Monday, 16 January 2023

కనుమ

 




Courtesy:Whats app
కనుమ
 కనుమరోజు ప్రయాణం నిషిద్ధం. ఇవన్నీ సాంఘిక కట్టుబాట్లు, నాటి రోజుల్లో. కొన్ని నేటిరోజులకీ వర్తిస్తాయి.సనాతన ధర్మంలో కాలంతో పాటు అచార వ్యవహారాలూ మారుతూ వచ్చాయి, వస్తాయి,రావాలి కూడా! ఇవన్నీ అవసరానికి ఏర్పరచుకున్న కట్టుబాట్లు.

శవదహనం మరుసటిరోజు:-నాటి రోజుల్లో శవదహనం అంటే శ్రమతో కూడినదే.కావలసినవారు కాలం చేసినపుడే వారింటికి వెళ్ళడం, దహనం దాకా ఉండడం జరుగుతుంది. అప్పటిదాకా ఆహారం తీసుకోరు కనక ఆహారం తీసుకుని శరీరానికి విశ్రాంతి ఇమ్మని చెప్పేదే ఈ ఆచారం. 

గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు:- అగ్ని ప్రమాదం జరిగితే పూరిళ్ళు కనక ఎక్కువగా కాలిపోయి ఉంటాయి. ప్రమాద సమయంలో అలసట చెంది ఉండచ్చు, అంతే కాక మరుసటి రోజు పునరావాసం లో మన అవుసరం పడచ్చు, అందుకు విశ్రాంతికి, అవుసరానికి ఆదుకోడం కి అందుబాటులో ఊళ్ళో ఉండమన్నది.

సపిండీ కరణం మరుసటిరోజు:- దీన్నే పన్నెండో రోజు తరవాత అనగా పదమూడో రోజు వెళ్ళకూడదు, పద్నాలుగో రోజు ఉండకూడదని చెబుతారు. అంటే పదమూడు ఉండకూ అంటే పన్నెండో రోజు భోజనాల అనంతరం నీ అవుసరం అక్కడలేదు, అందుకు వెళ్ళిపో! పదమూడో రోజు వెళ్ళకూడదంటే! అవును ఆ ఇంటికి అత్యవసరమైన వ్యక్తివి కనక ఉండిపోయావు, మిగిలున్న పనులు పదమూడో రోజు పూర్తి చేసి పదనాలుగో రోజు వెళ్ళిపో! అక్కడ ఉండకు అని చెప్పడమే! అవుసరానికి మించి ఉండద్దని చెప్పే ఆచారం. 

అమ్మవారి జాతర మరుసటిరోజు:- దీనికి తగిన కారణం చెప్పలేను.ఆ రోజుల్లో ఈ అవుసరం ఉండేదేమో!  

సంక్రాంతి మరుసటి రోజు:-ప్రతి నెల ఒక సంక్రాంతి జరుగుతూ ఉంటుంది.ఇది మకర సంక్రాంతి మరుసటిరోజుకు మాత్రమే పరిమితం. మకర సంక్రాంతి అనేది పెద్ద పండగ అనే పెద్దల పండగ. పెద్దల పండగ అంటారుగాని, ఇది అన్ని వయసులవారి పండగ. భోగి పిల్లల, అల్లుళ్ళ పండగ. సంక్రాంతిరోజు పెద్దలకి తర్పణాలు,దానాలు, ధర్మం ఇలా  అందరిని సంతృప్తి పరచేరోజు.కనుమరోజు పశువులను కడిగి అలంకరిస్తారు.నాడు ప్రయాణ  సాధనం బండి, పశువులు లాగేది. పశువులకి విశ్రాంతి ఇస్తూ వాటినీ ప్రేమిస్తూ చేసుకునే పండగ కనుక ప్రయాణం నిషిద్ధం.

ముక్కనుమ:- స్త్రీల పండగ, బొమ్మలనోము, బొమ్మల కొలువూ, పేరంటాలు.

కనుమ నాడు  కాకయినా మునుగుతుంది అంటే కనుమ నాడు అభ్యంగన స్నానం చేయమని, దీనికి కారణాలు అనేకం.  

18 comments:

  1. కనుమ నాడు ప్రయాణం చెయ్యకూడదని చిన్నప్పుడే నేర్పించారు for obvious reasons (పశువులకు విశ్రాంతి) బాగానే ఉంది.

    అయితే కనుమ నాడు మినుములతో చేసిన గారెల లాంటి పదార్థం తినమని కూడా చెబుతారు గదా, దానికి గల కారణాలు వివరించగలరా, శర్మ గారు? ధన్యవాదాలు.

    ReplyDelete
  2. తినడానికి కూడా కారణాలు కావాలాండి ? :)

    ReplyDelete
    Replies
    1. Anonymous17 January 2023 at 05:31

      అక్కరలేదు, ఆకలీ అక్కర లేదు :) సంచిలో కూరినట్టు కూరెయ్యచ్చు!!!!

      Delete
    2. ఆకలి లేకపోయినా ఆహారం స్వీకరించే జంతువు మనిషి ఒక్కడేనంట. పిజ్జలు, బర్గలు, బిరియాని లు, పిండి వంటలు, బేకరీ పదార్థాలు, కేకులు , కూల్ డ్రింక్స్, ఇవన్నీ అదుపు లేకుండా తిని ఊబకాయం, జబ్బులు కొని తెచ్చుకుంటున్నాము.

      Delete
  3. విన్నకోట నరసింహా రావు16 January 2023 at 18:27

    చెప్పబోతున్నవన్నీ తెలియనివేంకాదు. నేనేం చెబుతానోనని.... :)
    నేటి రోజుల్లో కనుమనాడు ప్రయాణం చేయచ్చు,నియమం సడలించచ్చు.

    మనది సమశీతోష్ణ ప్రాంతం. వాతావరణం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్నదీ తెలిసిన సంగతే!వాతావరణనికి తగిన ఆహారం తీసుకోవాలని పెద్దలమాట.మనకు ఆరు ఋతువులు, గడుస్తున్నది హేమంతం,నాల్గు రోజుల్లో శిశిరం ప్రారంభమవుతోందిగా! హేమంతంలో చలిని తట్టుకోడానికి నెయ్యి,వెన్న, నువ్వులతో చేసిన పదార్ధాలు,బెల్లం, మిరియాల లాటి సుగంధ ద్రవ్యాలు కొంచం ఎక్కువగా తీసుకోమన్నారు. ఇక రాబోయే శిశిరం,వసంతాలలో ఆరోగ్యం కోసం ఇప్పటిదాకా తీసుకున్నవికాక మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నవి తీసుకోమనడానొకి సూచనగా గారెలలాటివి తినమన్నారు.

    ధన్యవాదాలు ముందు చెప్పేసేరంటే నేను చెప్పబోయేది మీకు తెలుసనేగా :)

    ReplyDelete
  4. Replies
    1. విన్నకోట నరసింహా రావు17 January 2023 at 15:22

      ధన్యవాదాలు.నమస్కారం

      Delete
  5. Ilaa enni vishayalu telusukunnaamu guruvu garu mee post la dwaraa. Dhanyavaadamulu meeku. Ivi naa family lo evarikainaa cheptunte elaa telusu ani adugutunnaaru. Nenu oka saadhaarana gruhinini guruvu garu. Ilaanti vishayalu telusukovaalanna aasakti ekkuva. Mee posts chadavatam valanane telustunnaayi. Maro maaru dhanyavaadamulu 🙏guruvu garu.

    ReplyDelete
  6. లక్ష్మి గారు (“లక్ష్మీ’స్ మయూఖ”),
    ఇది మీకు బ్లాగ్ ఓనర్ గారు చెప్పవలసిన మాట కానీ నేనే చేతిదురద కొద్దీ ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను 🙂.

    మీ స్వంత బ్లాగులో మీరు తెలుగు లిపిలోనే వ్రాస్తారు కదా …. అంటే తెలుగు లిపిలో వ్రాయడం మీకు అలవాటే అన్నమాట ….. మరి ఇక్కడెందుకు తరచూ తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లిపిలో వ్రాస్తున్నారు మీ మొత్తం కామెంటుని? అది కూడబలుక్కుని చదివి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చక్కగా మనందరికీ అలవాటైన తెలుగు లిపిలోనే వ్రాస్తే బాగుంటుందని నా ఉ.బో.స 🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు18 January 2023 at 13:06
      ఉదయమే డాక్టర్ దగ్గరకెళ్ళి వచ్చాను.మరపు పెరుగుతోంది. తెనుగులో రాయడానికి లక్ష్మిగారి ఇబ్బందేమో తెలియదు. వారు తెనుగులో రాస్తారని ఆశిస్తాను.మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి.

      Delete
    2. మిమ్మల్ని మన్నించడమేమిటి / ఎందుకు శర్మ గారు? నాకేమీ ఇబ్బంది కలగలేదు చదవడానికి - చదివే స్పీడు కించిత్ తగ్గింది అంతే 🙂.

      వారు తెలుగు లిపిలో వ్రాయగలరు. కానీ ఇప్పుడెందుకిలా వ్రాస్తున్నారో తెలియడం లేదు. అందుకని నా కామెంట్ పెట్టాను.

      ఈ వయసులో కూడా ఇంత విజ్ఞానదాయకమైన బ్లాగు పోస్టులు వ్రాస్తున్న మీకు “మరపు పెరగుతోంది” అంటే ఎలా, సార్ 🙂.

      డాక్టర్ గారితో మీ ఇతరత్రా సంప్రదింపులు సంతృప్తికరంగా జరిగాయని ఆశిస్తాను.

      Delete

    3. విన్నకోట నరసింహా రావు18 January 2023 at 19:05
      శరీరానికి వయసు పెరిగింది, జరలో రుజ సామాన్యం.చివరిదాకా ఆరోగ్యంగా ఉండి కాలూ చెయ్యీ కదుపుకునీలా ఉండి చెల్లిపోవాలని ఆశ. ఇప్పుడు కూడా ఇరవైల్లో ఉన్నట్టు ఉండదుకదండీ!బాధలు తప్పవు. మరపురాకుండా ఉండేందుకే ఈ బ్లాగు ప్రయత్నమండి. నమస్కారం,ధన్యవాదాలు.

      Delete
    4. Tappu gaa anukokandi sarma garu, narasimharavu garu. Okappudu naa vadda system vundedi. Komchem daanilo letters pedda gaa kanapadevi. Ippudu system ledu, kanulu koodaa komchem ibbandi pedutunnayi. Cell lone ibbandi ayina vyaakya cheyagalugutunnaanu. Meeku ibbandi kaliginchinanduku manninchandi. 🙏

      Delete
    5. లక్ష్మీ'స్ మయూఖ19 January 2023 at 20:47
      Tappu gaa anukokandi sarma garu, narasimharavu garu. Okappudu naa vadda system vundedi. Komchem daanilo letters pedda gaa kanapadevi. Ippudu system ledu, kanulu koodaa komchem ibbandi pedutunnayi. Cell lone ibbandi ayina vyaakya cheyagalugutunnaanu. Meeku ibbandi kaliginchinanduku manninchandi.
      తప్పు గా అనుకోకండి శర్మ గారు, నరసింహరావు గారు. ఓకప్పుదు నా వద్ద సిస్టం వుండేది. కొంచం దానిలొ లెటర్స్ పెద్ద గా కనపడేవి. ఇప్పుడు సిస్టం లేదు, కనులు కూదా కొంచం ఇబ్బంది పెడుతున్నయి. సెల్ల్ లోనె ఇబ్బంది అయిన వ్యాఖ్య చెయగలుగుతున్నాను. మీకు ఇబ్బంది కలిగించినందుకు మన్నించండి.
      టెంత్ క్లాస్ కాంపొజిషన్ దిద్దుతున్నట్టనిపించిందండి, నాకు కూడా ఈ ఇబ్బంది ఉంది. సెల్ లో తెనుగు లో చేయలేను. సిస్టం ఆన్ చేయాలి అంటే కొంచం బద్ధకం.అంతే కాదండి, కూచోడం కూడా ఎక్కువ సేపు ఇబ్బంది పడుతున్నా! అందుకే మీ ఇబ్బంది కొంత గుర్తించాను సుమా! ఏమనుకోలేదు. మన్నింపులు సహజం, వడ్లగింజలో బియ్యపుగింజ, మరచిపొండి.కళ్ళుంటేనే కలియుగమండి, అశ్రద్ధ చేయద్దు, కిందటినెల కళ్ళు చూపించుకొచ్చా! మూడు నెలల్లో మరోకన్ను కేటరాక్ట్ ఆపరేషన్ కి రెడీ!!!

      Delete

  7. లక్ష్మీ'స్ మయూఖ17 January 2023 at 23:29
    Ilaa enni vishayalu telusukunnaamu guruvu garu mee post la dwaraa. Dhanyavaadamulu meeku. Ivi naa family lo evarikainaa cheptunte elaa telusu ani adugutunnaaru. Nenu oka saadhaarana gruhinini guruvu garu. Ilaanti vishayalu telusukovaalanna aasakti ekkuva. Mee posts chadavatam valanane telustunnaayi. Maro maaru dhanyavaadamulu 🙏guruvu garu
    ఈలా ఎన్ని విషయాలు తెలుసుకున్నాము గురువు గారు మీ పొస్ట్ ల ద్వారా. ధన్యవాదములు మీకు. ఈవి నా ఫేమిలీ లొ ఎవరికైనా చెప్తుంటె ఎలా తెలుసు అని అడుగుతున్నారు. నేను ఒక సాధారణ గృహిణిని గురువు గారు. ఈలాంటి విషయాలు తెలుసుకొవాలన్న ఆసక్తి ఎక్కువ. మీ పొస్ట్స్ చదవటం వలననె తెలుస్తున్నాయి. మరో మారు ధన్యవాదములు ??గురువుగారు

    మీ కామెంట్ చదువుకోడానికి కష్టపడ్డాను. తెనుగులో రాయడానికి మీ ఇబ్బంది తెలీదు. ప్రయత్నించండి.నేను కొత్తగా చెప్పేదేం లేదండి, ఇదంతా మన వారసత్వ సంపద. నా తరవాత తరాలకి అందించాలనే నా కోరిక, నాకు దొరికిన ఉత్తమ మార్గం ఇదే! దీనితో డబ్బు సంపాదించాలనుకోలేదు. అక్కరలేదు కూడా! ఆరోగ్యం క్షీణిస్తోంది, మరపు పెరుగుతోంది. ఉదయమే డాక్టర్ దగ్గరకెళ్ళి వచ్చాను.
    మిమ్మల్ని ఇబ్బంది పెడితే మన్నించండి

    ReplyDelete
  8. మీకు కలిగించిన అశౌఖర్యానికి క్షమించడి గురువు గారు.🙏,నరసిమ్హరావు గారిని కూడా కోరుతున్నాను. నా వద్ద ఇప్పుడు కంప్యూటర్ లేననందువలన సెల్ లోనే టైపు చేయటం కష్టమనిపించి అలా ఆంగ్లము లో వ్యాక్య వ్రాసాను.🙏.మీకు కలిగించిన అసౌకర్యానికి క్షమించండి.🙏

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ'స్ మయూఖ19 January 2023 at 20:59
      మీ ఇబ్బంది గుర్తించా! ఏమనుకోను సుమండీ మరోసారి చెబుతున్నా!

      Delete
  9. అయ్యో క్షమించడం వరకు ఎందుకు లెండి, లక్ష్మి గారూ. ఎప్పుడూ తెలుగు లిపిలో వ్రాసే మీరు ఉన్నట్లుండి ఇలా ఆంగ్ల లిపిలో తెలుగు వ్రాసున్నారేమిటా అనిపించి అలా కామెంటాను, ఏమనుకోకండి. మీ ఇబ్బందేమిటో ఇప్పుడు వివరించారుగా, that’s alright అర్థమయింది.

    ReplyDelete