ఆత్మాపరాధ వృక్షస్య
ఆత్మాపరాధ వృక్షస్య
ఫలాన్యేతాని దేహినామ్
దారిద్ర్యరోగదుఃఖాని
బంధన వ్యసనాని చ
(ఆచార్య చాణక్య)
దరిద్రం, రోగం, దుఃఖం, చెఱపడటం మఱియు ఇతర వ్యసనాలు స్వయంకృతాపరాధ వృక్షానికి కాసే ఫలాలు.
ఆత్మాపరాధం అంటే స్వయంకృతాపరాధం అంటే తెలిసి తెలిసి చేసే తప్పు. ఇదొక వృక్షమనుకుంటే దానికి కాచే ఫలాలెలా ఉంటాయి?
మొదటిది దరిద్రం, ఎక్కువగా ఇది తెలిసిచేసే తప్పుల ఫలితమే, ఈ దరిద్రం ఏదేని కావచ్చు, భావదారిద్ర్యం కూడా అందులోదే!
రోగమెందుకొస్తుంది? వ్యసనంతో రోగమొస్తుంది. వ్యసనం తెలిసి చేసే తప్పుకదా!
దుఃఖం, తెలిసితెలిసి నిప్పులో చేయిపెడితే కాలకమానుతుందా? కలిగేది దుఃఖమే
చెఱపడటం ఎందుకు కలుగుతుంది? చేయకూడని పని చేయడం మూలంగా కదా!
ఇతరవ్యసనాలు వాక్పారుష్యం కూడా సప్తవ్యసనాల్లో ఒకటి కదా!
ఇవన్నీ తెలిసి చేసే తప్పులుకదా!!!
మనం నిత్య వ్యవహారంలో ఈ నీతిని పాటించం, ఇది ఎవరికో చెప్పిన మాటనుకుంటాం, మనకి సంబంధం లేదనుకుంటాం. అదీ విచిత్రం..
గతె శోకె న కర్తవ్యో
భవిష్యం న చింతయేత్
వర్తమానేన కాలేన
వర్తయంతి విచక్షణాః
(ఆచార్య చాణక్య)
గతము తలచి, వగచి ఉపయోగం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఆతృత పడవద్దు. విచక్షణ కలవారు వర్తమాన కాలం మీద దృష్టి పెడతారు.
గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు - ఇది దేవదాసు ఉవాచ
ReplyDeleteAnonymous16 July 2023 at 06:53
Deleteదేవదాసు, దేవీదాసులు ఏమైనా అనచ్చుటండి:)
ఈ సందర్భం ఒక చిన్నముచ్చట, విన్నది.
కుడి ఎడమైతే పాట రికార్డ్ అయిపోయిందిట. ఘంటసాల పాడెయ్యడం జరిగిపోయింది, అప్పుడు చూసుకున్నారుట. పొరపాటు జరిగిపోయింది కూడి ఎడమైతే అనిపాడాలి, కుడి ఎడమైతే అని పాట రికార్డ్ అయ్యిందే అని, అసిస్టెంట్ డైరెక్టరు పాటల రచయిత దగ్గరకొచ్చి, జరిగిన పొరపాటు చెబితే రచయిత తాగుబోతు మాటలకి అర్ధమేంటి? కుడి ఎడమైతే తప్పేం లేదు అలాగే ఉంచెయ్యండి అన్నారట. దాంతో మనకో గొప్పపాట దొరికింది. :)
🙂🙂
Deleteసీనియర్ సముద్రాల గారా, మజాకానా (గేయరచయిత) 🙂🙏.
వికీపీడియా [మరియూ కొందరి పెద్దల వ్యాఖ్యల] ప్రకారం "Though Samudrala is credited as the lyricist in the film, M. L. Narasimham of The Hindu believes that Malladi Ramakrishna Sasthri also wrote some of the lyrics". పై పాట ఎవరు రాసారో పైవారికే [దేవదాసు సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ పైలోకాల్లోనే ఉన్నారు] ఎరుక.
Delete[దేవదాసు సినిమా గతము తలచి ముచ్చటించేకన్నా లౌక్యమే లేదు :-)]
కూడి యెడమైతే అని ఉండినపక్షంలో బాణీ మార్చవలసి ఉండేదండీ. కాబట్టి కథనం ఎంత విశ్వసనీయం అన్నది ఆలోచనీయం.
Deleteకాని అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒకపాటలో "సింహాలై గర్జించాలీ" అని వస్తుంది. కాని అది పొరపాటు ప్రయోగం. శ్రీశ్రీ గారు సవరణ అని చెప్పటానికి వెళ్ళేసరికే ఘంటసాల వారు ఆపాటను పాడటమూ రికార్డు చేయటమూ జరిగిపోయాయట. ఈమాటను శ్రీశ్రీ గారే చెప్పారు. ఇలాంటి పొరపాట్లు అడపాదడపా జరుగుతూనే ఉంటాయనుకుంటాను.
విన్నకోట నరసింహా రావు16 July 2023 at 19:31
Deleteఎంతైనా సీనియర్లు సీనియర్లే కదు సార్!
కాంత్16 July 2023 at 21:34
Deleteపాతకాలపు ముచ్చటగదా! ఎన్నేని తిరకాసులుంటాయి :)
శ్యామలీయం16 July 2023 at 23:32
DeleteAnonymous17 July 2023 at 01:36
నిజమేనండి. కూడి ఎడమైతే పొరపాటు లేదోయ్! ఓడిపోలేదోయ్! ఇది అర్ధవంతంగానే ఉంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! ఓడిపోలేదోయ్! ఇది తాగినవాడు మాటాడే పొంతన లేని మాటల్లాగే ఉంది.
ఎంతైనా, ఏమైనా ఒక సొగసైన ముచ్చట, చెప్పుకోడాని బాగున్నది, అంతే!
“కూడి యెడమైతే” అంటే ఆ బాణీకు సరిపోదు అని నేనూ చెబుదామనుకున్నాను కానీ చివరకు మరచితిని, శ్యామలీయం గారు 😔. మీరన్నది కరక్ట్.
ReplyDelete“అల్లూరి సీతారామరాజు” చిత్రంలో పాటలోని “సింహాలై గర్జించాలీ” అన్న పదప్రయోగం బాగానే ఉందిగా (at least మాలాంటి పామరులకు). దాంట్లో పొరపాటు ప్రయోగం ఏమిటంటారు?
పాటలో "ప్రతి మనిషి" అన్నది ఏకవచనం కాబట్టి "సింహంలా గర్జించాలి" అన్నది సరియైన పదప్రయోగం(ట). కాని లోతుగా ఆలోచిస్తే, ఒక మనిషి వంద సింహాల్లా గర్జిస్తున్నాడని వర్ణించ కూడదా? ఇది ఒక అలంకార పదప్రయోగమే కాబట్టి, అందులో తప్పేముంది? ఆ గర్జించే మనిషి మిమిక్రీ కళాకారుడైతే తప్ప (అప్పుడు ఒక్క సింహంలానే గర్జించగలడు :-)
Deleteకాంత్17 July 2023 at 19:37
Deleteఆ పాట నేనంత శ్రద్ధగా వినలేదండి
భవిష్యత్తు గురించి ఆలోచించి ఆతృత పడవద్దు ... Nice
ReplyDeleteAnonymous17 July 2023 at 19:52
Deleteఆచార్య చాణక్యుని మాట.
ధన్యవాదాలు.