Saturday, 14 October 2023

మహాలయం

 

కష్టేఫలే-శర్మ కాలక్షేపం కబుర్లు-మహాలయ అమావాస్య

రేపు సెప్టెంబరు ఇరువదిఏడవతేది మహాలయ అమావాస్య.
ప్రతీ సంసృతిలోను  కాలంచేసినవారిని తలుచుకోవడం సహజం. దీనినే మనవాళ్ళు పెద్దలకి పెట్టుకోవడం అంటారు. అలాగే కాలంచేసినవారిని తలుచుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులని కేటాయించారు.అవి భాద్రపద బహుళ పాడ్యమి మొదలు భాద్రపద బహుళ అమావాస్య వరకు. ఈ రోజులలో పెద్దలు కాలం చేసిన తిధినాడుగాని అప్పుడూ కుదరకపోతే అమావాస్య నాడుగాని పెద్దలను తలుచుకొని తర్పణంచేసి సాత్వికులైన వారికి అన్నపానీయలిచ్చి గౌరవం చేయడం మన ఆచారం. ఈరోజు కనీసంగా పిత్రు తర్పణం అనగా గతించిన తండ్రి, తాత, ముత్తాతలని తల్లి, మామ్మ, తాతమ్మలకు ఋషి సహిత గోత్రనామాలతో నీళ్ళు వదిలిపెడతారు.తన వంశంలో పిల్లలు లేకుండాగతించినవారికి, అకాలమరణం పొందినవారికి తర్పణం ఇస్తారు. గతించిన గురువుకి,తరువాత తనకు ముఖ్యులై గతించినవారికి, గతించిన రాజుకు,చివరగా ఈ భూమండలంమీద అనాధగా చనిపోయినవారందరికి తర్పణం ఇస్తారు. తర్పణం అంటే మంత్ర సహితంగ నీళ్ళువదలి పెట్టడమే. మంత్రం చెప్పుకోలేనివారు తర్పణం చేయలేరా. శ్రద్ధ ముఖ్యంకాని మంత్రం కాదు. మంత్రంతో చేయగలిగితే మంచిదే. లేకపోయినా ఆయా పెద్దలను తలుచుకొని నీళ్ళువదలచ్చు. విశేషం ఏమంటే గంగా నది ఒడ్డున ఈరోజు మధ్యహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత ఈ కార్యక్రమం జరుపేవారు ఎక్కువ. మనమూ ఈ కార్యక్రమాన్ని అవుసరం ఉన్నవారు మధ్యాహ్నం పన్నెండు దాటిన తరువాత ఆచరించ వచ్చును. పెద్దలను గౌరవించడం తలవడం మన సంసృతి. అంతేకాదు మనకు ఏ సంబంధమూ లేని భూగోళం మీద గతించిన అనాధలందరూ కూడా శాశ్వత పుణ్యలోకాలలో మనవారితో సహా వుండాలని మన భారతీయ సంస్కృతి చెబుతోవుంది. ఇది చాదస్తంగా కనపడవచ్చు కాని
మనంఆచరించవలసినదే.

పెళ్ళికిముందుగా గతించిన పెద్దలను ఆహ్వానించి అర్చన చేసి, వంశములో జీవించియున్నవారిలో పెద్దలిని పిలిచి వారికి సత్కారం చేసి అప్పుడు చేయబోయే శుభకార్యంకి కంకణం కట్టుకుంటాము. గతించిన పెద్దలను తలుచుకొని చేసే కార్యక్రమమే సంకల్పం.

అది నాటిమాట. 

(25.09.2011)

*********************

ఇది నేటిమాట

(14.10.2023)

 లయం అంటే కలసిపోవడం మహాలయం అంటేసర్వజీవులూ కలసిపోవడం. ఎవరితో? అదీ ప్రశ్న. 

జీవులెనుబదినాల్గు లక్షలచావు పుట్టుకలిక్కడా! ఎవరుచేసిన పాపకర్మము లనుభవవించేదక్కడా! అనేది తత్త్వం. పుట్టిన ప్రతిజీవి లయంకాకతప్పదు. ఎప్పుడూ? ఎవరి కర్మానుసారంగా వారు లయమవుతూ ఉంటారు! చావూ పుట్టుకల చక్రం తిరుగుతూనే ఉంటుంది. అంతెక్కడా?  ఇలా చావుపుట్టుకలచక్రం నుంచి తప్పించుకోలేని జీవులకు కూడా ముక్తి ప్రసాదిస్తాడు శంకరుడు, అదే అదే మహాలయం. ఆ సమయంలో శంకరుడు ఈ సృష్టి సమస్థాన్ని లయంచేసి తన ఒంటికి బూడిదగా రాసుకుంటాడంటారు, ఈ పితృ పక్షంలో.

23 comments:

  1. -

    లయమంటె కలయిక మహా
    లయమన సర్వమ్ము శివుని కలయికయగునోయ్ !
    లయమది తప్పదెవరికి వి
    లయతాండవమందు జగము లయమగు నెపుడున్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi15 October 2023 at 09:07
      పద్యం బాగుంది! బాగుంది!!

      Delete
  2. “మాలిక” ఎడమ ప్రక్క భాగం “మహా లయం” అయిందంటారా 🤔? Too bad 😒.

    ReplyDelete
    Replies
    1. Grow up my boy!
      ఎప్పుడూ ఇల్లాంటి చిన్న చిన్న విషయాలేనా ?
      Think Big :)


      రామ రామ


      జిలేబి

      Delete
    2. పోనీ మీరు నన్ను దత్తత తీసుకునే విషయం మాట్లాడుకుందామా?
      మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని చూస్తాను.,

      Delete

    3. విన్నకోట నరసింహా రావు19 October 2023 at 12:44
      అబ్బో గొప్ప విషయం. మాటలయ్యకా కొంచం శుభవార్త మా చెవిని కూడా వెయ్యండి, మరి.

      Delete
    4. విన్నకోట నరసింహా రావు19 October 2023 at 06:48
      విజయదశమికి కొత్త రూపుతో మాలిక రావచ్చని నా ఆశ. రాకపోతే ఆశ వదులుకుంటానండి.

      Delete
    5. విజయదశమి వెళ్లి ఏకాదశి కూడా బైబై అంటోంది తాతగారు.
      మాలిక కదలిక కనిపించడం లే :)


      Delete

    6. Zilebi25 October 2023 at 20:04
      విన్నకోట నరసింహా రావు26 October 2023 at 11:14
      నాకు మాత్రం ఏం తెలుసూ!! మాలికవారెప్పుడూ ఇంత అశ్రద్ధ చేసినట్టులేదు. వారి ఇబ్బందులేంటో తెలీదు. అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళెవరూ ప్రస్థుతం బ్లాగులు రాస్తున్నట్టులేదు :)
      విజయదశమికి కొత్తరూపున రావచ్చని ఆశపడ్డాను. ఆ తరవాత ఆశపడననికూడా ముందే చెప్పేను. ఇక పై తమ చిత్తం.

      Delete
    7. నేను మిమ్మల్నేమీ అనడం లేదు సారూ 🙏🙂. సదరు నిర్వాహకుల ఆసక్తిని బట్టి ఉంటుంది కదా.

      మనకు “శోధిని” ప్రత్యామ్నాయం ఉండనే ఉంది, కాబట్టి నో ప్రోబ్లం.

      Delete
    8. తాతగారు-

      . వారి ఇబ్బందులేంటో తెలీదు. అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళెవరూ ప్రస్థుతం బ్లాగులు రాస్తున్నట్టులేదు :)

      ఈ అమెరికా వాళ్ల టెక్కే టెక్కండీ
      ఇలాంటి‌ బొమ్మలాటల్ని‌ చేసి వదిలి పెట్టి మనల్ని భలే ఆడిస్తారండీ
      ఆ పై తన్ని తగిలేస్తా రండోయ్ మనలాంటి అమాయకులు జాలంలో చిక్కుకొని కొట్తుమిట్టాడుతూంటాం ఇలా దిక్కూ దివాణా లేక సుమండీ
      ఈ బ్లాగుల్ని కూడా గూగుల్ వాడు ఎప్పుడో
      తన్ని తగలేస్తాడేమో అప్పుడు మన గతేం కావాలండీ ?






      Delete
    9. విన్నకోట వారూ

      నేను మిమ్మల్నేమీ అనడం లేదు సారూ


      అబ్బే మీరేమీ.......... అనలేదాండీ ?




      జిలేబి

      Delete

    10. విన్నకోట నరసింహా రావు26 October 2023 at 17:05
      బద్ధకంతో వచ్చిన తిప్పలు సారూ!
      మూడు నెలలుగా మంచందిగకపోవడం అలవాటైపోయి బద్ధకం పెరిగిపోయింది,బరువూ పెరిగిపోయింది.నెమ్మదిగా అడుగులెయ్యమంటే బద్ధకంగా ఉంది. నాలుగడుగులేసి అమ్మో! నొప్పి అంటుంటే....భయం....

      Delete
    11. Zilebi26 October 2023 at 22:18
      Zilebi27 October 2023 at 04:39
      ఎవరిగోలవారిదే బుజ్జమ్మా :)
      మార్పు సహజం లెద్దూ!
      జరిగిపోయినదానికి విచారమేల?
      జరగబోయేదానిగురించి చింత ఏల?
      జరుగుతున్నది చూడు.
      ప్రపంచంలో ఏకాలంలోనూ,ఏదేశంలోనూ మార్పులేనివి ఈర్ష్య, అసూయ,ద్వేషం,పగ. మనం అతీతులమా? :)

      Delete
  3. Zilebi19 October 2023 at 07:30
    పెంచుకుంటున్నావా? మంచిదే!
    ఇన్నాళ్ళబట్టి కూడా ఉన్న నన్నొదిలేసేవు.
    అందుకే అన్నారు, నీళ్ళు కొడితే ఒకటవుతాయిగాని పాలుకొడితే కావని, నానుడి.

    ReplyDelete
  4. శర్మ గారు, మనం మనం అనుకోవడమే గానీ చెప్పవలసిన వారేమీ మాటాడట్లేదు చూసారా? ఇటువంటి పెద్ద పెద్ద విషయాలకు బెదిరిపోతారనే చిన్న చిన్న విషయాలు చర్చిస్తున్నది అందుకే మరి 😄😄😎.

    ReplyDelete
    Replies
    1. ఎవరో మాట్లాడదామన్నారు
      ఇప్పటి దాకా కాలేమీ రాలేదేమిటిస్మీ ?

      బ్యాంకునిఫ్టీ గోవిందా గోబిందా :) పరిణామమా ?


      Delete
  5. తాతగారూ

    అక్కడ హరిబాబు గారి రీసెర్చీ టపా చదవండి
    మీరూ ఇంస్పైర్ అయ్యి ఓ రీసెర్చీ టపారాద్దురూ :)

    ReplyDelete
    Replies
    1. Zilebi28 October 2023 at 19:17
      బుజ్జమ్మా!

      నీ సూచన గమనించాను :) భయమేసింది. హరిబాబు టపాకదా!అసలే బద్ధకంగా ఉంది.
      భయంగానే అడుగెట్టా బ్లాగులోకి, హరిబాబు టపా ఐతే ముందు కొలత చూస్తా! ఎంతకీ తరగదే!! :) చివరికొస్తే అప్పటికే ఎవరో పాపం! నా టపాలో ఒక ముక్కో, మొత్తమో పట్టుకొచ్చి ఒక కామెంటుగా వేసేసేరు :)
      టపా సంగతికొస్తే, నాకు సినిమాలకి సగమెరిక :)నెమ్మదిగా టపా చదివాను.

      రామారావు సినిమాలలో పౌరాణికాలలో, వారి చిత్తమే తప్పించి, అసలు సంగతులు మరుగునపడిపోతాయన్నమాట జగద్విదితం. ఆ సినిమాలు నేను చూడనుకూడా లేదు, ఇప్పుడసలు చూడను.

      ఇక పాపాలు పంచుకోడాలు, చాలా కతుంది, ఇప్పుడు చెప్పలేను. అడుగులెయ్యడం నేర్చుకుంటున్నా! పడిపోతానని భయం.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. sarma30 October 2023 at 09:23
      Zilebi28 October 2023 at 19:17
      బుజ్జమ్మా!

      నీ సూచన గమనించాను :) భయమేసింది. హరిబాబు టపాకదా!

      hari.S.babu
      మీలాంటి పెద్దల్ని కూడా భయపెడుతున్నానా,అన్నన్నా!

      అయినా,ఆ మాత్రం భయపెట్టాలిసిందే, రేపో మాపో ఏపీ సీయం అయ్యే మనిషంటే అందరికీ ఆపాటి భయం ఉండి తీరాలి.

      welcome బెకబెక.

      Delete
    4. hari.S.babu1 November 2023 at 12:47
      (తనలో)పెద్దలంటున్నాడు, మన రోజులనాటికీ గుంటడికి బొడ్డూడి ఉంటుందా? :))
      (ప్రకాశముగా)హరిబాబు గారు! మీరు చెప్పినట్టు సి.ఎమ్ అంటే భయమేకదండీ :) ఒక్క చిన్నూసు సి.ఎమ్ అయ్యాకా నన్ను మరిచిపొండేం, ఆ ఉపకారం చాలు..
      అద్సరేగాని సూరానేని హరిగోపాల్ పేరుతో తాలింపు ఘాటొస్తూ ఉంది అక్కడక్కడా! ఆ తాలింపు తమరిదేనా!! :)

      Delete