Monday, 17 July 2023

మయా దోషాన్

మయా దోషాన్

పిల్లలు రిసర్వేషన్లు చేయించుకుంటూ కొండకెళ్ళొద్దాం రండీ అన్నారు. వద్దురా! ఇబ్బందులు పడలేను. నాతో మీరూ ఇబ్బందులు పడతారు, వెళ్ళిరండీ, అని పంపేను.

దర్శనానికెళితే క్యూలలో ఇబ్బంది పడతాననుకున్నా! పిచ్చి వాడిని, ఇబ్బంది పడి బాధపడే కాలం వస్తే ఎక్కడైనా తప్పదని తెలుసుకోలేకపోయాను. చిత్రం! పిల్లలు తిరిగొచ్చే సరికి, ఇక్కడ ఉండి మాత్రం, కాలు బెణికి తిప్పలు పడటంలేదూ!

అజ్ఞానినా మయా దోషాన్
అశేషాన్ విహితాన్ హరే!
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే 


8 comments:

  1. కాదా మరి ?/ మా వెంకన్న బాబు రమ్మని ఆదేశిస్తే ఇంట్లో కూర్చుంటారా ! హన్నా !

    ReplyDelete
    Replies

    1. Zilebi17 July 2023 at 11:15
      మరందుకేగా ఇంట్లోనే కూచోరా కాలు చూసుకుంటూ అనేసి కూచోబెట్టేసేడు.
      బుద్ధి, బుద్ధి. వెంకన్నబాబా మజాకా?

      Delete
  2. దీన్నే mea culpa (my fault) అంటారుట (లాటిన్ భాష పదప్రయోగం).

    కాలు బెణికేది ఎక్కడకు వెళ్ళినా బెణకచ్చు. అక్కడ జరిగితే మీరు, మీ తోటివారు మరింత ఇబ్బంది పడాల్సి వచ్చేదిగా. అందువల్ల మీకే అంతా ఆపాదించుకోకండి. ఏది జరిగినా మన మంచికే, మీకు తెలియనిదేముంది.

    ReplyDelete
    Replies
    1. దర్శనానికి వెళ్ళలేకపోయానని బాధండి. మనవరాలూ మీలాగే అన్నది. క్యూలలో తోపులాట, మూడేసి గంటలు నిలబడ్డాం. నువ్వు వస్తే అంతా బాధపడి ఉండేవాళ్ళం, అని.

      Delete
    2. కాంత్18 July 2023 at 05:20

      గతే శోకో న కర్తవ్యో - గతము తలచి, వగచి ఉపయోగం లేదు

      Delete
    3. గతమంటే అంత హేల ఎందుకు ? గతంలేని‌ వర్తమానమెక్కెడ ?

      Delete

    4. కాంత్18 July 2023 at 05:20
      నిజమే సుమా! వెళ్ళలేకపోయానని వగచడం తగదు. :)
      గతము తలవక ఉండలేంగాని, అందులో కూరుకుపోకూడదు. :)

      Delete

    5. Anonymous18 July 2023 at 07:25
      గతముపై చులన కూడదు.
      గతముపైనే వర్తమానం, వర్తమానం పైనే భవిషత్తు ఆధారపడి ఉంటాయి. గతము గురించి అతిగా వగచద్దు.భవిషత్తు గురించి అతిగా ఆత్ర పడద్దు.

      Delete