Tuesday 18 July 2023

ప్రియవక్తృత్వం

 ప్రియవక్తృత్వం


 దాతృత్వం ప్రియవక్తృత్వం 

ధీరత్వముచితజ్ఞతా

అభ్యాసేన న లభ్యతె

 చత్వారః సహజా గుణాః

(ఆచార్య చాణక్య)


దానగుణం కలిగియుండడం అదే ఈవి కలిగియుండటం, ప్రియంగా మాట్లాడటం,ధీరత్వం కలిగి యుండటం, సమయోచితంగా మాట్లాడగలగటమనే నాలుగున్నూ సహజగుణాలు, నేర్చుకుంటే రావు.

( హెచ్చరిక:- ఇక ముందు టపాలో, ఇష్టం కాని మాటలు కనపడతాయి. భాధకలుగుతుందనుకునేవారిక్కడినుంచే మరలిపోవచ్చు)  


దాతృత్వం,ప్రియవక్తృత్వం, ధీరత్వం , ఉచితజ్ఞత, వీటిని వేరు వేరుగా చెప్పినా దాతృత్వం,ధీరత్వానికి; ప్రియవక్తృత్వం,ఉచితజ్ఞతకి అవినాభావ సంబంధం ఉంది.వీటిని వేరు వేరుగా చెబితే పేలవంగా ఉంటుంది, అందుకే కలిపి ఇలా.

దాతృత్వం, ధీరత్వం

దానగుణం కలిగి ఉండటం దానం చేయడం గొప్పవిషయాలు.దానాలు పది అన్నారు, కాదు పద్నాలుగూ అన్నారు.

అన్ని దానములకన్న అన్నదానము మేలు 

కన్నతల్లికంటె ఘనములేదు 

యెన్నగురునికంటె నెక్కుడు లేదయా 

విశ్వదాభిరామ వినురవేమ. 

దీనితో సమానమైనది లేదుగాని భూదానమూ గొప్పదంటారు,

 ఎన్నైనా గాని అన్నీ కూడా సొమ్ముతో కూడినవే, ఎంతోకొంత. ఓ ఉదాహరణ బలి దానమిస్తానంటే వద్దని శుక్రుడు అడ్డుపడ్డారు,కాని ఆపగలిగారా? లేదే. ఏమనమాట దానగుణం కలిగి ఉంటే, ఇచ్చే దానాన్ని ఎవరూ ఆపలేరు.

 వచ్చినవాడు విష్ణువే కానీ, మరెవరైనాగానీ,ఏమైనాకానీ, ఇచ్చిన మాట తిరిగిపోను, దానమిచ్చి తీరతాను, అనే ధైర్యగుణం చూపి దానమిచ్చినవాడు, బలిచక్రవర్తి.ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్... అన్నారు లక్ష్మణకవి. ఉత్తప్పుడంతా కీ బోర్డ్ వారియర్లే! :) అవసరానికొక్కడూ ముందుకురాడు. ధైర్యం అంటే ఎలా ఉంటుంది? ఒకమ్మాయి గోదాట్లో దూకింది. ఏ కారణమో! దగ్గర్లో ఉన్న ఒకతను ములిగిపోతున్న యువతిని రక్షించడానికి వెంఠనే దూకేసేడు! రక్షించగలనా?లోతెంతో, ఎమో! మనకెందుకొచ్చిన తిప్పలు అనుకోలేదు. అదీ ధైర్యమంటే!ధైర్యగుణమంటే. నిజం ఒకప్పుడు కాపాడబోయినవారి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉంటాయి.  ఈ గుణాలు సహజంగా వచ్చేవే పుట్టుకతో, నేర్చుకుంటేరావు.

ప్రియ వక్తృత్వం, ఉచితజ్ఞత

ప్రియ వక్తృత్వం, ఉచితజ్ఞత ఇవి రెండూ విడదీయలేనివే! ప్రియంగా అంటే, అబద్దాలు చెప్పమనికాదు. విషయాన్ని వివరించడం, వినేవారికి చిరాకు,బాధ కలగకుండా, వినగలిగేలా చెప్పడం.ఉచితజ్ఞత అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు, ఎలా మాటాడాలో తెలిసుండటమే ఉచితజ్ఞత. ఎంత చెప్పీ ఉపయోగం లేదు ఎఱుకపరచలేనేమో!

భాస్కర శతకకర్త ఈ రెండిటికి కలిపి ఒకమాట చెప్పేరు అదే రసజ్ఞత. ఇదీ అర్ధం కానిదే! అందుకే ఒక ఉదాహరణ చెప్పేరు. అది..


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక జాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు నిం

 పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య 

  భాస్కరా

చదువుతో విద్య రావచ్చు, వివేకంరాదు. ఎక్కడ,ఎప్పుడు,ఎలా,ఎంత మాటాడాలన్నది చదువుతో రాదు. ఏ యూనివర్సిటీ లలోనూ నేర్పరు, నేర్పలేరు. 

రసజ్ఞత ఉప్పులాటిదన్నారు శతకకర్త, నిజం ఎక్కువైనా తక్కువైనా నోటపెట్టలేం. ఈటన్ లోనో లార్డ్స్ లోనో చదుకున్నంతలో రసజ్ఞత రాదు. బుఱ్ఱకి బొక్కకొట్టి లోపలికి రసజ్ఞత జొప్పించలేరు. ఈ ప్రియవక్తృత్వం, ఉచితజ్ఞత అన్నవి నేర్చుకుంటే వచ్చేవికావు, పుట్టుకతో రావలసిన సహజగుణాలు. 


16 comments:

  1. “ఎలుగు తోలు తెచ్చి ఎందాక ఉతికినా
    నలుపు నలుపే గాని తెలుపు రాదయా”
    అన్నాడు శతకకర్త.

    ReplyDelete
    Replies
    1. ఎలుక తోలా ఎలుగు తోలా ?

      Delete
    2. ఎలుగు తోలు కనీసం కప్పుకోవడానికి పనికొస్తుంది. ఎలుక తోలు దేనికి పనికొస్తుంది ? పైగా అటువంటి దాన్ని తీసుకొచ్చి ఉతకడం కూడానా? కాబట్టి ఎలుగు తోలే.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు18 July 2023 at 09:24
      Anonymous19 July 2023 at 05:18
      విన్నకోట నరసింహా రావు19 July 2023 at 08:09
      ఎలుగుతోలు దెచ్చి ఏడాది ఉతికినా
      నలుపు నలుపేగాని తెలుపురాదు
      కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినా బలుకునా
      విశ్వదాభిరామ వినుర వేమ!

      Delete
    4. ఎలుగుతోలు అన్నదే సరైన పాఠమండీ. ఎలుకతోలు అన్నది ఎవరిపుణ్యాన పుస్తకాల్లోనికి ఎక్కిందో కాని ప్రచారంలోనికి వచ్చింది. అది చిన్నదా పెద్దదా అన్నది ఒక మైనర్ పాయింట్. అదటుంచి ఎలుగు రంగు నలుపు. అది ఖచ్చితం. (ధృవపు తెల్లఎలుగుల గురించి వేమనకు తెలిసే అవకాశం లేదు!) ఐతే, ఎలుకలు అక్కడక్కడా నల్లటివి ఉంటయి అన్నది నిజమే కాని అత్యధికశాతంవి ఖాకీ రంగులో ఉంటాయి. అందుచేత ఎలుకతోలు నలుపు అని అంటే పద్యంలో అది అవ్యాప్తి దోషం అవుతుంది. కాబట్టి వేమన ఎలుగుతోలు అన్నాడనే భావించాలి. ఎలుగుతోలు తగినంత పరిమాణంలో ఉంటుంది కాబట్టి అది దేనికైనా మనిషికి పనికి రావచ్చును కాని ఎలుకతోలు ఏమి ప్రయోజనం అన్నవిన్నకోటవారి మాటే నాదీను.

      Delete
    5. Polar bears too have jet black skin. Fur appears to be white.

      Delete
  2. మిత్రులు శర్మగారు, మంచి వ్యాసం. కాని, ఒక చిన్న సవరణ.
    ।........ ఇం
    ।పొదవెడు నుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా
    ఇక్కడ ఛందోభగం ఐనది. సరైన పాఠంగా చివరిపాదం
    ।.పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
    అని ఉండాలండి.

    ReplyDelete
    Replies
    1. నూరు ఆరైనా ఆరు నూరైనా ఛందోభంగ్ మాత్రం కాకూడదు :)

      Delete
    2. శ్యామలీయం18 July 2023 at 21:33
      Anonymous19 July 2023 at 05:18

      శ్యామలీయం సార్!
      ఎక్కడో తప్పుంది పద్యంలో అనుకున్నా! ఎక్కడో కనిపెట్టలేకపోతిని. నెట్ లో అన్నీ తప్పులు, అబద్ధాలే చలామణీలో ఉన్నాయిగా! టపాలో సరిజేస్తున్నాను.
      ధన్యవాదాలు.
      అనామకం
      తెలియక తప్పు చేస్తాం. తెలిసి సరిదిద్దుకోవాలిగా?

      Delete
    3. పద్యం నడకను బట్టి అది ఎక్కడన్నా కుంటుబడితే ఛందస్సుతో ఆడుకొనేవారే కాదండి, పద్యపఠనం తగినంతగా అలవడినవారు కూడా చప్పున గమనిస్తారు. మీరు అలాగే సులభంగా గమనించారు. ఐతే సవరించాలంటే ఛందస్సుతో మంచి స్నేహం తప్పదండి. ఆస్నేహమే తరచుగా పద్యాలను గుర్తుపెట్టుకోవటాన్ని మరింత సులభం చేస్తూ ఉంటుంది.

      Delete
    4. శ్యామలీయం19 July 2023 at 19:08
      నేను పద్యం గుర్తు పెట్టుకోడానికి కొన్ని కొండ గుర్తులుంచుకుంటానండి. మొదటిపాదం బాగా గుర్తుంటుంది. గణవిభాగాన్ని గుర్తించలేనుగాని, అక్షరాల సంఖ్య లెక్కిస్తా, మిగిలిన పాదాల్లో అలా వచ్చాయా లేదా చూస్తా.పాద విభాగం చేయడానికి రెండో అక్షరం ప్రాస చూస్తా! వీటి ప్రకారంగా పద్యం రాసేటపుడు చూస్తాను.
      ధన్యవాదాలు.

      Delete
    5. హేవిటో ఈ చందం గోల్గొప్పాలు ఒక్క ముక్కా అర్థమయి చావదు

      Delete
    6. అయ్యా, అనామకులవారూ, మీకు బోధపడనివన్నీ పనికిమాలినవి కానక్కరలేదండీ. అలాగే మీకు తెలిసినవి అన్నీ పనికివచ్చేవి కూడా కానక్కరలేదు. కాబట్టి చులకనమాటలు మానండి.

      Delete
    7. శ్యామలీయం19 July 2023 at 23:33
      పెద్దలు తమకు తెలియంది కాదుగాని, ఒక చిన్నమాట, కొంతమందిని ఉపేక్ష చేయడమే కావలసిందని నా భావం. :)

      Delete
    8. Anonymous19 July 2023 at 20:55
      గోల్గప్పాలు అంటే గప్ చుప్ లా? బాగుంటాయిట

      Delete