Friday, 19 January 2024

రెటమత శాస్త్రం :

 రెటమత శాస్త్రం :


లోకంలో కొంత మంది ఉంటారు. ఇతరులు ఏం చెప్పినా దాన్ని కాదు అనడం, దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, విమర్శించడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కాదన్నవాడే కరణం అన్నట్లు, ఇతరులు చెప్పినది కాదనడం లోనే మన తెలివితేటలు ఉన్నాయి,వాళ్ళ కంటే భిన్నంగా ఆలోచించడంలోనే మన గొప్పదనం ఉంది అని నిశ్చితాభిప్రాయం కలిగి ఉంటారు. ఏదైనా ఎవరైనా చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తారే తప్ప ఎవరు చెప్పినా వినరు. వారికి తోచిందే చేస్తారు. పోనీ అదైనా సరిగ్గా చేస్తారా అంటే అది కూడా సరిగా చేయరు. అయినా ఈ అలవాటు వదిలిపెట్టలేరు.

ఇంకా ఈ రెటమత శాస్త్రం లో ఉన్న మనసు ఎవరు ఏమి చెప్పినా దానికి వెంటనే ప్రశ్న వేయడం, ప్రతీ సమస్యనూ వ్యతిరేక దిశలో చూడటం, దానికి విరుద్ధంగా సమాధానం చెప్పడం చేస్తారు. భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా అంటే లేడు అని వెంటనే అంటారు. ఉండటం చేత వచ్చింది ఏం లేదు, లేకపోవడం వలన వీడికి వచ్చింది ఏం లేదు. కానీ భగవంతుడు ఉన్నాడు అని వారు అన్నారు కాబట్టి లేదని నేను అనడంలోనే నా వ్యక్తిత్వం నిలబడుతుంది. నేను గొప్ప తెలివి తేటలు కలిగిన వాడిని అని ఆలోచిస్తూ ఉంటాడు.

రేణుక పరశురాముని తల్లి. భర్త ఏం చెబితే దాన్ని వ్యతిరేకంగా ఆలోచించేది, వ్యతిరేకంగా చేసేది. అందుకే రేణుకా మతం, రెటమత శాస్త్రం అనే పేరు వచ్చింది.

ఎవరు ఏం చెప్పినా వీరు వ్యతిరేకంగా మాట్లాడుతారు. తనకు తోచదు, ఇతరులు చెబితే దాన్ని వినరు. ఇది రెటమత శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం. తనకు ప్రతీది తెలుసు అన్నట్లు మిగిలిన వారికి ఏమీ తెలియదు అన్నట్లు, తాను మాత్రమే తెలివి గలవాడినని మిగిలిన వారు తెలివి తక్కువ వారుగా భావించి విఱ్ఱవీగుతూ ఉంటారు. ఇటువంటి వారు శిష్యులుగా గురువు దగ్గరకు వచ్చినా ఈ పద్దతినే అవలంబిస్తారు. మళ్లీ దానిని సమర్థించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇది తప్పు. నీకు తెలియదు అని ఒక చోటుకు వచ్చావు! నీ కంటే లోకంలో ఎంతో మంది తెలిసిన వారు ఉన్నారు అంటే నీకు రక్షణ. నాకు మాత్రమే అంతా తెలుసు అన్నట్లు అందరితో మాట్లాడుతూ ఉంటే అతని అలవాటు అతనికి వదిలి పెడతారు. అతనికి ఏమీ చెప్పరు. మళ్ళి చెప్పకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో నాతో మాట్లాడటం లేదు. నేను ఇంత తెలివితేటలు కలిగిన వాడినని భాధ పడతారు. మళ్లీ ఎవరి దగ్గరికో వెళ్లి ఏమంటారు ఆ విషయం !? అంటూ చిన్నగా కదుపుతారు. నీతో ఎందుకు అంటే నాతో నేనయ్యా..ఏదైనా విషయం తేలాలంటే నాతోనే తేలాల్సి ఉంది అని నిష్కర్షగా గర్వంగా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను గురువు కాదు కదా భగవంతుడు కూడా మార్చలేడు. ఎంత జ్ఞాన బోధ చేసినా ఒక్కటే. కరుడు కట్టిన సూక్ష్మమైన అహంకారం అందరి కంటే మేం చాలా గొప్ప వారిమి అని వారి మనసులో చిన్న బీజం చిన్నప్పుడే నాటుకొని,ఆ తర్వాత అది మహ విషవృక్షం అయిపోయి, ఆ రూపంగానే వారి వారి ఆలోచన ఉండటం వలన వారు ఎవరు ఏం చెప్పినా వినరు. ఇక్కడితో ఆగితే పర్వాలేదు. ఇంకా ప్రమాదకరమైన లక్షణం ఇంకోటి ఉంది ఈ రెటమత శాస్త్రం లో...

అది ఏంటి అంటే మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు ఎవ్వరూ ఎదురు మాట్లాడకూడదు. అందురూ చచ్చినట్టు నోరు మూసుకుని వినాలి. ఎందుకు అంటే మేం చాలా చాలా తెలివి తేటలతో , చాలా అనుభవంతో ఎంతో గ్రంథ జ్ఞానం , ఎంతో లోక జ్ఞానం చేసి చెబుతున్నామని వారి లోపల అహంకారం. అందువలన వారు మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోరు. ఇంకో రకం వారు కూడా ఉన్నారు. భగవంతుడు ఎవరైనా లేడు అని అంటే వెంటనే వీళ్ళు ఉన్నాడు అని అంటారు. ఇంకోంత సేపటికి భగవంతుడు ఉన్నాడు అంటే వెంటనే భగవంతుడు లేడు ఉంటే ఎక్కడ ఉంటారు!? కనపడడు ఏంటి!? అని వాదన ప్రారంభిస్తారు.

ఈ రెటమత శాస్త్రం వారికి శ్రోతలు కావాలి. వారు ఏం చెబితే అది జేజేలు కొట్టడానికి సంఘాలు కావాలి. వీళ్ళు సింగిల్ గా ఉండలేరు.. వీళ్ళని ఎవరు భరించలేరు. వారు చెప్పేది ప్రతీ వ్యక్తీ వినాలి. వీళ్ళు మాత్రం ఎవరి మాటా వినరు. ఇలాంటి వ్యక్తులకు అవసరమైన సాధన అవసరం ఉండదు. కానీ వారు సాధన చేయడానికి ఏ మాత్రం ఒప్పుకోరు. ఎందుకు అంటే వారి అహంకారం ఇంకొకరి ముందు తల వంచనివ్వదు. చివరికి గురువుకు కూడా. గురువు చెప్పింది వింటారు కానీ ఆచరణలో మాత్రం ఉండదు. గురువు అలాగే చెబుతారు అది ఈ రోజుల్లో సాధ్యమా !? అన్ని నియమాలు ఎవడు ఆచరిస్తారు!? ఎవరు చేయగలరు అని అనుకుంటారు. అంటే గురువు ఉపదేశాన్ని కూడా కాదు అనగల సూక్ష్మ అహంకారం తో ఉంటారు. వీరి యొక్క లక్షణం వలన మిగిలిన వారు కూడా భాధ పడతారు. ఇదే రేణుకా సంప్రదాయం. మనం ఆచరించాల్సిన నియమాలు ధర్మం అని ఆలోచించరు. వారు ధర్మం అంటున్నారు దానికి నిదర్శనం ఏంటి అని వెంటనే ప్రశ్న ! మళ్లీ వీళ్ళే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎదురు ప్రశ్న వేశామా ఇంక సహించలేకపోతారు. ఇతరులు చెప్పిన విషయం వినే ఓపిక, సహనం కాని, ఇతరుల నుండి నేర్చుకొనే నేర్పు కానీ ఎప్పటికీ ఉండదు. ఆ కారణం వలన వారి జీవితాలు అలా వెళ్లి పోతూనే ఉంటుంది కానీ వారిలో ఎప్పటికి మార్పు రాదు!? వేల పుస్తకాలు చదివినా వెయ్యి మంది గురువుల దగ్గరకు వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూశావా ఇంత మంది గురువులను కలిశాను అని అందరికీ చెప్పుకోవడానికి తప్ప వారి గుణంలో మార్పు రాదు ‌ .

గురువు దగ్గరకు ఎందుకు వెళుతున్నాం మనం!? మన జీవితం యొక్క మార్గాన్ని, మన ఆలోచనా పద్దతిని గురువు మార్చి ఏది నీకు మంచిదో, ఏది నీకు శాంతిని ఇస్తుందో, ఏది సౌఖ్యమో, ఏది ధర్మమో, ఏది భగవంతుని పదార్థమో, ఏది భ్రమనో అది చెప్పి దానిని మనం గుర్తించి మనం ఆ విధంగా వెళితే మంచి జరుగుతుందో చెబుతారని వెళ్తాం. వారు చెప్పింది చెప్పినట్టు జరుగుతందా ఇంత సాధన ఎవరు చేస్తారు అంటూ కనీసం ప్రయత్నం కూడా చేయరు ఈ రేటమత శాస్త్రం వారు. ఇతరులను సాధించడమే వీరి యొక్క తపస్సు. ఈ రోజు స్నేహం తో ఉంటారు రేపు వారితోనే విరోధం పెంచుకుంటారు. ఈ రోజు విరోధం గా ఉన్నవారితో రేపు స్నేహం తో కూడా ఉంటారు. ఈ స్నేహం, ఈ విరోధం రెండూ కూడా వీరిలో శాశ్వతంగా ఉండవు. వారిది చంచల మనసు. ఆ చంచల మనసుతో వారు బాధ పడుతూనే ఇతరులకు కూడా ఆ భాధను అందరి నెత్తిన పులుముతారు ఈ విధమైన సాధకులను ఆ భగవంతుడు కూడా మార్చలేడు. కనీసం అంతరాత్మ చెప్పే మాటను కూడా వినడానికి సిద్ధంగా లేని మనిషి, తన వాక్కే వేదవాక్కని, తను ఆచరించేదే ధర్మం అని, తన ఆలోచనే సరైనది అని అనుకుంటూ కాలం వెళ్ళదీస్తారు.

ఇందులో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. మేధావి రెటమతం వారు అంటే మామూలుగానే మాట్లాడుతారు. ఏదైనా ఒక మాండూక్యోపనిషత్తు గాని ఛాందోగ్యోపనిషత్ గాని ఎవరైనా మాట్లాడితే వెంటనే అది చాలా తప్పు. నేను త్రిపుర తాపినీ ఉపనిషత్తు చదివాను. అందులో ఇంతకంటే గొప్ప రహస్యం ఉంది, మీకు ఏం తెలుసు అని అంటారు. వారు మేధావులుగా ఇంకొక మేధావితో మాట్లాడే విధం ఇది.

ఇంకొందరు స్నేహం లో రెటమతం ఉంటుంది. అందరితోనూ ఒక వ్యక్తి బాగా క్లోజ్ గా ఉన్నాడు అనుకోండి. అతనితో ఎందుకు అందరూ స్నేహంగా ఉండాలి అనుకుంటూ మిగిలిన స్నేహితులతో అతడు మంచి వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు అతను------- అని విమర్శిస్తారు. చెప్పేవాడికి సిగ్గులేకపోతే పోనీ .. వినే వాడి వివేకం ఏమీ అయింది!! అన్నట్టు ఈ ప్రపంచంలో చెప్పుడు మాటలు వినే వారే ఎక్కువగా ఉన్నారు. దాంతో ఎంత మంచి స్నేహితులు అయినా విడిపోతుంటారు. ఈ రెటమతం వారు చాలా నైపుణ్యం గల వారు ఎవరికి ఎలా చెబితే కింద పడతారో వారికి బాగా తెలుసు.

ఇంకొందరు ఉంటారు వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే రకం. ఇది కూడా రెటమతమే . సర్దుకోవడం, దిద్దుకోవడం ఈ రెండూ చేతకాని రెటమతం వారు. ఇంకొందరు మేమే బాగా చదువుకున్న వారిమి అని, మేం బాగా ఉన్నవాళ్లం అనీ, మాకే బాగా తెలివి తేటలు ఉన్నాయి అని, మా కంటే ఎవరూ గొప్ప వారు కాదు అనేటువంటి భావాలు కలిగి ఉన్నవారు. వీరికి కనుక కులం, మతం పిచ్చి పట్టింది అంటే ఇంక అంతే సంగతి.
Courtesy:What's app

నిన్న వాట్సాప్ చూస్తుండగా ఈ మెసేజ్ కనపడింది.   అజ్ఞాత రచయితకి శతకోటి వందనాలు. 

34 comments:

  1. బ్లాగ్ జ్యోతిష్కుల వారి టపాలా వుంది :)

    ReplyDelete
    Replies
    1. * టపా పై లా

      Delete
    2. అదేం పోలిక, “జిలేబి” గారు?

      Delete
    3. చదివితే అలా అనిపించిందండీ

      Delete
  2. ఎడ్డెం అంటే తెడ్డెం అనే జనాలని కూడా ఇదే బాపతు అనచ్చాండి?

    ReplyDelete
  3. సాధారణంగా మిడిమిడి జ్ఞానం కలవాళ్ళే ఇలా రెటమతంగా ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. వినరా వారికి జవాబా ఇది బో నగిరి గారు

      Delete
    2. మాకు, నగరి కి చాలా దూరం. మీకే దగ్గర.

      Delete
    3. మంచి చురక వేశారు, బోనగిరి గారు 👌.

      Delete
    4. bonagiri19 January 2024 at 15:11
      bonagiri20 January 2024 at 07:30
      బోనగిరిగారు,
      వాట్సాప్ లో రాళ్ళూ రత్నాలూ కూడా ఉంటాయి. వాటిని వేరు చేసుకోడమే మన విజ్ఞత కదా!
      మిడిమిడి జ్ఞానంవాళ్ళు,వితండవాదులు, జల్పం చెప్పేవాళ్ళు,యతికుతంగాళ్ళు,యెడ్డెమంటే తెడ్డెం మనుషులు అందరిని సామాన్యులు రెటమతం వాళ్ళనే అంటారండి. జనసామాన్యంలో ఈ అర్ధంతోనే వాడుకలో ఉన్నది కూడా, ఈ రెటమతం మాట మీరూ వాడినదే, ఇదే అర్ధంలో.
      . ఇక ఇన్ని తిరకాసులు పడలేక కాసుల పురుషోత్తం కవి గారు ఒక్కమాటతో తేల్చేసేరు, వదరుబోతులమాట వాసికెక్కె అని. నా ఆలోచనా క్రమం సరిలేదనుకుంటే మన్నించండి.

      Delete
    5. నాకు రెటమతం అనే పదం మాత్రమే తెలుసండి. శాస్త్రం ఉందని నాకు తెలియదు.
      ఇక వాట్సాప్ లో వచ్చే విషయాలు మరో విధంగా నిర్ధారించుకునే వరకు నేను నమ్మను. వాటిలో చాలా వరకు ఏదో ఉద్దేశ్యంతో (propaganda ) వ్రాసినవి తప్ప నిజాలు కావని నా అభిప్రాయం.

      Delete
    6. bonagiri21 January 2024 at 19:12
      రెటమతశాస్త్రం ఉందని శ్యామలీయంగారు చెప్పేదాకా నాకూ తెలియదండి.

      Delete
  4. మిడి మిడి ఙ్ఞానం , రెటమత
    మెడ నెడ గనుపించు బుధులు యెవరబ్బా ? యె
    య్యెడ గలరబ్బ ? యెవరిని
    యడుగుదు ? విహితా ! జిలేబి ! యరసిన జెపుమా ?

    ReplyDelete
  5. పొరపాటు అభిప్రాయాలు.
    రెట్టమతశాస్త్రం టపాలో వివరంగా వ్రాసాను.

    ReplyDelete
    Replies
    1. నిజాన్ని నిష్కర్షగా నిర్ద్వందంగా యెత్తి చూపిన శ్యామలీయం గారికి జేజేలు.

      వినరావారికి ఇప్పుడు జిలేబి మొదటి వ్యాఖ్య అర్థమయి ఉంటుందని ఆశిస్తాను. :)

      Delete
    2. వాట్సాప్ లో తిరిగేవి ఇలాగే ఉంటాయి మరి!

      Delete
    3. శ్యామలీయం19 January 2024 at 22:48
      శ్యామలీయంగారు,
      నమస్కారం!

      నాబ్లాగులోని రెటమత శాస్త్రం అన్న టపా నాది కాదని వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ అని వివరంగా ఎఱ్ఱటి అక్షరాలతో రాశాను. మీరు గమనించకపోవడం నా దురదృష్టం. మీటపా చూశాను అందులో పదేపదే నన్ను ఉటంకించడం చూస్తే నేను నా టపాలో టపా కర్తృత్వం నాది కాదని చెప్పినదానిని మీరు ఉపేక్షించేరని, టపా రచయిత నేనేనని మీరు బలంగా నమ్ముతున్నారనుకోక తప్పలేదు.

      ఇక రెటమతం, రెట్టమతం అన్నవి లో౦కంలో ఉన్నవే జనసామన్య వాడుక.
      రెట్టమతం అన్నది ఒక వ్యవసాయ శాస్త్రమని జనసామాన్యంలో లేదు. ఈ పదాలకి వ్యతిరేకార్ధాలే జనసామాన్యంలో ఉన్నాయి. ఈ విషయం మీ దృష్టికి తేక తప్పటం లేదు. ఇక రచయిత టపాకి రెటమత శాస్త్రం అని పేరుంచడం,రేణుకా దేవికి దీనితో ముడిపెట్టం సహించలేకపోవచ్చు. లోకో భిన్నరుచిః రచయిత జనసామాన్యంలో ఉన్న బలహీనతలని ఎత్తి చూపారు, ఎవరిని వదల లేదు. ఏదో ఒక చోట అందరూ భుజాలు తడుముకోవలసిందేననిపిస్తుంది. పరిధి మీరి స్పందించాననుకుంటే మన్నించండి.
      పునః నమస్కారం.

      Delete
    4. పొరపాటు పడ్డాను. మీరు సేకరణ అన్నది గమనించక లేదు.

      వ్యాసాన్ని సరిదిద్దాను.

      Delete
  6. “శ్యామలీయం” గారు వివరించినది ఆసక్తికరం గానే ఉన్నది గానీ “రెట్టమతము” అంటే నిఘంటువు (“ఆంధ్ర భారతి” సంకలనం) అర్థం మాత్రం శర్మగారి టపాలో చెప్పినట్లు “పెడసరము” అనే వుంది మరి👇.
    ==================
    “ రెట్టమతముpermalink
    రెట్టమతము : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report error(s) గ్రంథసంకేత వివరణ పట్టిక

    వి.
    1. సామాన్య ప్రజలు సాధారణముగా అను దానికి వ్యతిరేకముగా చెప్పుమాట.

    వ్యు. రెడ్డిగారి అభిప్రాయము. [ఇది సాధారణ జనాభిప్రాయమునకు వ్యతిరేకముగా ఉండుట చేత ఈ పలుకుబడి ఏర్పడినది.]

    2. పెడసరము, పొగరు.
    3. చెప్పినమాట వినిపించుకొనక పోవుట.”
    ==================

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రభారతి సేకరించిన సమాచారంలో పొరపాట్లు ఉన్నాయి. ఈశాస్త్రం తెనిగించినది యిద్దరు కవులు కలిసి అన్నది కూడా వారు గ్రహించలేదు. ఇంకా పొరపాటు లున్నాయి.

      Delete

    2. విన్నకోట నరసింహా రావు20 January 2024 at 08:49
      శ్యామలీయం20 January 2024 at 09:16
      జన సామాన్యంలో ఉన్నమాట నిఘంటువుకు ఎక్కింది. పురాతనకాలంది నిఘంటువుకు చేరలేదు, ఇది శోచనీయం. జనసామాన్యం వాడే మాటని తప్పందామా? పురాతనకాలందే అసలు అర్ధం అందామా? గడబిడ. భుజాలెగరేసినవారేరీ?పడిపోయినది వెతుక్కుంటున్నారేమో :)
      నా ఆలోచనా సరళి సరిలేదంటారా? మన్నించండి.

      Delete
    3. కాలక్రమేణా భాష యొక్క వాడుకలో మార్పులు వస్తూ ఉంటాయండీ. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. మొదటిది సామాజికమైన మార్పుల కారణంగా కొన్ని వస్తువుల భావనలకు సంబంధించిన అవసరాలు మారటం తొలగటం కారణాంగా కొన్నికొన్ని వస్తుభావనలకు చెందిన పదాలు అదృశ్యం అవుతాయి. కొన్నాళ్ళు పోయాక తిరగలి అన్నమాటకు అర్దం తెలిసినవాళ్ళు ఉండకపోవచ్చును. మొటికలువిరవటం అంటే ఎవరికీ తెలియకపోవచ్చును. రెండవరకమైన మార్పు ఇతరభాషల ప్రభావం వలన ఒకభాష యొక్క వ్యాకరణంలోనూ పదకోశంలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. హైదరాబాదులో నేను భీ వస్తాను అన్న ప్రయోగం గమనించండి. అలాగే ఒకరు నాతో పెరుగు అంటే ఎలాతెలుస్తుందీ తెలుగులో దహీ అనలేవా అని అడిగాడు! ఇత్యాది. ఇక మూడవది ప్రజలకు తమభాష మీద శ్రధ్ధ తగ్గిపోతూ ఉండటం కారణంగా వాళ్ళు తమతమ మాండలికాలనూ సాహిత్యాన్నీ కళలనూ ఇత్యాదులను విసర్జించి ఇతర సంస్కృతులను అలవరచుకోవటం వలన వారి స్వభాష క్రమంగా చచ్చిపోతుంది. అనేక భాషలకు మాట్లాడే వారే కరవై అవి చచ్చిపోయాయి - మాట్లాడగల కొద్దిమందికీ తమతో మాట్లాడే వారెవరికీ తమ భాష రాక వారు కూడా పరాయిభాషనే వాడవలసి వస్తుంది.

      ఇలా భాషలు దుర్గతి పాలై చెడక పోయినా క్రమంగా భాషాస్వరూపంలో మార్పులు కాలానుగుణంగా వస్తూనే ఉంటాయి. అన్నమయ్య వచ్చీని అంటాడు వచ్చేను అనటానికి బదులుగా. ఆయన తనకాలంలో జనభాషనే ఆదరించినా అది నేడు మనకు పదకోశాలు లేక అర్ధంకాని పరిస్థితి. అందుకే భాషలకు సాధ్యమైనంతగా ప్రామాణికపదకోశం వాడుకచేసిన పక్షంలో మాత్రమే వాళ్ళ సాహిత్యం పదికాలాలు మన్నుతుంది.

      ఎన్నో పదాలు కాలం గడిచే కొద్దీ అర్ధచ్యుతికీ అర్ధసంకోచానికీ అర్ధవిస్తృతికీ అర్ధవిలోమానికీ భిన్నార్ధప్రతీతికీ గురి అవుతూ ఉంటాయి. ఎన్నో తప్పుడు ప్రయోగాలు ప్రచారంలోనికి రావటం జరుగుతుంది (విలేఖరి అన్న పదం లాగా). జనం మరచిపోయిన అనేక పదాలకు కొత్త నిఘంటువుల్లో వింత అర్ధాలు వస్తాయి.

      జనం గమనించుతున్నారో లేదో, భాషను ఇంత నిర్లక్ష్యంగావాడటం ముందెన్నడూ లేదు. రాముడు ఇల్లు అంటున్నారు రాముడి ఇల్లు అనకుండా. ఇ-టి-తి అనే ఔపవిభక్తికాల గురించి తెలిసినవారు తగ్గిపోతున్నారు. ఈ మొబైల్ టైపింగ్ పుణ్యమా అని వింతవింతగా వ్రాస్తున్నారు తెలుగును. పిల్లలు అదే సరైన తెలుగు అనుకుంటే వాళ్ళ తప్పు లేదేమో.

      కొందరు తెలుగులిపిని వాడటం దండుగ అనుకుంటూన్నారు. అంటున్నారు. ఇంగ్లీషులిపిలో వ్రాస్తే అందరికీ అర్ధం అవుతుంది కదా అని నాకు కొందరు సూచించారు. పరిస్థితి ఇలా ఉంది.

      Delete
    4. శ్యామలీయం20 January 2024 at 16:48
      చాలా విషయాలు తెలుసుకున్నాను.
      ధన్యవాదాలు.

      Delete
    5. // “ పెరుగు అంటే ఎలాతెలుస్తుందీ తెలుగులో దహీ అనలేవా ” //
      😁😁😁😁.

      శ్యామలరావు గారూ, మీరేనా ఒకసారి “ఎలిఫెంట్ అనాలి, ఏనుగు అంటావేం?” అని ఓ చిన్నపిల్ల మీతో అన్నదని అన్నారు?

      ఈ నాటి తెలుగు వింటుంటే నాకు చాలాసార్లు “కాటుక కంటినీరు ……… “ అనిపిస్తుంటుంది (పోతన గారు అన్నది వేరే సందర్భం అయినప్పటికీ).

      కాస్తో కూస్తో సరైన తెలుగు వాడకం మన తరంతోనే ఆఖరు అని నా అభిప్రాయం. కాలక్రమేణా తెలుగు భాష pidgin స్ధాయికి దిగజారిపోతుంది అనిపిస్తోంది.

      Delete
    6. “ఎలిఫెంట్ అనాలి, ఏనుగు అంటావేం?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించిన చిన్నపిల్ల మాతమ్ముడి కూతురే. ఈరోజుల్లో బళ్ళల్లో తెలుగు నేర్పరు. ఇంట్లో అమ్మానాన్నా కూడా ఎవరెవరితోనో ఉద్యోగరీత్యానూ స్నేహాలు(ఆవలి వాళ్ళు తెలుగు వాళ్ళ కానక్కరలేదు కదా) కారణంగా అస్తమానూ ఇంగ్లోషులోనే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఐతే పిల్లలను తెలుగు ఎక్కడ పట్టుకుంటుందో అన్న ఆదుర్దాతో కావాలనే అమ్మానాన్నా ఇంగ్లీషులోనే వాళ్ళతో మాట్లాడుతూ పెంచుతున్నారు. ఇంక పిల్లలకు తెలుగురావటం లేదూ అంటే దానికి కారణం ఇప్పటి తరం వారి నిర్లక్ష్యమూ వారిలో హెచ్చుమందికి తెలుగుమీద ఉన్న అగౌరవమూ తప్ప వేరే కారణా లేమున్నాయి?

      Delete
  7. "నిన్న వాట్సాప్ చూస్తుండగా ఈ మెసేజ్ కనపడింది. అజ్ఞాత రచయితకి శతకోటి వందనాలు. "
    అంటే మీరు దీన్ని నమ్ముతున్నారనేగా శర్మగారూ. ప్రశ్నలేయక పోతే "డిక్టేటర్లు " అవుతారనేది మీకు తెలియనిది కాదుగదా . ఉదా : హిట్లరు, సూర్యకాంతం . ప్రశ్నలెసేవాళ్లు ఎప్పుడూ ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. అంతేగా !/ అంతేగా శర్మగారు నమ్ము తున్నా రనే గా

      Delete
    2. Rao S Lakkaraju20 January 2024 at 16:56
      రచయిత రాసినదాంట్లో నచ్చనిదేదో మెచ్చినదేదో శ్యామలీయం గారికి చెప్పిన సధానంలో ఉంది, చూడగలరు.
      sarma20 January 2024 at 08:45
      కంచం మంచం పొత్తులో అన్ని నచ్చకపోయినా బుర్రొంచుకుని తాళి కట్టేసేం. నాటిముంచి బుర్రెత్తే అలవాటూ, ప్రశ్నించే అలవాటూ పోయింది. :) ఆ తరవాత సెల్ఫోన్ వచ్చేకా బుర్రెత్తే అలవాటు పూర్తిగా :) పోయింది.ప్రశ్నించండి, ఎక్కడ? ఎవరు? ఏమిటి? చూడక. ఒక్క చిన్న సలహా! కంచం మంచం దగ్గర ప్రశ్నలేస్తే ఫుడ్డూ,బెడ్డూ కట్టు. గమనికలో ఉంచుకుందాం. ఏమంటారు?

      Delete
  8. ఈ టపాలో ఉన్న రేణుకా మతం అంటూ పరశురామజనని రేణుకమ్మను కించపరచే అభిప్రాయం ఉన్నది. నిజానికి రేణుకామతం అంటూ జనశ్రుతి కూడా ఏమీ ఉందనుకోను.

    పూర్వం ఉద్దలకుడు అనే ఋషి ఉండే వారు. అయన భార్యపేరు చండిక. ఆమె అనునిత్యమూ భర్తకు ఎదురు చెప్పటం చేసేది - ఆయన చెప్పినదానికి వ్యతిరేకంగానే చేసేది.

    ఒకసారి ఆ ఉద్దాలకులు తమ గురువు గారు దర్శనం ఇస్తే ఆయనతో చెప్పుకున్నారు తమ అవస్థను. గురువు గారు ఒక ఉపాయం చెప్పారు. వెఱ్ఱివాడా, నువ్వే కావలసినదేదో తలక్రిందులుగా చెప్తే సరిపోతుంది కదయ్యా అని. ఆ ఉపాయం పని చేసింది!

    ఉద్దాలకుడి తండ్రి గారి తద్దినం వచ్చింది. నేను పెట్టనుపో అన్నాడు ఉద్దాలకుడు. బుధ్ధుందా లేదా తద్దినం పెట్టనంటావా తండ్రికి అని కేకలు వేసి పట్టుబట్టి సవ్యంగా మొగుడిచేత తద్దినం పెట్టించింది.

    సంతోషంతో ఉద్దాలకుడు, గురూపదేశం మరచి, పిండాలు నదిలో కలిపివస్తానూ అన్నాడు. అంతే అదేం కుదరదూ అని ఆమె వాటిని ఎత్తి గోడవతలకు విసిరేసింది. ఉద్దాలకుడికి మండి సహనం చచ్చి, నువ్వు బండరాయివికా అని శపించాడు.

    ఆవిడ లబోదిబో అని ఏడ్చి కాళ్ళుపట్టుకుంటే కరిగి, ముందుముందు కాలంలో ధర్మరాజనే గొప్ప చక్రవర్తి పుట్టి అశ్వమేథయాగం చేస్తాడు. ఆఅశ్వం వచ్చి బండగా ఉన్ననిన్నుతాకి విడిపించుకోలేకపోతుంది. అర్జునుడని ధర్మరాజు తమ్ముడు వచ్చి దాన్ని విడిపించటానికి బండను తాకగానే నీకు శాపవిమోచనం అని చెప్పాడు.

    అప్పటినుండి మొగుడికి ఎదురుచెప్పి సాధించే ఆడవాళ్ళను చండికలు అనటం వాడుకలోనికి వచ్చింది

    ఈకథ జైమినీభారతంలో కనిపిస్తుంది.

    టపాలో చండికను ప్రస్తావించబోయి రేణుకమ్మవారిని చెప్పారేమో పొరపాటున.

    రేణుకాదేవి మాహాత్మ్యం ప్రసిధ్దం. ఈవిడ అగ్నికుండంలోనుండి ఉద్భవించిన దేవీశక్తి. ఎల్లమ్మ అని కూడా దేవతగా ఆరాధించబడుతూ ఉంటుంది. ఎల్లమ్మ అంటే ఎల్లరికి అమ్మ అని.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం21 January 2024 at 15:26
      చండిక కత పాతబ్లాగులో టపాగా చాలాకాలం కితమే రాసానండి.
      ఆబ్రహ్మ కీటజనని ఎల్లరకు అమ్మ

      Delete
  9. ఎల్లమ్మ ఎల్లను కాచే అమ్మ కాదుటండీ ?

    అఫ్కోర్స్ ఎల్లరికీ అమ్మే నో డౌటు

    ReplyDelete
    Replies
    1. నిజమే. ఎల్లమ్మ, పోలేరమ్మ గ్రామ దేవతలు పల్లె ఎల్లలు, పొలిమేరల పరిధిలో గ్రామ ప్రజలను కాపాడుతూ ఉంటారు అని విశ్వసిస్తారు

      Delete