Wednesday, 29 November 2023

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.

 

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.


సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా.  నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా


ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి   ప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.


ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..

పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు  అద్భుతఫలితాలిస్తుంది.

16 comments:

  1. అద్భుతం 👏👏.
    ప్రభుత్వానికి వందనాలు 🙏.

    ఆ చిక్కుకున్నవారికి ఆహారపానీయాలు కూడా ఆ పైపు ద్వారానే అందించారేమో?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 November 2023 at 12:42
      లోపల చిక్కుకున్నవారు తెలివిగా వ్యవహరించారు. చిక్కుకున్నవారం 41మంది అని,అంతా క్షేమమని బయటికి ఒక నీటి గొట్టం ద్వారా కబురందించారు. దానితో బయటవారు ఉద్విగ్నత చెంది లోపలవారికి ఆహారం పంపేందుకు ఒక ఆరంగుళాల పైప్ ని కూలిపోయినదానిలోంచి డ్రిల్ చేసి ప్రవేశపెట్టేరు. ఈ పైప్ కి అడ్లు తగలకపోవడం అదృష్టం. దీనిలోంచి వాకీ టాకీ లోనికి పంపేరు. దానితో లోపలవారితో బయటవారికి పూర్తి సమాచారం అందింది. కూలిన ప్రదేశం నుంచి ఇంకా ముందుకి తవ్విన సొరంగం రెండు కిలో మీటర్లు ఉండడంతో ప్రాణవాయువు సమస్య లేకపోయింది. గొట్టం లోంచి ఒక కెమెరాని పంపి అందరిని వీడియో తీసారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అవసరమైనవారికి మందులు పంపించారు. దాని ద్వారానే ఆహారం పంపించారు, డాక్టర్ల సలహామేరకు. చిక్కుకున్నవారు మలవిసర్జనకి చాలా చోటు వుండటంతో సమస్య లేకపోయింది. వ్యాయమం చేయమని డాక్టర్ల సలహాతో నడిచారు. జట్లుగా కూడి మాటాడుకున్నారు. యోగా చేసేరు. లోపలనుంచే మంచినీరు బయటికి ప్రవహిస్తున్నందున నీటి సమస్య లేకపోయింది. ఒక్క స్నానం మినహా అన్ని సౌకర్యాలు రెండురోజులలోపే లోపలివారికి అందాయి. ఈలోగా చిక్కున్నవారిని బయటకు తీసుకురావడానికి మూడడుగులస్టీల్ పైప్ లోపలికి ప్రవేశపేట్టడానికి జరిగిన ప్రయత్నాలకే అడ్డంకులు కలిగాయి.చివరికి ఎలుకబొరియ విధానంలో (మాన్యుయల్ డ్రిల్లింగ్) తవ్వకం సాగించి చివరికి విజయం సాధించారు.

      ప్రభుత్వం ఒక వ్యక్తిగా శక్తిగా కదిలింది, అద్భుతమే సాధించింది, జేజేలు.


      Delete
    2. విన్నకోట నరసింహా రావు29 November 2023 at 12:42
      మీ కామెంట్ కి నా సమాధానం శోధిని తీసుకోలేదు, ప్రచురించలేదు, కారణం తెలియదు. బ్లాగులో చూడగలరు.

      Delete
  2. ఎలుక బొరియ విధానమనగా ఏమిటండీ ?

    ReplyDelete
  3. ౨)/ అది ఎందుకు నిషేధింప బడెను ?

    ReplyDelete
    Replies

    1. Zilebi29 November 2023 at 14:05
      Zilebi29 November 2023 at 14:06
      Rat-hole drilling. For details search google

      Delete
  4. ఇండియా మే జుగాడ్ చల్తా హై.

    ReplyDelete
    Replies
    1. bonagiri30 November 2023 at 08:15
      జుగాడ్ శబ్దానికి అర్ధం తెలియలేదండి.సెర్చ్ లో ప్రాంతాన్ని బట్టి అర్ధం చెప్పుకుంటారంది.

      Delete
    2. గోదావరి భాషలో చెప్పాలంటే ఏదో ఒకలా మోపు చెయ్యడం.

      Delete
    3. bonagiri30 November 2023 at 14:12
      సరిగ్గా అందేలా చెప్పేరు. ధన్యవాదాలు.

      ఏ విద్యా నీచమైనదికాదు.సనాతనమే గొప్పకాదు, ఆధునికమే అనుకోడమూ గొప్పకాదు. రెండిటి మేలుకలయిక సత్ఫలితాలిస్తుందన్నదే జరిగినదానిలో విశేషం.

      Delete
    4. "గోదావరి భాషలో చెప్పాలంటే ఏదో ఒకలా మోపు చెయ్యడం." చాలా బాగుంది

      Delete
    5. neo2 December 2023 at 03:57
      అందుకే మా గోదావరి పరిభాషలోనే సమాధానమిచ్చా!సరిగ్గా అందేలా చెప్పేరని. :)

      Delete
  5. 'Jugaad' is a Hindi word that means to find a way to solve a problem using whatever resources are available. In the Oxford Dictionary, 'jugaad' is defined as “a flexible approach to problem-solving that uses limited resources in an innovative way.”

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు30 November 2023 at 12:46
      ధన్యవాదాలు.

      Delete
  6. ఆ పైపు ఏదో ముందే వేసుకుని ఉంటే, వెంటనే బయటపడేవారు కదా!

    ReplyDelete
    Replies
    1. bonagiri2 December 2023 at 05:56
      please see
      https://kasthephali.blogspot.com/2023/12/blog-post_3.html

      Delete