చచ్చి బతికేరు
చచ్చి బతికేరు
చస్తే ఎలా బతుకుతారు చెప్మా! కష్టం మీద బతికి బయటపడ్డారని అర్ధంట, గండం గడిచిందని.
చావలేక బతుకుతున్నాం బతకలేక చస్తున్నాం!
కష్టాలు పడలేకున్నాం. చావడానికి తెగించలేకున్నామనిట.
చావు బతుకు.
కష్టమైన బతుకని అర్ధంట.
చావరా! చావు!! చావమన్నాగా!!!
రా! రారా! రమ్మన్నగా!! అని అర్ధంట.
చచ్చినా చెప్పిన మాట వినడు.
ఏం చెప్పినా ఎలా చెప్పినా వినడని అర్ధంట.
చస్తే చెప్పినమాటేలా వింటాడు సినబ్బా!!
చావు పీనుగు
ఇదేంటి? చస్తేనే కదా పీనుగయ్యేది!!!!!
పనికిరానివాడని అర్ధంట.
చచ్చినాడా! వచ్చేవా!!!
ఇదొక తిట్టు, మురిపెంగా. సాధారణంగా స్త్రీలు వాడేది.
చచ్చిచెడి చాయంగల విన్నపాలు.
చాలా కష్టం మీద చేసే విన్నపాలు.
గ్రామీణుల తెనుగు నుడికారపు సొంపులు
చావు కబురు చల్లగా చెప్పడం.
ReplyDelete
DeleteAnonymous4 July 2023 at 11:14
అలా అంటారా? :)
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు.
ReplyDeletebonagiri4 July 2023 at 14:01
Deleteజుట్టున్నమ్మ సిగెట్టుకున్నా,కొప్పెట్టుకున్నా అందమే! ఇదో సామెత. జుట్టు లేనావిడ సవరం, లేదా విగ్గు పెట్టుకోవాలి :)
ప్రజలంతా బాబోరికి గంపగుత్తగా ఓట్లెయ్యాలని నిర్ణయించుకుంటే, సోము వీర్రాజు మాత్రం బాబోరిని విమర్శించడం బీజేపీ అధిస్టానానికి నచ్చలేదు. దానివల్ల ఆంధ్రాలో వున్నవోటుబ్యాకుంకు సున్నాకి పడిపోతుందని ఘా... ఠ్ఠిగా తీర్మానించిన అధినాయకత్వం... దిద్దుబాటుచర్యలల్లోబాగంగా.. బబోరి ఫ్యామిలీలోని పురంధరేశ్వరిని అధ్యక్షురాలినిచేసి.. ఆంధ్రుల కోపాన్ని కొంతవరకు తగ్గించేప్రయత్నం చేశింది.
ReplyDeleteAnonymous4 July 2023 at 18:36
Deleteతెనుగు రాజకీయాలర్ధమై చావవు :)
లోకంలో జరిగే ప్రతివిషయాన్నీ బాబోరికి అనుకూలంగా మలుచుకోవాలనే పచ్చ మీడియా తపన.
DeleteAnonymous5 July 2023 at 11:55
Delete''ఎవరి కంపు వారికింపు'' అని సామెత.