2023 ఆంగ్ల
నూతన వత్సర
శుభకామనలు.
31 రాత్రి ఆడవారికి ముగ్గులు మగవారికి పెగ్గులు అన్నాడో మిత్రుడు వాట్సాప్ లో.
ఈ రోజు ఉదయమే నడకలో కనపడ్డ కొన్ని ముగ్గులు. నేటికీ ఆడవారిలో చిత్రకళ తగ్గలేదన్న దానికిదే తార్కాణం. ఎక్కడా గొబ్బెమ్మలు కనపడలేదు.
చిరునవ్వు వెల ఎంత?
శతవత్సర జీవి.చదువుకోలేదు. పుట్టిన తేది తెలియదు. నూరేళ్ళనుకుంటాం. ఎప్పుడూ అలా చిరునవ్వుతోనే ఉంటాడు. జట్టు కార్మికునిగా పని చేసిన కష్టజీవి.నా స్నేహితుడు, పేరు తెలియదు.పిల్లల దగ్గరుంటాడు. భార్య గతించింది. ఇలా ఉదయమే కనపడ్డాడు, ఈ రోజు.అతని ఆరోగ్య రహస్యం చిరునవ్వు.
మంచి ఔరా కనిపిస్తోంది మీ మిత్రుని ముఖములో.
ReplyDeleteAnonymous1 January 2023 at 11:28
Deleteకష్టజీవులంతేనేమో సారూ!
// “ నా స్నేహితుడు, పేరు తెలియదు.” //
ReplyDeleteదీని భావమేమి, శర్మ గారు 🤔? స్నేహితుడంటారు, పేరు తెలియదంటారు, ఔరా అదెలాగ 😧?
మంచి మనసు, మంచి గుణం ఉండాలే గాని 'జగమంత కుటుంబం నాది' అని అన్నారొక సిని కవి (అనకాపల్లి చెంబోలు సీతారామశాస్త్రి గారు). అంతే మాత్రానికి వారి పేర్లు తెలియాలనేమి లేదుగా మ్యాసిటరూ. శర్మ గారి మూలంగానే మీరు సుధా బ్లాగ్ ముఖముగా నే పరిచయం. మీ పూర్వపరాలేమిటో నా పూర్వపరాలేమిటో తెల్వదీ. ఇది అంతే. డౌట్లుంటే . నెస్కఫే గోల్డ్ యాడ్ చూడండి తెలుస్తోంది మీకూ.
Deleteవిన్నకోట నరసింహా రావు1 January 2023 at 14:21
Deleteఅనుకోకుండా కలుస్తుంటాం వాన చినుకులా! అతని గురించి నాకు తెలుసునని అతనికి తెలుసునని నాకు తెలుసు, నాగురించీ అతనికి తెలుసుననీ నాకూ అతనకి తెలుసు. ఇక మాటాడుకోడానికేం అభ్యంతరం లేదు, ఇక పేరంటారా? అది ఇబ్బంది అనుకోలేదు. ఇక మాటాడుకునేదేం లేదు కూడా! ఇద్దరికీ.ఇక కాలునొప్పి చెయ్యి నొప్పి ఉండేవే ఇద్దరికీ, వయసు చిన్నెలుకదా! ఇద్దరం చిరునవ్వుతో కలిసేం అదే భాగ్యం, మా కాళ్ళమీద మేం నిలబడి. చిరునవ్వే పలకరింపు, అందులోనూ ఉదయమే, చెప్పద్దూ ఇద్దరికీ ఆనందమే అయింది.
Anonymous1 January 2023 at 22:19
Delete//నెస్కఫే గోల్డ్ యాడ్ చూడండి తెలుస్తోంది మీకూ.//
అదేంటండీ
మీరు చెప్పిందంతా బాగానే ఉంది గానీ శర్మ గారు, స్నేహానికి ముఖపరిచయానికీ తేడా ఉంటుంది అనేదే నా పాయింట్. ముఖపరిచయాల్లో ఎదుటి వ్యక్తి పేరు తెలియక / తెలుసుకోక పోవచ్చు ఎంత కాలమయినా.
Deleteసరే గానీ అసలు సంగతి చెప్పండి - ఆ ఫొటోలోని వ్యక్తి మీరే కదా 🙂? మీరేనని నాకెందుకో ‘ఘట్టి’ అనుమానం 🙂.
కాదు.
Deleteఅవును.
Deletehttps://youtu.be/KEp-_IbaECA
Delete
DeleteAnonymous2 January 2023 at 23:55
చూసాను, అర్ధం కాలేదు, వివరించుడీ!
Anonymous2 January 2023 at 17:32
Deleteఅవును.కాదు.
Anonymous2 January 2023 at 16:51
Deleteకాదు.అవును.
విన్నకోట నరసింహా రావు2 January 2023 at 11:52
Deleteకలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్
అన్న యశోదాదేవి లా ఐపోయానండి! నేను నేనేనా అనఏ అనుమానం వచ్చేసింది సుమండీ! ఎవరేనా చెప్పాలి నేను నేనవునో కాదో! :)
బాగా తప్పించుకున్నారు 👌🙂.
Delete“తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ||” అన్నాడు శతకకారుడు ఏనాడో.
అవును కాదు, కాదు అవును అంటూ శర్మ సార్ గారికి నరసింహారావు సార్ గారికి మధ్య యేదో కోడ్ సంభాషణ జరుగుతూన్నట్టుంది.
Deleteవిన్నకోట నరసింహా రావు3 January 2023 at 10:06
Deleteజిలేబి సావాసదోసమంటారా సారూ!
Anonymous4 January 2023 at 03:05
Deleteఇందులో కోడ్ సంభాషణేం లేదు సారూ! విన్నకోటసారు ఫోటో నాదేను అని అనుకుంటున్నా ”ఘట్టిగా” అన్నారు. మరొకరు ”కాదు” అన్నారు. అదే ”కాదు అవును” సమాధానం. ఇక మరొకరు ”అవును” అన్నారు. దానికి సమాధానం ”అవ్చును కాదు”. అంతేసారూ వడ్లగింజలో బియ్యపు గింజ!!
మీ అందరి స్నేహితుల పేర్లూ మీకు తెలిసి నట్లు అంటారేమిటండి ?
ReplyDeleteAnonymous1 January 2023 at 20:22
ReplyDeleteనా ఉదయం నడకలో కనీసం వందమంది, అమ్మాయిలతో సహా కలుస్తారు, సాయంత్రం నడకలో అమ్మలు నాలాటి ముసిలి ముతక, ఉదయం కుదరని జనాభా కనీసం ఏభై మంది కలుస్తారు. అందరిదీ ఒకటే పలకరింపు చిరునవ్వు, దానికి తోడు ఈ మధ్య రెండు చేతులు జోడించి నమస్కారం అలవాటు చేశా!ఇదిప్పుడు మా ట్రేక్ మీద వైరల్ అందరికీ :) కొంతమందివే పేర్లు తెలుసు, మనుషులూ తెలుసు, మిగిలినవారంతా ముఖపరిచయ మిత్రులే/మిత్రిణులే :)
Nutana samvatsara subhakaankashalu sarma garu. 💐. Elaa vunnaru sir.
ReplyDeleteలక్ష్మీ'స్ మయూఖ3 January 2023 at 13:22
Deleteఆంగ్ల నూతన వత్సర శుభకామనలు. బహుకాల దర్శనం, ఎల్లరున్ సుఖులేకదా!
నేనంటారా? 2018 లో ఒంటరివాణ్ణయిపోయాను.జీవఛ్ఛవంలా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, నిన్ననే కంటి డాక్టర్ గారి దగ్గరకెళ్ళొచ్చా! అలా రోజులు గడుస్తున్నాయమ్మా! భారంగా!!