Tuesday, 16 January 2024

చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది

 చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి  పడుతుంది

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.

ఇదొక నానుడి అమ్మ తరచు చెప్పేది. ఏమిటి ఇలా చెబుతుందనుకునీ వాడిని.  నిజమే కదా! అన్నీ వడ్డించిన విస్తరి బరువుకి అణిగి ఉంటుంది,  పుల్లాకు(పులివిస్తరి) ఏమీ బరువు లేక ఎగిరెగిరి పడుతుంది. జీవితం లో అనుభవాలతో గాని దీని అర్ధం తెలియలేదు. సంపద కలిగినవాడు సంపాదన ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటాడు,ఎగిరెగిరి పడడు. ఏవిషయానికి ఉద్రేకపడిపోడు. సంపాదన లేనివాడు సంపద లేనివాడే ఎగిరెగిరి పడుతుంటాడు. అలాగే జీవితం లో కష్టసుఖాలు చూసినవాడు ఉద్రేకపడిపోడు, సమస్యను పరిష్కరించుకోడానికే చూస్తాడు. జీవితానుభవం లేనివాడు మరికొన్ని చిక్కులు తెచ్చుకుంటాడు. అలాగే చదువుకున్నా,  అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు. నాకింకా తెలియదు అనుకున్నవాడు వృద్ధిలో కొస్తాడు,ఎగిరి పడడు. మిడిమిడి జ్ఞానం వారు చెప్పక్కరలేదు.  మొన్నటి పద్యభాగమే మరోసారి.

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి


చమురున్న పెంకు నిలిచి కాలుతుంది,   చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి  పడుతుంది ,  అనేవారు నాటి కాలంలో. ఇదీ ఒక నానుడే!  

11 comments:

  1. అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు...



    ఈ మధ్య ఒచ్చి‌నాయన గురించాండి ఇది ?


    ReplyDelete
    Replies
    1. నన్ను కాదుగదా ? ! , మన్నన యిదె , దేవ
      దేవుడా ! కృష్ణ పరమాత్మ ! తిరుమలేశ !
      నిన్ను దప్ప మదిని , దేనినీ తలవను
      గద ! ముకుంద ! నమోస్తు 🙏 , వేగ , రార !

      Delete

      Delete
    2. మిమ్మల్ని కాదు ! వలదు భ
      యమ్ము! కవీశ్వర! తెలివి భయంకరముగ తమ
      సొమ్మనుచు విర్రవీగెడు
      తమ్ముళ్ల గురించి వారి తాకిడి యేమో :)

      Delete
    3. వెంకట రాజారావు . లక్కాకుల16 January 2024 at 14:30
      అలా ఎందుకనుకున్నారు మిత్రమా!

      Delete

    4. Zilebi16 January 2024 at 09:50
      తమరు పండితమ్మన్యులు. తమకు తెలియనిదేముంది?

      Delete
    5. మీ సహవాసదోషం తో ఏదో కొంత అబ్బిందండీ :)

      Delete


    6. కరెక్టడు కా మింటు - మీలాంటి పండితమ్మన్యుల సహవాస......

      Delete
  2. -

    ఎందుకలా అనుకున్నా
    రెందుకు రాజన్న ? మీరు రేడండీ ! మా
    కందమ్ము మీదు వ్యాఖ్యలు
    డెందంబార చదువ కల రిచ్చట ప్రజలున్

    ReplyDelete
  3. -

    పండితమ్మన్యుల కెడ సావాస దోష
    మున జిలేబి నేర్చుకొనె ప్రముఖులు వారి
    లోన కష్టేఫలి గురువులు ! తెలియనివి
    వారి కేదియు లేదు వివరము లరయ!

    ReplyDelete
  4. అడు గడుగో ! నారాముని
    అడుగు లయోధ్యాపురి నిడె , ఆ పదములె , నా
    కడుగడుగున యేడుగడగ ,
    కడుకొని , నా యెడద యందు , గ్రమ్మర నిలిచెన్ .

    ReplyDelete