మొగుడు ముండా అంటే మాదాకవళం వాడూ ముండా అంటాడు.
ఇదిఒక నానుడి. ఒక కత చెప్పుకుందాం
ఒక రోజొక మాదాకవళం వాడు గుమ్మం దగ్గర అరుస్తున్నాడు, ''మాదాకవళం తల్లీ'' అని. భర్త భోజనం చేస్తున్నాడు, చివరికొచ్చేసింది, ''మళ్ళీ రా'' అనడం ఇష్టం లేక ఆ పడుచు ''ఒక నిమిషం ఉండూ'' అని అరిచింది. ఐనా వాడు అరుస్తూనే ఉన్నాడు. ఆమె భోజనం కానందున సద్దుకోవడానికి కొంచం సమయం పట్టింది. భోజనం చేసి బయటికి వెళ్ళిన ఇతను ”ఒసే! ముండా ఎంతసేపుండాలే వీడూ”అనరిచాడు లోపలికి.
పాపమా పడుచు మాదాకవళం తెచ్చి, మాదాకవళంవాడిజోలెలో వేసింది, మరో మాట మాటాడక. మరో నాలుగు రోజుల తరవాత కూడా అలాగే జరిగింది. ఆ తరవాత మాదాకవళం వాడే ''ముండా! ఎంతసేపు ఉండాలే'' అని అరచాడు. పడుచు మాటాడలేదు, జోలెలో కవళం వేసి వెళ్ళిపోయింది, లోనికి.
ఇప్పుడు అతని తల్లి కలగసేసుకుని, నువ్వు రెండు సార్లు నీ భార్యను ముండా అని మాదాకవళం వాడి ముందంటే , మాదాకవళాని కొచ్చినవాడూ ముండా అన్నాడు, చూసావా! నీకు నీ భార్య మీద పైచెయ్యి సాధించాలంటే ఇది పద్ధతి కాదు,నీకూ నీ భార్యకూ తేడాపాడాలుంటే నాలుగు గోడల మధ్యన తేల్చుకో వీధినకాదు. వాడు ఈ రోజు నీ భార్యను ముండా అన్నాడు, రేపు నిన్నూ తిడతాడు, ఆపై నన్నూ తిడతాడు. ముష్టివాడు తిడితే నీ పెళ్ళానికొచ్చిన లోటేం లేదు,నీ పరువే పోయింది. కాని ఇది పదిమందికీ తెలిసి నీ చేతకానితనమే బయట పడింది.
గడ్డిపోచ విలువ చెయ్యని
ముష్టివాడికిచ్చిన పాటి విలువ,గౌరవం, నీ భార్యకివ్వలేక పోయావు. నీకు తెలివితేటలెప్పటికొస్తాయో!
నీకు వయసు పెరిగిందికాని బుద్ధి పెరగలేదని తిట్టింది.
అంతే కదా సారూ, బయటవాళ్ళ ముందు మనవాళ్ళని మనమే పలుచన చేసి మాట్లాడితే …… క్రమేపీ …. మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినవాడూ ముండా అన్నాడట …. అనే సామెత లాగానే తయారవుతుంది పరిస్ధితి.
ReplyDelete
Deleteవిన్నకోట నరసింహా రావు27 January 2023 at 16:34
లోకం అంతేనండి, అందుకే నానుడయ్యింది.
mana vyavaharam guttu ganu pakkavaala vyavaharam rattu kavali kadandi :)
ReplyDelete
DeleteAnonymous4 February 2023 at 15:31
అందరూ అలాగే అనుకుంటారండి :)