Friday 1 December 2023

కన్నూ మిన్నూ

 కన్నూ మిన్నూ


'నీకు కన్నూ మిన్నూ కానరావటంలేదురా!' అని తిడుతుంటారు. దీని అర్ధమేమీ?

కన్ను కానకపోవడం జరిగితే మిన్నే కాదు ఏదీ కనరాదుకదా! అంటే దీని అసలు రూపం ఇది కాదనమాట.


'మన్నూ మిన్నూ కనరావటం లేదు, నీకు' అనితిడితే ఏమన్నట్టు? మన్ను, కాళ్ళ కిందుంటుంది అదే భూమి. ఇక మిన్ను అంటే ఆకాశం నెత్తి పైనుంటుంది. అంటే నీకు కిందపైనా లేదా కిందా మీదా కనపట్టం లేదూ! అని అర్ధం. అదేమి? అంటే నీకు పెద్దా, చిన్నా తేడా కాని, ఉచ్చం, నీచమనే తేడా; ఉచితం, అనుచితమని కాని అవుపించటం లేదనర్ధం. అదీ అసలు సంగతి.

17 comments:

  1. అహంకారంతో మిడిసిపడుతున్నాడు అనే అర్థంలో కూడా వాడతారనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు1 December 2023 at 14:39

      అవునండి. అహంకారంతో మిడిసిపడుతూ మాటాడేవారి గురించి ముందు చెబుతారు.
      చ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
      చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
      బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
      పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

      Delete
  2. ఉప్పు ఉప్పటంచు ఉప్పును దట్టింప
    వ్యాధు లెల్ల జేర పరితపించు
    టేల భాస్కరా! విరివిగాను కాయగూ
    రలను గైకొనండి రాధనమదె!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కనులు నెత్తి కెక్కె , కనరారు కంటికి ,
      గౌరవించ దగిన వారు , తనకు ,
      మిడిసి పడెడు వారి గడుసు దనాలను
      గూర్చి పలుకు నపుడుగూడ యండ్రు .

      Delete
    2. Zilebi1 December 2023 at 15:38
      ఆ పద్యం తమరికంతే అర్ధమయిందా! మేలు! మేలు!!
      ఉప్పు తక్కువైనా ప్రమాదమే,ఎక్కువైనా ప్రమాదమే బుజ్జమ్మా! తగుమోతాదులో ఉండాలి, అలాగే రసజ్ఞత కూడా! తెరియమా?

      Delete

    3. వెంకట రాజారావు . లక్కాకుల1 December 2023 at 18:47

      గర్వాంధులు మదాంధులు అంతే కదండీ

      Delete
    4. శర్మ గారు,
      // “ తగుమోతాదులో ఉండాలి, ” //

      వెటకారం కూడా తగు మోతాదులోనే ఉండాలి.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు2 December 2023 at 09:09
      తగుమోతాదు అంటే ఎవరిమటుకు వారేర్పర్చుకోవలసిన సభ్యత హద్దు,సర్వం హద్దుల్లోనే ఉండాలి, అప్పుడే అందం. ఏది ఎక్కువైనా బావోదుకదండీ. అందుకే అన్నారు వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ కావాలని. వెటకారానికి హద్దు లేదనుకుంటే.....

      Delete
    6. ఏమండీ
      వెటకారమనగా ఏమిటి ?
      ఈ కారము సాంబారు రసములో వేస్తారా ? దయచేసి తెలుపగలరు


      ఇట్లు
      క్యూరియస్
      జిలేబి

      Delete
    7. ఇదే అది, “జిలేబి” గారూ.

      Delete
    8. Zilebi2 December 2023 at 10:26
      వెటకారమను కారమును సాంబారు, కూటులలో ఎక్కువగా వాడుదురని వినికిడి.

      Delete
    9. -

      అది యిదియే ను జిలేబీ
      మదమ్ము వెటకారమై ప్రమాదంబాయెన్
      సదనమ్మున నెల్లరు సి! య
      నెదరు వినవె పడతి ! మానిని! మదిరనయనా !

      Delete
    10. చాల మంచి సమోసాచారము ఇచ్చారు తాత గారు‌.

      Delete
  3. చాల మంచి వివరణ ఇచ్చారు శర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. neo2 December 2023 at 03:54
      వివరణ నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  4. కనులు నెత్తికెక్కితే మిన్ను కనపడాలి కదా!

    ReplyDelete
    Replies
    1. bonagiri2 December 2023 at 05:53
      పాయింటే సుమా!గర్వాంధులు,మదాంధులు అంటాం కాని వారు నిజంగా అంధులా? కాదుగా!గర్వంతో కనులు మూసుకుపోయాయంటే బుద్ధి అనే కన్ను మూసుకుపోయిందనుకుంటా. కనులు నెత్తి కెక్కడం అంటే గర్వం తలకెక్కడం అనుకుంటా! నాకుతోచింది చెప్పేసేను. మాస్టరేం చెబుతారో మరి.

      Delete