Monday 4 December 2023

ఓటమికన్నీ కారణాలే!

 ఓటమికన్నీ కారణాలే!


గెలుపుకంతా చుట్టాలేనంటారు. సరేలే! నేను పోటీ చెయ్యక, నిన్ను బలపరిచేనుగనక నెగ్గేవు దగ్గరనుంచి, గల్లీ లీడర్ నుంచి  జండా మోసిన కార్యకర్తదాకా, ఓటేసిన మారాజుదాకా అంతా చుట్టాలే! 


మరి ఓటమికన్నీ కారణాలే!

మొదటిది నోటివట్టం. కనపడే కారణాలు కొన్నే!!  నిజంగా వెతుక్కుంటే,   కనపడని కారణాలెన్నో!!!


అదేంటయ్యా! నిన్నటిదాక ఇదే నోటివట్టం కదా!   పనికొచ్చింది,నచ్చింది.  ఇప్పుడేమయింది, కొత్తగా?  

 నిన్నటిదాకా నోటివట్టాన్ని జనాలు మెచ్చేరు, నేడు నొచ్చేరు, అంతే తేడా!!!!!

అదేకదా కాలం కలసి రాకపోవడమంటే! అదే   విధి అంటేనూ!


8 comments:

  1. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    “గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్”

    గెలిచెతనొక్కరాష్ట్రమునుగింజుగలాటలపోరిపోరితాన్
    నిలిచెనుబీదరైతులకునీరుకరెంటువరాలనిచ్చిబొం
    దలనటుబెట్టవోటరులుతప్పుడుమాటలనమ్మి ఆగమై
    గెలిచినవాఁడు దుఃఖపడె గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్

    గాదిరాజు మధుసూదన రాజు

    ReplyDelete
    Replies
    1. GadirajuMadhusudanaRaju4 December 2023 at 14:16
      మా అమ్మ ఒక మాట చెబుతుండేవారు. "కేసు ఓడిపోయినవాడు కోర్టులోనే భోరున ఏడ్చేడు! గెలిచినవాడు ఇంట్లో పడి ఏడ్చేడు ఎందుకూ?" అడిగేవారు. అది గుర్తొచ్చింది.

      Delete
  2. గలగల కాంగిరేసు తెలగాణని గెల్చెను! బొక్కసమ్ములో
    కలదకొ దస్కమౌర తమకై పథకమ్ముల జల్ల జోరుగా?
    గెలిచినవాఁడు దుఃఖపడె; గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
    ఫలితము మంచిదాయెను! సభాభవనమ్మున నిద్ర బోవగాన్!

    :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi4 December 2023 at 18:02
      గొప్పగా చెబితివి జిలేబి.

      Delete
  3. తాతగారి మాటల్లో ఏదో సూక్షి ఉన్నట్టనిపిస్తోంది :)


    ReplyDelete
    Replies
    1. Zilebi5 December 2023 at 05:45
      చెప్పుకోండి చూద్దాం! :)

      Delete
  4. ఓడిపోయిన వారు కారణాలు వెతుక్కోవడం మామూలే, గెలిచిన వారు కారణాలు వెతుక్కుంటే మళ్ళీ గెలుస్తారు.

    ReplyDelete
    Replies

    1. bonagiri5 December 2023 at 10:24
      గెలుపును జీర్ణించుకోవడమంత తేలిగ్గాదండి. గెలిచినవారికి ఎందుకు గెలిచామన్న దానిని సమీక్షించుకోవాలన్న స్పృహ ఉండదండీ :)

      Delete