Friday, 22 December 2023

నోట్లో మెతుకు గూట్లో దీపం.

 నోట్లో మెతుకు గూట్లో దీపం.


ఇది ఒక నానుడి. నానుడి,జాతీయం,సామెత అనేవన్నీ జీవితం నుంచి పుట్టిన అనుభవాలు. వీటిని తెలుసుకుంటే పాతకాలంలో మన జీవన విధానం, స్త్రీ పురుషుల ప్రవర్తన,ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ఇవీ అవీ అనేం, జీవితమంతా నానుడులలోనే ఉంది.కొత్త వింత పాతరోత అనుకునేవారినేమనగలం. చిత్రమేంటంటే కొత్తవింత పాతరోత అన్నది కూడా ఒక నానుడే :) ఈ నానుడులలో పాత జీవితమేకాదు నేటి జీవిత సత్యాలు కూడా బోధపడతాయి. మరోమాట సంస్కృతి అంటే ఏమిటి? 


ఇంతకీ నోట్లో మెతుకు గూట్లో దీపం ఏంటనికదా! పూరిల్లైనా, పెంకూటిల్లైనా,మేడైనా ఆ ఇంటి అన్ని గదులలోనూ దీపం గూడు ఉండేది. ఇంటి బయట ప్రహారీకి గమ్మానికి ఇరుపక్కలా రెండు దీపం గూళ్ళుండేవి. పాత కాలపు ఇళ్ళలో వీటిని చూడచ్చు, నేటికిన్నీ.  కిరసనాయిల్ దీపాలు లేనికాలంలో ఆముదం దీపాలు వెలిగించుకునేవారు. ఆముదం ఒక మట్టి ప్రమిదలో పోసి ఆముదంలో పగలంతా నానబెట్టిన కొత్త గుడ్డముక్కని వత్తిగా వాడేవారు. ఇది రాత్రంతా వెలిగి ఉదయానికి మలిగేది. సాయంత్రం దీపాలు వెలిగించుకోడమొక పనిగా ఉండేదంటే నమ్మలేరు. ఆ తరవాత కాలంలో కిరసనాయిలు దీపాలొచ్చినా అవీ గూళ్ళలోనే ఉండేవి. ఆ తరవాత కాలంలో హరికేన్ లాంతర్లు, చిన్న చిమ్నీ బుడ్లు,   వీటిని కోడిగుడ్డు లాంతర్లనేవారు,  వాడుకలోకొచ్చాయి.   వీటిని సీనారేకుతో చేసేవారు, ఆ తరవాత కాలంలో గాజు బుడ్లొచ్చాయి. ఇప్పటికీ ఇవి తీర్థాలలో దొరుకుతున్నట్టున్నాయి!   ఈ చిన్న దీపాల బుడ్లు రెండు గదుల్లోకి కనపడేలా ద్వారబంధానికి ఒక మేకు కొట్టి దీన్ని దానికి తగిలించేవారు. వీటికి ఇలాయి బుడ్లని పేరు.  బయట అవసరానికి హరికేన్ లాంతర్లు వాడేవారు.  కలిగినవారు పెట్రొమాక్స్ లైట్లు వెలిగించుకునేవారు. కలిగినవారింటిలో దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకంగా ఒకరుండేవారంటే నమ్మలేరు. ఇది ఒక కార్యక్రమం, దగ్గరగా మూడు గంటలేనా కాలం పట్టేది.   అన్ని   గదుల్లో దీపాలూ తెచ్చుకోవాలి, ఒకచోటపెట్టాలి, దీపాలగది అని ఒకటి వేరుగా ఉండేది, అందులోనే ఈ పనంతా. అన్ని దీపాల చిమ్నీలు తీసేసి వేరుగా పెట్టి ఉంచి ఒక్కొదానినీ ముగ్గు వేసి, గుడ్డతో దీపాన్ని, చిమ్నీనిని ఉన్న మసి  తుడిచి, ఆతరవాత ఇలాయి బుడ్లలో కిరసనాయిలు పూర్తిగా నింపి, హరికేన్ లాంతర్లని కూడా అలాగే చేసి, వత్తి మలిపి పెట్టుకుని, బర్నర్తో వత్తి పైకి కిందకి కదులుతోందో లేదో చూచుకుని, చివరగా దీపం వెలిగించి, అన్నిగదుల్లోనూ పెట్టాలి, ఇదో పెద్దపనే, నాటిరోజుల్లో.    ఎర్రకిరసనాయిలు,తెల్ల కిరసనాయిలని రెండు ఉండేవి. ఎర్రకిరసనాయిలు గవర్నమెంటు ఇచ్చేది. తెల్ల కిరసనాయిలు మార్కెట్ రేటు. కిరసనాయిలు శేర్ల లెక్కని కొలిచి అమ్మేవారు. శేరు కిరసనాయిలు ధర ఒక అణా అనిగుర్తు, లీలగా.


నానుడి గురించి చెబుతానని దీపాలగురించి చెబుతావేం :) నోట్లో మెతుకు అంటే సాయంత్రం బువ్వ తినడం.సాయంత్రభోజనం దీపాలు పెట్టేకా చేసేవారు కాదు. సూర్యాస్తమయం లోగా భోజనాలయిపోవాలి.

 అసుర సంధ్యలో భోజనం చేయకూడదు. ముందుగా ముసలి  వారికి, పిల్లలకి సాయంత్ర బోజనాలు పెట్టేసి ఆ తరవాత అత్తగారు,  మామగారు,ఆలుమగలు,   ఇలా అంతాభోజనాలు కానిచ్చేసిన తరవాత దీపాలు వెలిగించేవారు. రాత్రి భోజనాలు దీపాలు వెలిగించకమునుపే అనగా సూర్యాస్తమయం లోపే చేయాలని చెప్పడానికే ఈ నానుడి, నోట్లో మెతుకు గూట్లో దీపం అనే నానుడిపుట్టింది. నేటికాలంలో ఉదయం ఫలహారం అంటే పదిగంటలకి, మధ్యాహ్న భోజనమంటే మూడు గంటలకి, రాత్రి భోజనమటే పన్నెండు తరవాత. కాలం మారిందా? కాలం   మారలేదు   , అలవాట్లు మారాయి. 


నూరు పనులున్నా భోజనం ఆలస్యం చెయ్యకు, వెయ్యి పనులున్నా స్నానం ఆలస్యం చెయ్యద్దని ఆచార్యచణకుని మాట.    


54 comments:

  1. హేవిటో ఈ పాతకాలపు జమానా వారి బిరీన బువ్వ తినేసి తొంగేయని ఒకటే ఓయబ్బో ఉబోసలు!

    హాయిగా అన్నం నముల్తూ ఓ క్రైం సినేమా నో లేకుంటే అత్తాకోడళ్ల తగువు మెగా సీరియలో చూసేసుకుంటూ భోజనం చేయకుండా ఇలా సన్ సెట్ కి ముందే బజ్జో అంటారేమిటో !


    అంతా ఓల్డ్ మేళము


    ఎవర్ యంగ్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “సన్ సెట్ కి ముందే బజ్జో” అనలా.
      చీకటి పడక ముందే భోజనాలు పూర్తి చెయ్యమని అన్నారు. పురుగు, పుట్ర వస్తే చీకట్లో కష్టమని ఆ అలవాటు పెట్టారని అనుకుంటున్నాను.

      Delete
    2. విన్నకోట నరసింహా రావు22 December 2023 at 14:58
      సూర్యుడుండగానే భోజనాలు చేయమని, పడుకోమని కాదు. అన్ని జంతువులు,పక్షులు సూర్యాస్తమయ,సూర్యోదయాల మధ్య ఆహారం తీసుకోవు. ఇది ఆరోగ్య సూత్రం, పాతకాలపువారికి తెలిసినది, ఆచరించినదిన్నీ. ఆధునిక మానవుడే సూర్యాస్తమయం తరవాత కూడా ఆహారం తీసుకునేది.

      పేడతో అలికిన ఇంట్లోకి విషపుపురుగులు చేరవు.

      Delete
    3. Zilebi22 December 2023 at 09:49
      ఇలా అని చెప్పేను తప్పించి,ఉబోస చేయలేదు. నువ్వు చెప్పినట్టే జరుగుతోంది లే బుజ్జమ్మా!

      Delete
    4. ఓ యబ్బో వినరా వారు
      తాతగార్ని ఓ మాటంటే చాలు వెంటనే ఠామ్మని వెనకేసు కొచ్చేస్తారు :)

      పర్ సపోజ్ ఆ లైఫ్ డేస్ లకు వెళితే మీరివ్వాళ బతికి బట్టకట్టగలుగుతారా అంట ?



      నారదా
      జిలేబి

      Delete
    5. Zilebi22 December 2023 at 19:03
      నీకు కావల్సింది దెబ్బలాట...అలాగే ఉండిపో :)
      ఈ రోజుల్లో అలా ఊంటే బతకగరా? మెక్సికోలో అనుకుంటా. వేదగ్రామం ఉంది. వెతుక్కుని చూచుకో, వీలుంటే అక్కడికిపో! అక్కడికిపోగలిగితే బతుకు తెల్లవారినట్టే, ఇక్కడమాత్రం బతకలేమన్నది నిజం.
      విన్నకోట సారూ!
      జిలేబి యతికుతం మనిషి ఏమనుకోవద్దూ

      Delete
    6. -
      ఇక్కడమాత్రం బతకలేమన్నది నిజం
      ...

      అంత కోపంలో కూడా నిజాన్ని ఒప్పుకున్నారు చూసారా మరి :)



      Delete
    7. Zilebi23 December 2023 at 09:06
      నాకు కోపం ఎప్పుడూ లేదు. ఇప్పుడు అలా బతకలేమన్నది పచ్చి నిజం. ఒప్పుకోవడానికేం. ఇలా ఉండేది జీవితం అని చెప్పడానికే! గడచి వచ్చిన కాలాన్ని గుర్తు చేసుకోడం తప్పించి మరేం లేదు. జీవితం లో ఇది కూడా ఒక అవతారం గనక ఎక్కువ గుర్తుండిపోయింది. పెట్రోమాక్స్ లైట్ వెలిగించడం దాకా!

      Delete
    8. నాకు కోపం ఎప్పుడూ లేదు. ..

      నిజమేనంటారా ?
      సత్తిబాబునడుగుదామా ? :)


      Delete
    9. Zilebi23 December 2023 at 09:42
      సముఖంలో రాయబారమెందుకంట?
      ఇదే తడికి రాయబారమంటే :)
      తడికి రాయబారం మీద అల్లు రామలింగయ్య మీద మంచి పాటుంది, చెప్పరాదూ! :)

      Delete
    10. सत्तिबाबु नडुगुतामा अम्टे माट जवदाटेस्तुन्नारे ?


      Delete
    11. “మాట జవదాటెయ్యడం” కాదు, “జిలేబి” గారు.
      “దాటెయ్యడం” అంటే చాలు.

      Delete
    12. आ "जव" मिम्मल्नि रंगंलो दिंपडानिकि :)

      Delete
    13. Zilebi23 December 2023 at 12:01
      Zilebi23 December 2023 at 12:53
      తింగరిబుచ్చి పనులంటే ఇవే సుమా :)

      Delete
  2. సుగుణాభి ' రాము ' డనినా ,
    జగద్గురుడు ' కృష్ణు ' డనుచు, సరి మ్రొక్కిన , ప
    న్నగ భూషణు నీశ్వరు నె
    న్నగ ' దేవుం ' డనినను , పరమాత్మా ! నీవే .

    ReplyDelete
    Replies
    1. -
      ప్రస్తావించిన టపా అంశానికి ప్రత్యక్ష సంబంధంగల వ్యాఖ్యలు ,మాత్రమే వేయవలెను :)


      రాము డనినా జగద్గురు డనిన కృష్ణు
      డనుచు సరి మ్రొక్కినన్ పన్నగంపు భూష
      ణుడని నా దేవుడనుచు ప్రణుతియు చేయ
      నీవె నన్నియు పరమాత్మ నిక్కమిదియె!



      జిలేబి

      Delete
    2. Zilebi22 December 2023 at 14:15
      /ప్రస్తావించిన టపా అంశానికి ప్రత్యక్ష సంబంధంగల వ్యాఖ్యలు ,మాత్రమే వేయవలెను :) /
      ఎక్కణ్ణించి కొట్టుకొచ్చావ్ :)
      సర్వాంతర్యామికి ఒక రూపమా? అనేక రూపాలు. అనేక బాహూదరవక్త్ర నేత్రం....

      Delete

    3. వెంకట రాజారావు . లక్కాకుల22 December 2023 at 12:48
      నిర్వికార నిరంజనుడు.

      Delete
  3. అవును శర్మ గారు. ఆ రోజుల్లో ఇళ్ళల్లో సాయంత్రం దీపాలు వెలిగించడం ఒక ఆసక్తికరమైన ప్రక్రియ. దానిని మీరు విపులంగా వర్ణించారు. ముగ్గు పిండితో తుడుస్తున్నప్పుడు ఆ గాజు చిమ్నీ కొండొకచో (అరుదు గానే అనుకోండి) చేతిలో నుంచి జారి కిందపడి ముక్కలవడం కూడా జరుగుతుండేది.

    పెట్రోమాక్స్ లైట్ వైభవం చెప్పనక్కర లేదనుకోండి, కానీ దానికి చేసే చాకిరీ కూడా అలాగే ఉండేది. నేను చూడలేదు గానీ ఆ లైటు ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉందని అనేవారు.

    జనాల కోసం ప్రభుత్వం వారు వీధుల్లో ఏర్పాటు చేసిన లాంతరు స్తంభాలు కూడా ఉండేవిగా అక్కడక్కడ.
    మా ఇంటికి పది పదిహేను గజాల దూరంలోనే ఒక లాంతరు స్తంభం ఉండేది. సాయంత్రం ఒక వ్యక్తి నిచ్చెన మోసుకుంటూ వచ్చి, లాంతరు స్తంభం మీదకు ఎక్కి, లాంతరు శుభ్రం చేసి వెలిగించి, దిగి, తరువాత వెలిగించాల్సిన లాంతరు స్తంభం వద్దకు నడుస్తూ వెళ్ళేవాడు. ఆ ప్రక్రియ అంతా ఆ లాంతరు స్తంభం దగ్గర నిలబడి చూస్తుండేవాడిని, అదో సరదా.(నాకప్పుడు ఏడెనిమిదేళ్ళు లెండి). ఆ ఉద్యోగిని మషాల్చీ అనేవారనుకుంటాను.

    ఆముదపు దీపాల కాలం నుంచి ఈ నాడు రిమోట్ కంట్రోల్ తో వెలిగే లైట్ల వరకు పురోగమించింది ప్రపంచం. అంతా విష్ణుమాయ.

    ReplyDelete
    Replies
    1. ఆహా వినరా వారు నోస్టాల్జియా డేస్ కి వెళ్ళిపోయారు :)


      Delete
    2. విన్నకోట నరసింహా రావు22 December 2023 at 16:19
      ముగ్గు కూడా (షెల్)ముగ్గు, పిండి ముగ్గు కాదు. పెట్రోమాక్స్ లైట్ దినదిన గండమే, ఆరోజుల్లోనే మేంటిలు చాలా ఖరీదు. అది రాలిపోకుండా, దాన్ని బయటకుతీసి పెట్టి, అప్పుడు గ్లాస్ తీసి తుడిచి, పిన్ను సరిచూచి అపై కిరోసిన్ పోసి, గాలికొట్టి ఇంత చాకిరి చెయ్యాలి. కిరొసిన్ ఎక్కువ తక్కువలు పోయకూడదు. గాలి కొట్టడం, వెలిగించడం, పెద్ద పనే! ఆ తరవాత మధ్యమధ్యలో గాలికొట్టాలి.. చికాకు పనే! పేలుతుందని భయపెట్టేవారనుకుంటా, దగ్గరకు రాకుండేందుకు..
      వీధి దీపాలు తెలియవు, మాఊరు వీధి దీపాలు పెట్టుకునే స్థాయిది కాదు. ఆ తరవాత వలస(దత్తత) వచ్చిన ఊళ్ళో కరంటు దీపాలొచ్చేసేయి...:)

      కిరోసిన్ కొనలేక, చాలామంది ఆముదపు దీపాలతోనే గడిపే వారు, నేను ఎరిగినదే!

      మార్పు సహజం కదండీ!

      Delete
    3. sarma23 December 2023 at 09:09
      జీవితం లో ఎన్ని అనుభవాలు,ఎన్ని అవతారాలు, అలా గడిచిపోయిందంతే. నమస్కారం.

      Delete
    4. శర్మ గారు,
      నా ఉద్దేశం ముగ్గు (షెల్) అనే. దాన్నే కొన్నిచోట్ల / కొందరు వాడుకలో ముగ్గు పిండి అనేవారు (బియ్యప్పిండితో పెట్టే ముగ్గు కాదు). అమ్మటానికి వచ్చినతను కూడా ముగ్గు పిండండి, ముగ్గు పిండి అని అరుచుకుంటూ వెళ్ళేవాడు.

      అదేమిటి సర్, వీధి దీపాలు లేకపోవడం ఏమిటి? కరెంటు లేని గ్రామాల్లో బ్రిటిష్ వాడి రోజుల్నించే లాంతరు స్తంభాలుండేవిట కదా (అని పెద్దలు అంటుండేవారు)? నేను ఉదహరించిన ఊరు కూడా మేం కొంతకాలం నివసించిన చిన్న గ్రామమే.

      Delete

    5. విన్నకోట నరసింహా రావు23 December 2023 at 11:00
      అవునండి, మరచాను. గుల్లముగ్గో అంటూ అరుచుకుంటూ పోయేవారు,వెనకాల బండి వచ్చేది. సున్నపు గుల్ల,ముగ్గు అమ్మకానికొచ్చే రోజులివే, అప్పటి రోజుల్లో సుమా :)

      పల్లెలలో వీధి దీపాలు ఉత్తి మాటేనండి. పంచాయితీ దగ్గర సొమ్ములుంటేనే వీధిదీపాలు.

      Delete
    6. సున్నపు గుల్లలు ఇప్పుడు దొరుకుతున్నాయాండి? గోడలకు వెల్ల వెయ్యడానికి వాడేవారు. రసాయనాల పెయింట్ కంటే బాగుండేది.

      Delete
    7. bonagiri23 December 2023 at 13:45
      సున్నపుగుల్ల వీధిలోకి అమ్మకానికి రావటం లేదండి.
      నలభై ఏళ్ళకితం ఇల్లు కట్టినపుడు మొదటగా గుల్లపోయించుకుని, ఉడకబెట్టి వేయించాను. ఆ తరవాత ఇల్లాలు
      దొడ్లో రెండు సున్నపుకుండలు పాతడం,గుల్లపోయించుకోడం, వేడినీళ్ళు కాచడం, గుల్ల కుండలోపోసి వేడి నీళ్ళుపోస్తే బుసబుసాపొంగితే మీద పడకుండా కర్రతో తిప్పడం, ఇంత చాకిరీ ప్రతి రెండేళ్ళకోసారిచేయడం, పనివాళ్ళతో వేగడం... అనడంతో షాపునుంచి వైట్ సిమెంట్ తెప్పించి వేయించేసాను. ఆ తరవాత రంగులొచ్చాయనుకోండి.
      సున్నపుగుల్ల దొరకడం లేదండి. మా వూరుకి ద్వారపూడికి మధ్య కాలవగట్టున ఒక సున్నపుగుల్లబట్టీ వెలిసింది పాతికేళ్ళకితం, అక్కడే పక్క ఇల్లు కట్టేసేడు కూడా ఆ తరవాత. గుల్లకాల్చి సున్నం తయారుచేసి బస్తాల్లోనింపి,(వేల్యూ ఏడెడ్ )షాపులకిచ్చేస్తున్నారు. అక్కడ దొరుకుతోందండి,ఇంకా. ఇంక ముందేమో!!

      Delete
  4. ముక్కోటి దేవత , లొదిగి
    మ్రొక్కుచు నడువంగ , కృష్ణమూర్తి పుడమికిన్
    మక్కువ దిగివచ్చె , జనుల
    దిక్కయి , దర్శన మొసగగ తేజో ప్రభలన్ .

    ReplyDelete
    Replies
    1. -

      ఒదిగి దేవత లెల్లరు మ్రొక్కుచు నడు
      వంగ శ్రీకృష్ణమూర్తి గహ్వరిని జనుల
      దిక్క గుచు మక్కువ గొనుచు దిగె ప్రభలను
      జూపి జనులకు దర్శన మొసగ గాను


      Delete
  5. శ్రీకరముగ , గీతా సుధ
    శ్రీ కృష్ణుం డర్జునునికి చెప్పి , జనులకున్
    చేకొని ఈ రోజుననే ,
    ప్రాకటముగ బోధచేసె , పరమ గురుండై .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల23 December 2023 at 08:36
      అధరం మధురం వదనం మధురం
      ............
      వచనం మధురం, గమనం మధురం
      మధురాధిపతేరఖిలం మధురం.

      Delete
    2. -

      పరమగురుడగుచు తెలిపె ప్రాకటముగ
      నేడె గీతాసుధను కృష్ణు డే రణమ్ము
      సేయ ననుచు పలికినట్టి స్నేహితునికి
      జనులు కార్యోన్ముఖులు గాన సత్వరముగ!


      జిలేబి

      Delete
  6. “జిలేబి” గారు,
    // “నిజమేనంటారా ?
    సత్తిబాబునడుగుదామా ? :)” //

    శర్మ గారే సత్తిబాబు అయ్యుండవచ్చనే అనుమానం మీకెప్రుడూ కలగలేదా? 🙂

    ReplyDelete
    Replies
    1. शर्म गारु जिलेबि गारु ओकरे अने संदेहं कूडा उंदंडि :)

      Delete
    2. మీరెవరో బయటపడకుండా ఇటువంటి ముసుగు వేషాలు వేస్తున్నంతకాలం ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి. దానికి మీరే బాధ్యులు.

      అయినా మాకెందుకీ రాష్ట్రభాషా సేవ, ఇవాళ హిందీ దినం కూడా కాదే?

      Delete
    3. విన్నకోట నరసింహా రావు23 December 2023 at 12:16
      సుబ్బరాజు, సత్తిబాబు ఇద్దరూ కనపట్టం లేదండి. అబ్బో! ఒకప్పుడు స్వర్ణయుగంలో వారానికొకసారేనా కనపడేవారు, చెల్లెమ్మా! అంటూ వచ్చేవాడు, సత్తిబాబు. చెల్లెమ్మెళ్ళిపోయాకా నన్ను చెల్లు రాసినట్టున్నాడండీ, కనపట్టంలేదు :) కనపడతాడేమో చూడాలండి.

      Delete
    4. రావోయ్ అని పిలిచి‌ చూషారా మన సారా ఎపుడైనా .?

      Delete

    5. Zilebi23 December 2023 at 15:46
      మనసు సారా మీదకిపోతోందేం :) ప్రమాదం సుమీ.
      **************************************
      సత్తిబాబూ కనపట్టం లేదేం అనడిగితే
      ”బంగారంలాటి చెల్లిని నీ చేత బెట్టేను. ఏదీ? నిప్పచ్చరం జేసేసేవు.దక్కించుకోలేని నిర్భాగ్యుడివి. ఏమని కనపడను,వచ్చి నోరారా చెల్లెమ్మా!కాఫీ అని అరుద్దామంటే, ఏదీ? ఎక్కడా? కనపడని లోకానికెళ్ళిపోయింది”.అని నోటితో అనలేకపోయినా ఒక్క చూపుచూస్తే....తట్టుకోగల శక్తి లేక పిలవలేదు,పిలవలేనేమో కూడా!

      Delete
    6. ఓ మారు పిలిచి చూడండీ
      అన్నీ సర్దుకుంటాయి

      Delete
    7. జిలేబీ గారు,
      ओकरे (ఓకరే) కాదండీ. ఒకరే అని రాయాలి. [ఇది మొహం-మోహం అని తెమిళంలో రాసినంత వీజీ కాదు] :-)

      Delete
    8. టెల్గూ లేంగ్వేజ్ ఆల్ఫా బెట్స్ వరల్డ్స్ బెష్టు అని అమెరికన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ న్యూరో జంబో లింగ్విస్టిక్ స్టడీస్ వారి ఉబోస.

      Delete
    9. మరి తెలుగు లిపిలోనే వ్రాయచ్చుగా మీరు? అప్పుడప్పుడు అటూ ఇటూ గెంతడం ఎందుకు?

      ఆ so called మీ ఊహాజనిత institute కి మీరే director గినానా?

      Delete
    10. ప్రస్తుతానికి director పోష్టు అందుబాటులో లేదండి.. ప్రొఫసర్షిప్పు చేయదగ్గ పనులేను
      చూడాలి ఎవరైనా director గా ప్రమోషనిస్తారా అని :)

      Delete
    11. Zilebi24 December 2023 at 12:16
      తాగేది దమ్మిడీ కల్లు ఊసేది ఊరంతా అని నానుడి.
      ఈ మాత్రం ప్రొఫెసర్ సిప్పుకే ఇంత సోకా/ఊపా/డోకా!

      Delete
    12. విన్నకోట నరసింహా రావు24 December 2023 at 11:05
      శాఖా చంక్రమణం చేసే జీవుల లక్షణాలు కదు సార్!

      Delete

    13. Zilebi24 December 2023 at 01:43
      అబ్బబ్బ! ఏమి సోకు! సోకు సోమవారం మొగుడు యాయవారం!

      Delete
    14. కాంత్23 December 2023 at 20:04
      సార్! మోటుగా ఉంటుందేమో! ఒక సామెతజెప్తా! ఏమనుకోవద్దూ! ఆయనే ఉంటే.......

      Delete

    15. Zilebi23 December 2023 at 18:08
      ప్రయత్నం జేస్తానండి :)

      Delete
  7. శర్మ గారు,
    // “ తడికి రాయబారం మీద అల్లు రామలింగయ్య మీద మంచి పాటుంది, చెప్పరాదూ! :)” //

    మీరడిగింది “జిలేబి” గారినేననుకోండి. కానీ ఆసక్తితో నేనూ ఆలోచించాను. చదలవాడ గారి మీద పాట ఉంది 👇 గానీ అల్లు రామలింగయ్య గారి మీద పాట ఉందేమో గుర్తు రావడం లేదు. మీకు తెలిస్తే చెప్పెయ్యండి.

    https://youtu.be/8G9PAXThMk0?si=Dc0XalTs4BuflXo2

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు23 December 2023 at 13:14
      పాట గుర్తులేదండి, సరే సినిమా పేరు అసలు గుర్తులేదు.
      అల్లు, మరోనటి,భార్యా భర్తలుగా నటించిన సీన్...
      ఆవిడలోపల ఈయన బయట ఉన్న సన్నివేశం, చలిరోజులు( ఆవిడే బయటికి గెంటేసినట్టుంది)
      ఈయన వీధిలోంచి..
      చలేస్తోంది.
      తలుపు తీసే వుంది. లోపలికి రావచ్చు.
      ఆకలేస్తోంది.
      ఉట్టిమీద ఉప్పుచేపుంది.చట్టిలో పప్పుచారుంది, పోసుకుతినచ్చు. ఇలానడిచిపోతుంది సన్నివేశం సరదా సరదాగా నవ్వులబండి మీద...

      Delete
    2. ఓ, ఆ సన్నివేశమా? అవును సరదాగా ఉంటుంది. పాత “మూగమనసులు” సినిమాలోనిది.

      ఈ క్రింది లింక్ లో చూడచ్చు. వీడియోలో రెండో సగం దరిదాపుల్లో మొదలవుతుంది అసలైన తమాషా (విడియోని ట్రిమ్ చేసే విద్య నాకు రాదు 😒).

      https://youtu.be/sK9oxDvQlpI?si=Vaozmt6vG2gVoUEB

      Delete
    3. విన్నకోట నరసింహా రావు23 December 2023 at 16:06
      బలే పట్టుకున్నారండీ. మంచి సన్నివేశం, సరదా,సరదా సన్నివేశం, సునిసిత హాస్యం.
      కత్తిరింపుల విద్య వద్దండీ !

      Delete
    4. దెబ్బ పడితే గాని ఆసాములు దార్లో కి వచ్చే సూచన్లు కనిపించడంలే :)


      Delete
    5. Zilebi26 December 2023 at 07:37
      అర్ధమ్కాకుండా వెకిలిగా మాట్లాడ్డం నీ నైజం :)

      Delete