు
సరులని సూచనలిడంగ సరసులని సఖా !
"అనుప్రాస పదాలతో ... అద్భుతం ఆవిష్కరించారుగా!!!" ...
Deleteఏదో చిన్నపాటి సరదా సార్. మీ అభినందనలే ఆశీస్సులు.
ధన్యోస్మి 🙏🙏🙏
"సూచనలిడంగ సరసులని ...
Deleteఅకటా! ఆకతాయి కిదేమి సమస్య!
ఒకటా రెండా! ఎన్నని చెప్పుదు? గటగట గు
టకెయ్య, కని, కొని, పుచ్చుకొన, ఎన్నని
చక్కని దేశ విదేశీ తీర్ధాల్, స్వాస్థ్యము చిక్కన్!
ఏదేశంలోనూ ఏకాలంలోనూ అబద్ధం చెప్పనిది - జీవుల దేహాలలో కొలువై ఉన్న ధారణా పరబ్రహ్మ స్వరూపమైన బుధ్ధి!
ReplyDeleteఎవరు చెప్పేరు ? చూసొచ్చేరా ?
Deletehari.S.babu11 January 2024 at 16:44
Deleteపరబ్రహ్మ స్వరూపమెప్పుడూ సత్యమైనది, నిత్యమైనది. మరి బుద్ధియే పరబరహ్మ స్వరూపమైతే ఇన్ని అబద్ధాలు ఎందుకు కనపడుతున్నాయి?
@zilebi
Deleteఎవరు చెప్పేరు ? చూసొచ్చేరా ?
హరి.S.బాబు
వేదం చెప్పిందని భాగవతంలో పోతన చెప్పాడు!అన్నీ చూసే నమ్ముతున్నావా - జిలేబీని డిప్ప మీద ఒకటిస్తే బతుకు జాంగ్రీ అవ్వుద్ది,ఖబడ్దార్.
@sarma
బుద్ధియే పరబరహ్మ స్వరూపమైతే ఇన్ని అబద్ధాలు ఎందుకు కనపడుతున్నాయి?
హరి.S.బాబు
కనబ్డుతున్నవి అబధ్ధాలు అని మికు తెలిసేది కూడా మీలో బుధ్ధి జాగృతం కావడం వల్లనే కదా!
బుధ్ధి జాగృతం కాని సమయంలో కూడా తెలివి అనేది పని చేస్తుంది.అందువల్ల తాత్కాలికం నడిచిపోతుంది గాబట్టి దాన్నే బుధ్ధి అని పొరపడుతున్నారు.అసలు సిసలైన దేవరహస్యం - "బుధ్ధి" అనేది స్వయం జాగృతం కాదు.మనం కష్టపడి నిద్ర లేపాలి.అది నిదర్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న తెలివి అన్నిసార్లూ నిజానిజాలు నిర్ధారించి చెప్పలేదు.
కాబట్టి బుధ్ధి ఎప్పుడూ ఎవరికీ అబధ్ధం చెప్పదు.
జై శ్రీ రామ్!
ఇగ్గో హరి బాబు
Deleteడిప్ప మీదిస్తే జాంగ్రీ గట్రా వేరే ఎవరి దగ్గిరైనా చెల్లుబడి అవ్వొచ్చు జిలేబి దగ్గిర జాన్ తానై.
ఎవరు చెప్పేరు ? చూసొచ్చేరా ?
కమ్ టు ది పాయింట్ అండ్ ఏంసర్
This comment has been removed by the author.
Delete@zilebi
Deleteఇగ్గో హరి బాబు.....కమ్ టు ది పాయింట్ అండ్ ఏంసర్
హరి.S.బాబు
వేదం చెప్పిందని భాగవతంలో పోతన చెప్పాడు!అవును,నేనే చూశాను.ఎక్కడో చూసి ఇక్కడికి రావటం కాదు,నాలోని బుధ్ధిని జాగృతం చేశాను,సత్యాన్ని నాలోనే చూశాను..తెలిసింది.నీకసలు బుధ్ధి ఉందో లేదో కూడా తెలియదు నాకు.
====
డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్సులో ఒకతనికి స్టైలుగా ఉండటం ఇష్టం.రోజుకో గెటప్ వెయ్యాలని సరదా - కమలాగాసన్ ఫ్యాన్!ఒకసారి మీసం తీసేసి వచ్చాడు,చూట్టానికి బాగానే ఉన్నాడు గానీ వెంకటేష్ అనే ఫ్రెండు దానికీ మగతనానికీ లింకు పెట్టి జోకులేస్తున్నాడు అతనిమీద.
నేనేదో పుస్తకం చదువుకుంటూ వీళ్ళ గోలకి డిస్టర్బ్ అయ్యి కల్పించుకుని "అది లేకపోతే తప్ప మీసం లేనంతమాత్రాన మగవాడు కాకుండా పోతాడా?" అని రిటార్ట్ ఇచ్చాను.దానికి మీసం తీసేసిన ఫ్రెండు ఖుషీ అయ్యాడు గానీ వీడు మాత్రం "అది అంటే ఏమిటి?చెప్పు!" అని జిడ్డులా తగులుకున్నాడు.
ఆ చెప్పగూడని మాట నాతో చెప్పించాలని వాడి ప్లాను,నేను దొరుకుతానా!"అది నీకు ఉండి ఉంటే నువ్వు నన్ను అడిగేవాడివి కాదు - ఇప్పటికే తెలిసిపోయేది.అది నీకు లేనప్పుడు నేను ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా నీకు అర్ధం కాదు - కాబట్టి పదే పదే అడిగి ఉపయోగం లేదు!" అనేశాను.
====
మళ్ళీ ఇన్నేళ్ళకి నీకూ అదే రిప్లై ఇస్తున్నాను.
జై శ్రీ రామ్!
అవును,నేనే చూశాను.ఎక్కడో చూసి ఇక్కడికి రావటం కాదు,నాలోని బుధ్ధిని జాగృతం చేశాను,సత్యాన్ని నాలోనే చూశాను....
Deleteఓకే అయితే
Deletehari.S.babu15 January 2024 at 17:18
మెచ్చేను హరిబాబూ, మెచ్చేనబ్బాయి.
ఇది నిన్ననే చెప్పాలి అనారోగ్యంతో ఆలస్యమైంది.
******
పల్టీ బలేగా కొట్టించావుగా! భేష్!! సాహో!!!
This comment has been removed by the author.
Deletehari.S.babu14 January 2024 at 21:35
Deletesarma11 January 2024 at 17:54
చిన్న అనుమానం,
**************
శంకరులు ఆత్మయే పరమాత్మ స్వరూపం అన్నారు. పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ అన్నారు. ఎక్కడో చిన్న లింకు మిసాయిపోతున్నా! దయచేసి మరికొంచం వివరించవూ!
@sarma
Deleteచిన్న అనుమానం,
**************
శంకరులు ఆత్మయే పరమాత్మ స్వరూపం అన్నారు. పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ అన్నారు. ఎక్కడో చిన్న లింకు మిసాయిపోతున్నా! దయచేసి మరికొంచం వివరించవూ!
హరి.S.బాబు
వేదంలో ఉన్న అద్వైతం అనేది ఒక సత్యంలా చెప్పి వదిలేసిన దాన్ని శంకరులు కొంచెం సాగదీసి సిధ్ధాంత రూపం ఇచ్చారు.అయితే, శిష్యులు గానీ భాష్యకారులు గానీ వ్యాఖ్యానుంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొంత గందరగోళం వచ్చింది.లలితా సాహస్రం "పంచ కోశాంతర స్థితా" అని బల్లగుద్ది చెప్తున్నప్పుడు శంకరులు చెప్పినా సరే "పంచకోశాల్లోనూ ఆత్మలేదంటూ బుద్ధి గుహలో చైతన్యమే ఆత్మ" అనేది అబధ్దం అయిపోతుంది,అయిపోవాలి.ఎందుకంటే,వైరుధ్యం లేకపోవటమే సతం యొక్క ప్రధాన లక్షణం.
ఆననదవల్లి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించి చెప్తూ అన్నమయ కోశం గురించి చెప్తున్న అనువాకంలో "తస్యేద మేవ శిరః, అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అందువల్ల పురుషతత్వం గల జీవులు అన్నరసమయమై ఉంటాయి.బ్రహ్మమునైన నేను పురుషతత్వం గల జీవులకు శిరస్సునై ఉన్నాను.ఆ పక్షికి నేను కుడి రెక్కను,ఆ పక్షికి నేను ఎడమ రెక్కను.ఆ పక్షికి నేను ఆత్మను.ఇదియే ఆ పక్షికి తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది" అని అన్నమయ కోశంలో పరమాత్మ పక్షిలా విహరిస్తాడని చెప్తుంది.ఇది అన్నమయ కోశపు వర్ణన అయితే, మిగిలిన నాలుగు కోశాలలోనూ పరమాత్మ యొక్క బింబ రూపమైన ఆత్మ పక్షి రూపంలోనే విహరిస్తుంది.
బుధ్ధి నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా తెలివిలానే ఆత్మకూ అస్తిత్వం ఉంటుంది.బుధ్ధిని చైతన్యవంతం చేసినప్పుడు జరిగేది ఆత్మకు స్వస్వరూపజ్ఞానం కలగడమే.బుధ్ధిని చైతన్యం చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క దారి ప్రార్ధన - జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే బుధ్ధిని నిద్ర లేపుతుంది.
జై శ్రీ రామ్!
hari.S.babu16 January 2024 at 13:02
Deleteసందేహ నివృత్తికి ధన్యవాదాలు.
బుధ్ధి జాగృతం కాని సమయంలో కూడా తెలివి అనేది పని చేస్తుంది.అందువల్ల తాత్కాలికం నడిచిపోతుంది గాబట్టి దాన్నే బుధ్ధి అని పొరపడుతున్నారు.అసలు సిసలైన దేవరహస్యం - "బుధ్ధి" అనేది స్వయం జాగృతం కాదు.మనం కష్టపడి నిద్ర లేపాలి.అది నిదర్లో ఉన్నప్పుడు పనిచేస్తున్న తెలివి అన్నిసార్లూ నిజానిజాలు నిర్ధారించి చెప్పలేదు. - 👌👌బాగా చెప్పారు హరి బాబు గారు.
ReplyDeleteJilebi wants only time pass and sees even serious topics as entertainment.