Thursday 20 July 2023

హంస లేచిపోయింది.

 హంస లేచిపోయింది.


తోలు తిత్తి ఇది 

తూటులు తొమ్మిది

తుస్సు మన ఖాయం

జీవా తెలుసుకో

అపాయం! అపాయం.


ఈ శరీరం తొమ్మిది తూటులతో ఉండే తోలు తిత్తి. ఏదో ఒక రోజు హంస లేచిపోవడం/నిలిచిపోవడం ఖాయం. ఈ తొమ్మిది తూటుల్లో ఒకదానిలో నుంచి జీవుడు బయటి పోవడమే అపాయం, అది తెలుసుకో అని హెచ్చరించారు.


మరెలా పోవాలి? ప్రశ్న. పదో దారుంది, అది మూసుకుపోయింది, దాన్ని తెరుచుకో, అలా బయటపడు, అన్నదే హెచ్చరిక.. 


ఎలాపోతే ఏమి? ప్రశ్న.బ్రహ్మరంధ్రం నుంచి బయటికిపోతే జన్మ రాహిత్యం. ఊర్ధ్వ ముఖంగా పోతే మానవ జన్మ. అధో ముఖంగా పోతే తిర్యక్కులలో జన్మ. తిర్యక్కులననేమి? ప్రశ్న. భూమికి సమాంతరంగా వెన్నుపాముండేవన్నీ తిర్యక్కులు. 

 బయటికిపోవడం అంటే? ప్రశ్న. ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన, సమాన వాయువులు పంచ ప్రాణాలు. ఇవన్నీ శరీరం వదలిపెట్టడమే బయటికిపోవడం. అంటే వాయువు శరీరాన్ని వదిలెయ్యడం.

 దీన్నే హంసలేచిపోవడం/నిలిచిపోవడం అని చెబుతారు.

 హంస ఏమి? ప్రశ్న.

 అనేది గాలిలోపలికి పీల్చుకునేటపుడు కలిగే శబ్దం, హం  అనేది గాలివదలిపెట్టేటప్పుడు కలిగే శబ్దం. ఇదే హంస మంత్రం. దీని గురించి చాలా ఉంది, క్లుప్తంగా. నిమిషానికి ఏడుసార్లు ఊపిరిపీల్చి ఏడు సార్లు వదలుతాం. ఊపిరే జీవుడు. ఈ శరీరంలో నివాసమున్నాడు, బయటికిలోనికి తిరుగుతుంటాడు. ఒక సారి నిలబడితే మరిచొరబడడు. అదే హంస నిలిచిపోవడం లేచిపోవడం. 


మహన్యాసం ఇలా చెబుతోంది.


హకారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రకృతిర్మతా

పుంప్రకృత్యాత్మకోహంసః తదాత్మకమిదంజగత్

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనతనః

త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్


క్లుప్తంగా హకారం పురుషం సకారం ప్రకృతి వీటి జోడియే హంస. దేహమే దేవాలయం,సనాతనుడైన జీవుడే ఈ దేవాలయంలో ఉన్నాడు. ఆ జీవుణ్ణే సోహం అదేనేను, ఏది అది? అదే పరమాత్మ. ఆ పరమాత్మే నేను అనే భావంలో పూజించాలి. చాలు, ఇంకా చెబితే...


జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరుని మాట.

జంతువు అంటే ప్రాణి అని అర్ధం. ప్రాణుల్లో నరజన్మ దొరకడమే కష్టం. దొరికిందంటే అదృష్టమన్నదే మాట.

అందుచేత హంస లేచిపోయేటపుడు కనీసం ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి సిద్ధం కావాలి.


జీవుడికి ప్రాణాయామం అలవాటు చేయి.


ఊర్ధ్వ ముఖప్రయాణం అధో ముఖప్రయాణమననేమి?

జీవుడే ద్వారం నుంచి బయటకుపోయాడో ఎలా తెలుస్తుంది?

చెప్పండి కాస్త మీరు.

12 comments:

  1. మీ రెప్పటి నుండి కాపీ పేష్టు చేయటం మొదలెట్టేరు ?

    ReplyDelete

  2. Anonymous20 July 2023 at 11:14
    తమ బుఱ్ఱలో గుంజెండిపోయి ఏదేంటో తెలీటంలేదు,తమకి :)

    ReplyDelete
  3. హంస ఎవరితో లేచిపోయింది?

    ఎగిరిపోయింది అనాలనుకుంటా... శ్యామలీయం గారు చెప్పాలి.

    ReplyDelete
    Replies
    1. కాపీ పేష్టు ఎఫెక్టు :)

      Delete
    2. bonagiri20 July 2023 at 12:37
      శ్యామలీయంగార్ని వివరణ కోసం మీరు అడిగారు కనక, వారి సమాధానానికి ఎదురు చూస్తాను, అప్పటిదాకా నా సమాధానం వాయిదా వేస్తున్నాను.

      Delete
    3. వాయిదాల వరదయ్య :)

      Delete
  4. "హం" కూడా గాలిని బయటకివూదుతుంది మాలాంటి మామూలు మనుషులకి.

    ReplyDelete
  5. సోహం అన్న పదం నుండి సంస్కృతమర్యాద ప్రకారమే హంస అని కొత్తపదం వచ్చిందట. హింస నుండి సింహం ఐనట్లుగా. సోహంలో సో అన్నప్పుడు గాలి లోపలికి పోయి హం అన్నప్పుడు బయటకు వస్తుందంటారు.ఈ సోహం అంటే సః అహం అని అంటే వాడే నేను అని తెలుగుతర్జుమా చేసుకోవచ్చును.

    ఇక హంస ఎగిరిపోవటం అన్నదీ హంస లేచిపోవటం అన్నదీ రెండూ కూడా ప్రచారంలో ఉన్నవే. లేచిపోవటం అన్నప్పుడు అక్కడ భావన చటుక్కున వెళ్ళిపోవటం. లేవటానికి యత్నం చేస్తున్నట్లు కొంచెం కూడా ఉప్పందదన్నమాట ఎవరికీను. పక్షులు చూడండి కుదురుగా కూర్చున్నట్లే ఉన్నది ఒకటి హఠాత్తుగా పైకి ఎగిరిపోతుంది. మనలాగా లేవటానికి కొంచెం శరీరాన్ని సన్నధ్ధం చేయటమూ అది ఇతరులు గమనించేంత వ్యవధి ఉండటమూ పక్షి విషయంలో కాదు. అది మనం ఎగరబోతోంది అని మనకి అనిపించేంత సమయం ఇవ్వదు.

    హంస అన్నది జీవుడికి పర్యాయంగా వాడతారు తత్త్వాల్లో. ఈ జీవుడనే హంస అన్నదీ పక్షిలాగా చటుక్కున లేచ్చక్కాపోతుంది కాబటి లేచిపోయింది అని వాడుక.

    ReplyDelete
    Replies
    1. మనుషులు లేచిపోవడం, పక్షులు ఎగిరిపోవడం వాడుక కదా.

      Delete
  6. bonagiri23 July 2023 at 12:43
    bonagiri20 July 2023 at 12:37
    శ్యామలీయం22 July 2023 at 17:55
    లేచిపోవడం అనే మాటకి నీచార్ధంలో వాడుతున్నారు, నేడు. కాని మా పల్లెలలో ఇప్పటికిన్నీ లేచిపోవడం అంటే, మళ్ళీ ఆ స్థానానికి రాకపోయే అర్ధంలో వాడతారు. ఈ ఇంటినుంచి లేచిపోతున్నాం, ఈ ఊరునుంచి లేచిపోతున్నాం, అని అంటుంటారు. ఇక్కడ హంస అనేది పక్షికాదు, ఊపిరి, జీవుడు. దేహమనే దేవాలయం నుంచి లేచిపోతున్నాడు, మళ్ళీ తిరిగిరాడని మా పల్లెవాసుల వాడుక.

    హంసలేచిపోయింది, హంస నిలిచిపోయింది, హంస ఎగిరిపోయింది అనేవిన్నీ వాడుకలో ఉన్నవే!

    మీరలా కాదనుకుంటే నాది పొరబాటే మన్నించండి

    ReplyDelete