లెక్క తప్పుతోంది.
నీకీ వయసులో లెక్కలేంటయ్యా? అనకండి.
లెక్క లెక్కే కదా!
లెక్క ఎందుకూ? అన్నది మాట.
నేను కూడబెట్టుకున్న ఆస్థులు,షేర్లు విలువ పెరిగిందా తరిగిందా? నిప్టీ లెక్కేసుకోడానికి కాదు.
మరేంటి?
ఉదయం ట్రేక్ మీద నడుస్తాను. ఎన్ని రౌండ్లు తిరిగాను? అదీ లెక్క!
వేళ్ళు లెక్కెంటుకుంటే సరిపోయె!
వేళ్ళు లెక్కేట్టేను, వేలి కణుపులు లెక్కెట్టేను. అబ్బే! నడుస్తుండగా, వేళ్ళు ముడవడం మరవడమో, కణుపులు లెక్క ముందుకా వెనక్కా! సందేహం రావడం, ఇలా లెక్క తప్పుతోంది.
ఏం చేయాలి?
సెల్ పోన్ పట్టుకెళ్ళి స్టాప్ వాచ్ లో రౌండ్లు లెక్కేసేను. ఇందులో కూడా రౌండు అయ్యాకా నొక్కేనా? లేదా? సందేహం! ఇలాగా లెక్కతప్పుతోంది.
అసలు రౌండ్లు లెక్కెందుకూ?
పది రౌండులైతే నాలుగు కీలో మీటర్లు నడచినట్టు! అదీ సంగతి.
ఏం చేయాలో తోచలేదు, ఇలా పడుతూ లేస్తూ, లెక్కతప్పుతూ నడుస్తూనే ఉన్నా రోజూ!
ఓ రోజు నడుస్తుండగా, హటాత్తుగా మెరుపు ఆలోచనొచ్చింది.
ఉదయం నడకలో బలే బలే ఆలోచనలొస్తాయి, బుర్రొంచుకు నడుస్తుంటే! ఈ ఆలోచనలన్నీ కొద్ది సేపటికే ఆవిరైపోతాయి. కొన్ని మాత్రమే బతికి బట్టకడతాయి. అటువంటివే ఇక్కడ కంప్యూటరుకి ఎక్కుతాయి. ఈ సొదెందుకుగాని ఏం చేసేవో చెబుదూ అని సెలవా!
ఆలోచనొచ్చిన దగ్గరే వంగున్నా, చిన్న చిన్న రాళ్ళు ఏరుకున్నా!
కూడా ఉన్నవాళ్ళడిగేరు. రాళ్ళుందుకూ? చెప్పేను. నవ్వుకున్నారు.
నవ్వుకోండి నాకేం! ఏదో ఒక రోజు మీకూ ఈ అవస్థ తప్పకపోవచ్చని మనసులో అనుకున్నా!
ఒక్కో రౌండుకి ఒక్కో రాయి పారేస్తూ వచ్చా!
చివరికి చెయ్యి ఖాళీ అయింది, రౌండ్ల లెక్క సరిపోయింది, కాళ్ళూ పీకేయి :)
లోకో భిన్నరుఛిః లోకంకదా! నవ్వుతారు. నవ్వేరని మనపని మానుకుంటామా? మనిషి నోరు మూయడానికి మూకుడుందిగాని,లోకం నోరు మూయడానికి మూకుడు లేదు, ఇదో నానుడి.
రాళ్లు రువ్వేరన్నమాట రౌండు రౌండుకీ :)
ReplyDeleteZilebi7 July 2023 at 09:26
Deleteరాళ్ళు రువ్వడానికి పారెయ్యడానికి తేడా ఉంది బుజ్జమ్మా!
నాలుగు రౌండ్లు తిరగడానికి ఎంత టైం పడుతుందో మీకీపాటికి అంచనా ఉండి ఉండాలి. దాన్నిబట్టి రోజూ అంతసేపు నడవచ్చుకదా. ఈ వయసులో రాళ్ళు రువ్వడం, వేళ్ళు నొవ్వడం, నోళ్ళు నవ్వడం లాంటి జంఝాటాలెందుకు?
ReplyDeleteకాంత్7 July 2023 at 18:12
Deleteకాంత్ జీ!
రాత్రేసుకున్న మందుల ప్రభావానికి ఉదయానికి మత్తుగా ఉంటుంది, దానికితోడు బద్ధకం. ఒక్కో రోజది ఎక్కువగానూ ఉంటుంది. ఆరోజున అడుగు చురుగ్గా పడదు. అందుకుగాను రౌండ్ల లెక్క, కొంత ఎక్కువో తక్కువో సమయంలో దూరం పూర్తి చేయడం జరుగుతుందని ఆస...
రాళ్ళు రువ్వడం, వేళ్ళు నొవ్వడం తప్పదనుకోండీ! :)ఇక నవ్వేనోళ్ళంటారా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఏం చేసిన నవ్వుతాయి, చెయ్యకపోయినా నవ్వుతాయి. అవంతే, మనపని మనం చేసుకుపోవాలంతే!
అరగంట పాటు నడిస్తే సరిపోతుంది. రౌండ్లు లెక్కలు అవసరమా ?
ReplyDelete
DeleteAnonymous7 July 2023 at 20:08
సమయం గడిచిపోతుందిగాని నడక దూరం పూర్తికాదు :)
నడిచే వాల్లు టపాలు రాయరు రాసే వాల్లు నడవరు
DeleteZilebi8 July 2023 at 09:22
Deleteఇదేం సిద్ధాంతం బుజ్జమ్మా!
జిల్ జిల్ జిలేబీ విశిష్ట సిద్ధాంతము :)
DeleteZilebi8 July 2023 at 10:21
Deleteజీవులు మూడు రకాలు. జలచరము,భూచరము,ఉభయచరము. అలా నేను రాస్తాను, చదువుతాను,నడుస్తాను. తమరేమో రాయరు, మానేసి, మరచిపోయి ఏళ్ళు ఐదేమో!
నడక చాలా కాలం కితమే మరచిపోయారుగా! కోవిడ్ కాలం సరేసరి! చచ్చిబతికేకానైనా నడుస్తున్నట్టా? అలా అనిపించటం లే!
మాలిక టపాలు మీ పక్క బిగుసుకుపోయి పదిరోజులయుండ్లా! పట్టించుకోలేదేం :)
ఓయీ లక్కుపేట రౌడీ !
Deleteశర్మ.గారి ఆఖరు పాయింటు గమనించుడీ !
ఇట్లు
విన్న పాలు వినవలె వింత వింతలు :)
శర్మ గారు, ఆ ప్రక్కనేదో “కొండచిలువ” మాటేసినట్లుంది 🐍.
Delete😁😁
పెరిగిన టెక్నాలజీ వల్ల ఈ కాలంలో పని సులువవుతోందేమో తెలియదు కానీండి, శర్మ గారు, క్రికెట్ ఆటలో ఒక ఓవర్లో బౌలర్ ఆరు సార్లు వేసే బంతుల్ని లెక్క పెట్టడానికి అంపైర్ గులకరాళ్ళనే వాడేవారట. ఆరు రాళ్ళని ఒక చేతిలో పెట్టుకుని, బంతి వెయ్యగానే ఒక రాయిని రెండో చేతిలోకి జార్చేవాడట. అలా ఆరు సార్లు. కాబట్టి లెక్క కోసం రాళ్ళని వాడడం మామూలే. అంపైర్ ఒక సారి రాయిని చెయ్యి మార్చడం మరచాడంటే …. క్రికెట్ గ్రౌండ్ లో కొంపలంటుకోవూ 😁? అదే మీరు మర్చిపోయారనుకోండి … పోయిందేముంది, మరో రౌండ్ ఎక్కువ నడుస్తారు, మరింత వ్యాయామం అవుతుంది 😁.
ReplyDeleteఏమీ లేని మేటరుకు ఇంత చేంతాడంత కామెంటా !
Deleteతమరు “జిలేబి” గారని కించిత్ అనుమానంగా ఉంది 🤔.
Deleteపాత రోజుల్లో ఒక మేధావి గురించి పెద్దలు చెప్పేవారు. యూనివర్శిటీ పరీక్షలో సదరు మేధావి గారు ప్రశ్నా పత్రంలోని మొదటి ప్రశ్నకు సమాధానం వ్రాయడం మొదలు పెట్టి …. పరీక్ష వ్యవధి మూడు గంటలూ ఆ ప్రశ్న మీదే వెచ్చించారట.
నాది కూడా అదే పంథా. చెప్పేది వివరంగా చెప్పాలన్న పాలసీ. “కట్టె కొట్టె తెచ్చె” మన దగ్గర కుదరదు. నా విధానం మీద తమరికేమయినా అభ్యంతరమా?
అన్నట్లు ఇది కూడా “చేంతాడంత” కామెంటేనండోయ్.
విన్నకోట నరసింహా రావు8 July 2023 at 00:31
Delete''చుట్టైనా మెట్ట మేలు'' అన్నది నానుడి. మాట్రేక్ మీద స్మార్ట్ వాచీలు పారేస్తున్నారు. మా గ్రూప్ లో దొరికినవారు, ''నాకు స్మార్ట్ వాచీ దొరికింది, ఎవరిదో, చెబితే ఇచ్చేస్తాను'' అన్న మెసేజిలు చాలా తరచుగా కనపడుతున్నాయి. కాని నాదే పోయింది అన్నవాళ్ళు కనపడలేదు.
ఇక అంపైర్లు ఓవర్లో బంతులు లెక్కెట్టడానికి రాళ్ళు చేతులు మార్చుకునేవారన్న మాట, నాకు కొత్త,వార్త కూడా!
నేటి రోజుల్లో ఫస్టు అంపైర్, సెకండ్ అంపైరు, తర్డ్ అంపైర్, ఆపై అభిమానులు,ప్రేక్షకులు, రెప్లయ్ లూ ఇంతైతే కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు, ఎందుకనీ?
రాళ్ళు చేతులు మార్చడం కాదుగా పారెయ్యడం కనక మరచే సమస్య లేదు. అన్ని రాళ్ళు చిన్నవే దొరక్కపోవచ్చు, కొంచంపెద్దవి కూడా ఉంటాయి, అవే ముందు పారేస్తాం కదా!
చాలాకాలంనుంచి క్రికెట్ తెలిసినా, గవాస్కర్ కాలం నుంచి ధోనీ కాలం దాకానే అనుసరించినది. ఆ తరవాత దాని మీద అభిమానం తగ్గింది.
మీ కామెంట్ కంటే సమాధానం పెద్దదయిందా?
వామ్మో! వామ్మో! అంతా జిలేబీ మయము గా వున్నది :)
Deleteశర్మ గారు,
Deleteనా కామెంట్ “చేంతాడంత” ఉందనే కదా “జిలేబి” గారో, అలాంటి వారెవరో అన్నారు? కాబట్టి సినిమావాళ్ళ ఊతపదం లాగా “లెంగ్త్ ఎక్కువయినా ఫరవాలేదు, డీ..టె..యి..ల్డ్ గా చెప్పండి” అన్నట్లు వివరంగా ఉంటేనే నయం.
గులకరాళ్ళు, మరీ కంకరంత పెద్ద రాళ్ళు కాకపోతే చిన్న సైజ్ గోళీ కాయలు అనుకుందాం. అవునూ, ఈ రోజుల్లో పిల్లలెవరయినా గోళీలు ఆడుతున్నారా 🤔?
విన్నకోట నరసింహా రావు8 July 2023 at 13:46
Deleteరాళ్ళు అంటే బియ్యం లో కలిపే పలుకురాళ్ళంతవి. మరీ కంకరరాళ్ళు కాదండి.
గోళీలు,బచ్చాలు,కుండబంతి, గూటీబిళ్ళ,ఎచ్చనగాయలు,దాగుడుమూతలు,వీరివీరి గుమ్మడిపండు వీరిపేరేమి?,చింతగింజలు,వామన గుంటలు,ఉప్పట్లు ఏవండి? ఎక్కడా? పిల్లలికి వీటి పేర్లేనా తెలుసా? నేటి పిల్లలమాట దేవుడేరుగు, పిల్లల తల్లులకైనా తెలుసా? అనుమానమే!
చిత్రాలు చూస్తుంటా, ట్రేక్ మీద తల్లి ట్రేక్ మీద రొప్పుతూ ఉంటే పిల్ల అక్కడే దగ్గరలో ఉన్న జారుడు బండమీద ఆడుకోడం కాదు, తలొంచుకు కూచుని ఫోన్ గీకుతూ ఉంటుంది.
స్మార్ట్ వాచ్ ల కాలం ఇది, మీరింకా రాతి యుగం లో ఉన్నారు.
ReplyDeletebonagiri8 July 2023 at 08:34
Deleteసారూ!
పాతరాతి యుగం ,కొత్త రాతి యుగమని రెండున్నట్టున్నాయండి చరిత్రలో. పాతరాతి యుగం వాడినే కదండీ, అందుకు అక్కడే ఉండిపోయా!! ఎదగలేదు!!! స్మార్ట్ వాచీలు పారేస్తున్నారు మా ట్రేక్ మీద. :)
మిత్రులు శర్మ గారు, అంత కష్టం అవసరం లేదండీ. మీ ఫోనులోనే step tracker ఉంటుంది. బయలుదేరి నపుడూ వెనక్కు వచ్చినపుడూ లెక్కచూసుకోండి. ఎంతదూరం నడిచారో తెలుస్తుంది. రాత్రి పడుకొనే ముందు చూడండి రోజుమొత్తం ఎంత నడక అన్నది తెలుస్తుంది. ఐతే హమేషా ఫోనుమాత్రం హస్తభూషణంగా ఉండాలంతే. వేళ్ళూ రాళ్ళూ లెక్కవేసే పనిలేదు.
ReplyDeleteశ్యామలీయం11 July 2023 at 11:29
Deleteశ్యామలీయం సార్!
పెడోమీటర్ ఫోన్ లో చూసుకోవచ్చని మీరు చెప్పేకా తెలిసింది. మనవరాలికి చెబితే ఆప్ డవున్ లోడ్ చేసిచ్చింది. కాని ఉపయోగించడానికే లేకపోయింది. గత రెండు రోజులుగా నడక అటక ఎక్కేసింది, పాదం బెణకడం మూలంగా! నడకమొదలెట్టినపుడు చూస్తాను. ఇంట్లో కుంటుతూ నడుస్తేనే 600 అడుగులికి 20 కేలరీలు మండేయంటోంది, నిజమంటారా?
మండే వుంటుంది :)
Deleteదూరపు లెక్కలు కెలొరీ లెక్కలు ఎందుకు ? మీ వయసుకు ఒక అరగంట సేపు నడిస్తే చాలు. స్టెప్ ట్రాకర్ ల అనవసరపు గోల అనవసరం.
ReplyDeleteAnonymous14 July 2023 at 23:28
Deleteమీరన్నది నిజమేనండి.
ఎవరి దిష్టో కొట్టేసింది, నడక అటకెక్కిపోయింది,వారంగా :)
పాదం బెణికి ఖాళీగా కూచుని, చేయగలది, చేసేపని లేక, కాలక్షేపానికి. :)
జిలేబి దిష్టే వుంటుంది ఇంకెవరు మీపై దిష్టి పెట్టే వాళ్లుంటారు .?
DeleteAnonymous15 July 2023 at 13:39
Deleteనిజమే అనుకోండి. జిలేవి అంత దిష్టి కళ్ళాండి? :)
ఏమో ఎవరికెరుకా ? మీకే తెలిసుండాలి.
DeleteZilebi15 July 2023 at 15:37
Deleteనాకు తెలిసి జిలేబి కజ్జా కోరు, అంతే.
బుజ్జమ్మా! నీవి దిష్టి కళ్ళని నేననలా!! :)
అంతేనంటారా :)
DeleteZilebi15 July 2023 at 16:52
Deleteఅంతకాక మరెంత? :)
బుజ్జమ్మవి పసిరి కళ్ళా? కణ్ణా!