Wednesday 11 October 2023

కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.

 కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.


కాలం కలిసొచ్చినపుడు, ప్రపంచమే మనచుట్టూ తిరుగుతున్నట్టనిపిస్తుంది, మనమాట మీదే నడుస్తున్నట్టుంటుంది. మన మాటే వేదమని పాటించేవారికంటే, మన మాటకోసం ఎదురుచూసేవారే ఎక్కువ. సరే  తరవాత చిన్నతల్లి పరుగు పరుగునా గలగలలాడుతూ చేరిపోతుంది.   అడగకనే న్యాయదేవత మన ముంగిట్లోకి నడచొచ్చేస్తుంది.  తెప్పలుగ జెరువునిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ! వందిమాగధులకి లోటుండదు. ఇంద్రుడు చంద్రుడు అననివారు దుర్మార్గులే! సమయం అదే కాలం తెలియకనే దొర్లిపోతుంటుంది. రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజుల్లా నడచిపోతుంటాయి. ఆకలుండదు దాహముండదు, నిన్ను చూస్తుంటే, అన్నట్టుంటుంది.  


కాలం నడుస్తున్నప్పుడు, రోజులు భారంగా నడుస్తుంటాయి. తెల్లవారుతుంది మళ్ళీ పొద్దుగూకుతుంది, అంతే!!పిలిస్తే పలుకుతారు జనం, లేకపోతే లేదు. ఎవరి ప్రపంచం వారిదే! వందిమాగధులు కైవారాలు కష్టం మీద కొనసాగచ్చు,సాగకాపోవచ్చు. ఏదీ నికరం లేదు. న్యాయదేవత కోసం పరుగులు పెడితే కరుణించచ్చు, లేకపోవచ్చు. జనాలు చేరిక చెప్పలేం, చిన్నతల్లి పలుకును బట్టి ఉంటుంది. చిన్నతల్లి పరుగులుండవు, నడకలూ ఎనకబడతాయి. ఒక్కొకప్పుడు చిన్నతల్లి పోకేగాని రాకుండదు. విత్తంకొద్దీ వైభోగం,నడుస్తూ ఉంటుంది. ఆకలుంటుంది, దాహమేస్తూ ఉంటుంది. ఇంతేనా జీవితం అనిపిస్తూ ఉంటుంది. కాలం నడుస్తుంటుంది, భారంగా. 


కాలం కలసిరానపుడు,పిలిచినా పలికేవాడుండడు. నిన్నటిదాకా మన గుమ్మందగ్గర నిలబడ్డవాడి గుమ్మం దగ్గర నిలబడ్డా దర్శనముండదు. దర్శనమిచ్చినా పలుకుండకపోవచ్చు.చిన్నతల్లి పలుకే బంగారం. పోయేగాని రాలేదు. న్యాయదేవత పెడముఖం పెడుతుంది. నిన్నటిదాకా మనం చెప్పినదే న్యాయమే, మరి నేడేంటి? న్యాయదేవత శలవులు తీసుకుంటూ ఉంటుంది.పలికేవారు ఉండరు. చెరువెండిపోతే కప్పలుండవు. ఇంద్రుడు, చంద్రుడు మాట దేవుడెరుగు మన పెరే గుర్తుండదు, ఎవరికి. గడియారం లో చిన్నముల్లు కదలదు, పెద్ద ముల్లు సరే సరి. రోజు నడవదు, భారంగా కూడా. నీడని చూసి భయపడాల్సివస్తుంటుంది. తాడు కరుస్తుందా? కాని కానికాలమొస్తే తాడే పామై కరుస్తుంది.


ఇంతకీ ఎవరీకాలం?అదీ కొచ్చను. కాలం గంటలు,నిమిషాలు, రోజులు ,సంవత్సరాలే కాదు. కాలానికి రూపులేదు, గుణం లేదు;  దయలేదు, దాక్షిణ్యం లేదు; పుట్టుకలేదు, చావులేదు; ఆది లేదు, అంతం లేదు; సమవర్తి. పెద్ద చిన్న తేడా లేదు.  ఎవరికోసమూ ఆగదు, నడుస్తూనే ఉంటుంది.ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. మరి ఇన్నిగుణాలూ ఉన్నవారొకరున్నారు, వారే దేవుడు, మీరే పేరుతో పిలుచుకున్నా, ఏమతంవారైనా, ఇదే నిజం. 


కాలం కలసిరావడమంటే భగవంతుడు మనతో ఉన్నాడు, అప్పుడు. అందుకే మనకి రోజులలా గడిచాయి, మనమా సమయంలో మంచిపనులు చేస్తామేమో అని భగవంతుడు ఎదురుచూచాడు. మన కర్మ బాగుంటే అదే కాలం కలిసొచ్చేది.


 ఆ తరవాత అరోజులు భారంగా నడిచాయి, ఎందుకు? భగవంతుడు నీ పట్ల ఉన్నట్టు లేనట్టు ఉన్నకాలం. ఇక కాలం కలసిరానపుడు భగవంతుడు మన పట్ల లేడు. 

అందరూ పడిపడి దణ్ణాలెట్టేవాళ్ళే!నాటి రోజుల్లో. ఎందుకూ? ఆ రోజు మన వెనక విధి ఉన్నది. అందరూ దణ్ణాళెట్టేరు, విధికి, కాని మనం, మనకే దణ్ణాలెట్టేరని భ్రమపడ్డాం, మనగొప్పే అనుకున్నాం. విధిని మరచాం. అందుకే...ఈ రోజు, పిలిచినా పలికేవాడు లేడు, సాయంచేసేవాడసలే లేడు, చిన్నతల్లి అడుగులు లేవు, ఆ రోజు మొక్కినవాడు, ఈ రోజు బయటకాపలా ఉన్నాడు, బయటికి పోకుండా. ఇప్పుడు గుళ్ళూ గోపురాలూ గుర్తొచ్చాయి, ఉపయోగమే కనపట్టదు.అదే తాడు పామైకరవడమంటే...


32 comments:

  1. వచ్చిన గొడవ ఎక్కడ వస్తుందంటే , కాలం కలసి వచ్చినప్పుడు మనము చేసిందంతా మన ప్రతిభే అనుకుంటాము. దీనిలో మన ప్రతిభ ఏమీ లేదని, కాలం మనతో ఆడుకుని వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు, మళ్ళా ఆ కాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం తప్ప.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju11 October 2023 at 19:01
      అంతే కదండీ! మీకు తెలియండికాదు, ఏమనుకోవద్దూ!

      గడచినకాలం,పల్లానికి పారిననీరు, జారినయవ్వనం తిరిగిరావంటారు పెద్దలు. ఆ కాలం తిరిగిరాదు,అటువంటి కాలానికి ఎదురుచూపే మిగులుతుందిగాని అది నిజంకాదు, తిరిగిరాదు!

      Delete
  2. అబ్బా ఎంత బాగా వ్రాస్తారండి మీరు !

    బావున్నారాండీ ?

    నరసింహారావు గారు కూడా పద్యాల్వ్రాయటం ముదావహమ్ము :)


    చీర్స్
    జిలేబి బీలేజి :)

    ReplyDelete
    Replies
    1. Zilebi12 October 2023 at 04:07
      /అబ్బా ఎంత బాగా వ్రాస్తారండి మీరు !/
      ములగచెట్టెక్కించకండీ! :)

      /బావున్నారాండీ ?/
      నాగురించి అడిగినందుకు ధన్యవాదాలు. నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తున్నా, కర్ర సాయంతో! అడుగులు లెక్కెట్టుకుంటున్నానన్నదే నిజం. :)

      /నరసింహారావు గారు కూడా పద్యాల్వ్రాయటం ముదావహమ్ము :)/
      సావాసదోసమటంచు నెరిగియు పజ్జముల్ జెప్పుట సాహసింప బూనెదవొకో...పూర్తిచేసుకో!
      నాతో నీ సావాసం పుష్కరం దాటింది, మరి విన్నకోటవారిది ఏడెనిమిదేళ్ళుండచ్చనుకుంటా :)

      సావాసదోషం బలమైనది/బలవత్తరమైనది/బలకరమైనది/బలతరమైనది/బలతమమైనది ఏది సాధువో చెప్పుమీ :)

      Delete
    2. నాతో నీ సావాసం పుష్కరం దాటింది,


      అవునా :) అబ్బురముగా ఉన్నది :)

      Delete
    3. తాతగారి కోరిక పై :)

      సావాస దోసమని ప
      ద్యావరణములోన జొచ్చి తన్మయులగుచున్
      కైవారంపు పదమ్ముల
      తో వాగ్దేవిని కొలిచిరహొ నరసరాయా !


      జిలేబి

      Delete
    4. "తాత గారి కోరిక" పద్యం బాగుంది.

      Delete
    5. Zilebi13 October 2023 at 05:23
      అలుగుటయే ఎరుంగని మహామహితాత్ము డజాతశత్రువే అలిగిననాడు
      సాగరములన్నియు ఏకము కాకపోవు...

      నరసరాయకవివరేణ్యులు మీ కవ్వింపులకు దొరకరుస్మీ.
      పజ్యం బావుంది. :)

      Delete
    6. బాగా శలవిచ్చారు, శర్మ గారు 🙏.
      ————
      “నరసింహ కృష్ణ రాయని
      కరమరుదగు కీర్తి యొప్పె …….”
      (నాది కాదు, మీకు తెలుసుగా తెనాలి రామకృష్ణ కవి పద్యం)

      Delete
    7. ఏదో మీకు వత్తాసు పలుకుదామనుకుంటే
      మీరిలా బ్యాక్ స్టెప్ వేస్తే ఎలాగండీ మహాకవి నరసరాయా

      ముందు పడండి :)


      నాలగు చీవాట్లు శ్యామలీయం‌ మేస్టారు గారు వేస్తారు ఆ తరువాయి అవే వచ్చేస్తాయి.


      కందమేవ బ్రహ్మా :)
      జిలేబి

      Delete
    8. 2011 సెప్టెంబరు 21 తారీకున బ్లాగు సముద్రంలోకి కళ్ళు తెరుచుకుని దూకేసేను. 2011 అక్టోబరు 23 తారీకున మొదలు ఈ చెలగాటం. తమరు నాకంటే రెండేళ్ళ ముందు ఈ సముద్రంలోకి దూకినట్టు కనపడుతోంది. ఈ రోజుతో సరి, వీళ్ళిద్దరికీ చెడినట్టే అనుకున్నవారు,ప్రొత్సహించినవారనేకులు. కుదరలే! ఎప్పటికప్పుడు విరిగినదే మళ్ళీ అతుక్కుంది. అలా తులువలు, పలవలుగా సాగిన చెలిమి కొనసాగింది.ఒకానొక సమయంలో త్వమేవాహం,త్వమేవాహం అని జనాలకు అనిపించినరోజులూ గడచాయి.

      సముద్రం చెరువయ్యింది. చెరువూ ఎండిపోయింది. ఏ మాధ్యమంలోకూడా ఇలాగే ఈర్ష్య,అసూయ,ద్వేషాలు గూడు కట్టుకునే ఉన్నాయి.చాలామంది బ్లాగుల్ని వదిలేసి మరోమాధ్యమాలకి మారిపోయారు. ఇదిగో నువ్వూ నేనూ మిగిలాం మరికొందరితో, మారలేక,అలవాటు మానలేక. ఈ పరిచయం/స్నేహం/ఎఱుక/చెలగాటం వయసు పన్నెండేళ్ళు :)

      అబ్బురమేం లేదు,సుబ్బరంగా నిజమే :)
      ఇదిరాయడం మొదలెట్టా కరంటుపోయింది పుటుక్కున, ఏమని కనుక్కుంటే సబ్ స్టేషన్ లో నిలిపివేయక తప్పని అత్యవసర పరిస్థితి ఏర్పడిందన్నారు :)

      Delete
    9. మీ కమింట్లు అంత హై‌ వోల్టేజీ అన్నమాట సబ్ స్టేషనే టాప్ మని ఎగిరి పోయే :)


      Delete
    10. Zilebi13 October 2023 at 17:23
      నిజానికంత వోల్టేజి ఉంటది బుజ్జమ్మా!

      Delete
  3. ఏది సాధువో చెప్పుమీ :)

    "బలమైనది యేదియున్ సాధువని నిర్ధారింప సాహసింప బూనెదనొకో:)

    పూరించుకోండి హమాజా ఇజ్రాయెలా సాధువేది ?

    ReplyDelete
    Replies
    1. Zilebi13 October 2023 at 05:52
      /"బలమైనది యేదియున్ సాధువని నిర్ధారింప సాహసింప బూనెదనొకో:)/

      లెస్స బలికితిరిగా?

      బలయుతులకు దుర్బలులకు
      బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్‌
      బల మెవ్వఁడు ప్రాణులకును
      బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!
      హమాజు సాధువెటులయ్యె చెపుమా?

      Delete
  4. ఎవరో నేడు నా ప్రసక్తి తెచ్చారు నాలుగు చీవాట్లు శ్యామలీయం‌ మేస్టారు గారు వేస్తా రంటూ. క్షమించాలి. పోచికోలు కబుర్లూ వ్యర్ధచర్చలూ పట్ల నాకేమీ ఆసక్తి లేదని దయచేసి గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. ఎవరో వారెవరో :)

      Delete
    2. శ్యామలీయం13 October 2023 at 17:12
      *********************************
      Zilebi13 October 2023 at 17:24

      మీరు పట్టించుకోకండి సార్
      ***********************
      మళ్ళీమళ్ళీ ఇలా మనసుల్ని బాధించడం....నచ్చలేదు,నచ్చలేదు, నచ్చలేదూ..... పుర్రెతో పుట్టిన బుద్ధియా?

      Delete
    3. పుర్రెతో పుట్టిన బుద్ధియా?

      పుర్రె వుందా ? :(

      Delete
    4. Zilebi14 October 2023 at 18:10
      పుట్టుకతో అది పుర్రె. బుద్ధితో పెరిగేది బుర్ర :)

      Delete
    5. బుర్ర వుందా :)

      Delete
    6. Zilebi15 October 2023 at 18:49
      బుర్రుంటే బూడదమ్ముకు బతకొచ్చని నానుడి. :)

      Delete
    7. -
      పుర్రెయదె వచ్చు పుట్టుక
      వెర్రుల బట్టి, సరి బుర్ర పెరిగిన కొలదౌ
      కుర్రోళ్లు! తాత చెప్పిం
      డర్రా విన్నాణపు గని డాబుల్లేవోయ్


      జిలే బుల్స్:)

      Delete
    8. -

      చిర్రావూరి పలికెరా
      బుర్రుంటేబూడిదమ్ముకొని బత కొచ్చోయ్
      సర్రంటూ జారక ఓ
      కర్రుంటే నడ వగలవు కష్టే ఫలిలా!



      జిలే బుల్స్ :)

      Delete

    9. Zilebi16 October 2023 at 09:10
      పద్యం బాగుంది.

      Delete
    10. Zilebi16 October 2023 at 08:49
      పద్యం బాలేదు.

      Delete
  5. మీ బ్లాగు చదివితే, ఈ motivational song (ప్రేరణాత్మక పాట?) గుర్తొచ్చింది. వీలైతే వినండి:
    https://youtu.be/cAZuuUoDzO0

    కాలం కలిసొచ్చినపుడు, ఆకలుండదు దాహముండదు, నిన్ను చూస్తుంటే అన్నారు. ఎవర్ని చూస్తుంటే? :-) ఎవర్ని చూసినా ఆకలి, దాహము ఉండకపోతే, కలిసొచ్చిన కాలం వికటిస్తుంది.

    కాలం కలిసిరానపుడు, తోకే పామై కరుస్తుంది అని కూడా ఎక్కడో చదివేను.

    BTW, మీ బ్లాగుల్లో కామెంట్లు అనానిమస్సులనుండి అప్రస్తుత ప్రసంగాలుగా అయినట్లు అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. కాంత్14 October 2023 at 00:30
      ధన్యవాదాలు.

      కాలంకలిసొచ్చినపుడు వయసుంటుంది,చిన్నతల్లి తోడుంటుంది,సరే అధికారం నడచొస్తుంది.ఇంకేంకావాలి, వయసుమదం,డబ్బుమదం, అధికారమదం తలకెక్కినపుడు ఆకలుండదు,దాహముండదు, నిన్ను చూస్తుంటే :) అదండి సం....గతి.

      అనామకుల అప్రస్తుత ప్రసంగాలని కట్టు చేసానండి. మరి ఈ పెద్ద అనామకాన్ని కట్టు చేయలేను, పుష్కరంగా వేపుకుతింటున్నది. కట్టు చేయాలంటే రాయడం మానెయ్యాలి, లేదా కామెంట్ బాక్స్ దాచెయ్యాలి! ఏంచేయనో చెప్పండి !

      Delete
    2. ఎవరండీ ఆ బెద్ద అనామకం ?

      Delete
    3. Zilebi14 October 2023 at 10:21
      అబ్బో!పెద్ద!!
      జలకాలాటలలో
      కలకలపాటలలో
      ఏమిహాయిలే హలా!
      ఏమి హాయిలే హలా!!

      Delete
    4. -

      జలకాలాటలలో,సరి
      జిలేబి కలహముల నడుమ చిక్కుకొనెడు మ
      త్తులలోని హాయి! దీనికి
      యిలలో యీడైనది కలదే యేదైనన్ :)


      జిలే బుల్స్ :)

      Delete
    5. Zilebi15 October 2023 at 14:14
      కలహాలాటలతో పజ్జెంబాగోలేదూ!!!!!ఇటుకలపేర్పు సరిలేదు. :)

      Delete