Wednesday 5 July 2023

అమిత్రం కురుతె మిత్రం

 

అమిత్రం కురుతె మిత్రం

మిత్రం ద్వేష్టి హినస్తి చ

కర్మ చారభతె దుష్టం

తమాహుర్మూఢచేతసమ్.

(విదుర నీతి) 

అమిత్రులతో (స్నేహానికి అర్హులు కానివారితో)మిత్రత్వం నెరపేవారు,స్నేహానికి అర్హులను ద్వేషించేవారు. స్నేహార్హులపై పగ సాధించేవారు,  హానిపొందుతారు. వారే మూఢులని పిలవబడతారు.

కర్ణుడు, శిశుపాలుడు,జరాసంధుల స్నేహం, చేయ కూడనివారితో స్నేహంచేసి, స్నేహం చేసి బాగుండవలసిన పాండవుల పట్ల ద్వేషం పూని వారి చావుకు ప్రయత్నం చేసి, తాను చావును కొనితెచ్చుకున్నవాడు, దుర్యోధనుడు.


ఇది లోకం, రకరకాలవాళ్ళుంటారు. ఎవరితో స్నేహం చేయచ్చో,ఎవరితో చేయ కూడదో, తెలుసుకోవడమే విజ్ఞత. 

6 comments:

  1. మీతో స్నేహం ఏ కోవలోకి వస్తుంది?

    ReplyDelete
    Replies

    1. Anonymous5 July 2023 at 15:20
      మీరు మిత్రులైతే ప్రశ్నే లేదు, అది మీరు తేల్చుకోవలసిన సంగతి :) మిత్రులు కాకపోతే ప్రశ్నకి తావు లేదు :)

      Delete
  2. ఏమిటో వీరి గందరగోళం ! మిత్రులు శత్రువులు గట్రా గట్రా ఒక్క ముక్కా అర్థమయి "చావదు" :)

    ReplyDelete
    Replies
    1. Zilebi6 July 2023 at 20:16
      తింగరిబుచ్చీ!
      ముక్కర్ధమైతే ఎలా చస్తుంది సినబ్బా! :)
      ముక్కర్ధం చేసుకోలేక చచ్చినవాడు దుర్యోధనుడు.
      ముక్కర్ధమైనా అర్ధం కానట్టు నటించి, ఫలితం అనుభవించి, కొడుకులంతా కళ్ళెదురుగా చచ్చినా, పాండవుల మోచేతి నీళ్ళు ఏభై ఏళ్ళు తాగి చస్తూ బతికినవాడు ధృతరాష్ట్రుడు.

      Delete
    2. ఆహా. అయితే సరేనండి. నేను మీ థాట్ వేవ్ లోనే అర్థం చేసు కుంటాను.
      ధన్యవాదాలు. :)

      చెబ్తేనూ తంటాయే చెప్పక పోయినా తంటాయె అంతా గోదారోళ్ళ చాదస్త మాయె :)

      Delete
    3. Zilebi7 July 2023 at 09:13
      అర్ధం చేసుకుంటే సరి :)

      దీన్నే మావాళ్ళు ”అత్తకొంగు తొలిగిందని చెప్పినా తప్పే,చెప్పకపోయినా తప్పే" అంటారు. :)
      గోదారి నీళ్ళకి కారమెక్కువ చాదస్తం కాదుస్మీ :)

      Delete