తాటితాండ్ర
తాటితాండ్ర
తాటిబెల్లం
వేసవిలో వచ్చేవి తాటికల్లు,తాటిముంజలు.
వర్షకాలంలో వచ్చేవి తాటితాండ్ర,తాటిబెల్లం.
శీతకాలంలో వచ్చేవి తేగలు బుర్రగుంజు.
వేసవిలోతాడిచెట్ల సీజన్ ప్రారంభం. ముందుకల్లొస్తుంది. దానినుంచి తాటిబెల్లం అనే కల్లుబెల్లం లేదా పాతబెల్లం వండుతారు.వేసవిని తప్పించుకోడానికి తాటికల్లు ఆరోగ్యప్రదాయిని. తాటిముంజలూ అంతే! వీటినే ఐస్ ఆపిల్ అంటారు. వేసవిలో తాటిముంజలొచ్చాకా అవి పెరిగి తాటికాయలవుతాయి, ఆ తరవాత పళ్ళూ అవుతాయి.తాటిపళ్ళనుంచి రసం తీసి మరగబెట్టి చాపలమీద పోస్తారు, పల్చగా,తాటి చాపలమీదే. అందుకే దీన్ని తాటితాండ్ర చాపలంటారు. ఇక గుజ్జు తీసుకున్న తరవాత టెంకలు మిగులుతాయి, వీటిని కొచం ఎత్తుగా ఉన్నచోట పాతరేస్తారు. టెంకలనుంచి మొలకలొస్తాయి భూమిలోకి, ఇవే తేగలు. టెంకలు అలా ఒకదానిమీద ఒకటిపేర్చేస్తారు. ఈ తేగలు తవ్వడానికి, శీతకాలానికి తయారవుతాయి, ఫిబ్రవరిదాకా వస్తాయి. తేగలు తవ్వుకున్న తరవాత టెంకలు మిగులుతాయి. వీటిని చితక్కొట్టుకుంటే బుర్రగుంజు దొరుకుతుంది, తియ్యగా ఉంటుంది. అన్ని టెంకల్లోనూ బుర్రగుంజుండదు. అందుకే బుర్రగుంజన్నారు. టెంక చితక్కొట్టేదాకా బుర్రగుంజున్నది లేనిదీ తెలీదు. అలాగే మనిషిని వాడేదాకా బుర్రలో గుంజున్నదీ లేనిదీ తెలీదు.
ఇప్పుడింతకీ ఈ దాళద్రుమోపాఖ్యానం గురించి ఎందుకు రాసారు చెప్మా?
ReplyDeleteతాలాంకురాధివాసపు రమ్మా సరసకు రమ్మా అన్న పిలుపు కారణమై వుండవచ్చు :)
Deleteకాంత్18 October 2023 at 05:29
Deleteగవళ్ళ గంగమ్మగారి హస్తోదకం సీజనైపోయింది.ఇప్పుడు తాండ్ర బెల్లం వస్తున్నాయి. కార్తీకం వస్తే తాళదృమాలూ (తేగలు) వస్తాయి, బుర్రగుంజూ వస్తుంది :)
DeleteZilebi19 October 2023 at 03:57
హస్తోదకం లేదు, రమ్మూ లేదు రమ్మనవారూ లేరు :)
పీత్వా పీత్వా పునః పీత్వా రోజులెళ్ళిపోయాయి. :)