Thursday, 13 July 2023

భోజనాంతె విషప్రదమ్

 భోజనాంతె విషప్రదమ్


అజీర్ణే భేషజం వారి

జీర్ణే వారి బలప్రదమ్

భోజనే  చామృతం వారి

భోజనాంతే విషప్రదమ్

(ఆచార్య చాణక్య)


 అజీర్ణానికి మందు,నీరు తాగడం. ఆహారం జీర్ణమయ్యాకా నీరుతాగితే బలంకలిగిస్తుంది. భోజనం తో పాటుగా నీరు అమృత సమానం. భోజనానంతరం తాగే నీరు విషంతో సమానం.


 నీరు ఎప్పుడెప్పుడు తాగితే ఏమి ఫలితం అన్నది ఒక చోటికి చేర్చారనుకుంటాను.


వృద్ధకాలే మృతా భార్యా

బంధుహస్త గతం ధనం

భోజనం చ పరాధీనమ్

తిస్రః పుంసాం విడమ్బనాః

(ఆచార్య చాణక్య)


పెద్దవయసులో భార్యగతించడం,తన డబ్బు బంధువుల చేత చిక్కడం, భోజనానికి ఇతరులపై అధారపడటం అనే మూడు అనుభవించేవాడు దురదృష్టవంతుడు.


8 comments:

  1. భోజనానంతరం తాగే నీరు విషంతో సమానం....

    ఇదేదో ఉల్టాపుల్టా వుందేమిటండి తాతగారూ ?

    భోజనం చేసేటప్పుడు నీరు త్రాగరాదనియు~ దాని తరువాయె త్రాగాలనియు పెద్ధలమాట కదా ?


    జిలేబి





    .

    ReplyDelete
    Replies
    1. Zilebi13 July 2023 at 11:00
      ఆచార్య చాణుక్య నీరు తాగడం విషయాన్ని క్రోడికరించి చెప్పినట్టనిపించింది. ఇందులో ఉల్టా పల్టా ఏం లేదు.

      భోజనం ముందు, తరవాత, నీరు తాగద్దని అందరూ చెప్పినమాట. భోజనంతో నీరు తాగమనీ అందరూ చెబుతున్నమాట. అన్నం జీర్ణమయ్యాకా తాగితే అనగా గంటన్నర రెండుగంటల తరవాత తాగితే బలం చేస్తుందన్నదీ నిజమే! ఆజీర్తికి నీరుతాగడం మందు అనీ చెబుతారు.

      భోజనం ముందు తరవాత నీరుతాగడమంటే గటగటా ఎక్కువ తాగద్దని. భోజనంతో కూడా కొద్దికొద్దిగా తాగమని. భోజనం జీర్ణమయ్యాక గటగటా ఎక్కువ తాగమని. అదీ అర్ధం.

      Delete
  2. భోజనానికి ముందు నీరు తాగితే మా అమ్మ కూడా మందలింస్తుండేది. ఆవిడది సింపుల్ లాజిక్ - అన్నం తినడానికి ముందే నీళ్ళు తాగేస్తే ఇంక అన్నం ఏం ఎక్కుతుందిరా - అని.

    అన్నట్లు శర్మ గారు, చా ణు క్య అని ణ కు కొమ్మిచ్చి వ్రాస్తున్నారేమిటి మీరు? చా ణ క్య అని మాకు నేర్పినది, మేం నేర్చుకున్నదీనూ. తేడా ఎలా వచ్చిందంటారు? చాణక్య నీతి అనే అంటారు కదా.

    ReplyDelete
    Replies
    1. చాణక్యుడికి పిలక ఉంటుంది కదా. అందుకే, పిలక బదులు, ఒక కొమ్ము పెట్టారు.

      Delete

    2. Anonymous13 July 2023 at 19:16
      చాణక్యుడికి పిలకుంటుంది, ముడేసి ఉండదు నాలాగే, కొమ్ముండదు :)

      Delete
  3. విన్నకోట నరసింహా రావు13 July 2023 at 13:08
    అమ్మలందరికి ఇదలవాటనుకుంటానండి :)
    చాణక్య ను పొరపాటుగానే రాసాను,టపాలలో సరిజేసాను గమనించగలరు. సరిజేసినందుకు
    ధన్యవాదాలు.

    ReplyDelete