Wednesday, 1 November 2023

నడక నేర్చుకుంటున్నా!

 

 


నడక నేర్చుకుంటున్నా!

 ఓం సర్వవ్యాధి ప్రశమనీయైనమః


చిన్నప్పుడు నడక నేర్చుకున్నా! అమ్మ వెనకుండి నేర్పింది. మూణ్ణెల్లు మంచం మీదుంటే, నడక మరిచిపోయా! నడవడమంటే భయంగా ఉంది పడిపోతానేమోనని, మళ్ళీ ఎముక విరుగుతుందేమోనని,భయం. మళ్ళీ

ఓం దరహాసోజ్వలన్ముఖాయైనమః) అమ్మలగన్నయమ్మే నడక నేర్పిస్తోంది. మెల్లమెల్లగా అడుగులేస్తూ కఱ్ఱ బోటేసుకుని గ్రౌండు దాకా నడిచా! 


ఎందుకిన్ని తిప్పలు? హాయిగా పడుకోవచ్చుగా! నిజమే అలా మూడు నెలలు, కాలు విరిగి  బలవంతంగా పడుకుంటే, బద్ధకం ముందు పెరిగింది. ఆ పై సుగర్ పెరిగింది, బరువు పెరిగింది,BMI పెరిగింది.కనపడని బి.పి పెరిగింది.ఆకలి తగ్గింది.

సుగర్ డాక్టర్ నడిస్తేగాని సుగర్ తగ్గదు,బరువు తగ్గదు,బి.పి తగ్గదు, ఆకలిపుట్టదంటారు. ఎముకల డాక్టర్ పడుకునుంటేగాని కాలు సరిపడదంటారు. పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుంది, పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది. ఏది ముందు? బలే లింకులేసేవయ్యా సామీ!అంతేలే కారణం లేనిది కార్యం జరగదని అంటారు. తీసుకుపోయేటందుకు, నెపం నీమీదుంచుకోవనీ అంటారు.

ఇంకా కొంతకాలం తిరిగే యోగం ఉన్నట్టే ఉంది, నడుస్తున్నా, నెమ్మదిగా, ధైర్యం వచ్చింది. :) 


పైవాడు బలే లింకు లేస్తాడు, తీయాలంటే అంత తేలిగ్గానే తీసేస్తాడు. అది పైవాని వల్లే ,అవుతుందిగాని మనవల్లగాదు. కాని మనం మాత్రం సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, ఇదీ కత.బయట లోకం అంతా కొత్తగా ఉంది, బ్లాగ్ లోకం వింతగా ఉంది  :)

12 comments:

  1. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు. All the best.

    కనిపించిందా దరహాసోజ్వలన్ముఖి ?

    చాలా కాలం విరామం తరువాత బయటికొస్తే లోకం కొత్తగా కనిపిస్తుంది కదా, ఆశ్చర్యం లేదు. కానీ బ్లాగ్ లోకం మీకు వింతగా కనబడడమేమిటి?

    ReplyDelete
    Replies
    1. అంతా జిలేబీమయముగా అగుపించి విచిత్రముగా కన్నుల బడి‌ వుండును :)


      Delete

    2. Zilebi1 November 2023 at 15:21
      కన్నులాబడలేదు కాళ్ళాబడలేదు. ఉదయమే, అందునా చలికాలంలో జిలేబీలమయము ఉండునా. ముణగదీసుకుని మూడంకేసుకుని పడుకుని ఉండి ఉందురు :) తలుపులుదీసిన జిలేబి కళ్ళబడితే ఒట్టు :)

      Delete
    3. విన్నకోట నరసింహా రావు1 November 2023 at 10:41
      నిజమేనండి అదే చేసేను.

      దరహాసోజ్వలన్ముఖి లలితామ్మవారి నామం కదండీ. ఓ! ఆ దరహాసోజ్వలన్ముఖి నా పొరుగూరెళ్ళిపోయిందిగా రెండ్రోజులు పలకరించింది ఆపై మరిచిపోయింది.
      మరో త్రిదశి చిమ్మిలి పట్టుకొచ్చి తినమని బలవంతం చేసింది, ఎముకలు తొందరగా అతుక్కుంటాయని.నిజమేగాని నావల్లకాదని చెప్పి ఒప్పించేటప్పటికి పెద్దలు దిగొచ్చేరు :)
      మూణ్ణెలయి బయటకాలుబెట్టలేదు కనక అంతా కొత్తగానే ఉంది. నిన్నటిదాకా కనపడని జనాలు బ్లాగుల్లో వీరవిహారం చేస్తుంటే వింతాగా అనిపించిందండీ :)

      Delete
  2. ఇది జిలేబీమయంలా లేదు.వరూధినీ-ప్రవరాఖ్యీయం లా ఉంది.
    https://varudhini.blogspot.com/2023/08/blog-post.html

    ReplyDelete
    Replies
    1. -
      ఇదియెటుల జిలేబీమయ
      మిదియెటుల ? వరూధినీ సమేత ప్రవరుడిన్
      పదముల విన్యాసమువలె
      కదా గలదు? పల్కుడయ్య కష్టేఫలి సార్ :

      Delete
    2. Zilebi2 November 2023 at 06:03
      ఇద్దరిది ’పద’విన్యాసమే!
      నా పదవిన్యాసంలో నాకాలు విరిగింది. నీ పదవిన్యాసంలో ఎదుటివారి కాళ్ళు విరుస్తావు అంతే తేడా!!

      https://varudhini.blogspot.com/2023/08/blog-post.html
      పై టపాలో,నీ బ్లాగులో విన్నకోటవారి కామెంట్ ఏదీ? ఎందుకు తీసేసేవు? నువ్వు చెబితే పదవిన్యాసం, ఎదుటివారు చెబితే కాపీ,దొబ్బుకొచ్చింది.దీనికి నీడప్పూ!!!
      నీకైతే అట్టు ఎదుటివారికి ముక్కా!! ఇదేనా నీమాటా:)అంతేలే పెద్దచెఱువు నీళ్ళు కుక్కముట్టుకున్నా పనికొస్తాయట,శంకరమ్మత్త చెప్పిందిలే :)

      Delete
    3. కాంత్1 November 2023 at 18:47
      జిలేబిది పదవిన్యాసం సారూ :)

      Delete
    4. ఇవ్చట యేమియొ అగ్గిబరాటా రగులు చున్నది

      పై టపాలో విన్నకోట వారి కామెంటు ....గట్రాలకు
      అర్థము తెలుపగలరు

      ఇట్లు
      నెవర్ సే నో టు కామింట్స్

      జిలేబి





      Delete
    5. Zilebi2 November 2023 at 11:04
      మనకిది ఈ వేళ కొత్తకాదుగా

      Delete
  3. శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies

    1. bonagiri4 November 2023 at 09:03
      ధన్యవాదాలండి.

      Delete