Wednesday, 8 November 2023

మాట విలువ

మాట విలువ  

 రామకృష్ణులు మఠంలో ఉండగా, ఒక తల్లి తనకొడుకుని తీసుకుని వచ్చి, ఈ కుర్రవాడు చిన్నవయసులోనే చెప్పినమాట వినటం లేదు, బెల్లం ఎక్కువ తింటున్నాడు , మీరు చెబితే వింటాడని మీదగ్గరకి తీసుకొచ్చానంది.


విన్న రామకృష్ణులు రేపురమ్మని వాయిదా వేసేరు. ఆ తల్లి కొడుకుని తీసుకుని మరునాడొచ్చింది. మళ్ళీ రేపురమ్మని వాయిదావేసేరు. ఇలా వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు, కాని కుర్రవానికి బెల్లం తినద్దని చెప్పటం లేదు. ఆ తల్లి పట్టువదలక తిరుగుతూనే ఉంది. చివరికి   నెలదాటిన తరవాత రామకృష్ణులు ఆ కుర్రవానితో, బెల్లం తినకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేరు. అప్పుడు ఆ తల్లి రామకృష్ణులతో, ఈ మాట మీరు నెలకితమే చెప్పి ఉండచ్చుగా! అని అడిగింది. అంత రామకృష్ణులు తల్లీ! నెలకితందాకా నేనూ బెల్లం తింటున్నవాడినే. ఈ నెలలోనే నేను బెల్లం తినడం మానేసాను, ఆ తరవాతే చెప్పేను, అన్నారు. చిత్రంగా ఆ కుర్రవాడు ఆ   తరవాత బెల్లం మరి తినలేదు.


ఆచరించి చెప్పినమాటకంత విలువుంటుంది.

గాలివాటు మనుషుల మాటకి విలువుండదు.

8 comments:

  1. మీ దగ్గరెవరైనా వచ్చేరాండీ మా మనవడికీ అంటూ


    ReplyDelete
    Replies
    1. Zilebi8 November 2023 at 09:52
      అరె! మీ మనవణ్ణని చెప్పేడే!!

      Delete
    2. చెప్పేడూ? చెప్పే ఉంటాడు లెండి :) ఎంతైనా తాతగారు కదా
      ఆ పాటి గాల్లో రాయి వేయకుండా పోయుంటాడా అని

      Delete
    3. Zilebi9 November 2023 at 09:58
      నీ మనవడేగా! గాల్లో ఎందుకు ఇంటిమీద రాయేసి బుర్ర ఒగ్గిన ఘనుడు!!! పోలికలెక్కడికిపోతాయి? :)

      Delete
  2. అంతేగా మరి 👌.
    ఇటువంటి కథే గాంధీ గురించి కూడా చెబుతారు. బహుశః రామకృష్ణుడి కథ స్ఫూర్తి గా తీసుకున్నాడేమో గాంధీ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు8 November 2023 at 10:26
      గాంధీగారి కత తెలీదండి.

      Delete
  3. ఈ కథలో ఎంతవరకు నిజముందో తెలీదు కాని, ఒకటి మాత్రం సత్యం - రామకృష్ణులు ఆచరించకుండా చెప్పినా కూడా, ఆయన మాటకంతే విలువ ఉంటుంది. లోకంలో ప్రతివారూ తమ సలహాల్ని తాము మొదట ఆచరించి అవతలవారికి చెప్పాలని లేదు. ఒక్కోసారి అది సాధ్యం అవకపోవచ్చుకూడా. ఆచరించకుండా చెప్పినంత మాత్రాన, వారు గాలివాటు మనుషులైపోరు. మీ డాక్టరు మీకు వైద్య సలహా చెప్పినప్పుడల్లా అది ఆయన పాటిస్తున్నారో లేదో ముందు మీరు అడుగుతారా? సలహా ఇచ్చినవారిమీద మనకు నమ్మకముండాలి.

    ReplyDelete
    Replies
    1. కాంత్8 November 2023 at 22:07
      పెద్దలు చెప్పగా విన్నదేనండి. (అనుమానప్రమాణం లేదా పరోక్ష ప్రమాణం)
      తర్కం విషయ నిర్ణయానికి మూడు ప్రమాణాలు చెబుతుంది.
      అవి ప్రత్యక్షప్రమాణం,పరోక్షప్రమాణం, వేద(విజ్ఞాన ప్రమాణం)
      ఈ మూడుటిలో మొదటిది తప్పించి తెలియనివయసా బాలుడుది. అందుకు ప్రయక్ష ప్రమాణం రామకృష్ణులు ఎన్నుకున్నారనుకుంటా! తాను చేసి చూపించారు.
      ఇక డాక్టరు ఈ మూడు ప్రమాణాలూ చదుకునిగురువునుంచి విని, ప్రత్యక్షంగా రోగులలో చూసి ఉంటాదూ, అందుకు డాక్టర్ మాటకి విలువ మిగిలివన్నీ గాలివాటు మాటలు కదా!
      ఇక సలహా ఇచ్చినవారిని మీరు చూసారా అని అడుగుతారా? ఒక్కొకప్పుడు, అడుగుతాం. అలా అడగలేకపోతామనే అనుభవజ్ఞుల్ని ఎంచుకుంటాం

      Delete