Saturday, 1 July 2023

పృధివ్యా త్రీణి


 


  పృధివ్యా త్రీణి రత్నాని   

 (ఆచార్య చాణక్య)     

   

                                             

                                         పృధివ్యా త్రీణి రత్నాని                                              

జలమన్నం సుభాషితమ్

మూఢే పాషాణఖండెషు

రత్నసంజ్ఞా విధీయతె


భూమి మీద విలువైనవి మూడే!అవి నీరు,అన్నం,సుభాషితమున్నూ. మూర్ఖులు రాతి ముక్కలని రత్నాలని భ్రమిస్తారు.


అన్నము,నీరు,సుభాషితము (ఇవే రత్నాలంటారు కవి) ప్రాణాలు పోస్తాయి.రత్నాలనుకునే రాతి ముక్కలు ప్రాణాలు తీస్తాయి. రాతి ముక్కల్ని రత్నాలనుకుని మూఢులు భ్రమపడతారని చాణుక్య ఉవాచ.



శైలె శైలె న మాణిక్యం 

మౌక్తికం న గజె గజె

సాధవో న హి సర్వత్ర 

చందనం న వనె వనె


అన్ని పర్వతాలోనూ మాణిక్యాలు దొరకవు.అన్ని ఏనుగులలోనూ ముత్యాలు దొరకవు ( ఏనుగు కుభస్థలంలో ముత్యాలుంటాయని ప్రతీతి).సాధకులు ప్రతిచోట ఉండరు.చందనపు చెట్లు అన్ని అడవుల్లోనూ ఉండవు.


గొప్పవైనవన్నీ కొన్ని చోట్లమాత్రమే ఉంటాయని కవిగారి మాట


రాజా వేశ్యా యమశ్చాగ్ని

తస్కరో బాలయాచకో

పరదుఃఖం న జానంతి

 అష్టమో గ్రామకంటకః


రాజు,వేశ్య,యముడు,అగ్ని, దొంగలు,బాలలు,యాచకులు వీరంతా ఇతరుల కష్టం గుర్తించరు. ఎనిమిదోవాడు గ్రామీణుడు.(పల్లెటూరి బైతు)  


విద్వాన్ ప్రశస్తతె లోకె 

విద్వాన్ గఛ్ఛతి గౌరవమ్

విద్యయా లభ్యతె సర్వం

 విద్యా సర్వత్ర పూజ్యతె


విద్వాంసుడిని లోకం పొగుడుతుంది.విద్వాంసుణ్ణి లోకం గౌరవిస్తుంది. విద్యతో సర్వం లభిస్తాయి. విద్యను సర్వత్రా పూజిస్తారు. 


విద్యలేనివాడు వింత పశువని తెనుగుమాట. 


అనాహూతః ప్రవేశతి

అపృష్ఠో బహు భాషతె

అవిశ్వస్తె విశ్వసతి

మూఢచేతా నరాధమః


పిలవక వచ్చేవాడు,అడగకనే అనవసరంగా అనర్గళంగా మాటాడేవాడు,నమ్మకూడనివారిని నమ్మేవాడు,పనికిరానివాడు, మూర్ఖుడు.

****

పక్షిణా బలమాకాశం

మత్స్యానాముదకం బలం

దుర్బలస్య బలం రాజా

బాలానం రోదనం బలం


పక్షికి ఆకాశం బలం.చేపకు నీరు బలం. దుర్బలులకు రాజు బలం. బాలలకు రోదన బలం.


నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!


17 comments:


  1. 👌👌👏👏🙏🙏.
    ఆంధ్ర మూలాలున్నవాడట చాణుక్యుడు.

    ఈ మధ్య కాలంలో చాలా ప్రపంచ దేశాలు మన భగవద్గీత ను చదవడం మొదలెట్టాయి. గొప్ప గ్రంథమే. అయితే దానితో బాటు చాణుక్య సూక్తులను కూడా ప్రచారంలోకి తీసుకు వస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు1 July 2023 at 13:15
      కాలంతో పాటొస్తాయండి

      Delete
  2. చక్కటి వివరణ. తెలియని విషయాన్ని తెలిపారు.
    ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. Zilebi1 July 2023 at 17:06
      కామెంట్లు కూడా కొట్టుకురావడమేనా పిచ్చమ్మా!

      Delete
  3. అద్భుతమైన విశ్లేషణ అండి.నిజంగా ఒక్కో శ్లోకాన్ని పట్టుకుని మమ్మల్ని అందులోకి తీసుకెళ్లారు.

    ఇప్పుడిప్పుడే చదవడం మొదలెట్టిన మావంటి వారికి చాణుక్యుల వారిని ఎలా చదవాలో, ఏ కోణం నుండి చూడాలో చక్కగా తెలుస్తుంది ఇటువంటి విశ్లేషణలు చదివితే.

    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. ఇది కూడా “కొట్టుకొచ్చిన” కామెంటే కదా 😁?

      Delete

    2. Zilebi1 July 2023 at 19:57
      ఇది చిలిపితనమా? మొఱకుదనమా?

      Delete
    3. విన్నకోట నరసింహా రావు1 July 2023 at 22:13
      అనుమానమా సారూ!

      Delete
  4. విద్యా సర్వత్ర పూజ్యతె బదులు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని ఉండాలేమో పరిశీలించగలరు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం1 July 2023 at 22:07
      శ్యామలీయంగారు!
      "విద్యా సర్వత్ర పూజ్యతె" అన్నది "విద్వాన్ సర్వత్ర పూజ్యతె" అన్న పాఠమూ కనపడిందండి.
      వ్యాకరణం, అర్ధం, సందర్భం, అన్వయం ఏదైతే సాధువో చెప్పమని కోరిక. నేననుకున్నది చెబుతా!
      మొదటి రెండు పాదాలలో విద్వాన్ గురించి చెప్పి మూడో పాదంలో విద్య గురించి చెప్పేరు. అందుచేత నాలుగో పాదం కూడా విద్యతో నే అనుబంధం అనుకున్నా! కాదు విద్వాన్ అనే చెప్పుకోవాలాంటారా? అలాకాదు మొత్తం నాలుగు పాదాలు విద్వాన్ అనే చెప్పుకోవాలా? ఏది సాధువు అన్నది ప్రస్తుతం లో నా సందేహం, తీర్చవలసినదిగా కోరిక.

      Delete
    2. కాంత్2 July 2023 at 09:59

      స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
      విద్యయా లభతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే.

      Delete
    3. కాంత్2 July 2023 at 09:59
      స్వదేశే పూజ్యతే రాజా
      విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
      విద్యయా లభతే సర్వం
      విద్యా సర్వత్ర పూజ్యతే.
      మీరు చెప్పిన శ్లోకంలో ఒక అన్వయం కనపడుతోంది. రాజును స్వదేశంలోనే గౌరవిస్తారు,విద్వాంసుడిని సర్వత్ర గౌరవిస్తారు.విద్యతో అన్నీ లభిస్తాయి,విద్య సర్వత్ర పూజింపబడుతుంది.

      నేను చెప్పిన శ్లోకం వేరనుకుంటాను,అందులో అన్వయానికే తిప్పలు పడుతున్నా.

      Delete
    4. స్వగృహే పూజ్యతే మూర్ఖః
      స్వగ్రామే పూజ్యతే ప్రభుః
      స్వదేశే పూజ్యతే రాజా
      విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
      మూర్ఖుడు స్వగృహంలోనే గౌరవింపబడతాడు,అధికారి స్వగ్రామంలో గౌరవింపబడతాడు, రాజు స్వదేశంలో గౌరవింపబడతాడు,విద్వాంసుడు సర్వత్ర గౌరవింపబడతాడు. ఇందులోనూ అన్వయం కనపడుతోంది.

      Delete
    5. శ్యామలీయం గారి మాటలకే ఎదురాడుటయా! ఏమి ధిక్కారము!

      Delete
    6. కాంత్2 July 2023 at 17:53

      క్షమించండి. మీరు చెప్పినవే కరెక్టు. నేను చెప్పింది ఒకటే శ్లోకం కాదు. రెండు లైన్లు వేర్వేరు శ్లోకాల్లోనివి.

      మొడటి లైన్ (విద్వాన్ సర్వత్ర) ఈ రెండు శ్లోకాల్లో కనపడుతుంది:

      విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన | స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్రపూజ్యతే ||

      స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా
      విద్వాన్ సర్వత్ర పూజ్యతే ||

      రెండవ లైను (విద్యా సర్వత్ర పూజ్యతే) మీరు చెప్పిన ఛాణక్యనీతి:
      విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్ఛతి గౌరవమ్ |
      విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే ||

      Delete
    7. కాంత్2 July 2023 at 17:53
      కాంత్ జీ!
      ''ప్రమాదో ధీమతా మపి'' పెద్దల మాట.క్షమించండి అన్నది, ఈ సందర్భంలో చాలా పెద్ద మాటని నా అభిప్రాయం.
      ఆ మాట మీ సంస్కృతి, సంప్రదాయాలను చెప్పకనే చెబుతోంది, నమస్కారం.
      విషయంలో కొస్తే,
      నాలుగో పాదం విద్వాన్, విద్యాలలో ఏది సాధువన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తప్పించి, పండిత పరిక్ష కాదు కదా! ఆ విషయం తెలుసుకునే ప్రయత్నంలో చర్చలో పాల్గొని సహకరించ మనవి.
      ధన్యవాదాలు.

      Delete

    8. Anonymous2 July 2023 at 17:33
      తింగరి బుచ్చీ!
      ధిక్కారము, పురస్కారము,తిరస్కారము అన్ని మాటలూ ఒకలాటివే నీకు, అంధకారం కూడా అటువంటిదేనేమో!
      విషయం తెలుసుకోడానికి ప్రశ్నించడమూ, నీకేం తెలుసని ప్రశ్నించడమూ నీకొకటే. నీకు తెలిసినదీ ఒకటే! కొచ్చనించడం.
      వద్దు!వద్దు!!వద్దు!!! నిన్ను తిట్టి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను.

      Delete