Wednesday 6 December 2023

పనసపండు కోసి పళ్ళెంలో పెడితే

పనసపండుకోసి పళ్ళెంలో పెడితే, తినడం చేతకానివాడు 

  దిక్కు దిక్కున చూసాడు.

***

పనసపండు కోసుకు తినడం అంత తేలికైన పనేం కాదు. పనసపండు కోసుకోడం తెలియాలి. దీనికి పదునైన కత్తి కావాలి. నూనె కావాలి. వాటిని సిద్ధం చేసుకోవాలి. నూనె లేకపోతే పండులో ఉన్న జిగురు చేతులకంటుకుపోతే కోసుకోడమే కష్టం. చేతులకి నూనె రాసుకోవాలి. కత్తికి నూనె రాయాలి. పండును తకిందులుగా నిలబెట్టి వెనకనుంచి నిలువుగా కోయాలి కొంచంలోతుగా, పై తొక్క దళసరిగా ఉంటుంది, అది తెగేదాకా కోయాలి. ఆలాగే నాలుగు పక్కలా కోయాలి. అప్పుడు  ముక్కలుగా గట్టిగా విరవాలి. లోపల ఉన్న బొడ్డును నిలువుగా కోయాలి. ఇప్పుడు ముక్కలొస్తాయి. తొనలప్పుడే దొరకవు. ముక్కని మిగిలిపోయిన బొడ్డు కోయాలి. ముక్కని విరవాలి. తొనలు పీచులో ఉంటాయి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఒక్కో తొనా పీకాలి,  తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులనున్న నూనె జిగట పోవాలంటే, కొంచంగా అంటిన జిగురుపోవాలంటే మరికొంచం నూనె పట్టించి చేతులు గుడ్డతో తుడుచుకుని ఆపైన సున్నిపిండితో చేతులు రుద్దుకోవాలి.


ఇంత బాధ పడక్కరలేక పనసపండు కోసి తొనలు పళ్ళెంలో పెట్టి తినమంటే దిక్కులు చూసినవాణ్ణేమంటారు? చేతకాని వాడు.

చేతకాని మొగుడికి చేష్టలెక్కువ. చెల్లని రూపాయికి గీత లెక్కువ

ఇంకొంచం మోటు సామెత చెబుతారు, వద్దు లెండి.

50 comments:

  1. హ్హ హ్హ హ్హ 😁.
    మా తండ్రిగారికి కృష్ణా జిల్లా నుంచి తూగోజి కు బదిలీ అయి కోనసీమకు వచ్చాం. నేను తూగోజి చూడడం అదే మొదటిసారి. ఒకరోజున నేను స్కూలు నుంచి వచ్చాక ఇంట్లో పనసపండు తొనలు ఇచ్చారు తినమని. నాకు అదీ మొదటిసారే (పనసపండు). వద్దన్నాను. అప్పుడు మా అమ్మగారు సరిగ్గా ఈ సామెతే చెప్పారు 😁 🙏. .

    తరువాత కాలంలో పనస తొనలకు, పనస కూరకు పెద్ద అభిమానిని అయిపోయాను లెండి 🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు6 December 2023 at 10:01
      పనసతొనలు కూడా తెలియనివాళ్ళుండచ్చండి. అందుకే ఈ సామెత పుట్టింది. :)

      Delete
  2. Replies

    1. విన్నకోట నరసింహా రావు6 December 2023 at 10:09
      పనసపొట్టు కూర! అబ్బో! పనసపొట్టు కొట్టుకోడమో పెద్దపని. ఇదందరికి చేతాకాదు. ఇక కూరొండుకోడమూ చేతాకావాల్సిందే! సరిగా వండుకున్న పనసపొట్టు కూర, నేతితోతింటే రంగనా రాజా...... ఇకజెప్పేరా! మంచినీళ్ళ చెంబు దగ్గర పెట్టుకోవాల్సిందే!

      Delete
  3. Replies
    1. Zilebi6 December 2023 at 12:36
      ౧.’నస’ యనునది తెనుగు భాషలోని ఏ భాషా భాగమునకు చెందినది? వివరించుము.
      నస గురించి నీకేమి తెలుయునో క్లుప్తముగా వివరించుము....5మా
      ౨. తండ్రి గరగర
      తల్లి పీచుపీచు
      బిడ్డలు రత్నమాణిక్యాలు.
      మనుమలు బొమ్మరాళ్ళు
      అనగానేమో వివరించుము............5మా

      Delete
    2. ఇవన్నీ మేము చెబితే మీరెందుకండీ తాతగారు ? :) ఇవన్నీ మీ ఇలాకాయే త్వరితముగా వివరించుడీ :(

      Delete
  4. ఇప్పటి యువత నోటి దగ్గర పెట్టినా తినడం లేదండి పనస తొనలు. విదేశీ ఫలాలే కావాలంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. కార్పొరేట్లు అలవాటు చేసిన దరిద్రాలు.

      Delete
    2. bonagiri6 December 2023 at 18:37
      భారతీయ ఫలాలు పనికిరానివనుకుంటున్నట్టుందండి. మనకున్నన్ని పళ్ళు మరే దేశంలోనూ ఉన్నట్టు లేదు. శీతకాలం ప్రారంభం నుంచి వేసవి వెళ్ళేదాకా అన్నీ పళ్ళే! తినాలిగాని. రేగు( జుజుబి), నేరేడు కూడా ఎండు పళ్ళు దొరుకుతున్నాయి.ఆన్ లైన్ తెప్పించాను, తినడానికి బాగున్నాయి.అలవాటు చెయ్యాలండి.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు6 December 2023 at 20:32
      పిల్లలేం తింటున్నారో చూసిన తల్లితండ్రులు తగ్గినట్టుందండి.కాకరకాయ కూర తినను అంటే ఏం రోగం? ప్రశ్నించేవారు. తిను బాగుంటుంది, తింటే ఆరోగ్యానికి మంచిది, చేదు కూడా తినాలి. తినకపోతే నీకివేళకి అన్నం పెట్టను. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ ని మించినది. అంతే!! ఇప్పుడుందా? లేదు. అదంతే!!!!

      Delete
  5. పనస అంటే గుర్తుకు వస్తోంది. మాచెల్లెళ్ళల్లో ఒకమ్మాయి సంగతి. ఆఅమ్మాయి బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక రైతు పనసపండు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆసమయంలో ముందు హాలులో తనొక్కతే ఉన్నట్లుంది. అతను పనసపండును తీసి హాలులో పెట్టగానే దాన్ని చూసి పెద్దగా కేకపెట్టింది. ఇంటిల్లిపాదీ పరుగెత్తుకొని హాల్లోకి వచ్చారు. అక్కడ గడగడా వణికిపోతున్న పిల్లా, తెల్లబోయి చూస్తున్న రైతూ కనిపించారు. ఏమయిందే అంటే మెల్లగా తెప్పరిల్లి పనసపండును చూపిందట. బహుశః దాని ఒంటినిండా ముళ్ళను చూసి ఆ పండు పరిమాణాన్ని చూసి దడుచుకుంది కాబోలు. ఈసంఘటన నాకు మాఅమ్మగారు చెబుతే తెలిసింది - అప్పటికే నేను హైదరాబాదుకు ఉద్యోగార్ధం వచ్చాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం6 December 2023 at 20:23
      తెలియని వయసు పిల్లంతే కదండీ!
      పాలకొల్లులో ఆదివారం సంతరోజు గుట్టలుగా ఉంటాయి, పనసపళ్ళు,లారీలకి ఎగుమతికి.లంకల్లోంచి పడవలమీద తెస్తారు.

      Delete
  6. తాతగారు

    అరికాలిలో బొబ్బ లాగ లేచి కాలూనితే నొప్పి.
    అదే తగ్గుతుందేమో అని చూస్తే ఊహూ ఓ పట్టాన వదిలెళ్లటములేదు.


    ఏదన్నా పరహిత హోమ్లీ వైద్యం చెబ్దురూ ప్లీజ్

    ReplyDelete
    Replies

    1. Zilebi9 December 2023 at 13:17
      ఎనిమిది పదులు నిండేయిగా! చిటకా వైద్యాల వయసెప్పుడో దాటిపోయింది. మంచి వైద్యుణ్ణి కలుసుకో!సింగపురంలో మంచి వైద్యమే ఉన్నట్లుంది, దీని కోసం ఇండియా రావక్కర్లేదు, కంగారు పడి! జాగర్త!! జరిగేదెలాగూ జరుగుతుంది, దాన్ని ఆపలేవు, మన ప్రయత్నం చేయాలంతే!

      Delete
    2. మాట దాటెయ్యడంలో_/ మ్యాటరు పోకడ మార్చెయ్యడంలో తాతగారికి‌ సరిలేరెవ్వరు ;)

      విషయానికి రండి హోమ్ రెమిడీ చెబ్దురూ .

      Delete
    3. Zilebi10 December 2023 at 09:35
      /మాట దాటెయ్యడంలో_/ మ్యాటరు పోకడ మార్చెయ్యడంలో తాతగారికి‌ సరిలేరెవ్వరు ;)/
      ఉన్నమాటంటే ఉలుకెక్కువంటారు, ఇదే!
      /విషయానికి రండి హోమ్ రెమిడీ చెబ్దురూ/ .
      అరికాలి బొబ్బకి చిట్కా వైద్యం తెలీదు.

      Delete
  7. అందరిపైనా అరికాలు మీద లేవడం తగ్గిస్తే ఇలా బొబ్బలు రావు 😁😁.
    =================
    పిండి కట్టు కట్టుకోండి “జిలేబి” గారు. ఆ బొబ్బ పగిలి ఉపశమనంగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. -

      అందరి పైనా నరికా
      లెందరి పైనో జిలేబులింకెందరి పై
      డెందంబారగ పద్యాల్
      కొందరి తోదోస్తి , కోరి కోరి జగడముల్

      Delete
    2. విన్నకోట నరసింహా రావు10 December 2023 at 17:35
      అరికాల్లో కురుపేయడం బహు అరుదు అనుకుంటున్నాను..నేనెప్పుడూ వినలేదు,చూడలేదు.
      ఇక డయాబెటిస్ ఉన్నవారు మెట్ఫార్మిన్ మందు దశాబ్దాలపాటు వాడుతుంటారు. దీనికున్న సైడ్ ఎఫెక్ట్స్ వెంట వెంటనేరావు. అరికాల్లో బొబ్బ, కనురెప్పల చివరకురుపు ఇలా చిత్రంగా సాగుతాయి. ఆలస్యం/ అలసత్వం కూడదు, అదేపోతుందిలే అనుకోడం అసలు కూడదు. చిట్కా వైద్యాలు వయసులో ఉండగా పని చేస్తాయి. వయసుడిగిన తరవాత ఇటువంటి వాటికి చిట్కా వైద్యాలు ప్రాణమీదకి తెస్తాయి, కారణం, వయసులో వ్యాధినిరోధక శక్తి వుంటుంది, అది వయసుతో ఉడిగిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి, తప్పదు. వైద్యుణ్ణి చూడటం తప్పదు. చెప్పడం నా విధి.అది చేసేను, ఆ తరవాత వారిష్టం.

      Delete
  8. “జిలేబి” గారు,
    ఒంటి కాలుపై లేవడం అన్నది సరైన పదప్రయోగం. మీరు అరికాలిలో బొబ్బ అంటూ బొబ్బలెడుతున్నారు కాబట్టి ఆ పదజాలాన్ని తదనుగుణంగా మార్చానన్నమాట 🙂.

    శర్మ గారు (11-Dec-2023 at 09:27) పైన వివరంగా చెప్పారుగా. ఆ రకంగా సాగిపొండి.

    ReplyDelete
  9. జిల్లేడాకొక్కటి శ్రీ
    జిల్లేబీజి ! సెగజూపి , చెలువుగ కప్పెయ్ ,
    మెల్లగ సాక్సును తొడిగెయ్ ,
    తల్లీ ! తమ కుపశమనము తప్పక కలుగున్ .

    (ఇది శ్రీశర్మగారు గతంలో చెప్పిందే సుమండీ)

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల11 December 2023 at 17:02
      రాజా సాబ్
      ఇదివరలో ఎప్పుడేనా చెప్పేనేమో నాకైతే గుర్తు లేదు. ఇప్పుడు చెప్పటం లేదు,ఆ వైద్యం చెప్పను. మీరు చెబితే అది మీ ఇష్టం, ఆవిడ ఇష్టం. సారూ! ఆవిడ ఇండియాలో లేదు. సింగపూర్ లో జిల్లేడాకు దొరుకునా? హైదరాబాదులోనే దొరికే సావకాశం లేదాయె. జిలేబి తొందరగా వైద్యుని సంప్రదించడం ఉత్తమోత్తమం. సుగరెంతుందో! పుండు పడితే తగ్గేనా? ఎన్ని చూసుకోవాలండి. జిల్లేడు పాలు చర్మానికి తగిలితే పుండు పడుతుంది.

      Delete
    2. నాకేమి తెలుసు వైద్యము
      శ్రీకృష్ణుని కీర్తి వొగుడు చేతన దక్కన్
      చేకొని యైటీ దాటిన
      రాకేందువదనకు , శర్మరమణులకు నతుల్ 🙏🙏🙏

      Delete
  10. ఆనందము , నంద బ్ర
    హ్మానందంబు , మురళీ రవానందము , కృ
    ష్ణానందము , రాధా రమ
    ణానందము , హరిముకుంద నయనానందమ్ .

    ReplyDelete
  11. వెంకట రాజారావు . లక్కాకుల11 December 2023 at 17:02
    వెంకట రాజారావు . లక్కాకుల11 December 2023 at 19:33
    వెంకట రాజారావు . లక్కాకుల11 December 2023 at 21:18
    ముందు కామెంట్ లో నన్ను ప్రస్తావించారు గనక కొంత వివరంగా చెప్పాల్సి వచ్చింది, తప్పించి మీకు వైద్యం తెలియదని అనను, అనలేను. మీరు నా మాట మరొకలా అర్ధం చేసుకోడానికి సావకాశం కలగిందేమో, క్షంతవ్యుడిని, మన్నించండి.

    ReplyDelete
  12. తమరు పెద్దలు , మన్నించాలి .
    నా పద్యంలో వ్యంజనం లేదు .
    అసలు నాకు వ్యంగ్యంగా మాటాడటం రాదు .
    ఉన్నది ఉన్నట్లు అనడం సహజాతం .
    ఈ అవగుణం వల్ల , చాల ఇబ్బంది పడుతున్నాను .
    తమరో , మరెవరో ఈ చిట్్కా వైద్యం సూచించి న అంశం స్ఫరణకొచ్చింది . అంతే . నిజంగా నాకు వైద్యం తెలియదు .
    మరొక పరి మన్నింపు వేడుకొంటున్నాను .


    అను నిత్యము పరమాత్మను
    మనసున ధ్యానించు రతులు , మహదానందం
    బొనరగ బొందుదురు , నిజము ,
    జనులకు ఇది దప్ప , దారి , చన , నేది ? కనన్ ?

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల12 December 2023 at 09:30
      రాజావారు
      అర్ధం చేసుకోవడం లో ఇద్దరమూ పొరబడినట్టే ఉన్నమనుకుంటా. మన్నింపులు చాలిద్దాం. నమస్కారం.
      ఇద్దరమూ జిలేబి మంచికోరి చెప్పబోతే మన మధ్య తగవు పెట్టాలనుకునే జిలేబికి మంచి జరగాలనుకోవడం అవివేకమనుకుంటాను. ఏమైన సాయం చేయడం మన సహజగుణం అందుకే అలా ప్రతిస్పందించాం. జిలేబి సహజగుణం బయట పెట్టుకుంది మరో సారి అంతే!నమస్కారం.

      Delete
  13. సెగజూపి ...


    సెగ ఆల్ రెడీ మొదలయినట్టుంది :)


    ReplyDelete
    Replies
    1. jilebi12 December 2023 at 09:35
      నీ సహజగుణం బయట పెట్టుకున్నావు మరోసారి.సహజగుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి. కాలుని, కురుపుని ఏం చేసుకుంటావో చేసుకో! కాలు నీది, కురుపునీది. కాలు నెత్తిన పెట్టుకు ఊరేగు. నీ చిత్తం.వైద్యుని దగ్గరకెళ్ళకు. ఇంట్లోనే కూచో! బాధపడు, వద్దన్నవారెవరు?

      Delete
  14. తమలాగా , పెద్దలతో
    నెమకుట లెరుగను , జిలేబి ! నియమావళితో
    నమముల 🙏 నర్పింతు , సెగల
    చిమ చిమ లూదంగ వలదు , చేతులు 🙏 మ్రోడ్తున్ .

    ReplyDelete
  15. రాజారావు గారు,
    “జిలేబి” గారి కెలుకుడు మాటలకు నొచ్చుకుంటుంటే వారు మరింత రెచ్చిపోతారు. కాబట్టి వదిలెయ్యడం మంచిది. సీనియర్ బ్లాగర్ అయిన మీకు తెలియనిదేముంది.

    ReplyDelete
  16. నరసింహరావు గారూ !
    అరయంగా తెలియదేమి ? ఐనను నొకచో ,
    పొరబడుటలు అలవడె , నిక ,
    పొరబాటున కూడ అటుల పోను , మహాత్మా !

    ReplyDelete
  17. హమ్మయ్య ! పెద్దలంతా జమిలి గా కలిసి ఏక త్రాటి పై వచ్చినారు :) సెగ సెహబాసె :)



    జిలేబి

    ReplyDelete
  18. కృష్ణ ! వాసుదేవ ! కేశవా ! అచ్యుతా !
    మాధవా ! ముకుంద ! మదన జనక !
    నంద గోపబాల ! నగధర ! గోవింద !
    నీలమేఘ వర్ణ ! నీవె దిక్కు 🙏 .

    ReplyDelete
    Replies
    1. -

      మదనజనక !నగధర! నీ
      వె దిక్కు!గోవింద! నీల విషధపు వర్ణా!
      మధురిప! ముకుంద! కృష్ణా!
      సుదర్శనా! వాసుదేవ! సూరి! గిరిధరా!


      జిలేబి

      Delete
  19. పరమోదార ! పరాత్పర !
    పరమాత్మా ! పరమపురుష ! వందే 🙏 కృష్ణా !
    హరి నారాయణ ! కరుణా
    కర ! శరణు తవ చరణముల కంజలి కృష్ణా !

    ReplyDelete
    Replies
    1. పరమపురుష! శరణు! పరమాత్మ! తవ చర
      ణముల కంజలిడుదు ! నగధర! హరి!
      పరమ పావనా! కృపాసింధు! రుక్మిణీ
      వల్లభ! వృషనాశ! వ్రజ కిశోర !

      Delete
  20. అచ్యుతా ! అనంతా ! కేశవా ! హరీ ! ము
    కుంద ! రథము నీవే , పూన్చు గుఱ్ఱములును
    నీవె , రథియు నీవే , సారధీవె , సర్వ
    మీవె , వేరు వేరను భ్రమ వోవ జేతు .

    ReplyDelete
    Replies
    1. -

      వారున్వీరవియివియున్
      వేరను భ్రమ వోవ జేతు వేడెద కృష్ణా!
      సారధి, గుర్రంబారథ
      మా రథియును నీవె! అచ్యుతా! కంబుధరా!

      జిలేబి

      Delete

  21. పరి పరి నిను కీర్తింతుము
    పరమాత్మా ! కృష్ణ ! కృష్ణ ! వర మిమ్ము హరీ !
    చిరు దివ్వెను వెలిగించుము
    నిరతము నీ నామ జపము నేమము గలుగన్

    ReplyDelete
    Replies
    1. -

      ఈ బ్లాగు పద్యాలతో హైజాకయిపోతున్నది :)

      పనస తొనలకింత పవరా :)

      పరిపరి నిను పరాత్పర ! ప్రభు! కొలిచెద
      మయ్య!చిరు దివ్వె మదిలోన మాకు వెలుగు
      నొసగ వరమీయ వయ్య మనోజ్వలమ్ము
      గా నదే నిన్ను జేర ప్రకటనమవగ


      జిలేబి

      Delete
  22. అనితర సాధ్యము కృష్ణా !
    కనికట్టున సకల జగతి కట్టిపడేసే
    ఘనుడవు , మురళీ రవమున
    మొనసి చరాచరము వడెడు , మోహము నందున్ .

    ReplyDelete
  23. కృష్ణోజ్జ్వలమై వెలిగెను ,
    విష్ణుమయము గాగ , బ్లాగు , విమల వచో వ
    ర్ధిష్ణువయె , జిలేబియు శ్రీ
    కృష్ణుని మాయం బడియెను , కీర్తించె గడున్ .

    ReplyDelete
    Replies
    1. -

      మాయంబడని జనులెవరు ?
      ఆ యవనారి కరుణా కటాక్షములకు జే
      గీయంబగు మూర్తికి ? జగ
      మేయాతని లీల ప్రాణమే భిక్ష కదా!


      జిలేబి

      Delete

  24. రాజావారు,
    జిలేబి.

    13.12.2023 అనగా నిన్నటి రోజు మారగశిర మాస ప్రారంభం. మాధవునికి ప్రీతికరమైన నెల. మొదటిరోజు మాధవుని గూర్చి పద్యాల జుగల్బందీ నా బ్లాగులో సంతోషదాయకం.అనుకుంటే జరిగేది కాదు. అనుకోకుండా అలా ఆశువుగా జరిగిపోయింది. ఇద్దరికి ధన్యవాదాలు
    వందనాలు.

    వందనము రఘునందన,భక్తచందనా. రామా! వందనము రఘునందనా!!

    ReplyDelete