మొలతాడు బిగిసింది.
మొలతాడు బిగిసిందంటాం. మొలపెరిగిందనుకోం. మొలతాడు చిక్కదు :) మనమే బలుస్తాం,ఎప్పుడో కట్టుకున్న మొలతాడిప్పుడెందుకు బిగుస్తుంది?మొల చుట్టుకొల్త పెరిగితేనేకదా!
సమస్య పట్టుకుని వదలటం లేదంటాం. సమస్యని మన మనసు పట్టుకుంది, తన చుట్టూ కట్టేసుకుంది. కాని సమస్య పట్టుకుంది వదలటం లేదంటాం.వదలవలసిందెవరు? మనమనసే.
తననెవరో పట్టుకున్నారంటుంది, మరెవరో విడిపించాలనీ అనుకుంటుంది. చెబితే శానా ఉంది.
అన్నిటికి మూలం మన మనసు.
ఇక చాలు.
సర్వే జనాః సుఖినోభవంతు.
.....స్వస్తి.....
-
ReplyDeleteThe unfolding of eye లాంటివి చదివి గుండె బరువెక్కి వెక్కి వెక్కి ఏడ్చితే అది చదివినది మనలను పట్టుకున్నది కాదు మన మనసే దానిని పట్టుకున్నదను సమస్యను బాగా వివరించారు.
Zilebi10 November 2023 at 09:27
Deleteబుజ్జమ్మా!
ఇది నీ మాటలా లేదు కమే(కల్పిత మేధస్సు) మాటలా ఉంది :)
మేకం చమే ....
Deleteమీ కమే క్రొంగొత్త పదాన్వేషణ బావుందండి
తిరుమల ప్రయాణం బాగా జరిగిందాండీ ?
జిలేబి
DeleteZilebi23 November 2023 at 11:07
బుజ్జమ్మా!
ఇది నమకమూ కాదు చమకమూ కాదు :)
ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ని అంతా కృత్రిమ మేధ అంటున్నారు, దానికంటే కల్పిత మేధ బాగుందనిపించింది.
తిరుమలా? ప్రయాణమా? బలేదానివే! రెండురోజులు కొద్దిగా తిరిగితే కాలు నొప్పిజేసింది మళ్ళీ వైద్యపరిశీలన, అంతా బాగానే ఉంది, మీరు అడుగులు సరిగా వేస్తున్నట్టులేదని చెప్పి, మందులిచ్చి పంపేరు. మంచమే తిరుమలైపోయింది. సామి కరుణలేదు.
-
Deleteనమకము కాదోయీ చక
కము! కల్పిత మైన మేధ గాన "కమే"! కృ
త్రిమ మేధస్సనటము క
న్న మేలటంచు తలచితి సునాయాసముగా!
జిల్ జిల్ జిలేబి :)
సామి కరుణ మనము చేయు యతనమ్మునకు యూత :)
కమే (కల్పిత మేధస్సు) దుర్వినియోగమే హెచ్చని వార్త.
Deleteమనం చేసే పనికి స్వామి ఊతకావాల్సిందే! లేనిదే కాలు కదలదుగదా!!
కమే ఆ స్వామి కోరిక , ఆటలలో ఒకటి కాకూడదేమిటి? :)
DeleteZilebi24 November 2023 at 09:35
Deleteస్వామి కరుణతోనే కమే(కల్పిత మేధస్సూ) వచ్చింది, అది ఆయన ఆట కావచ్చు, కాని, దుర్వినియోగం చేసుకుంటామంటే అది మానవుల దురదృష్టం. అంతే!
కాని స్వామి మాట ఇదీ!
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్ధాయ
సంభవామి యుగే యుగే
శర్మ గారు,
ReplyDeleteబాగానే ఉంది గానీ …. ఇదివరలో లేనిది ఇప్పుడు ఈ పోస్ట్ చివర్లో మీరు “స్వస్తి” అనడంలో ఏదో గూఢార్థం ఉన్నట్లు అనుమానంగా ఉంది 🤔.
విన్నకోట నరసింహా రావు10 November 2023 at 17:50
Deleteనిజమంతేనండి :)
ప్రయత్నం సఫలం కాలేదు :)
మాకు కావలసినది అదే 🙂.
DeleteWelcome back 👍.
విన్నకోట నరసింహా రావు24 November 2023 at 14:45
Deleteతానొకటి తలచిన దైవమొకటి తలచుననికదు సార్ పెద్దలమాట.
ధన్యవాదాలు.
Before we work on artificial intelligence, why don't we do something about natural stupidity?
ReplyDeleteFrom Facebook👆
ReplyDeletebonagiri24 November 2023 at 12:47
Deletebonagiri24 November 2023 at 12:49
సార్! ఇదేదో మేధావుల మాటలా ఉంది, అర్ధం చేసుకోలేకపోయాను. అర్ధం స్వభావసిద్ధ మూర్ఖత్వమం అనుకుంటున్నా! అంతేనంటారా
అర్థం స్వభావ సిద్ధమైన
Delete....
తమ గురించిన సరియైన అవగాహన అతి కొద్ది మందికే వుందంటారు . ఆ కొద్ది మందిలో మీరున్నారని తెలియడం ముదావహం :)
Zilebi25 November 2023 at 17:17
Deleteఆరునెల్లు సావాసంజేస్తే వారు వీరవుతారన్నది నానుడి.
తమతో నా సావాసం పదమూడేళ్ళు! ఎన్ని ఆరునెల్లు? :)
ReplyDeleteశర్మ గారు,
// “…….. మూర్ఖత్వమం “ //
“అన్నమయ్య” సినిమాలో అన్నమయ్య తల్లి పాత్ర అన్నీ కరక్ట్ గానే చెప్పి, “అంతేనంటారా, అసలే లోకజ్ఞానం లేనిదాన్ని?” అంటుంటుంది చాలా సీన్లలో.
మీ వ్యవహారం కూడా అలాగే ఉంది. 🙂
విన్నకోట నరసింహా రావు25 November 2023 at 17:44
Deleteఅదేమో పరాయిభాష. దానితో నా పరిచయం చిన్నది.పొరబాటుగా అర్ధం చేసుకున్నానేమోనని భయం, అందుకు వారినే అడిగేసేనండి. మరేం లేదు :)