కూలికి విషం తాగరు.
ఇదొక నానుడి, పల్లెలలో బాగా చెబుతారు.
డబ్బుకోసం ఏ నీచపుపని చేయడానికైనా దిగజారిపోతారు, కొందరు. ప్రపంచంలోని యుద్ధాలు తగువులు అన్నిటికి మూలకారణాలు కాంతా,కనకాలే!
కాంతపైన ఆశ
కనకంబుపై ఆశ
లేనివాడు మొదలు లేడురా
ధరణిలేడురా!
అన్నారో సినీకవి,చాలా కాలంకితం.
వయసుతో కాంతమీద మోహం,ఆశ తగ్గుతుందేమోగాని, చావదు. ఇంక కనకం మీద ఆశ చచ్చినా చావదు. :)
చావుకాలానికి ప్రాణంపోక, ఉండక కొట్టుకుంటున్నపుడు, తలకింద పెట్టుకున్న రూపాయల్ని, నీళ్ళలో కడిగి ఆ నీళ్ళు పోసేవారు. అప్పుడు ఆ జీవుడు కదైలేది బొందినుంచి. :)
డబ్బుకోసం హత్యలు చేస్తారు,చేయిస్తారు, ఎంతకైనా తెగిస్తారు.
కాని డబ్బుకోసం చేయని పని ఒకటే ఒక్కటి ఉంది ప్రపంచంలో,
అదే ఆత్మహత్య. డబ్బుకోసం ఎవరూ ఆత్మహత్యకి పాల్పడరు. దాన్నే మా గ్రామీణులం కూలికి విషం తాగరు అంటూంటాం.
-
ReplyDeleteకూలికి విషమ్ము తాగరు
లోలాక్షుల పైన చొక్కులో, కాంతము పై
మేలిమితో వడి హత్యల
తేలికగా చేయ బూను త్రిమ్మరులైనన్
జిలేబుల్స్ :)
Zilebi21 October 2023 at 06:27
Deleteఅర్ధగౌరవం దక్కలేదు,బాలేదు.