Saturday 16 December 2023

ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.

 ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.


ఉప్పుతో తొమ్మిదీ తెచ్చుకోవలసిందే, ఇక్కడేంలేవు, అంటుంటారు. ఏమిదీనర్ధం?     నోట్లోకి  ముద్దరావాలంటే వంటకి కావలసిన పదార్ధాలు ఈ తొమ్మిదీ, ఉప్పుతో సహా! ఏమిటవి? ఎప్పుడూ ఆలోచించలేదుకదూ! అవేంటో చూదాం...ఇదీ ఒక నానుడే!

బియ్యం,

నెయ్యి/నూనె

కూర,

పాలు/పెరుగు,

పోపు సామాన్లు,

ఉప్పు,

పులుపు,

కారం,

తీపి.

మరోమాటా చెబుతారు ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది.

వీటికి వంట పాత్రలు, వంట కట్టెలు,విస్తళ్ళు అదనం.

ఇవన్నీ ఉంటేగాని వంట కాదు. ముద్దరాదు.కొత్తగా కాపురం పెట్టుకునేవాళ్ళు మరచిపోకూడని నానుడి.


6 comments:

  1. -

    నానుళ్ళ తాత గారం
    డీ! నుడివిన విషయముల్ వడి చదివి నామం
    డీ! నూత్నదంపతులకు ప్ర
    ధానము గా వలయు విజ్ఞత తెలిపిరి సుమీ


    జిలేబుల్స్

    ReplyDelete
    Replies

    1. Zilebi16 December 2023 at 12:06
      చెప్పడమే నా ధర్మం. వినకపోతే నీ ఖర్మం

      Delete
    2. చెప్పడమే నాధర్మం
      బప్ప! విననిచొ నవివేక మప్ప! జిలేబీ
      గొప్పలకు బోకు తగ్గవు
      తిప్పలు తప్పవవగడము తింగరి బుచ్చీ !



      తాతగారికి

      బ్లాకు టర్మెరిక్కు ఒక వారముగా కొన్ని‌ చిన్ని చిన్ని ముక్కలు రెండు లేక‌ మూడు తినుచున్నాము. కొంత ఉపశమనము కనిపిస్తున్నది.
      దీనిపై (బ్లాక్ టర్మెరిక్ పై) మీ అభిప్రాయము తెలుపగలరు.

      మీ కాలునొప్పి అధికముగా వున్నదా?/ఈ ముక్కలు మీరు ప్రయత్నించి చూడగలరు


      ఇట్లు
      జిలేబి

      Delete

    3. Zilebi20 December 2023 at 18:44
      /గొప్పలకు బోకు తగ్గవు
      తిప్పలు తప్పవవగడము తింగరి బుచ్చీ !/
      ఇది సత్యం కాదు ఇదే సత్యం.

      బ్లాక్ టర్మరిక్ తో పరిచయం లేదు,తెలియదు కూడా! ''మానింది మందు బతికింది ఊరు'' అని నానుడి. గుర్తుంచుకుంటా! అవసరపడితే ఉపయోగించుక్ంటా! ధన్యవాదాలు.
      మీకు తగ్గితే మంచిదే లేకుంటే తిప్పలు తప్పవు. మొన్న వైద్యుని కలసివచ్చా! అంతాబాగుంది, నడకవేగం తగ్గించండి, ఏకధాటిగా రెండు కిలోమీటర్లు నడుస్తా,వేగంగా అంటే ,చిన్నపిల్లలా! చెప్పేరు, మరి వేగము,దూరం తగ్గించి నడుస్తున్నా! బాగుంది ...గాడీ చల్తీ హై! :)

      Delete
  2. పప్పుతో పది, మొబైల్‌తో పదకొండు. మొబైల్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే, మొదటి పదీ అసలక్కర్లేదు. క్షణాల్లో భోజనం రెడీ.

    ReplyDelete
    Replies
    1. కాంత్16 December 2023 at 19:55
      అంతేలెండి నేటికాలానికలాగే ఉంది. ఇది ఎల్లకాలమూ,ఎల్ల చోట్లా సాగదనుకుంటా!

      Delete