Saturday, 14 January 2023

శుభకృత్ భోగి శుభకామనలు

 శుభకృత్ భోగి శుభకామనలు



భోగిమంట దగ్గర చలికాగుతున్న చిన్నోడు


అందమైన రంగవల్లి

ముగ్గు గొట్టం తో ముగ్గు వేయడం

ముగ్గు గొట్టం తో ముగ్గు 


చేత్తో వేసిన ముగ్గు 

అన్నీ ఉదయం నడక ముచ్చట్లు.

శుభకృత్ నిజంగానే శుభాన్ని చేసింది.ఈ రోజు భోగి పిల్లలు,అల్లుళ్ళ పండగ.ఆరోగ్యమే మహాభాగ్యం. సాముదాయక ఆరోగ్యం భయస్థితి నుంచి బయట పడింది.జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగానే ఉన్నాం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఈ సంవత్సరం పంట చేతికి బాగానే వచ్చింది. తిండి గింజలకి లోటు లేదు.ప్రతి ఇల్లు కలిగినంతలో కలకలలాడుతోంది, అల్లుళ్ళు కూతుళ్ళ రాకతో, కోడళ్ళ శోభతో. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ....రేపు సంక్రాంతికై (పెద్ద పండగ అనే పెద్దల పండగకై ) ఎదురు చూస్తూ...



18 comments:

  1. ముగ్గుల మీ ఇంటి ముందరివా? బాగున్నాయి. అదొక కళ.

    చలి కాగుతున్న చిన్నోడెవరో “బొడ్డు” రాఘవేంద్రరావు గారి బాపతులా ఉన్నాడే 😁😁.

    చిన్న సందేహం శర్మ గారు - సంక్రాంతిని మాత్రమే అల్లుళ్ళ పండగ అంటారెందుకని?

    మీకు, మీ కుటుంబసభ్యులకు, బ్లాగు మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు 🔥🌾🎋.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు14 January 2023 at 11:00
      మనసున్న మంచోడు
      మాపేట చిన్నోడు
      పరోపకారి పాపన్న
      అన్నో తమ్ముడో !!

      తెనుగునాట ముఖ్యంగా చేసుకునే పండగలు మూడు. పెద్దపండగ అనే సంక్రాంతి నాలుగురోజులు, భోగి,సంక్రాంతి, కనుమ,ముక్కనుమ.
      తర్వాతది ఉగాది ఒకరోజు.
      దీపావళి నాలుగురోజులు
      నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి,భగినీ విదియ.
      తెలుగువారికి అమావాస్యకి సగమెరిక, అందుకున్నూ,ఈ కాలంలో పంట చేతికొచ్చి సొమ్ములు ఆడే సమయమున్నూ కనుక అల్లుళ్ళ పండగ.
      మీకు మీ కుటుంబ సభ్యులకు సర్వదా శుభమగుగాక!

      Delete
    2. // “…. సొమ్ములు ఆడే సమయమున్నూ” //
      అద్గదీ అసలు సంగతి.

      అవునూ, పండగల్లో దసరా వదిలేసారేం? బెజవాడమ్మ వారికి ఆగ్రహం రాదూ?

      Delete
    3. విన్నకోట నరసింహా రావు15 January 2023 at 11:48
      ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ! సొమ్ములు లేకపోతే అల్లుణ్ణి పిలిచి ఉపయోగం లేదు కదండీ! చిన్నతల్లి పలికితేనే!!! శుష్కప్రియాలు శూన్యహస్తాలు ఏమన్నమాట?

      అమ్మో! అమ్మని మరచిపోడమా?జరగనిపనండి. చైత్రశుద్ధనవమి అన్నగారి పండగండి, సరిగ్గా ఆరునెల్లకి ఆశ్వయుజశుద్ధనవమి చెల్లాయిగారి పండగండి! ఇవేగాక అమ్మగారి అబ్బాయిగారి పండగ భాద్రపద శుక్ల చవితి ఇవన్నీ సామూహిక పండగలు కదండీ! అల్లుణ్ణి పిలిచి ప్రత్యేకంగా గౌరవించే పండగలు కావు, అదండీ సంగతి.
      ఇంతేకాదండి చైత్రమాసం యువతమాసం అమ్మాయి అల్లుడు అల్లుడింట ఉండాలి! భాద్రపద మాసం, ఆశ్వయుజమాసం పనులరోజులు, ఇదండి ధర్మ సూక్ష్మం!
      పొద్దుటే వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొచ్చా!అత్తం కొయ్యని గెలనుంచి పండు విరవని అత్తం కోసి అమ్మకి సమర్పించడం ఆనవాయితీ!!!!!
      చాలా చెప్పేసేనా!!!!!!!

      Delete
  2. చేత్తో వేసిన ముగ్గు :)

    ముగ్గు చేత్తో వేయకుండా ఇంకా వేరే దేంతో వేస్తారండీ ? :)

    ReplyDelete
    Replies

    1. Anonymous14 January 2023 at 19:31
      చేత్తోనే కాక ముగ్గు గొట్టంతో కూడా ముగ్గేస్తారు.
      పైన చూపిన ముగ్గులలో మొదటిది చుక్కలుపెట్టి వాటిని కలుపుతూ ముగ్గేసి మధ్య రంగులద్దినది, గంటపైన పడుతుంది. రెండవది ముగ్గు గొట్టంతో వేసినది. ముగ్గు గొట్టం ఉంటుందని దానితో ముగ్గెయ్యచ్చని తెలియని కాలమే!ముగ్గు గొట్టంతో ముగ్గు తొందరగా ఒక డిజైన్ లో వేయచ్చు. ఈ తరానికి ముగ్గుగొట్టం తెలియకపోవడం లో విచిత్రం లేదు.
      ఇక మూడో ముగ్గు చుక్కలు లేకుండా పెట్టే సావకాశం. అదీ ముగ్గులలో తేడా!

      Delete
    2. మీ ముగ్గోపాఖ్యానం బావుంది.
      ఈ నాటి గొట్టాంగాళ్లకు ఇవన్నీ తెలీక పోవడంలో ఆశ్చర్యమేముంది.

      గొట్టం ముగ్గు కన్నా చేత్తో వేసింది బావుంది.

      Delete

    3. Anonymous15 January 2023 at 11:50
      ప్రశ్న చూడగానే నేనూ మీలాగే అనుకున్నా సుమా!తరవాత తమాయించుకున్నా!!నేటి వారికి ముగ్గేసుకోడానికి చోటు లేదు. ముగ్గన్నది తెలియడమే గొప్పనుకోవాలి. ఇక ముగ్గుల్లో తేడాలూ, గొట్టంతో ముగ్గులూ తెలియకపోడం లో వింతలేదు.అందుచేత చెప్పాలి.ఈ ముగ్గు గొట్టం నేను చూసి దశాబ్దాలయింది. దానికి తోడు ముగ్గులో గొట్టం కనపడటం లేదు,ఫోటో లో. అదీ ఒక కారణమే సుమా! నిన్న ఉదయం ఒక పడుచు హడవిడిగా నీళ్ళు జల్లి ముగ్గుగొట్టంతో ముగ్గేస్తుంటే చూశా! మధ్యలో ఫోటో తీసుకుంటానని సైంధవుడిలా అడ్డుపడ్డా! సరేనని తనపని తొందరగా పూర్తి చేసుకుని లోపలకెళ్ళిపోయిందా పడుచు నిమిషాల్లో! అదీ గొట్టంతో ముగ్గు, ఎంత తొందరగా పూర్తి చేయచ్చో!
      పొద్దుట తీర్థంలో చూశా, ముగ్గు గొట్టం కనపడిందిగాని మంచి డిజైన్ కనపడలేదు. పిల్లలు సాయంత్రం వెళ్ళినపుడు చూసి తెస్తామన్నారు. తెస్తే ఒక టపా సాయిస్తా!!!

      Delete
  3. ఆఁ ముగ్గుల గొట్టం తో కూడా

    ReplyDelete
    Replies

    1. Anonymous15 January 2023 at 05:53
      ధన్యవాదాలు

      Delete
  4. అసలు క్రీ.పూ 623వ సంవత్సరం మొదలు బుధ్ధుని మహాపరినిర్వాణం జరిగిన కాలం మధ్యన గౌతమ బుధ్ధుడు తిరిగిన ప్రాంతాలలో పాళీ భాష ఎంతమంది మాట్లాడారు,ఎంతమందికి అది వాడుక భాష అయ్యింది?
    మనం చెప్తే అతి హిందూత్వ వాదుల బనాయింపు పాండిత్యం అంటారు.Kenneth Roy Norman అనే వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రపంచ ప్రసిధ్ధి ఉన్న University of Cambridgeకి చెందిన Middle Indo-Aryan languages మీద సాధికారిక పరిజ్ఞానం ఉన్నవాడు.అతనే its emergence was based on a misunderstanding of the compound pāli-bhāsa, with pāli being interpreted as the name of a particular language అనేస్తున్నప్పుడు భారతదేశంలో బుధ్ధుడు తిరిగిన ప్రాంతాల్లో పాళీ భాష కోసం ఇప్పుడు మనం వెతికితే తిరుగులేని ఆధారాలు ఎలా దొరుకుతాయి?
    అత్యంత సుదీర్ఘమైన పరిశోధనల అనంతరం వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్న ఆణిముత్యాలు ఇట్లా ఉన్నాయి:Pali was first mentioned in Western literature in Simon de la Loubère's descriptions of his travels in the kingdom of Siam.An early grammar and dictionary was published by Methodist missionary Benjamin Clough in 1824, and an initial study published by Eugène Burnouf and Christian Lassen in 1826 (Essai Sur Le Pali, Ou Langue Sacree de La Presqu'ile Au-Dela Du Gange).The first modern Pali-English dictionary was published by Robert Childers in 1872 and 1875.తెలుగులోకి అనువదిస్తే మార్చి చెప్పానని అంటారు గాబట్టి యధాతధం దించేశాను.చదివారు కదూ!
    అసలు పాళీ భాషయే హుళక్కి బుళక్కి అని తేలిపోయింది గద.ఒక కొత్త మతాన్ని హిందువుల మీద రుద్దడానికి వీళ్ళే ఒక చెత్తభాషని పుట్టించి అందాల రాముడు సినిమాలో ఏయన్నార్ నాగభూషణాన్ని ఏడిపించటానికి వంటపాత్రల్నీ కూరగాయల్నీ చెట్లకింద దాచేసి వచ్చినట్టు కొన్ని రాళ్ళమీద ఈ భాషలో శాసనాల్ని చెక్కించి అక్కడక్కడ పాతిపెట్టి తుఫానొచ్చి లాంచీలు కొట్టుకుపోయాయని అబధ్ధం చెప్పాక మళ్ళీ ఏయన్నారూ రాజబాబూ "ఇదిగో ఇక్కడ బూరెల గంగాళం దొరికింది,ఇదిగో ఇక్కడ పళ్ళాలూ గ్లాసులూ దొరికాయి" అన్న టైపు క్యామిడీ తవ్వకాలు చేసి కట్టుకధల్ని చరిత్ర చొప్పున అల్లేశారనేది యావన్మంది హిందువులకీ అర్ధం అయ్యింది కదూ!
    ఇక,268 BCE మొదలు 232 BCE వరకు ఉత్తర దక్షిణాలలో చూస్తే ఇప్పటి ఆఫ్ఘనిష్తాన్ నుంచి అస్సాము తప్ప ఇప్పటి ఈశాన్య రాష్ట్రాలని కలుపుకుని తూర్పు పదమరలలో చూస్తే హిమాలయాల దిగువ నుంచి కేరళ తప్ప ఇప్పటి భారతదేశపు రాష్ట్రాలను పరిపాలించిన అశోక సామ్రాట్టు "Major rock edicts,Minor rock edicts,Separate rock edicts,Major pillar edicts,Minor pillar edicts" అన్నీ కలిపి 33 శిలా శాసనాలు వేయించితే 20వ శతాబ్దంలో లార్డ్ కన్నింగుహాం గారు వచ్చి తవ్వి తీసేవరకు మనలో ఎవరికీ అశోకుడు అనే గొప్ప చక్రవర్తి మన చరిత్రలో ఉన్నాడని తెలియనే తెలియదంట!
    ఇంతకన్న పోరంబోకు తనం ఎక్కడ ఉంటుంది,చెప్పండి!ఇంకొక దగుల్బాజీ స్టేట్మెంటు ఏంటంటే ఇంగ్లీషోళ్ళు రాకముందర మనవాళ్ళకి చరిత్రని రికార్డు చెయ్యడం తెలియదంట!కల్హణుడు కాశ్మీర దేశపు రాజులను గురించి చెప్పిన "రాజ తరంగిణి" ఎప్పటిది?పాందవాగ్రజుడి మనవడు జనమేజయుడు తన తాతగారిని ప్రస్తావిస్తూ యుధిష్టిర శకంలో కాలాన్ని చెప్తూ వేయించిన శాసనం దొరికింది కదా,కనిపిస్తున్నది కదా!శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీ ముఖ శాతకర్ణి గురంచీ శాలివాహన శక స్థాపకుడైన గౌతమి పుత్ర శాతకర్ణి గురించీ వాళ్ళు వేయించిన శాసనాల వల్లనే కదా తెలిసింది!
    మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే మనం ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశన్లూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి.
    అది,"క్రీ.శ 18వ శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?" అని.

    జై శ్రీ రాం!

    ReplyDelete
    Replies

    1. hari.S.babu16 January 2023 at 22:05
      చరిత్రని వక్రీకరించడం కాలంలో జరుగుతూ వచ్చింది, అప్పుడు అస్వతంత్రులం. కాని స్వాతంత్ర్యానంతరం కూడా వక్రీకరింపబడ్డ చరిత్రకి ఋజుగతి ఏర్పడలేదు.దీనికి చాలామంది సైంధవులు అడ్డుతగులుతూనే ఉన్నారు.చాలా దేశాలు అస్వతంత్రం నుంచి స్వతత్రం సంపాదించుకున్న తరవాత పట్టణాల పేర్లు మార్చుకున్నాయి, చరిత్రా మార్చుకున్నాయి, గత శతాబ్దిలోనే ఇవి జరిగేయి కూడా, మనం ఇంకా బానిసత్వ నిద్రనుంచి మేల్కోలేదు. ఆ నిద్రలో ఉండాలని కొంతమంది ఆశ,ఆకాంక్ష, కాని జరిగేలాలేదు :)

      Delete
    2. నిజమే కానీ, వాట్సాప్ లో వచ్చిన వార్తలను నిజమైన చరిత్ర అనుకోవడం అంతకంటే దారుణం.

      Delete
    3. వాట్సప్ లో వచ్చే వార్తల లో సత్యాలు అసత్యాలు రెండూ ఉంటాయి. వామపక్ష హిందూ వ్యతిరేక శక్తుల చేతిలో ఉన్న ప్రధాన ప్రసార మాధ్యమాలు నిజాలు చెప్పవు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని సార్లు అసత్యాలు పుకార్లు, అర్ధ సత్యాలు వచ్చేమాట వాస్తవం. అయితే అనేక మంచి విషయాలు, నిజాలు కూడా ఉంటాయి.

      Delete
    4. bonagiri17 January 2023 at 11:54
      నిజమే!వాట్సాప్ లో చేప్పేదంతా చరిత్రకాదు! కాని చరిత్ర వక్రీకరించబడలేదన్నది మరీ దారుణం!!!

      Delete
    5. Anonymous17 January 2023 at 20:08
      నిజమే!వాట్సాప్ లో సత్యాలు,అసత్యాలు,అర్ధ సత్యాలు ఉంటాయి! వాటిలో నిజమేదో తేల్చుకోవడమే వివేకం !!!వామపక్ష, హిందూ వ్యతిరేకులు,ఈ మీడియా చాలాకాలంగానే అసత్యాలు ప్రచారం చేస్తున్నమాట నిజమే!!

      Delete
  5. Aalasyamu gaanainaa guruvugariki sankranti subhakaankashalu telupukuntunnaanu.💐

    ReplyDelete
  6. లక్ష్మీ'స్ మయూఖ17 January 2023 at 23:22
    Aalasyamu gaanainaa guruvugariki sankranti subhakaankashalu telupukuntunnaanu.
    ఆలస్యము గానైనా గురువుగారికి సంక్రాన్తి శుభకాంక్షలు తెలుపుకుంటున్నాను.
    మీ కామెంటు చదువుకోడానికి కొంచం కష్టపడ్డాను.
    ధన్యవాదాలు.

    ReplyDelete