Sunday 31 December 2023

మందున్నది మంచి విందున్నది.

2024ఆంగ్ల నూతన వత్సర ప్రారంభదిన ముoదస్తు శుభకామనలతో

మందున్నది మంచి విందున్నది.


 రారోయి బావా! మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.

మందున్నది మంచి విందున్నది.


నువ్వు రానీకి బుల్లెట్టు బండున్నది

మనం కూచోను ఫామ్ హవుజ్ ల చోటున్నది.

రావోయ్ బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


నువు తాగనీకి పోతుతాడి కల్లున్నది.

నంజుకోను దోర దోర చికినున్నది

రావోయి బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


కాదు కాదంటె పాతపాత చిగురున్నది. 

అందులోకి  చీకు ముక్కున్నది.

రావోయి మా ఇంటికి బావా

మందున్నది మంచి విందున్నది.


నీకు నచ్చకుంటె కంపెనీ సరుకున్నది.

అందులోకి వర్రవర్ర కాజున్నది.

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది. 


లేదు కాదంటె సీమ సరుకున్నది.

నంజుకోను సీమకోడి ఇగురున్నది.

రావోయి  బావా  మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నీకాకలేస్తె బాస్మతి   వైట్ రైసున్నది.

అందులోకి  పొట్టేలుతల కూరున్నది.

 రావోయి బావా మాఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


ఆపైన  మంచి ఉలవచారున్నది

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


ఆపైన అసలు పాల పెరుగున్నది.

 చీక్కోను మాగాయి టెంకున్నది.

రావోయి బావా మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నువు పడుకోను డబల్ కాట్ల బెడ్డున్నది

దానితోడు, ఏ.సి  మిసనున్నయి. 

రావోయి బావా  మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.

(రావోయి మావా మా ఇంటికి పాట పేరడీ)


ఈపాటికి చాలామందికి ఇలా ఆహ్వానాలొచ్చే ఉంటాయి, నూతన సంవత్సరం సందర్భంగా!

ఇది ప్రమోదం అయ్యేలా లేదు. కరోనా ప్రమాదం చెప్పి చెప్పిరాదు. సింగపూర్ లో XBB వేరియంట్ బలంగా వ్యాపిస్తోందిట. మూలమైన చైనాలో గత మూడు నెలలుగా ఇది నడుస్తున్నట్టు వార్తలు. లక్షణాలు పిల్లని ఎక్కువగా సోకుతున్నట్టు, న్యూమోనియా ఆక్రమించి ప్రాణాలు తీస్తున్నట్టు వార్తలు.


ఇక మనదేశంలో ఇది ఇంకా అడుగుపెట్టలేదు గాని, JN1 అనే వేరియంటు కేరళా,మహారాష్ట్ర, గోవాలలో ఉన్నట్టు వార్త. లక్షణాలు దగ్గు,రొంప,జ్వరం,న్యూమోనియా...ఇలా నడుస్తున్నట్టు వార్తలున్నాయి. మా జిల్లాలో మూడు కేస్ లున్నట్టు, ఒకటి పండు ముసలి,మరొకటి చిన్ని పాప,మరొకటి మధ్యవయసు. ఈ వార్త ధృవీకరింపబడలేదు. మేం మాత్రం ము.మూ గుడ్డలు కట్టుకునే తిరుగుతున్నాం. పది మందిలోకి పోవటం లేదు.  ఆరోగ్యం జాగర్త! బతికియుండిన సుఖములబడయవచ్చు.



మరో బావయ్య ఇలా అంటున్నాడు చిత్తగించండి.

 వద్దురా బావయ్య!

ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పెద్దోళ్ళింటిని తఱిచి చూచేవేళ

పసిపాలను కరోన పట్టుకెళ్ళేవేళ
వద్దురా! వద్దురా!!

ఈపొద్దు మందు మాటొద్దురా

అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పూడ్చిన చిగురేమో పండని వేళాయె
చీకు
లకి  నీ చెల్లి చెల్లు  
చెప్పినవేళ

వద్దురా! వద్దురా!! బావయ్య.

ఈపొద్దు మందు మాటొద్దురా

చుట్టాలందరు గాలిగాళ్ళురా!
మనమీద కొండెములు మళ్ళీ చెప్పేరు
వద్దురా! వద్దురా బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

కంపెనీ మందంటే కడు గోలరా
మొదటి రౌండ్ కే వాంతులొచ్చేను.
వద్దురా! వద్దురా! బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

ఆడుకోవలనన్న పాడుకోవలెనన్న
అన్నిట, సెల్లు చాలురా
వద్దురా! వద్దురా! బావయ్య

ఈపొద్దు మందు మాటొద్దురా

వద్దురా కన్నయ్యా! పాటకి పేరడీ! బండి వారి బ్లాగులో కామెంటుగా ఆశువుగా చెప్పినది, కొన్ని కొన్ని మార్పులతో.)

9 comments:

  1. డిసెంబర్ 31 కి అలవాటైన (దిగుమతి) ఆనవాయితీకు తగిన పాట కట్టారు శర్మ గారు 👌🥃🥃.

    దానికి విరుద్ధంగా ఆ వైపు పోవద్దని కూడా చెప్పారనుకోండి ☝️.

    ఆవకాయతో (లేదా పైన పాటలో చెప్పినట్లు మాగాయ 😛) మజ్జిగన్నం తిని పెందలాడే పడుకోవడం ఉత్తమం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు31 December 2023 at 09:56
      రెండు వందల పైబడిన సంవత్సరాల బానిస అలవాటు అంతతొందరగా పోదుగదండీ

      ఆంగ్ల నూతనవత్సర శుభకామనలు.

      Delete
  2. కొత్త వత్సరం రాకూడదు ఇలా అందరినీ భయపెట్టించేయడమే ? :)

    ReplyDelete
  3. రావో యి బావ! యింటికి
    కోవా జాంగ్రీ జిలేబి కుష్కా బిర్యా
    నీ వైనూ చిక్కెను క
    ర్రీ వండా నీకటంచు రేతిరి నీదే

    ReplyDelete
    Replies
    1. Zilebi31 December 2023 at 10:01
      Zilebi31 December 2023 at 11:57
      ఆంగ్ల నూతనవత్సర శుభకామనలు.

      Delete
  4. నవ వసంతోత్సవమ్మును , నయన శుభగ
    ముగ జరుపవలె గాని , ఏమనగ వచ్చు
    నిట్లు ? , మందు నొద్దంటూనె నీళ్ళు నమిలె
    నొకరు , చిక్కెను కర్రీల నొండె నొకరు .

    ReplyDelete
  5. పరమాత్మ , పరంధాముడు
    పురుషోత్తమ , వా‌సుదేవ , మురళీధరు డీ
    ధరణిని , నవ వత్సరమున
    కరుణామయ దృక్కుల నిడి , గాచెడి గాతన్ .
    ( నూతన సంవత్సర శుభాకాంక్షలతో )

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల31 December 2023 at 14:56
      వెంకట రాజారావు . లక్కాకుల31 December 2023 at 19:55
      వసంతం అప్పుడే ఎక్కడండీ! ఇదింకా హేమంతమే కదా!

      రామరామ జయ రాజారాం
      రామరామ జయ సీతారాం
      అతులిత గుణగణ భూషణ రాం.

      ఆంగ్ల నూతనవత్సర శుభకామనలు.

      Delete
    2. చాలా చక్కగా వివరించారు.చదువుతున్నతసేపు మనస్సు ఆనందం తో పరవశించి పోయింది.ధన్యవాదములు

      Delete