Thursday 14 December 2023

పనికిరాని పరిజ్ఞానం

 

ఉల్లిపాయల బస్తా


ధాన్యం నుంచి, ఉప్పు,పంచదార ఇలా అన్నిటిని బస్తాలలో నింపడానిని పట్టుబడిఅంటారు. ఈ బస్తాలను వరసగా పేర్చడాన్ని నెట్టు కట్టడం అంటారు. ఈ మొత్తం చర్యని బస్తాబందీ అంటారు :) బియ్యం,ధాన్యం, పంచదార ఇలా అన్నిటిని నిలవచేసే బస్తాలని గోనెసంచులంటారు. ఇవి జనపనారతో తయారయ్యేవి.జనపనార సంచులని కూడా అంటారు. ఇవి రెండు రకాలు ఒకటి కళ్ళీ సంచి,రెండు చార సంచి.కళ్ళీ సంచి నేత చిక్కగా ఉండదు. సాధారణమైనవాటికి వాడతారు. ఎక్కువ ఇవే వాడకం. ఇక చార సంచిలో నిలువచేసేది పంచదార మాత్రమే. ఈ సంచి నేత భిన్నంగా ఉంటుంది. దీన్ని ఐమూలనేత అంటాం. నేత చిక్కగా ఉంటుంది.మామూలు కళ్ళీ సంచిలో పంచదార కారిపోతుంది :) ఈ సంచులు ఒకప్పుడు 100 కేజిలు లేదా 24 కుంచాలు పట్టేలా ఉండేవి. ఇప్పటికీ పంచదార సంచులు మాత్రం 100కేజిలకి   తయారవుతున్నాయి. మిగిలిన వాటికి  మార్పులొచ్చాయి. ఒకప్పుడు 75kg సంచులొచ్చాయి. ఆ తరవాత కాలంలో ఇవి 50 కేజిలకి తగ్గిపోయాయి. ఇప్పుడు వాడుకంతా 50 కేజిలు మాత్రమే. ఇదంతా రైతులు వాడేవి. ఇక వినియోగదారుడి దగ్గరకొచ్చే జనపనార సంచులే లేవు నేడు. అన్నీ పోలీథిన్ సంచులే. ఇవి కూడా ఇప్పుడు 50,25 కేజిల పట్టుబడికే సరిపోతాయి. బియ్యం వగైరాలన్నీ 25 కేజిలకే పట్టుబడి ఇప్పుడు. 


ఇక ఉల్లిపాయల సంచులన్ని ప్రత్యేకం. ఒకప్పుడు ఉల్లిపాయల బస్తా అంటే 30 కేజిలు. ఇప్పటికి ఉల్లిపాయ బస్తాపట్టుబడి 30 కేజిలనుకుంటున్నా. ఐతే పైన ఫోటో లో ఉన్నది 5కేజిల ఉల్లిపాయబస్తా. ఒక బస్తా ఉల్లిపాయల ఖరీదు 300, ఒకనెలకి సరిపోతాయి. ఈ ఉల్లిపాయసంచులు మాత్రం చాలా దూరం కొంత దగ్గరనేతతో ఉంటాయి, ఉల్లిపాయ బయటపడిపోకుండా. ఉల్లిపాయ సంచి మరెందుకూ పనికిరాదు.   


నరసాపురం లో ఉద్యోగం చేసినపుడు ముచ్చట. ఆఫీసులోనే క్వార్టరు మూడో అంతస్థులో ఉంది. బియ్యం 50 కేజిలు తెచ్చుకోడం అలవాటు. రిక్షాతను కిందదాకా తెచ్చి అక్కడపెట్టేసేవాడు. పై తెచ్చిపెట్టు డబ్బులు వేరేగా ఇస్తానన్నా 50కేజిల మూట మూడో అంతస్థుకి తేలేనండి మెట్లెక్కి, అని వెళిపోయేవారు. ఇద్దరం ఏచేయాలి? అంతమూట మోయగల ఓపికలేదు. అందుకు మూట విప్పేసి ఐదుకేజిల చొప్పున పైకి మోసుకుపోయేవాళ్ళం, ఇల్లాలు నేనూ! ఇన్ని కొనుక్కోడమెందుకంటే, ఇల్లాలు రోజూ బియ్యం కోసం సంచి పుచ్చుకు బయలుదేరడం  చిరాగ్గా ఉండదూ అనేది.   

నేటి కాలంలో పాతిక కేజిల బరువు మించి మోయగలవారే ఉన్నట్టు లేదు. 


19 comments:

  1. ఇంకా బియ్యం, బస్తా ఉల్లిపాయలు గట్రా కొనుక్కుంటున్నారా!
    ఏమి చాదస్తపుటోళ్లో!

    హాయి గా స్విగ్గీ బగ్గీ లో ఆర్డ రేసుకొని కొంత తిని మిగతావన్నీ పారేయకుండా ఇట్లాంటి‌ చాదస్తమున్నవాళ్లు ఉన్నారంటే మరీ చోద్యంగా అనిపిస్తోందండోయ్!


    ప్చ్? ఏమి పాతకాలపు చింతకాయ జనాలోస్మీ


    ReplyDelete
    Replies
    1. Zilebi15 December 2023 at 07:15
      బుజ్జమ్మా!
      స్విగ్గీలు, బుగ్గీలు మాదగ్గర లేవుగాని, అంతకు మించిన ఏర్పాట్లున్నాయి, మాకు కావలసినట్టు, నచ్చినట్టు చేసి పట్టుకొచ్చేవి, పదేళ్ళు పైగా. నీకు స్విగ్గీవాడు తెచ్చినది తినాలి అంతే! ఇంక అక్కడక్కడ చాదస్తులం ఉండిపోయాం లే :)

      నేటి కాలంలో పిల్లలని కనడం దగ్గరనుంచి అన్నీ ఔట్ సోర్సింగే కదా! నేనడిగేవాటికి ఔట్ సోర్సింగ్ ఉంటే చెబుదూ! అవి, ఆకలి,దప్పిక;శోకం,మోహం;జర,మరణం.
      నాకాకలేస్తే మరొకరు తినాలి, ఆ శక్తి నాకు రావాలి. అలాగే నాకు దాహమైతే మరొకరు నీరుతాగాలి, నాదాహం తీరాలి.
      నాకేడుపొస్తే మరొకరు ఏడవాలి, నాకు ఏడుపురాకూడదు. అలాగే మోహం కూడా........ ఇక చివరగా నాకు ముసలితనాన్ని మరొకరు అనుభవించాలి. నాకు చావొస్తే మరొకరు చావాలి, నేను బతకాలి. అన్నిటి వెల ఉంటుందనుకో..

      నాకాలి మీద కురుపేస్తే అది మరొకరికి ట్రాన్స్ఫర్ కావాలి.ఏర్పాటుంటే చెప్పు.

      Delete
    2. -

      నాకేడుపొస్తే మరొకరు ఏడవాలి, నాకు ఏడుపురాకూడదు... అలాగే మోహం ...

      எவரன்னா ஆ மோஹான்னி அவுட் சோர்ச் ஸெச்தாரா :)
      ஏமிரா தேவுடா :)


      ஜிலேபி

      Delete
    3. Zilebi15 December 2023 at 09:53
      ఆ ఏడ్చేదేదో తెనుగులో ఏడవరాదూ :)

      Delete
    4. జిలేబీగారు మొహానికి, మోహానికి మధ్య confuse అయినట్టున్నారు. అందుకే మొహమాటంతో తమిళంలో కామెంటేరు. అయినా, అణిమ, గరిమ, పరకాయ ప్రవేశం లాంటి అష్ట సిద్ధులన్నీ నేర్చుకుంటే, ఆకలి,దప్పిక వగైరాలతో పాటు మొహాన్నీ, మోహాన్నీ కూడా outsource చెయ్యొచ్చు కదా.

      Delete
    5. చిన్న సవరణ: జిలేబీగారు తమిళంలో కాదు తెమిళంలో (తెలుగువాక్యాన్ని తమిళంలో రాసి) కామెంటేరు.

      Delete
    6. కాంత్ గారు

      லென்ச் கார்ட் லோ பை ஒன் கெட் ஒன் ஃப்ரீ அட ஒ சாரி வெள்ளி வத்துரூ :)

      Delete
    7. కాంత్15 December 2023 at 22:35
      కావచ్చునేమో లెండి :)
      కాంత్15 December 2023 at 22:37
      జిలేబికి ఇలాటి పిచ్చి పనులు అలవాటేనండి

      Delete
    8. జిలేబీగారూ,
      ఇలా తెమిళంలో కాక, ఎంచక్కా పూర్తిగా తెలుగులోనో లేదా పూర్తి అరవంలోనో అరవొచ్చుగా? BTW, ఆ షాప్ మా ఊర్లో లేదండీ. ఈ సారి ఇండియా వచ్చినపుడు, ఆ ఆఫర్ ఉపయోగించుకుంటాలెండి.

      Delete

  2. -

    చాదస్తపుటోళ్లు సుమీ
    గోదాముల గంపెడంత కొనుగోళ్లున్, బ
    స్తా దంగుళ్లు, బఠాణీల్!
    సీదా స్విగ్గీ ల కొనని సీసపు జనులున్


    నారదా
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi15 December 2023 at 08:06
      ఈ మాత్రం దానికి నారదుడెందుకులే, నువ్వు చాలవూ!

      ఇప్పటివాళ్ళకి నేను చెప్పేది వింతగా ఉండచ్చు. ఇల్లాలు సంవత్సరానికి సరిపడ సరుకులు సీజన్లో కొనేసేది.కందిపప్పు 50 కేజీలు,చింతపండు 30కేజిలు, పంచదార 25కేజీలు,నాలుగు నెలలికి , ఇవన్నీ దాచుకోడానికి ఒక పెద్ద అలమారా. ఇంక మిగిలిన సామాన్లు టంగ్ క్లీనర్ తో సహా, రెండు నెలలకి సరిపడా ఎప్పుడూ ఇంట్లో ఉండేవనుకో!
      నెలనెలా కొనుక్కునేవేంటో తెలుసా టూత్ పేస్టు,మందులు.

      Delete
  3. మోహాన్ని మాత్రం outsource చెయ్యడానికి వీలవదు కదా శర్మ గారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు15 December 2023 at 10:13
      ఆహారము,నిద్ర,భయం,మైథునం సర్వజీవులకు సమానం కదండీ! అలాగే ఈ ఊర్ములు ఆరున్నూ ఆకలి,దప్పిక;శోకం,మోహం;జర,మరణం, ఎవరివి వారే అనుభవించాలండి, ట్రాన్స్ఫర్లు కుదరవు :). ఎవరిచావు వారే చావాలి కదు సార్!

      Delete
    2. -

      ఆహారము నిద్ర భయం
      బాహా! మైథునము సర్వ ప్రాణుల కొకటే
      దేహంపుటూర్ము లారు
      న్నూ హంతువెవరిది వారె పొలియిక సుమ్మీ!

      Delete
    3. శర్మ గారు,
      అంతే గదండీ. “ఎవరి చావు వారే ….”

      Delete
    4. విన్నకోట నరసింహా రావు15 December 2023 at 11:01
      దీన్నంతా వివరంగా చెప్పలేక చివరిదాన్ని కాస్తా తీసుకుని ”ఎవరిచావు వారే చావాలని” ఒక నానుడి చెప్పేరండి,పెద్దలు. ఈ నానుడి వాడుతుంటాంగాని దీని వెనక ఇంత ఉందని ఆలోచించం.

      Delete
  4. -

    ఎవరి నిహతి వారే చా
    వవలె విదురులు పలికిరి వివరముగ తెలుపం
    గవలయు నోపిక లేకన్
    భువిలో కారణములు మన పూర్వపు కర్మల్

    జిలేబుల్స్

    ReplyDelete
    Replies
    1. Zilebi15 December 2023 at 18:10
      ఎవరు చేసిన కర్మ
      వారనుభవింపకా
      ఏరికైనా తప్పదన్నా!
      ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు
      అనుభవింపకతప్పదన్నా
      అనుభవించుట తథ్యమన్నా

      Delete
    2. -
      ఎవరు చేసిన కర్మవారెవ్వ రైన
      ననుభ వింపక తప్పదు! నాడె పల్కె
      తాత వేమన మనకమ్మ తమ్మికంటి
      తెలుసు కున్న మేలు గలుగు తీగబోడి

      Delete